Live News Now
  • జీఎస్టీతో అవినీతికి చెక్.. దేశం దశ మారుతుందన్న కేంద్ర మంత్రివెంకయ్య
  • కిలో మిర్చి 100.. టమాటా 50... కొండెక్కిన ధరలతో ప్రజల పరేషాన్
  • ముంబై బైకుల్లా జైల్లో విధ్వంసం.. ఖైదీలను రెచ్చగొట్టారంటూ ఇంద్రాణిపై కేసు
  • వరుస విజయాలతో శ్రీకాంత్ దూకుడు ...గుంటూరులో పేరెంట్స్ సంబరాలు
  • అసెంబ్లీ స్పీకర్ వర్సెస్ మాజీ చీఫ్ విప్ ...పరస్పర సవాళ్లతో భూపాలపల్లిలో వేడి
  • ఇంట్లో మొండెం.. బావిలో చేతులు..చిత్తూరు జిల్లాలో మహిళ దారుణ హత్య
  • అల్లుడి వేధింపులకు అత్త బలి..ప్రాణాలు తీసిన ఆస్తి గొడవ
  • కల్తీ రక్తంతో ప్రాణాలతో చెలగాటం..హైదరాబాద్‌లో ముగ్గురి అరెస్ట్
  • ఆకాశంలో ఊగిపోయిన విమానం...పెర్త్‌లో ప్రయాణికులకు నరకం
  • పాకిస్థాన్ ఆయిల్ ట్యాంకర్ ప్రమాదంలో 151కి చేరిన మృతుల సంఖ్య
ScrollLogo శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.. కాలినడక భక్తులకు 10 గంటల సమయం ScrollLogo ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం ScrollLogo శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ.. భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దర్శనానిని బారులు తీరిన భక్తులు ScrollLogo ఉత్తర బంగాళఖాతంలో స్థిరంగా కినసాగుతున్న అల్పపీడనం ScrollLogo కృష్ణా డెల్టాకు పట్టిసీమ జలాలు..నీటిని విడుదల చేసిన ఏపీ సీఎం ScrollLogo వనజీవి రామయ్యకు చంద్రబాబు పరామర్శ...ప్రభుత్వం తరఫున 5 లక్షల ఆర్థిక సాయం ScrollLogo విశాఖ జిల్లా ఏజెన్సీలో ఆంత్రాక్స్‌ కలకలం...వ్యాధి లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన 5గురు ScrollLogo కాశ్మీర్‌లో రంజాన్‌ ప్రార్థనల తర్వాత ఘర్షణ...టియర్‌ గ్యాస్‌తో చెదరగొట్టిన బలగాలు ScrollLogo ముంబైలో కలర్‌ఫుల్‌గా మిస్‌ ఇండియా పోటీలు...హర్యానాకు చెందిన మానుషి చిల్లార్‌కు టైటిల్‌ ScrollLogo పోలవరంపై సీఎం చంద్రబాబు సమీక్ష...పనుల్లో వేగం పెంచాలని ఆదేశం
Telangana News
Telangana-all-opposition-parties-Chalo-Delhi-programme-on-miyapur-land-scam
మియాపూర్ భూకుంభ‌కోణంపై ఛలో ఢిల్లీ

మియాపూర్ భూకుంభ‌కోణంపై ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు... ప్రతిపక్ష కాంగ్రెస్‌ వ్యూహాలు రచిస్తోంది. ఇందుకు మిగతా విప‌క్ష పార్టీల‌న్నింటినీ ఏకం చేసే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో గ‌వ‌ర్నర్ గ‌డ‌పతొక్కిన కాంగ్ నేత‌లు.. ఇక సీన్ హ‌స్తిన‌కు మార్చేందుకు సిద్ధమౌతున్నారు. ఈ స్కాంపై  కేంద్ర హోం మంత్రికి ఫిర్యాదు చేసేందుకు అన్ని ప‌క్షాల‌ను స‌మ‌న్వయం చేస్తున్నారు కాంగ్రెస్ నేత‌లు.

మియాపూర్ భూకుంభ‌కోణం ఇష్యూలో కాస్త వెనుక‌బ‌డి పోయామ‌ని భావిస్తున్న కాంగ్రెస్ నేత‌లు దాన్నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు మరోసారి వాయిస్ పెంచుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో ఫీల్డ్ విజిట్ చేసి స‌ర్కారుపై ఒత్తిడి తీసుకొచ్చిన హ‌స్తం నేత‌లు.. గ‌వ‌ర్నర్ కు కూడా ఫిర్యాదు చేశారు. అయితే రాష్ట్ర స్థాయిలో ఆందోళ‌న‌ల‌తో గులాబీ స‌ర్కారు దిగిరాక‌పోవ‌డంతో... హస్తం పెద్దలు వ్యూహలకు మరింత పదును పెడుతున్నారు.

ఈ స్కాంపై గ‌వ‌ర్నర్ కు ఫిర్యాదు చేసినా స్పంద‌న‌ లేక‌పోవ‌డంతో  అన్ని ప్రతిప‌క్ష పార్టీల‌తో క‌లిసి ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమౌతున్నారు కాంగ్రెస్ నేత‌లు.  తాము పెద్దన్న పాత్ర పోషిస్తూ ఆల్ పార్టీ నేత‌ల‌తో క‌లిసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావ‌డం ద్వారా .. ఇష్యూపై జాతీయ‌స్థాయిలో ఫోక‌స్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌... కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ఈ నెల 28న అపాయింట్ మెంట్ కూడా తీసుకున్నారు. దీనిపై ఇత‌ర ప్రతిప‌క్ష పార్టీ నేత‌ల‌తో ఫోన్ లో మాట్లాడి స‌మాచారం తెలియ‌జేయ‌డంతో పాటు .. అంద‌రు నేత‌ల‌ను డిల్లీ వెళ్ళేందుకు ఒప్పించారు పిసిసి చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి.

మియాపూర్‌ భూకుంభ‌కోణం అంశాన్ని హ‌స్తిన‌కు చేర్చడంలో పెద్దన్న పాత్ర పోషించ‌డం ద్వారా రాష్ట్ర స్థాయిలో కాస్త వెనుక‌బ‌డ్డామ‌నే డామేజీని ఓవ‌ర్ టేక్ చేయొచ్చనేది కాంగ్రెస్ భావ‌న‌. ఇక దీంతో పాటు ఈ ఇష్యూలో హ‌స్తిన గ‌డ‌ప తొక్కడం ద్వారా..  జాతీయ‌స్థాయిలో టీఆర్‌ఎస్‌ అవినీతిని ఎండ‌గ‌డుతూనే.. ఇటు టిఆర్ఎస్ స‌ర్కారు.. అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టొచ్చనేది కాంగ్రెస్ ప్లాన్ గా క‌నిపిస్తోంది.

GST-implementation-protest:Telangana-textile-federation-call-for-3-days-bandh
మంగళవారం నుంచి 3 రోజుల పాటు వస్త్రదుకాణాలు బంద్

వ‌స్త్రాల‌పై జీఎస్టీ విధించడాన్ని వ్య‌తిరేకిస్తూ టెక్స్‌టైల్స్ ఫెడ‌రేష‌న్ మూడురోజుల బంద్ కు పిలుపునిచ్చింది. రేప‌టి నుంచి మూడు రోజుల పాటు అన్ని వ‌స్త్ర దుకాణాలు బంద్ నిర్వ‌హించ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించింది. జీఎస్టీ అమ‌లులోకి వ‌స్తే వినియోగ దారుల‌పై తీవ్ర భారం పడుతుందని... చిన్న‌చిన్న వ‌స్త్ర వ్యాపారాలు మూత‌ప‌డ‌తాయంటోంది తెలంగాణ టెక్స్ టైల్స్ ఫేడ‌రేష‌న్. కేంద్ర‌ం వెన‌క్కు తగ్గకపోతే నిర‌వ‌దిక బంద్ కు వెన‌కాడ‌బోమంటున్నారు తెలంగాణ టెక్స్ టైల్స్ ఫెడ‌రేష‌న్ అధ్యక్షుడు ప్రకాశ్. 

Dowry-harassment:Mother-in-law-padmavathi-commits-suicide
అల్లుడి వేధింపులకు అత్త బలి

అదనపు కట్న పిశాచుల వేధింపులు పెరుగుతూనే ఉన్నాయి. సమాజంలో ఎందరిలో మార్పు వచ్చినా వీరిలో మాత్రం మార్పు రావడం లేదు. అసలు కట్నమే తప్పు అంటే.. అదనపు కట్నం కోసం వేధింపులకు పాల్పడుతున్నారు. ఆస్తి కోసం అల్లుడి వేధింపులు తాళలేక అత్త ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన హైదరాబాద్ ఉప్పల్ మేడిపల్లి పీఎస్ పరిధిలోని ప్రశాంత్‌నగర్‌లో జరిగింది. ప్రశాంత్‌నగర్‌కు చెందిన ప్రదీప్, పద్మావతికి ఇద్దరు సంతానం. కొడుకు సౌతాఫ్రికాలో స్థిరపడ్డాడు. కూతురు శ్వేతను నల్గొండ జిల్లా కోదాడ నారాయణపురానికి చెందిన హరిప్రసాద్‌కు ఇచ్చి ఏడేళ్ల క్రితం వివాహం జరిపించారు. కాగా పెళ్లయిన రెండేళ్ల వరకు బాగానే ఉన్నా... హరిప్రసాద్ కన్ను అత్తింటి ఆస్తిపై పడింది. భార్యను అదనపు కట్నం తెమ్మని, ఆస్తి తన పేరున రాయాలని వేధింపులకు గురి చేయడంతో శ్వేత తన ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వచ్చి రెండేళ్ల నుంచి ప్రశాంత్‌నగర్‌లోనే ఉంటోంది. 

భార్య పుట్టింటికి వెళ్లినా భర్త వేధింపులు ఆపలేదు. ఈరోజు ఉదయం హరిప్రసాద్ మళ్లీ ఫోన్ చేశాడు. ఆ కాల్ రిసీవ్ చేసుకున్న అతడు అత్తనూ వేధించాడు. మాటా మాటా పెరిగింది. అల్లుడి పదజాలానికి తీవ్ర మనస్తాపానికి గురైంది పద్మావతి. దీంతో ఇంటి మూడో అంతస్తు పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Pets-Adoption-Drive-Conducted-at-Secundrabad
అనిమల్ లవర్స్ కోసం పెట్ట్స్ అడాప్ట్ డ్రైవ్

సికింద్ర‌బాద్ జోరాస్టియ‌న్ క్ల‌బ్ లో  జరిగిన పెట్స్ అడాప్ట్ డ్రైవ్ కు ప్ర‌జ‌ల నుంచి విశేష స్పంద‌న ల‌భించింది .వాయిస్ ఆఫ్ హైద‌రాబాద్ అనిమ‌ల్స్ సంస్థ నిర్వ‌హించిన ఈ డ్రైవ్ లో 25కు పైగా పెంపుడు జంతువులు, వీధి కుక్కలను అనిమ‌ల్ ల‌వ‌ర్స్ అడాఫ్ట్ చేసుకున్నారు. పెట్స్ పెంచుకోలేనివారు త‌మ సంస్థ‌ను సంప్ర‌దిస్తే వాటిని తీసుకుని అడాప్ట్ డ్రైవ్  పెడతామని నిర్వాహకులు చెప్పారు. పెంచుకోవాల‌ని ఆస‌క్తి ఉన్న వారికి వాటిని అందిస్తామ‌న్నారు. సంస్థ నిర్వ‌హించిన పెట్స్ అడాఫ్ట్ డ్రైవ్ వల్ల తమ కోరిక తీరినందుకు అనిమ‌ల్ ల‌వ‌ర్స్ సంతోషం వ్యక్తం చేశారు.

Dialogue-war-between-Congress-Gandra-and-Speaker-Madhusudhana-Chary
భూపాలపల్లిలో వేడెక్కుతున్న రాజకీయాలు..

జయశంకర్ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూధనా చారి.., కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణారెడ్డిపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. తమ జోలికొస్తే పోస్ట్‌మార్టం చేస్తామని స్పీకర్ అన్నారు. దీంతో గండ్ర రియాక్ట్ అయ్యారు. స్పీకర్ పదవికి గౌరవం ఇస్తున్నామని, తామూ ఎందాకైనా మాట్లాడగలమని అంటున్నారు. 

ఇంటింటికి పాదయాత్రలో భాగంగా ఇటీవల గండ్ర వెంకటరమణారెడ్డి టీఆరెస్ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అభివృద్ధి కనిపించడం లేదన్నారు. దీనిపై స్పందించిన స్పీకర్ మధుసూధనా చారి.. అది చేయలేదు, ఇది చేయలేదని విమర్శిస్తే.. గ్రామాల్లో నిలబెట్టి పోస్ట్ మార్టం చేస్తామని హెచ్చరించారు. 

దీనిపై స్పందించిన మాజీ చీఫ్ విప్ గండ్ర... ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్లే తాను ఇంటింటికి తిరుగుతూ ఏం చేశారని ప్రశ్నిస్తున్నానన్నారు. స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా దిగజారి మాట్లాడడం సరికాదన్నారు గండ్ర. తన వ్యాఖ్యలపై భూపాలపల్లి ఎమ్మెల్యే మధుసూధనాచారి ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. మళ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తాము స్పీకర్ పదవిని కూడా చూడకుండా ప్రతిస్పందించాల్సి వస్తుందని గండ్ర అన్నారు. 

Palamuru-farmers-face-loss-during-Kharif-season-starting
ఖరీఫ్‌ ప్రారంభంలోనే నష్టాలు మూటగట్టుకున్న రైతులు

వరుణుడు కరుణించి చిరు జల్లులు కురిపించడంతో గంపెడాశలతో ఖరీఫ్‌ సాగుకు వెళ్లిన పాలమూరు అన్నదాత ఆదిలోనే నష్టాలను చవిచూశాడు.సకాలంలో చిరు జల్లులు కురిశాయన్న సంతోషంతో దుక్కి దున్ని రైతులు విత్తనాలు వేసుకున్నారు.అయితే.. ఆ తర్వాత కురిసిన భారీవర్షానికి పొలంలో వేసిన విత్తనాలు వర్షార్పణమయ్యాయి.దీంతో.. కరువుతో అల్లాడుతోన్న ఉమ్మడి పాలమూరు జిల్లా అన్నదాత ఆశలు ఆదిలోనే అడియాశలయ్యాయి.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో గత 20 రోజులుగా కురుస్తోన్న చిరు జల్లులకు అన్నదాతలు ఎంతో సంబరపడి ..బీడు వారిన పంట పొలాలను చదును చేసి ఎంతో ఉత్సాహంగా ఖరీఫ్‌ పంటలను సాగు చేశారు.ఈ యేడు సకాలంలో వర్షాలు పడడంతో అప్పు  చేసి మరీ ఆరుతడి పంటలైన జొన్న,మొక్కజొన్న,కంది పంటలను సాగు చేశారు.అయితే.. ఈ యేడు ఖరీఫ్‌ పంటల్లో ఎలాగైనా లాభాలు సంపాదించాలని ఆశపడిన రైతన్నలకు ఆదిలోనే వరుణుడు తీవ్ర నష్టాలకు గురి చేశాడు. చిరు జల్లుల తర్వాత కురిసిన భారీ వర్షానికి విత్తనాలు మొత్తం కొట్టుకుపోయాయి.ఒక్క జట్చర్ల నియోజక వర్గంలోనే దాదాపు నాలుగు వందల ఎకరాల్లో వేసిన జొన్న,మొక్కజొన్న,కంది విత్తనాలు వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి.. పొలాల్లో ఇసుక మేటలు మాత్రమే మిగిలాయి.ఈనేపథ్యంలో.. ప్రభుత్వమే తమని ఆదుకోవాలని నష్టపోయిన రైతులు వేడుకుంటున్నారు.

Dengue-dissemination-in-Rainy-season:22-years-naveeen-die
విజృంభిస్తున్న డెంగ్యూ: 22ఏళ్ల నవీన్ మృతి

డెంగ్యూ వ్యాధి విస్తరిస్తున్నా మున్సిపల్ అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానికులు మండిపడ్డారు. నవీన్ మృతికి మున్సిపల్ అధికారులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. చెత్తా, చెదారంతో వీధులన్నీ కంపుకొడుతున్నాయని, దోమల నివారణకు చర్యలు చేపట్టక పోవడంతో డెంగ్యూ బారిన పడే వారి సంఖ్య పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 

CM-Chandrababu-Meets-Padma-Shri-Vanajeevi-Ramaiah-in-Care-Hospital
వనజీవి రామయ్యకు చంద్రబాబు పరామర్శ...ఆర్థిక సాయం

గుండెపోటుతో  హైదరాబాద్‌ కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వనజీవి రామయ్యను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. రామయ్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వైద్య ఖర్చుల కోసం ప్రభుత్వం తరపున 5 లక్షల ఆర్థిక సాయం అందించారు.


Tension-In-Ramzan-Celebrations,-Police-Vs-TDP-Leaders-in-Kothagudem
కొత్తగూడెంలో రంజాన్ ప్రార్థనల సమయంలో ఉద్రిక్తత

కొత్తగూడెంలో రంజాన్ ప్రార్థనల సమయంలో ఉద్రిక్తత నెలకొంది. ఈద్గా వద్దకు వచ్చిన వివిధ పార్టీల నేతలను పోలీసులు అడ్డుకోవడంతో వివాదం నెలకొంది. ఇవాళ రంజాన్ సందర్భంగా పార్థనల తర్వాత ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు చెప్పేందుకు మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర్రావు, మాజీ MLA కూనంనేని సాంబశివరావు, TDP ఇంఛార్జ్ కోనేరు చిన్ని అక్కడకు చేరుకున్నారు. ఐతే, అక్కడ నాయకులు ఉండడం పట్ల పోలీసులు అభ్యంతరం తెలిపారు. అక్కడి నుంచి బయటకు వెళ్లాలంటూ సూచించారు. ఈ క్రమంలోనే మాజీ MLA సాంబశివరావు చేతిని పట్టుకుని CI లాగడంతో ఉద్రిక్తత తలెత్తింది. వన్‌టౌన్ CI తీరుపై కూనంనేని మండిపడ్డారు. తన చేయిని పట్టి లాగాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటూ, ఆయన కూడా CI చేతిని పట్టుకున్నారు. పోలీసుల తీరుపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇంతలో మత పెద్దలు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది.

TTDP-Supports-BJP's-Presidential-Candidate-Ram-Nath-Kovind
రాష్ట్రపతి అభ్యర్ధి రాంనాధ్ కు టీటీడీపీ మద్దతు - ఎల్.రమణ

NDA రాష్ట్రపతి అభ్యర్ధి రాంనాధ్ కోవింద్ కు మద్దతివ్వాలని తెలంగాణ టీడీపీ నేతలు తీర్మానించారు. హైదరాబాద్లో ని పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో సమావేశమైన నేతలు.. తెలంగాణ వ్యాప్తంగా నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో భూ కుంభకోణాలపై తాము చేసిన ఆందోళనలను చంద్రబాబు అభినందించారని నేతలు తెలిపారు. త్వరలో నియోజకవర్గ ఇంచార్జిలు, జిల్లా, రాష్ట్ర కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

Dogs-Mourn-The-Deaths-Of-Their-Owners
మరణించిన యాజమానుల కోసం తిండి తిప్పలు మాని ఏడుస్తున్న కుక్కలు

ప్రస్తుత కాలంలో మానవసంబంధాలన్నీ వ్యాపార బంధాలుగా మారి.. ఎవరికి ఎవరు కానీ రోజులివి.. కన్నవారి పట్టెడన్నం పెట్టలేని దాయలేని సంతానం.. ఆస్తి కోసం కన్నవారినే చంపేస్తున్న దుర్మార్గపు రోజులివి.. విశ్వాసం అనేది మనిషి దరిదాపుల్లో కూడా రాని కాలమిది.. కానీ ఆ కుక్కలు మనుషులం కాదు గా మేము.. తమను నమ్మి తిండి పెట్టిన యజమానులను తలుచుకొని రోదిస్తున్నాయి.. తిండి తిప్పలు మాని.. తమ యజమానులు శాశ్వత నిద్ర పోతున్న చోట తిరుగుతున్నాయి.. మనిషికి లేని విశ్వాసం.. ప్రేమ కుక్కలకు ఎలా వచ్చింది అంటే.. సమాధానం చెప్పలేం కానీ.. ఆ కుక్కలు పడుతున్న వేదన చూస్తున్న మనుషులు కంట తడి పెడుతున్నారు.. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకొన్నది. వివరాల్లోకి వెళ్తే..
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం రంగాపూర్‌ గ్రామంలో మోహనాచారి, సరిత అనే దంపతులు ఉండేవారు.. ఈ దంపతులు పొలం పనులు చేసుకొంటూ... వారి వ్యవసాయక్షేత్రం వద్దనే ఉండేవారు.. ఈ దంపతులకు పిల్లలు లేరు.. దీంతో కుక్కలను పెంచుకొన్నారు.. కాగా మోహనాచారి, సరిత లు అప్పుల బాధతో ఈ నెల 22 న ఆత్మహత్య చేసుకున్నారు.. అప్పటి నుంచి ఈ కుక్కలు తిండి తిప్పలు మాని తమ యాజమానుల కోసం ఏడుస్తున్నాయి.. వదహనం చేసిన చోటు నుంచి కదలడం లేదు.. కుక్కలు పడుతున్న బాధను చూడలేక.. ఎవరైనా అక్కడ నుంచి వెళ్లగొడితే... అరుస్తూ.. మృతదేహాలు కాలిన బూడిద చుట్టూ తిరుగుతున్నాయి. తిండిమాని యజమానులను దహనం చేసిన చోటే కుక్కలు పడి ఉన్న వైనం చూసిన వారని హృదయాలను ద్రవింప జేస్తున్నాయి. కాగా కొంతమంది మేము ఇటువంటి కుక్కలను చేరదీసి పెంచుకొలని ఉన్నా.. అద్దె ఇంట్లో ఉండే వాళ్ళం... కుదరడం లేదు.. మీరు అయినా ఈ కుక్కలను చేరదీయండి అమల గారు అంటున్నారు.

Telangana-News-Headlines
ఐదు నిమిషాలు తెలంగాణ వార్తలు

ఐదు నిమిషాలు తెలంగాణ వార్తలు

More-rain-forecast-for-Telangana-next-two-days
తెలంగాణకు మరో రెండు రోజులు వర్ష సూచన

తెలంగాణలో ఈ నెల 28 వరకూ ఒక మాదిరి వర్షాలు పడతాయాని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారింది. అది క్రమంగా పడమర దిశగా కదులుతుందని అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశాలున్నాయి. రెండు రోజుల తరువాత భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ప్రస్తుతం కోస్తా వెంబడి గంటకు 45 నుంచి 50కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.

Heavy-Rains-In-Hyderabad
హైదరాబాద్‌లో అర్ధరాత్రి భారీ వర్షం...

హైదరాబాద్‌లో వర్షం దంచికొట్టింది. కొంతసేపు తెరిపి లేకుండా కురిస్తే.. రాత్రంతా చినుకులు పడుతూనే ఉన్నాయి. దీంతో పలుచోట్ల రోడ్లపై నీళ్లు నిలిచాయి.  మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది వాతావరణ శాఖ. మరోవైపు.. పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో రోడ్లపైకి వర్షపు నీరు రావడంతో.. జనం లేక రంజాన్ మార్కెట్లు వెలవెలబోయాయి.
హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. ఆదివారం రాత్రి 8గంటల నుంచి తెల్లవారుజాము వరకు ఏకధాటిగా కురిసిన వర్షంతో.. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మాదాపూర్‌, మీర్ పేట్, మలక్‌పేట, పాతబస్తీ, దిల్‌సుఖ్‌నగర్‌, ఐఎస్‌ సదన్‌ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, నాగోల్, బీయన్ రెడ్డి నగర్ లలోనూ భారీ వర్షం కురిసింది.  ఆదివారం రాత్రి నెలవంక కనపడటంతో సోమవారమే రంజాన్‌ పర్వదినాన్ని జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పాతబస్తీ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసి రోడ్లపైకి నీళ్లు రావడంతో కొనుగోలు దారులు లేక దుకాణాలు వెలవెలబోయాయి.

Duplicate-Cotton-Seeds-in-Nalgonda-District
వర్షాలకు రైతులు సాగు బాట.. దళారులు నకిలీ విత్తనాల దందా..!

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గత పదిరోజులుగా కురుస్తోన్న వర్షాలకు రైతులు సాగు బాట పట్టారు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో సాధారణ సాగు విస్తీర్ణం 13లక్షల 25వేల ఎకరాలు. ఈసారి గతంలో కంటే 10 శాతం అదనంగా సాగయ్యే అవకాశాలు ఉన్నాయని, పత్తి సాగు తగ్గించి అపరాల సాగు పెంచాలని వ్యవసాయ శాఖాధికారులు భావించారు. అయితే గత ఏడాది  పత్తికి మినహా ఇతర పంటలకు మద్దతు ధర లబించలేదు. పండించిన పంటలను అమ్ముకోవడానికి రైతులు ధర్నాలు చేశారు. దీంతో గత అనుభవాల దృష్ట్యా ఈసారి ఎక్కువ మంది రైతులు పత్తి పంట వైపుకే మొగ్గుచూపుతున్నారు. ఇదే అదునుగా  కొంతమంది దళారులు రంగంలోకి దిగారు. నకిలీ పత్తి విత్తనాలను ఆకర్షనీయమైన కవర్లలో ప్యాకింగ్ చేసి.. రైతులకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామాల్లో  ఈనకిలీ  పత్తి గింజల దందా యథేచ్చగా సాగుతోంది. బహిరంగంగానే నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నా వ్యవసాయ శాఖాధికారులు స్పందించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. గత 20 రోజులుగా అమాయక రైతులకు కల్తీ విత్తనాలను అంటగడుతున్నారు వ్యాపారులు. అక్రమ దందాపై ఉప్పదండంతో  విజిలెన్స్ అధికారులు విత్తన విక్రయకేంద్రాలపై మెరుపు దాడులు నిర్వహించారు. పలు దుకాణాల నుంచి భారీగా నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. పెద్దమొత్తంలో జరిమానా విధించారు. అయితే  ఫైన్‌తో  వదిలేయకుండా  రైతులను మోసం చేస్తున్న  కల్తీరాయుళ్లపై  క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే  వ్యవసాయ అధికారులు మాత్రం కాగితంపై కాకిలెక్కలు చెబుతూ అంతా సవ్యంగానే ఉందని ప్రభుత్వానికి నివేదికలు పంపుతున్నారు. పత్తి సాగు తగ్గించి ఆపరాల సాగుకు రైతులు సన్నద్దం కావాలని చెబుతున్నారు. ఎక్కడా విత్తనాల కొరత లేదని, నకిలీ విత్తనాలకు ఆస్కారమే లేదని  జిల్లా అధికారి ప్రకటిస్తున్నారు.  
వర్షాలు ఎంతగా కురిసినా..విత్తనం సరైనది ఎంచుకోకపోతే పెట్టిన పెట్టుబడి, చేసిన శ్రమ అంతా వృధానే. ఇప్పటికైనా నకిలీలకు  అడ్డుకట్ట వేసి నాణ్యమైన విత్తనాలు మార్కెట్ లో అందుబాటులో ఉండాల్సిన భాద్యత ప్రభుత్వంపై ఉంది. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials