Live News Now
  • ఇసుక మాఫియా కట్టడిపై కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు
  • జమ్మూకాశ్మీర్: అనంత్‌నాగ్‌లో మరో ఉగ్రదాడికి ముష్కరుల యత్నం
  • ప్రభుత్వ ధనాగారాన్ని దోచుకునేందుకు ముష్కరుల యత్నం...
  • ముష్కరుల దాడిని తిప్పికొట్టిన సీఆర్పీఎఫ్... ఓ ఉగ్రవాది అరెస్ట్ మరో ఉగ్రవాది పరారీ
  • భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపట్టిన సీఆర్పీఎఫ్
  • చంద్రబాబుతో ఆర్‌.కృష్ణయ్య భేటీ... గ్రూప్‌2 మెయిన్స్‌ వాయిదా వేయాలని విజ్ఞప్తి
  • చంద్రబాబు విదేశీ టూర్ షెడ్యూల్ ఖరారు...మే 4 నుంచి 11 వరకు అమెరికాలో పర్యటన
  • జమ్మూకాశ్మీర్‌లో పట్టుబడ్డ ఉగ్రవాది... పాక్‌తో సంబంధాలు ఉన్నట్లు అనుమానం
  • అనంతపురం: గుంతకల్లు మండలం వైటీ చెరువులో తెప్ప బోల్తా... 11 మంది మృతి నలుగురు గల్లంతు
  • మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు... గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు
ScrollLogo 111 పాయింట్లు నష్టపోయి 29,948 వద్ద ముగిసిన సెన్సెక్స్ ScrollLogo 38 పాయింట్లు నష్టపోయి 9,308 వద్ద ముగిసిన నిఫ్టీ ScrollLogo 9,300 పాయింట్ల మార్కును నిలుపుకున్న నిఫ్టీ ScrollLogo సూర్యపేట మార్కెట్‌ యార్డులో ఉద్రిక్తత... ScrollLogo మార్కెట్‌ యార్డును సందర్శించేందుకు వచ్చిన కోదండరామ్ ను అడ్డుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు ScrollLogo జేఏసీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం ScrollLogo హైదరాబాద్: సీబీఐ కోర్టులో వైఎస్ జగన్‌కు ఊరట... ScrollLogo జగన్‌ బెయిల్ రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్ ను కొట్టివేసిన ప్రత్యేక కోర్టు ScrollLogo హైదరాబాద్: జగన్ విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి... కుటుంబ సభ్యులతోనే వెళ్లాలన్న కోర్టు ScrollLogo మే 15 నుంచి జూన్ 15 లోపు 15 రోజులు విదేశాలకు వెళ్లవచ్చన్న కోర్టు
AP News
TDP-MLA-Files-SC,ST-case-Against-Inturi-Ravikiran-cartoonist
ఇంటూరి రవికిరణ్ పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు

పొలిటికల్ పంచ్’ పేరుతో అభ్యంతరకర పోస్ట్ పెట్టారంటూ  ఇంటూరి రవికిరణ్ పై కేసు నమోదు చేశారు. విశాఖపట్టణం త్రీ టౌన్ పోలీసులకు రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే అనిత ఈ మేరకు ఫిర్యాదు చేశారు. దీంతో ‘పొలిటికల్ పంచ్’ అడ్మిన్ ఇంటూరి రవికిరణ్ పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. మే 4వ తేదీన విచారణకు హాజరు కావాలని రవికిరణ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. 
కాగా, పొలిటికల్ పంచ్ ఫేస్ బుక్ పేజీలో శాసన మండలిపై అసభ్యంగా పోస్టు చేసిన ఆరోపణలపై రవికిరణ్ ను ఈ నెల 22వ తేదీన పోలీసులు విచారణకు తీసుకువెళ్లి, ఆ మర్నాడు రిలీజ్ చేసిన విషయం విధతమే.  

CM-Chandrababu-Naidu-meet-with-ministers
ఇసుక మాఫియాను అరికట్టండి: చంద్రబాబు

ఏర్పేడు ఘటన తర్వాత ఇసుక మాఫియాను అరికట్టే దిశగా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఇసుక విధానంపై చర్చించేందుకు మంత్రులు కేఈ కృష్ణమూర్తి, చినరాజప్ప, మైనింగ్‌శాఖ మంత్రి సుజయ్‌ కృష్ణ రంగారావు సీఎంతో భేటీ అయ్యారు. ఇసుక మాఫియా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ, హోమ్‌, విజిలెన్స్‌, మైనింగ్‌ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఇసుక విధానం, అందులోని లోటుపాట్లపై మంత్రులు చర్చించారు.

Float rollover in Errathimaraju pond: 14-family-members died,ananatapur
విహారయాత్ర కాదు విషాదం: తెప్ప బోల్తా పడి 14 మంది మృతి

అనంత‌పురం జిల్లా గుంత‌క‌ల్లులోని ఎర్ర‌తిమ్మ‌రాజు చెరువులో అనుకోని సంఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 19 మంది తెప్ప‌లో వెళ్తుండ‌గా అది బోల్తా ప‌డి విషాదం చోటు చేసుకుంది ఈ ఘ‌ట‌న‌లో 14 మంది మృతిచెందారు. 
ఓ ఫంక్షన్ కి వెళ్లిన వీరంతా విహారయాత్ర కోసం తెప్పలో ప్రయాణించినప్పుడు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స‌మాచారం అందుకున్న సీఎం చంద్ర‌బాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మంత్రి ప‌రిటాల సునీత‌తో ఆయ‌న మాట్లాడి స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సూచించారు. ఘ‌ట‌నా స్థలిలో స‌హాయ‌క చ‌ర్య‌లు జ‌రుగుతున్నాయ‌ని మంత్రి సునీత మీడియాతో చెప్పారు. ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన మంత్రి కాల్వ శ్రీ‌నివాసులు అన్ని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఇప్ప‌టికే సంబంధిత అధికారుల‌ను ఆదేశించామ‌ని చెప్పారు.

All-Set-For-Chandanotsavam-2017-At-Simhachalam-Temple
చందనోత్సవ ఉత్సవానికి సింహాచలం సిద్ధం

సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం కోసం లక్షల మంది భక్తులు ఎదురు చూస్తున్నారు. అక్షయ తృతీయ నాడు మాత్రమే నిజరూపంలో సాక్షాత్కరించే సింహాచలేశుని దర్శనం కోసం రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా చుట్టు పక్కల రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలి వస్తారు. 364 రోజుల పాటు చందనం పూతతో భక్తులకు దర్శనమిచ్చే స్వామివారు ఒక్క రోజు మాత్రం ఉగ్రనరసింహుడిగా నిజరూపదర్శనం ఇస్తారు. ప్రతి సంవత్సరం ఈకార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం. అర్థరాత్రి 12 గంటల తర్వాత చందనం బొరిగలతో తిరిగి ప్రత్యేక పూజల అనంతరం స్వామి నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తారు. అనువంశిక ధర్మకర్త అశోక్‌గజపతిరాజు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. 15 గంటలపాటు నిజరూపంలో కనిపించే ఉగ్రనారసింహుణ్ని లక్షల్లో భక్తులు దర్శించుకుంటారు.

AP-Minister-Sujay-Krishna-Ranga-Rao-Review-Meet-on-Sand-Mining
ఇసుక మాఫియా కట్టడిపై కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్‌లో సామాన్యులకు ఇసుకను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సుజయకృష్ణ రంగారావు అన్నారు. సామాన్యులను ఇసుక రీచ్ ల్లోకి రాకుండా అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇసుక విధానం, ఇసుక మాఫియా కట్టడిపై అమరావతిలో సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ..పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. మాఫియా కట్టడికి దశలవారీగా తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించింది. ఇసుక కొరత ఉన్న ప్రాంతాల్లో మ్యానుఫాక్చరింగ్ శాండ్ ను ప్రోత్సహించాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది.

YS-Jagan-Gets-Relief-in-Bail-Cancellation-Plea
వైఎస్‌ జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌ కొట్టివేత

సీబీఐ కోర్టులో వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు ఊరట లభించింది. జగన్ బెయిల్ రద్దు కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. సీబీఐ చూపిన ఆధారాలతో బెయిల్‌ రద్దు చేయలేమని కోర్టు పేర్కొంది.

Huge-Response-for-Baahubali-2-Movie-in-Telugu-States
కర్నూల్ జిల్లాలోనూ సాహోరే బాహుబలి ..

కర్నూల్ జిల్లాలోనూ బాహుబలి సందడి చేస్తోంది. సినిమా మీద భారీ అంచనాలు ఉండటంతో రాత్రి నుంచి థియేటర్ల వద్ద సందడి నెలకొంది. 

Baahubali-2-Movie-A-Visual-Feast-AP-Minister-Ganta-Srinivas
విశాఖలో బాహుబలి 2 సినిమా చూసిన మంత్రి గంటా

విశాఖలో బాహుబలి  2 బెనిఫిట్ షో  సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రత్యేకంగా వీక్షించారు. సినిమా అద్భుతంగా ఉందన్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత రాజమౌళి టీమ్ కు దక్కుతుందన్నారు. 

YS-Jagan-Meet-With-Party-Leaders,-Focus-On-Rythu-Deeksha
గుంటూరు రైతు దీక్షపై జగన్ ఫోకస్.. భవిష్యత్ పై నేతలతో చర్చ

ఏపీలో ప్రజా సమస్యలపై ఫోకస్‌ పెట్టారు వైసీపీ అధినేత జగన్‌. ఇప్పటికే రైతు దీక్షకు సిద్ధమైన ప్రతిపక్ష నేత... రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై పార్టీ నేతలతో చర్చించారు. ప్రజల సమస్యలపై పోరును కొనసాగిస్తూనే... పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టాలని నేతలకు దిశా నిర్దేశం చేశారు. హైదరాబాద్‌ వైసీపీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు వైఎస్‌ జగన్‌. గుంటూరులో మే 1, 2న చేపట్టబోయే రైతు దీక్షపై చర్చించారు. దీక్షకు సంబంధించిన ఏర్పాట్లపై నేతలతో సమీక్ష జరిపారు. నేతలతో భేటీలో తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చించారు. ముందస్తు ఎన్నికల అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. అలాగే రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై కూడా ప్రధానంగా చర్చ జరిగింది. ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేయాలని నేతలకు దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో భవిష్యత్‌లో చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించారు. చంద్రబాబు ప్రభుత్వం అవినీతి ఊబిలో కూరుకుపోయిందని వైసీపీ నేత బొత్స విమర్శించారు. పోలవరంపై CMO కేంద్రంగానే పంచాయతీలు సాగాయన్నారు. సర్కార్‌ అవినీతిని ప్రజల్లో ఎండగడతామన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలన్నారు జగన్‌. అలాగే గ్రామీణ స్థాయి నుంచి పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టాలని నేతలకు సూచించారు. 

CM-Chandrababu,-Nara-Lokesh-On-Different-Stand-Over-Simultaneous-Elections
ఒకే దేశం..ఒకే ఎన్నికల నినాదానికి ఏపీ సీఎం మద్దతు..

ఒకే దేశం-ఒకేసారి ఎన్నికలు... ఇప్పుడిదే అంశం ఏపీలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇదేలా సాధ్యమనే అనుమానం కలుగుతుంటే... సీఎం చంద్రబాబు మాత్రం ఈ నిర్ణయాన్ని స్వాగితిస్తున్నామన్నారు. రెండు మూడు నెలలకొకసారి ఎన్నికలకంటే... ఒకేసారి పోలింగ్‌ జరగడం బెటర్‌ అన్నారు. అయితే మంత్రి లోకేష్‌ ఒకేసారి ఎన్నికలు సాధ్యం కాదన్న మరుసటి రోజే చంద్రబాబు ఈ కామెంట్స్‌ చేయడం చర్చనీయాంశమయ్యింది.  ఒకే దేశం-ఒకే ఎన్నికల నినాదానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.. చంద్రబాబు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగాలన్నదే తన అభిమతమన్నారు. ఈ నిర్ణయాన్ని స్వాగ‌తిస్తున్నామ‌న్నారు. రెండు మూడు నెల‌ల‌కోసారి ఎన్నిక‌లు జ‌ర‌గ‌డం క‌రెక్ట్ కాద‌న్నారు. అనేక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రఆన్ని గాడిలో పెట్టినప్పుడు జ‌నం ఎందుకు ఓటు వేయ‌ర‌న్నారు సీఎం. టీడీపీ ఓడిపోయే స‌మ‌స్యే లేద‌ని మ‌రో ఇర‌వై ఏళ్లు అధికారంలో ఉంటామ‌న్నారు. దేశంలో ఒకేసారి ఎన్నికలు సాధ్యం కావంటూ రెండు రోజుల క్రితం లోకేష్‌ వ్యాఖ్యలు చేయగా... చంద్రబాబు అందుకు భిన్నంగా స్పందించారు. అయితే ఇద్దరు ఒకే అంశంపై ఇలా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

Blade-batch-arrested-by-vijayawada-task-force-police
టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు చిక్కిన బ్లేడ్ దొంగలు

విజయవాడలో ఇద్దరు బ్లేడ్‌ బ్యాచ్‌ దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. రాజరజేశ్వరీపేటకు చెందిన మొఘల్‌ నయ్యూమ్‌ (25), నిందితుడు వైఎస్సాఆర్‌ కాలనీకి చెందిన పిల్లా భాస్కర్‌ కాళేశ్వరరావు మార్కెట్‌ దగ్గర  అనుమానాస్పదంగా తిరుగుతుండగా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గుర్తించి  పట్టుకున్నారు. వీరిద్దరూ ఒంటిరిగా వెళ్తున్న వారిపై బ్లేడ్‌తో యాటాక్  చేయడం వృతిగా ఎంచుకున్నారు. మహిళలను చంపుతామని బెదిరించి చోరీలకు పాల్పడం వంటి నేరాలకు ఈ వీరిద్దరూ పాల్పడుతున్నారు. ఇప్పుడు కూడ మార్కెట్ ప్లేసులో కాపు కాసి యాటాక్ చేద్దామని రెడీగా ఉన్నారు. కానీ పోలీసులు వీళ్ల స్కెచ్ ను గుర్తించి పట్టుకోవడంతో  ముప్పు తప్పిందని చెప్పుకోవచ్చు.  


AP-CM-Chandrababu-Supports-One-Nation,-One Election-Theory
దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరగాలి - చంద్రబాబు

దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగాలన్నదే తన అభిమతమన్నారు చంద్రబాబు. కొద్ది నెలల తేడాలో జరిగే ఎన్నికల వల్ల అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోందని అభిప్రాయపడ్డారు. ఒకే దేశం-ఒకే ఎన్నికల నినాదాన్ని తాము పూర్తిగా సమర్థిస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు.

Jagan-Rythu-Deeksha-In-Guntur
గుంటూరులో రైతుదీక్ష వైసీపీ అధినేత జగన్ దృష్టి

గుంటూరులో మే ఒకటి, రెండు తేదీల్లో చేపట్టబోయే రైతుదీక్షపై వైసీపీ అధినేత జగన్ దృష్టి సారించారు. పార్టీ సీనియర్లతో సమావేశమై ఏర్పాట్లపై చర్చించారు. పార్టీ బలోపేతం, తాజా రాజకీయ పరిణామాలపై కూడా మంతనాలు జరిగాయి. చంద్రబాబు ప్రభుత్వం అవినీతి ఊబిలో కూరుకుపోయిందని వైసీపీ నేత బొత్స విమర్శించారు. పోలవరంపై CMO కేంద్రంగానే పంచాయతీలు సాగాయని ఘాటు ఆరోపణలు చేశారాయన.

no-baahubali-tickets-in-anantapur
అనంతపురంలో దొరకని బాహుబలి టిక్కెట్స్

అనంతపురంలో బాహుబలి మూవీ టిక్కెట్లు భారీ ధరలకు అమ్ముతున్నారంటూ అభిమానులు ఆందోళనకు దిగారు. మూవీ టిక్కెట్లు వెయ్యి నుంచి రెండు వేల రూపాయలకు అమ్ముతున్నారని AIYF, AISF ఆధ్వర్యంలో యువకులు ధర్నాకు దిగారు. నిబంధనల ప్రకారం అమ్మకుండా అధిక ధరలకు టిక్కెట్లు అమ్ముతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సామాన్యులు సినిమా చూసేందుకు వీల్లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ధర్నా చేస్తున్న వారిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Nara-Lokesh-Meeting-With-Ministers-and-MLAs,-Amaravati
మంత్రులు, ఎమ్మెల్యేలతో నారా లోకేష్ భేటీ

పంచాయతీరాజ్, ఐటీ మంత్రి నారా లోకేష్.... సహచర మంత్రులు, MLAలతో భేటీ అయ్యారు. గ్రామాల్లో తాగునీరు, వీధి దీపాలు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. పల్లెల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఆయన.. వీలైనంత త్వరగా ఆ సమస్యలు పరిష్కారం చేసే దిశగా యాక్షన్ ప్లాన్ తయారు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. గ్రామాల్లో డిజిటల్ సేవల్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. దీంట్లో భాగంగానే ఇవాళ MLAలతో సమావేశం అయ్యారు. మంత్రులు సుజయకృష్ణ రంగారావు, నక్కా ఆనంద్‌బాబు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.

NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials