Live News Now
  • ప్రజల మన్ కీ బాత్ కావాలి.. పాలకులది కాదు.. పోరుబందర్‌లో రాహుల్‌ సెటైర్లు
  • ప్రాణం తీసిన సెల్ఫీ మోజు.. జల్పాయ్‌గురిలో వ్యక్తిని తొక్కిచంపిన గజరాజు
  • అయోధ్యలో మందిరం కట్టి తీరుతాం.. గడియలు దగ్గర పడ్డాయన్న మోహన్ భగవత్
  • డిసెంబర్‌ 21న పోలింగ్‌ ... 24న కౌంటింగ్‌.. ఆర్క్‌ నగర్‌ ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్‌
  • నాగపూర్ టెస్ట్ లో స్పిన్ మాయాజాలం..
  • 205పరుగులకు లంక ఆలౌట్, 11పరుగులకు 1వికెట్ కోల్పోయిన భారత్
  • సిద్ధిపేట జిల్లాలో పేలిన ఎయిర్ క్రాఫ్ట్.. ప్యారాచూట్‌తో ఇద్దరు పైలెట్లు జంప్‌
  • ఉద్రిక్తంగా SFI ఒంగోలు కలెక్టరేట్‌ ముట్టడి.. ఆందోళనకారులను ఈడ్చుకెళ్లిన పోలీసులు
  • సన్‌బర్న్‌కు హైకోర్టు పర్మిషన్.. పార్టీని వీడియో తీయాలని కండిషన్
  • ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురాలేక పోయారు: సీపీఐ రామకృష్ణ
ScrollLogo చంద్రబాబును కలిసిన సురేష్ గోపీ.. కేరళలో బనానా ఫెస్టివల్‌కు ఆహ్వానం ScrollLogo పూర్తి స్థాయి డీజీపీగా సాంబశివరావు.. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్ ScrollLogo యాదాద్రి అభివృద్ధిపై కేసీఆర్ సమీక్ష.. పనులు వేగవంతం చేయాలని ఆదేశం ScrollLogo 10 జిల్లాల ప్రాతిపదికనే టీఆర్టీ.. ఉన్నతాధికారులతో కడియం సమావేశం ScrollLogo మగ్గాలకు సబ్సిడీపై రా మెటీరియల్.. చేనేతకు 1200 కోట్లు కేటాయించామన్న KTR ScrollLogo విమాన ప్రమాదంపై అధికారుల దర్యాప్తు.. గాయపడ్డ పైలెట్ హైదరాబాద్ తరలింపు ScrollLogo భద్రాద్రి ఆలయ సమీపంలో లిక్కర్ షాప్.. తొలగించాలంటూ స్థానికుల ఆందోళన ScrollLogo పర్మిషన్లు లేకున్నా కాలేజీల ఏర్పాటు.. బోర్డు తిప్పేస్తున్న నిర్వాహకులు ScrollLogo ఉద్రిక్తంగా SFI ఒంగోలు కలెక్టరేట్‌ ముట్టడి.. ఆందోళనకారులను ఈడ్చుకెళ్లిన పోలీసులు ScrollLogo విశాఖలో సునామీ మాక్ డ్రిల్.. ఆకట్టుకున్న విన్యాసాలు
ENTERTAINMENT NEWS
What-is-the-next-movie-of-director-Bobby?
హిట్ వెంటే ఇండస్ట్రీ పరుగు.. ఎన్టీఆర్ కు కెరీర్ బెస్ట్ ఇచ్చినా దర్శకుడు ఖాళీ..!!

హిట్సే వెంటే ఇండస్ట్రీ పరిగెడుతూ ఉంటుంది. సక్సెస్ కొట్టినోళ్లకి సలామ్ లు కొడుతుంది. అలాంటిది ఓ బ్లాక్ బస్టర్ డైరెక్ట్ చేసిన దర్శకుడికి అయితే ఆఫర్స్ మామూలుగా ఉండవు. స్టార్ హీరోస్ నుంచి క్రేజీ ప్రపోజల్స్ వస్తుంటాయి. కానీ జైలవకుశతో జూ.ఎన్టీఆర్ కు కెరీర్ బెస్ట్ ఇచ్చిన బాబీ మాత్రం ఇప్పటివరకు మరో సినిమా స్టార్ట్ చెయ్యలేదు.
జైలవకుశ జూ.ఎన్టీఆర్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. తారక్ ట్రిపుల్ రోల్ లో ఈ దసరాకు రిలీజ్ అయిన జైలవకుశ ఎన్టీఆర్ ఆర్ట్స్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇండస్ట్రీ జనాలను మెస్మరైజ్ చేసి సూపర్ హిట్ గా నిలిచిన ఈసినిమాను డైరెక్ట్ చేసిన బాబీ మాత్రం ఇప్పటివరకు నెక్ట్స్ ప్రాజెక్ట్ కన్ఫామ్ చేసుకోలేదు. స్టార్ హీరోస్ కూడా బాబీతో సినిమాలు చెయ్యడానికి ట్రై చేస్తున్నట్లు కనిపించడం లేదు. చాలా మంది హీరోలు రెండు మూడు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు కూడా.
జైలవకుశ హిట్ అయినా, ఆ క్రెడిట్ మొత్తం బాబీ అకౌంట్ లో పడలేదు. తారక్ పెర్ఫామెన్స్ అదుర్స్ అనే టాక్ ముందు బాబీ మేకింగ్ స్టైల్ అంతగా హైలెట్ కాలేదు. దీంతో దర్శకుడిగా బాబీకి ఈసినిమా హిట్ ఇచ్చినా, క్రెడిట్ ఇవ్వలేకపోయింది. దీంతో ఈ దర్శకుడితో వెంటనే సినిమా చేద్దాం అని హీరోల నుంచి ప్రపోజల్స్ రాట్లేదని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అయితే బాబీ ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాడని, త్వరలోనే ఓ క్రేజీ కాన్సెప్ట్ తో వస్తాడని అతని సన్నిహితులు చెబుతున్నారు. మరి ఆ క్రేజీ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.

naga-chaitanya-fallows-nagarjuna
తండ్రి బాటలో పయనిస్తున్న తనయుడు

పాత ఇమేజ్ ను పక్కనపెట్టి కొత్త ఇమేజ్ లోకి వెళ్తేనే జర్నీ థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఆడియన్స్ కూడా రీఫ్రెషింగ్ గా ఫీలవుతారు. అయితే ఆ థ్రిల్ ఇచ్చే కథలు, మేకర్స్ ను క్యాచ్ చెయ్యడం ఆర్టిస్ట్ కు అంత ఈజీ కాదు. కానీ నాగచైతన్య మాత్రం చాలా ఈజీగా కొత్త కథలవైపు వెళ్తున్నాడు. టాలెంటెడ్ మేకర్స్ తో సినిమాలు చేస్తున్నాడు.
నాగచైతన్య కూడా నాగార్జున రూట్ లోనే కొత్త కథలను సెలక్ట్ చేసుకుంటున్నాడు. ఇండస్ట్రీ లెక్కలు, కమర్షియల్ సబ్జెక్ట్స్ అనే ఫార్ములాస్ పట్టించుకోకుండా, సినిమా సినిమాకు కొత్త జానర్ ను సెలక్ట్ చేసుకుంటున్నాడు. లవ్ స్టోరీస్ తో ఎక్కువగా హిట్స్ కొట్టినా, అక్కినేని హీరోలకు రొమాంటిక్ హీరోస్ అనే ఇమేజ్ ఉన్నా, ఆ సర్కిల్ ను దాటి యాక్షన్, రొమాంటిక్ కామెడీ మూవీస్ కు సైన్ చేస్తున్నాడు.
చైతు ప్రజెంట్ చందూ మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి అనే సినిమా చేస్తున్నాడు. మైత్రీ మూవీస్ బ్యానర్ లో నిర్మాణమవుతోన్న ఈసినిమా యాక్షన్ థ్రిల్లర్ గా వస్తోంది. తమిళ స్టార్ మాధవన్ ఓ కీరోల్ ప్లే చేస్తున్నాడు. అలాగే ఈ శనివారం సితార ఎంటర్టైన్మెంట్స్ లో మారుతి దర్శకత్వంలో ఓ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ స్టార్ట్ చేస్తున్నాడు చైతు. ఈ రెండు సినిమాలు ఒకదానితో ఒకటి సంబంధం లేని జానర్స్ లో వస్తోన్న సినిమాలే. సో చైతు ఒకే ఇమేజ్ లో ఇరుక్కుపోవడానికి ఇష్టపడట్లేదని చెప్పొచ్చు.

Rare-Childhood-Photo-of-Tollywood-Heroes
ఈ చిన్నారులు .. నేటి హీరోలు..అన్నదమ్ములు.. ఓ సీనియర్ తనయులు గుర్తు పట్టగలరా..!!

బాల్యం ఎవరికైనా అపురూపమే.. ఇక సెలబ్రిటీలు అయితే తమ బాల్యంలోని ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు.. తాజాగా ఇద్దరు చిన్నారులు ఎంతో అన్నోన్యంగా ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నది. వీరిద్దరూ అన్నదమ్ములు.. పైగా హీరోలు కూడా... ఓ సీనియర్ హీరో తనయులు.. ఇప్పటికైనా ఎవరో ఆ చిన్నారులు తెలిసిందా..!! ఎవరో కాదు ఆ చిన్నారులు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయులు. మంచు విష్ణు, మంచు మనోజ్ లు. విష్ణు గురువారం పుట్టిన రోజు జరుపుకొన్న సందర్భంలో మనోజ్ తన ప్రియమైన సోదరుడి పుట్టిన రోజు శుభాకాంక్షలను ప్రత్యేకంగా తెలిపాలని భావించినట్లున్నాడు.. దీంతో చిన్నారి 'విష్ణు'తనను ఎత్తుకొన్నప్పుడు తీసిన ఫోటోని తన అభిమానులతో పంచుకున్నాడు. అంతేకాదు.. ఈ ఫోటోతో పాటు తమ మధ్య ఉన్న బంధాన్ని అనుబంధాన్ని అక్షర రూపంలో తెలిపాడు.. మా మధ్య బంధం గురించి చెప్పడానికి మాటలు చాలవు.. నాకు ఎంతో బలంగా నిలిచినందుకు ధన్యవాదలు.. పుట్టినరోజు శుభాకాంక్షలు .... నువ్వు ఎప్పుడు సంతోషంగా.. ధృఢంగా ఉండాలని కోరుకొంటూ.. లవ్ యూ అని మనోజ్ తన ట్విట్టర్ ద్వారా అన్న పై ప్రేమను తెలుపుతూ ట్వీట్ చేశాడు.

Jabardasth Chammak Chandra New House Warming Function in Manikonda
ఓ ఇంటివాడైన చమ్మక చంద్ర.. ఆనంద... ఆనందమ్ అంటోన్న రవి

ప్రముఖ ఛానల్ లో వస్తున్న జబర్దస్త్ షో.. సీరియల్స్ తో పోటీపడి.. బుల్లితెరపై హవా చెలాయించడమే కాదు.. ఈ షో లో చేస్తోన్న ఎంతో మంది కామెడియన్స్ లు లైఫ్ ని ఇచ్చింది అని చెప్పడంతో అతిశయోక్తి లేదు.. కాగా ఈ షో ద్వారా పరిచయమైన కామెడియన్స్ అందరూ ఓ కుటుంబం లా ఉండడమే కాదు... జబర్దస్త్ షో లో జడ్జ్ గా వ్యవహరిస్తున్న నాగబాబుని తమ కుటుంబ పెద్దగా భావిస్తారు. కాగా ఈ షోలో చేస్తోన్న ఒక్కొక్కరుగా తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకుంటున్నారు. ఇప్పటికే సుధీర్, గెటప్ శ్రీను వంటి వారు తమ సొంత ఇంటి కలనెరవేర్చుకోగా.. తాజాగా ఇప్పుడు చమ్మక చంద్ర వంతు వచ్చింది. ఈ రోజు చమ్మక చంద్ర నూతన ఇంట్లో గృహ ప్రవేశం చేసినట్లు తెలుస్తోంది. మణికొండ లో నిర్మించుకున్న ఈ ఇల్లు ఈ గృహ ప్రవేశం చాలా సింపుల్ గా జరిగిందట.. ఒక్క రచ్చ రవి మాత్రమే ఈ గృహ ప్రవేశానికి హాజరనట్లు తెలుస్తోంది. జబర్దస్త్ షోలో చమ్మక చంద్ర, రవిచేసిన స్కిట్స్ మంచి పేరు తెచ్చాయి. దీంతో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. దీంతో చంద్ర రవి ని ఒక్కడినే తన ఇంటికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు చంద్ర గృహ ప్రవేశం అంటూ రవి ఓ ఫోటోను షేర్ చేసి.. దానిని ఓ ఆనంద.... ఆనందమ్... ఆయనే మా చంద్రన్న ఓ ఇంటివాడు ఆయనే.." అంటూ రవి కామెంట్ తో పాటు ఇంటి గృహప్రవేశం ఫోటోని పోస్ట్ చేశాడు. సినిమాల్లో పెద్దగా పేరు తెచ్చుకోలేని చమ్మక చంద్ర జబర్దస్త్ తో మంచి పేరు తెచ్చుకున్నాడు.  

Sayesha-Saigal-Dance-for-Vidya-vox-song
సాయేషా డ్యాన్స్ కు అభిమానులు 'ఫిదా'

బాలీవుడ్ లెజండరీ ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ లో అఖిల్ సినిమాతో హీరోయిన్ గా అడుగు పెట్టింది.. సాయేషా సైగల్. అఖిల్ సినిమా ప్లాప్ కావడంతో సాయేషా కు మళ్ళీ టాలీవుడ్ లో ఆఫర్లు లేవు.. కానీ బాలీవుడ్ లో అప్పుడప్పుడు మెరుస్తుంది.. తాజాగా ఓ కొలీవుడ్ లో ఆఫర్ అందుకొన్న సాయేషా నిత్యం అభిమానులతో సోషల్ మీడియా ద్వారా టచ్ లో ఉంటూనే ఉన్నది. తాను ఏమి చేస్తున్నా.. ఎక్కడ ఉన్నా.. తన షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్స్ ఏమైనా ఆ వివరాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంది. ఈ నేపధ్యంలో ఈ చిన్నది ఓ వీడియో షేర్ చేసింది.. కేవలం నిమిషం నిడివి గల ఆ వీడియోలో సాయేషా డ్యాన్స్ ఓ రేంజ్ లో చేసింది. గ్యాప్ ఇవ్వకుండా ఓ రేంజ్ లో ఆమె చేసిన డ్యాన్స్ ను అభిమానులతో పాటు.. నెటిజన్లు కూడా ఫిదా..!! అమెరికన్ పాప సింగర్ విద్యా వోక్స్ రీమిక్స్ చేసిన ఈ పాటకు సాయేషా డ్యాన్స్ చేసింది.. కాగా అప్పట్లో సాయేషా జూ.ఎన్టీఆర్ టెంపర్ సాంగ్ కు స్టెప్స్ వేసి అభిమానులను కనువిందు చేసిన సంగతి విధితమే..

kangana-injured-on-the-sets-of-manikarnika
దెబ్బకూడా మంచిదే..! అంటోన్న బాలీవుడ్ క్వీన్ కంగనా ..!!

ఎవరికైనా షూటింగ్ లో దెబ్బ తగిలితే.. ముఖ్యంగా హీరో, హీరోయిన్లకు దెబ్బలు తగిలితే.. షూటింగ్ నిలిపేయాల్సి వస్తుంది.. అయ్యో అని బాధపడతారు.. కానీ బాలీవుడ్ క్వీన్ కంగనా తన రూట్ సెపరేట్ అంటూ.. దెబ్బ కూడా మంచిదే అని అంటున్నది. కంగనా తాజాగా క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్నమణికర్ణిక ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ.. సినిమా షూటింగ్ లో భాగంగా ఇప్పటికే కంగనా రెండు సార్లు తీవ్రంగా గాయపడింది. రెండు రోజుల క్రితం కంగనా కుడి కాలు బెణికింది. ఈ విషయాన్ని కంగనా మీడియా తో తెలుపుతూ.. మణికర్ణిక కోసం 60 రోజుల నుంచి ఏకధాటిగా షూటింగ్ లో పాల్గొన్నాను...  ఓ పసికందును నా వీపుకి తగిలించుకొని పోరాటం చేయాల్సిన సన్నివేశాలు కూడా ఉన్నాడు.. దీంతో నాకు ఎప్పుడెప్పుడు దెబ్బలుతగులుతాయా..!! నేను ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకొంటానా అని నాలో నేను ఆలోచించుకొనే దానిని.. ఇప్పుడు నేను ఈ దెబ్బతో చాలా హ్యాపీ అంటూ.. తన కాలికి తగిలిన గాయాన్ని చూపించింది.. కంగనా...!

director-bobby-rejects-bunny's-movie
నిక్కరు వేసుకోమన్నారని... బన్నీ ఫ్రెండ్ క్యారెక్టర్ ని వదులుకున్న దర్శకుడు

రచయిత నుంచి దర్శకుడిగా మారిన బాబీ.. మాస్ మహారజా రవితేజ్ తో పవర్ సినిమాతో ఇండస్ట్రీలో దర్శకుడిగా అడుగుపెట్టాడు. అనంతరం పవన్ కల్యాణ్ తో సర్ధార్ గబ్బర్ సింగ్ కు దర్శకత్వం వహించే ఛాన్స్ దక్కించుకొన్న బాబీ... ఎన్టీఆర్ తో జై లవకుశ సినిమాతో సూపర్ హిట్ అందుకొన్నాడు. కాగా తనకు రచయిత, దర్శకత్వం కంటే ముందుగా నటుడుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టె ఛాన్స్ వచ్చింది అని... కానీ ఆ పాత్ర కోసం నిక్కరు వేసుకోమన్నారు అని ఆ సినిమాను వదులుకున్నట్లు బాబీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ గారు వల్ల దర్శకుడు బాబీకి అల్లు అర్జున్ మొదటి సినిమా "గంగోత్రి"లో నటించే ఛాన్స్ దక్కింది అని తెలిపాడు. బన్నీ చిన్ననాటి స్నేహితుడిగా నటించే ఛాన్స్.. ఆ పాత్ర కోసం నన్ను నిక్కరు వేసుకోమన్నారు.. కానీ నేను మూడో తరగతి నుంచే ఫ్యాంట్ వేసుకొనే వాడిని .. దీంతో ఆ పాత్ర కోసం నిక్కరు వేసుకోవడం ఇష్టం లేక ఆ సినిమా వదులుకొన్నా.. ఆ తర్వాత చిన్ని కృష్ణ గారి వద్ద రచయితగా పని చేశా.. అనంతరం దర్శకుడి అయ్యా అని బాబీ తెలిపాడు.

rajasekhar-daughter-shivani-debut-with-vijay-devarakonda-film
తెలంగాణ మెగాస్టార్ సినిమాతో ఎంట్రీ ఇవ్వాలనుకొంటున్న రాజశేఖర్ తనయ

సీనియర్ హీరో రాజశేఖర్ వరస వైఫల్యాల తర్వాత గరుడ వేగ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు.. ఈ సినిమా హిట్ అందించిన జోష్ లో రాజశేఖర్ ఫ్యామిలీ ఉన్నది. కాగా రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని సినీ రంగం ఎంట్రీపై ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కాగా ఈ విషయం పై రాజశేఖర్ క్లారిటీ ఇచ్చినట్లు అనిపిస్తుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాజశేఖర్ శివాని టాలీవుడ్ ఎంట్రీ పై మాట్లాడారు. ప్రస్తుతం శివాని మెడిసిన్ లాస్ట్ ఇయర్ చదువుతుంది అని .. మెడిసిన్ కంప్లీట్ అవ్వగానే వెండి తెరపై అడుగు పెడుతుంది అని చెప్పారు. అంతేకాదు.. పెళ్లి చూపుల సినిమాతో హీరోగా మారి.."అర్జున్ రెడ్డి" సినిమాతో సంచలన విజయం నమోదు చేసుకొన్న విజయ్ దేవర కొండ సినిమాతో శివాని ని లాంచ్ చేస్తే బాగుంటుంది అని భావిస్తున్నట్లు.. ప్రస్తుతం అదే ప్రయత్నంలో ఉన్నట్లు రాజశేఖర్ తెలిపారు. ఈ విషయం కన్ఫామ్ అయితే.. త్వరలో కూతురు తెరం గ్రేటం పై అధికారిక ప్రకటన చేస్తామని ఆయన అన్నారు.. అంతేకాదు.. శివాని కి కమర్షియల్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకోవాలనే మంచి పట్టుదలతో ఉన్నది అని రాజశేఖర్ తెలిపారు.

chiranjeevi-helps-rajasekhar's-daughter-doctor-seat
రాజశేఖర్ కూతురు డాక్టర్ సీట్ కోసం సాయం అందించిన చిరు..!!


టాలీవుడ్ లో చిరంజీవి, రాజశేఖర్ ల మధ్య అభిప్రాయబేధాలు ఏర్పడి... కొన్నేళ్ళ పాటు అలా కొనసాగిన మాట వాస్తవం. కాగా ఇటీవల రాజశేఖర్ రగుడవేగ సినిమా రిలేజ్ సందర్భంగా చిరంజీవిని రాజశేఖర్ దంపతులు కలుసుకొని సినిమా చూడడానికి ఆహ్వానించడంతో వీరిద్దరి మధ్య ఉన్న అభిప్రాయబేధాలు తొలగిపోయాయి అని అందరూ భావిస్తున్నారు. ఇదే విషయం పై రాజశేఖర్ స్పందిస్తూ... తామిద్దరం కొత్తగా కలుసుకొన్నది ఏమీ లేదని.. తమ మధ్య ఎప్పుడో అభిప్రాయబేధాలు తొలగిపోయి.. స్నేహసంబంధాలు నెలకొన్నాయని రాజశేఖర్ తెలిపాడు. ఇటీవల రాజశేఖర్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... గతంలో తన కూతురు మెడికల్ సీటు కోసం తాను చిరంజీవి ఇంటికి వెళ్ళినట్లు తెలిపాడు. చిరంజీవి గారితో విబేధాలు వచ్చాక కొంత కాలం దూరంగా ఉన్నాము.. కానీ అప్పుడప్పుడు పబ్లిక్ ఫంక్షన్లో కలుస్తూనే ఉన్నాము. మేము సైతం వంటి ఫంక్షంలో కలిశాం... మా అమ్మాయి శివానికి మెడికల్ సీటు కోసం అపోలో మెడికల్ కాలేజీ లో ధరఖాస్తు చేశాం. ఈ విషయంపై జీవిత చిరంజీవి గారి ఇంటికి వెళ్లింది. జీవిత వెళ్ళగానే చిరంజీవి గారు నా గురించి అడిగారాట.. వెంటనే జీవిత నాకు ఫోన్ చేసి రమ్మనమని చెప్పింది. కానీ అప్పటికి నేను రెడీగా లేను.. దీంతో జీవిత వెనక్కి వచ్చి.. నన్ను చిరంజీవి గారి ఇంటికి తీసుకొని వెళ్లింది. చిరంజీవి గారు చాలా బాగా మాట్లాడారు.. శివాని సీటుకు అవసరమైన సాయం కూడా చేశారు. అప్పటి నుంచి మా మధ్య ఉన్న అభిప్రాయ బేధాలు తొలగి.. మరింత దగ్గార అయ్యాం.. అంతేకాదు.. గరుడ వేగ సినిమా సమయంలో కూడా చాలా సాయం అందించారు చిరంజీవి అని రాజశేకఃర్ తెలిపాడు. కాగా ఇప్పటికే రాజశేఖర్ తాను విలన్ పాత్రలకు అయినా ఒకే.. అని.. చిరంజీవి సినిమాలో విలన్ గా నటిస్తా అని ప్రకటించిన నేపద్యంలో త్వరలో మళ్ళీ రాజశేఖర్ వెండి తెరపై బిజీ అవుతాడేమో చూడాలి మరి.!!

balakrishnudu-movie-review
రివ్యూ: రొటీన్ ఫ్యాక్షన్ ఫార్ములా బాలకృష్ణుడు

రివ్యూ: బాలకృష్ణుడు 

తారాగణం: నారా రోహిత్, రెజీనా, రమ్యకృష్ణ, కోటా శ్రీనివాసరావ్, అజయ్, శివ ప్రసాద్, 30ఇయర్స్ పృధ్వీ, వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి, ఆదిత్య మీనన్, రఘు బాబు, రవి వర్మ, తేజస్వి, సన, సత్యకృష్ణన్, తదితరులు
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర్రావ్
సినిమాటోగ్రఫీ:వి జయ్ సి.కుమార్
సంగీతం: మణిశర్మ
నిర్మాతలు :మహేంద్రబాబు, ముసునూరు వంశీ, శ్రీ వినోద్ నందమూరి
దర్శకత్వం :పవన్ మల్లెల

వైవిధ్యమైన కథలతో ఓ సెపరేట్ ట్రాక్ లో వెళ్లే నారా రోహిత్ ఫస్ట్ టైం ఫ్యాక్షన్ జానర్ లోకి వచ్చాడు. స్లిమ్ లుక్ లో బాలకృష్ణుడుగా మారాడు. నాకు ఫ్యాక్షన్ మూవీ కూడా ఓ ప్రయోగం లాంటిదే, ఇంతవరకు ఇలాంటి సినిమాలు చెయ్యని నాకు బాలకృష్ణుడు ఓ కొత్త జానర్ సినిమానే అని చెబుతూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మరి టాలీవుడ్ లో ఒకప్పుడు సక్సెస్ ఫార్ములాగా నిలిచిన ఫ్యాక్షన్ స్టోరీతో నారా రోహిత్ ఎలాంటి రిజల్ట్ అందుకున్నాడో చూద్దాం

కథ:
కక్ష్యలు, పగప్రతీకారాలు, కరువుతో తల్లడిల్లిపోతున్న ఉయ్యాలవాడ ప్రాంతాన్ని అభివృద్దిలోకి తీసుకెళ్లాలని, ప్రజలను చైతన్యపరచాలని స్కూల్లు, కాలేజీలు, పరిశ్రమలు స్థాపించాలనుకుంటారు (ఆదిత్య మీనన్)రవిందర్ రెడ్డి అతని చెల్లెలు భానుమతి దేవి(రమ్యకృష్ణ). అయితే ఆ ప్రాంతంలో ఉన్న ఖనిజాలను దోచుకోవాలని, జనాలను బానిసలుగా వాడుకోవాలనుకునే ప్రతాప్ రెడ్డి(అజయ్) అతని తండ్రికి ఈ పనులు అడ్డుతగులుతుంటాయి. దీంతో రాజకీయపలుకుబడితో రవీందర్ రెడ్డిని దెబ్బతియ్యాలనుకుంటాడు ప్రతాప్ రెడ్డి. ఈ క్రమంలో ప్రతాప్ రెడ్డి తండ్రి ఆత్మహత్య చేసుకుంటాడు. తన తండ్రి చావుకు కారణం అయిన రవీందర్ రెడ్డిని చంపి ప్రతాప్ రెడ్డి జైలుకెళతాడు. ఈలోపు భానుమతి తన అన్నయ్యను చంపిన ప్రతాప్ రెడ్డి మనుషులను అంతం చేసి కర్నూల్ లో సూపర్ పవర్ గా ఎదుగుతుంది. ఆ పవర్ ను దెబ్బతియ్యడానికి భానుమతి మేనకోడలు ఆద్య(రెజీనా) ను చంపెయ్యాలనుకుంటాడు ప్రతాప్. ఈ మధ్యలో బాలు(నారా రోహిత్) ఎంటరై ప్రతాప్ ప్లాన్స్ కు అడ్డుపడి ఆద్యను కాపాడుతుంటాడు. మరి ఆద్యకు బాలుకు సంబంధం ఏంటి? బాలు ఆద్య కోసం ఫ్యాక్షన్ గొడవలోకి ఎందుకు ఎంటర్ అవుతాడు? అనేది మిగిలిన కథ

విశ్లేషణ:
టాలీవుడ్ లో ఇప్పటికీ బోల్డన్ని ఫ్యాక్షన్ స్టోరీస్ వచ్చాయి. ఆ ఫ్యాక్షన్ కథలపై స్ఫూఫ్స్ కూడా వచ్చాయి. ఇక అదే జానర్ లో సినిమా అంటే కొత్తగా ఉంటుందనే ఆలోచనలు రావు గానీ, ట్రీట్మెంట్ ఎలా ఉంటుందనే ఆసక్తి ఉంటుంది. ఆ క్యూరియాసిటీకి ఎంటర్టైన్మెంట్ కోటింగ్ ఇచ్చి బాలకృష్ణుడుని ఫ్యాక్షన్ కమ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు దర్శకుడు పవన్ మల్లెల. రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ లో ఉండే ఫార్ములాస్ ను మిస్ కానివ్వకుండా హీరో ఇంట్రడక్షన్, ఫైట్స్, సాంగ్స్, కామెడీ, అన్ని ట్రాక్స్ నింపేశాడు. హీరోయిక్ ఫార్ములాను హైలెట్ చేస్తూ బాలకృష్ణుడును రెగ్యులర్ ట్రాక్ ఎక్కించాడు. ఇక ఈ ట్రాక్ లో నారా రోహిత్ కూడా కమర్షియల్ హీరోగా అలరించడానికి బాగానే ట్రై చేశాడు. సన్నబడి న్యూ మేకోవర్ తో కొత్త లుక్ లో కనిపించాడు. డబ్బులు ఇస్తే చాలు, ఎంతటి రిస్క్ అయినా చెయ్యడానికి వెనకాడని బాలు పాత్రను బాగానే చేశాడు. ఇప్పటివరకు తనపై ఉన్న సీరియస్ ఇమేజ్ ను చెరిపేసుకోవడానికి కమర్షియల్ వాల్యూస్ ఉన్న పాత్రగా మారాడు. ఫైట్లు, కామెడీ ట్రాక్స్ లో చాలా ఈజ్ గా చేశాడు. అయితే వైవిధ్యమైన పాత్రలతో ఎప్పుడూ సర్ ప్రైజ్ చేసే రోహిత్ కు ఈ బాలు క్యారెక్టర్ అంత స్పెషల్ గా నిలవదనే చెప్పాలి. ఇక సెక్యూరిటీ మధ్య పెరిగి స్వేచ్చ కోరుకునే ఆద్య పాత్రలో రెజీనా చాలా గ్లామర్ గా కనిపించింది. పాటలు, సీన్స్ లో స్కిన్ షోతో అలరించింది. రమ్యకృష్ణ పవర్ ఫుల్ క్యారెక్టర్స్ కు కేరాఫ్ గా నిలుస్తోన్న టైంలో ఫ్యాక్షన్ లీడర్ భానుమతి పాత్రలో ఆ ఈజ్ చూపించింది. అయితే ఆ క్యారెక్టర్ లో రమ్యకృష్ణకు పెద్దగా పర్ఫామ్ చేయడానికి స్కోప్ లేదు. అయినా బాగానే చేసింది. రెండు రాష్ట్రాలను గడగడలాడించే పవర్ ఉన్న, ఇంట గెలవలేని ప్రతాప్ రెడ్డి పాత్రకు అజయ్ బాగానే సరిపోయాడు. అయితే హీరోయిజం ఫార్ములాలో విలన్ ను స్ట్రాంగ్ గా చూపించడంలో దర్శకుడు అంత శ్రద్ద తీసుకోలేదు. దీంతో అజయ్ పెర్ఫామెన్స్ కు పెద్దగా అవకాశం లేకుండా పోయింది. ఇక సినిమాకు హైలెట్ గా ఫ్యాక్షన్ స్టోరీలో కామెడీని హైలెట్ చేసింది మాత్రం 30ఇయర్స్ పృధ్వియే. నేషనల్ జియాగ్రఫీ ఫోటో గ్రాఫర్ మాధవరావ్ అలియాస్ మాడీ ఆర్ గా కామెడీ ట్రాక్ నడిపించాడు. ఫైట్స్, పాటల మధ్య తన కామెడీతో ప్రేక్షకుల మూడ్ చేంజర్ గా మారాడు. అజయ్ తో ఉండే సీన్స్ లో అయితే పృధ్వీ కామెడీ హైలెట్ అనే చెప్పాలి. ఇక ఆ కామెడీని చిట్టిబాబు డ్రామా కంపెనీతో బాగానే కంటిన్యూ చేశాడు శ్రీనివాసరెడ్డి. తన స్టైలాఫ్ డైలాగ్స్ తో నవ్వించాడు. ఇక పెయింటర్ గా వెన్నెల కిశోర్ కామెడీ కూడా అలరించింది. అయితే మణిశర్మ అందించిన పాటలు సినిమాలో ప్రత్యేక స్థానం సంపాదించుకోవడంలో సక్సెస్ కాలేదు. సినిమాను రిచ్ గా చూపించడంలో కెమెరా మెన్ ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. టాప్ కమెడియన్స్, స్టార్ ఆర్టిస్టులు ఉన్నా, సినిమా కామెడీతో రన్ అవుతోన్నా, ఎక్కడో ఏదో మిస్ అయిన ఫీలింగ్ మాత్రం ప్రేక్షకుడిని వెంటాడుతుంది. కంటెంట్ గ్రిప్పింగ్ గా లేకపోవడం, మేకింగ్ లో దర్శకుడు తడబడడం, కథనాన్ని సరిగా హ్యాండిల్ చేయకపోవడం వల్ల కావొచ్చు బాలకృష్ణుడు రెగ్యులర్ యాక్షన్ స్టోరీయే అనే భావన కలిగిస్తుంది. అయితే పాటలు, ఫైట్లు, కామెడీ ఉన్న మాస్ సినిమాలను ఇష్టపడేవాళ్లకు బాలకృష్ణుడు ఓకే అనిపిస్తాడు.

ఫైనల్ గా: రొటీన్ ఫ్యాక్షన్ ఫార్ములాను దాటలేకపోయిన బాలకృష్ణుడు 

RGV-movie-with-Nag-and-Anushka
నాగ్‌తో రొమాన్స్‌కి రెడీ అంటున్న అనుష్క..

నాగార్జున కథానాయకుడిగా రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రంలో నాగ్‌కి జోడీగా టబు నటిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే టబుని కాదని ఇప్పుడు అనుష్క తెరపైకి వచ్చింది. అనుష్కను ఇండస్ట్రీకి పరిచయం చేసింది నాగార్జునే. ఆ అభిమానంతోనే అడగ్గానే ఒప్పేసుకుందట. ఇప్పటికే వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు బ్లాక్ బస్టర్ సాధించాయి. ఎలాగూ తన ప్రాజెక్ట్ 'భాగమతి' కూడా పూర్తి చేసింది. ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులు కూడా ఏమీ లేవు. సో.. ఈ నవ మన్మధుడితో మరోసారి అనుష్క అల్లరి చేయబోతోంది. త్వరలోనే ఈ విషయంపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వనుంది. 

'Mental-Madhilo'-Movie-Review
'మెంటల్ మదిలో' రివ్యూ

పెళ్ళి చూపులు తో నేషనల్ వైడ్ క్రేజ్ ని సంపాదించుకున్న నిర్మాత రాజ్ కందుకూరి. మరో షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ ని మెయిన్ స్ట్రీమ్ కి తీసుకొచ్చాడు.  నిర్మాతగా తనకు సక్సెస్ ని అందించిన దారిలో మరో అడుగు ఈ మూవీ. ప్రీ రిలీజ్ లోనే సక్సెస్ టాక్ ని సొంతం చేసుకొని ఇండస్ట్రీ అంతా పెద్ద బజ్ ని క్రియేట్ చేసింది మెంటల్ మదిలో.. మరిఈ మూవీలో అంతగా ఆకట్టుకునే విశేషాలేంటో చూద్దాం..

కథ:
ఆప్షన్స్ ఎక్కువఅయితే కన్ ఫ్యూజ్ అవడం సహాజం.. అయితే ఆ కన్ ఫ్యూజన్ లెవల్స్ పీక్స్ లో ఉండే క్యారెక్టర్ అరవింద్ కృష్ణ(శ్రీవిష్ణు) ది. చెప్పినది చేయడమే తప్ప ఏం కావాలి అనే ఆప్షన్స్ ఇస్తే అక్కడే ఆగిపోతాడు. ఈ భయంతో అమ్మాయిలకు దూరంగా పెరుగుతాడు. ఇతడు పెళ్ళి కొచ్చాడని తల్లిదండ్రులు తెగ గాబారా పడిపోయి మ్యారేజ్ బ్యూరోల చుట్టూ తిరుగుతుంటారు.  సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ అయిన ఈ కుర్రాడు పెళ్ళి చూపులకు వెళ్ళి స్వేచ్ఛ( నివిత పేతురాజ్) తో కనెక్ట్ అవుతాడు. ఇతడి బెరుకు , అమాయకత్వం నచ్చి  స్వేచ్ఛ కూడా అరవింద్ ని ఒకే చేస్తుంది. తనేంటో అర్దం చేసుకొని తనను పూర్తిగా ఇష్టపడే స్వేచ్ఛ అరవింద్ జీవితంలోకి వచ్చాక అతని ప్రపంచం మారిపోతుంది.  పెళ్ళి కి సిద్దం అవుతున్న టైం లో అరవింద్ ఆఫీస్  ముంబాయ్ వెళతాడు. అక్కడ రేణు(అమృత) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. స్వేచ్ఛతో ఎంగేజ్ మెంట్ , రేణు తో ప్రేమ ఇలా కన్ ఫ్యూజన్ గా మారుతుంది అరవింద్ జీవితం.  మరి అరవింద్ తీసుకున్న డెసిషన్ ఎంటనేది మిగిలిన కథ..?

కథనం:
ప్రతి మనిషికి కన్ ఫ్యూజన్ ఉంటుంది. అలాంటి యూనివర్స ల్ ప్రాబ్లెమ్ ని కాస్త ఎక్స్టాక్ట్ చేసి కథను రాసుకోవడంతోనే దర్శకుడు వివేక్ ఆత్రేయ విజయం సాధించాడు. అతని కన్ ఫ్యూజన్ లెవల్స్ ని బాగా ప్రొజెక్ట్ చేస్తూ కథను ముందుకు తీసుకెళ్ళడంతో హీరో క్యారెక్టరైజేషన్ కి త్వరగా కనెక్ట్ అయిపోతాము.  ఆ పాత్రలో శ్రీవిష్ణు లో చాలా బాగా కుదిరాడు. అతను నటించాడు అనడం కంటే  ఆ పాత్రగా మారిపోయాడు అంటే బాగుంటుంది. పెళ్ళి చూపులకు వెళ్ళే సీన్ సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది. హీరోయిన్ తో హీరో మాట్లాడే సన్నివేశం చాలా రోజులు గుర్తుండిపోతుంది. శ్రీ విష్ణు తండ్రిగా శివాజీ రాజా మంచి క్యారెక్టర్ తో అలరించాడు. వయస్సుకు తగ్గ పాత్రతో తన టైమింగ్ తో శివాజీ రాజా నటన బాగా ఆకట్టుకుంది. స్వేచ్ఛ పాత్రగా మారిన నివితా ఈ సినిమాకి బలంగా మారింది. అమ్మాయి నటనలో కనిపించే కాన్ఫిడెంట్ ఇట్టే ఆ పాత్రతో ప్రేమలో పడేలా చేస్తుంది. పాటలలో ‘చాల్లే పోరా చూసాంలేరా’ ఆ సిట్యువేషన్ ని బాగా ఎలివేట్ చేసింది.  స్వేచ్ఛలాంటి క్యారెక్టర్ ని డిజైన్ చేసిన రైటర్ కమ్ డైరెక్టర్  అభినందించాల్సిందే.  ఆ పాత్ర ని ఎక్కువగా ప్రేమించిన ప్రేక్షకులకు సెకండాఫ్ లో వచ్చే రేణు పాత్ర  కాస్త ఇబ్బందిగా నే అనిపిస్తుంది. అయినా ఆ ఇబ్బంది తక్కువ టైంలోనే ఒక ఎమోషనల్ టచ్ ఇచ్చాడు దర్శకుడు. నిదానంగా ఆ పాత్రలోని నిజాయితీకి కనెక్ట్ అవుతాము. తర్వాత వచ్చే ప్రతి సన్నివేశంలో హీరో కన్ ఫ్యూజన్ ఆడియన్స్ కన్ ఫ్యూజన్ ఒకేలా మారడం దర్శకుడు సాధించిన విజయం . చాలా సహాజంగా అనిపించే సన్నివేశాలు, మాటల మద్యలో మనసుల్లోకి చొచ్చుకొళ్ళే భావాలు, పాత్రలను మలిచిన తీరు లో దర్శకడుు చూపించిన పరిణితి సినిమా ఎక్స్ పీరియన్స్ ని దాటి ఒక లైఫ్ లో మరిచిపోలని అనుభూతి గా మారుతుంది. కథలో కలసిపోయే సాహిత్యం, సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణగా మారాయి. ప్రశాత్ విహారి  స్వరాలు హాయిగా ఉన్నాయి. శ్రీ విష్ణు కి ఇది కెరియర్ టర్నింగ్ మూవీ అవుతుంది. అరవింద్ కృష్ణగా అతను చాలా కాలం గుర్తిండిపోతాడు. ఇక కథనం లో దర్శకుడు తీసుకున్న శ్రర్ధ చాలా బాగుంది. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ దగ్గర కథకు బ్రేక్ ఇచ్చిన దర్శకుడు తర్వాత పదినిముషాలు ముందుకు వెళ్ళి  అదే కథను మరో విధంగా చెప్పాడు.  ఆ ప్రయత్నం మెంటల్ మదిలో కి కొత్తదనం అందించింది. రేణు పాత్ర చేసిన అమ్మాయి పాత్ర ఒక జర్క్ తో మొదలైనా ఆ పాత్ర ముగింపు ని అర్దవంతగా చేసాడు దర్శకుడు.  వివేక్ ఆత్రేయ, ప్రశాంత్ విహారి, శ్రీవిష్ణు, నివేతా వీరెరికీ పోస్టర్ వాల్యూ, అండ్ కాంబినేషన్ వాల్యూలేదు. కథను, దర్శకుడు ప్రతిభను మాత్రమే నమ్మి ముందుకు వెళ్ళి న రాజ్ కందుకూరి ఈ విషయంలో సక్సెస్ అయ్యాడు. కాంబినేషన్స్ చుట్టూ తిరగకుంటూ కథలను వెతకడంలో అతను పడ్డ శ్రమ మెంటల్ మదిలో సక్సెస్ గా మారింది. ఎదిగిన తర్వాత వచ్చిన దారిని మరిచిపోవడం ఇండస్ట్రీలో సహాజంగా జరిగేదే. కానీ ఎదిగిన దారిని మరిచిపోకుండూ కొత్త వారిని ప్రొత్సహించాలి మంచి కథలను మాత్రమే అందించాలనే నిర్మాతలు పరిశ్రమకు చాలా అవసరం. మెంటల్ మదిలో ప్రేక్షకులకు ఆకట్టుకోవడానికి ఈ అంశాలే ప్రధాన కారణం. 
సినిమా  మేకింగ్ లోనూ, ఆడియన్స్ అభిరుచిల్లోనూ చాలా మార్పులను ఈ సంవత్సరం చూసాం. ఫార్ములాలు, ఫోర్సడ్ కామెడీలకు మోహం మొత్తిన ప్రేక్షకులు వాటిని తిప్పికొడుతూనే ఉన్నారు. మెంటల్ మదిలో వాటికి భిన్నంగా ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేసింది. కథలో పాత్రలుగా మారిపోయే కాస్టింగ్ ఈమూవీకి ప్రధాన బలం.  పెళ్ళి చూపులు తర్వాత ఈ సినిమా తో  రాజ్ కందుకూరి తన సక్సెస్ టైం కలిసొచ్చి వచ్చింది కాదని నిరూపించాడు. 

చివరిగా:
రోమాంటిక్ కామెడీ జానర్ లో ఈ మూవీ ఒక రిఫరెన్స్ లా మిగిలుతుంది. ఏ కన్ ఫ్యూజన్ లేని ఆహ్లాదకరమైన సినిమా. 

Allari-naresh-planning-'Sudigadu2'
'సుడిగాడు2'తో అల్లరి నరేష్‌కి లక్ వస్తుందో లేదో?

తన కామెడీ టైమింగ్ తో ఫాలోయింగ్ తెచ్చుకుని, మినిమమ్ గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్న హీరో అల్లరి నరేష్. వరుస విజయాలు అందుకున్న అల్లరోడుకి హిట్ వచ్చి చాలా కాలం అయ్యింది. వరుసగా సినిమాలు చేస్తున్న సక్సెస్ రావడం లేదు. దీంతో తన హిట్ సినిమా సుడిగాడుకి సీక్వెల్ తీసి హిట్ కొట్టాలనుకుంటున్నాడు.

తమిళ పడంకి రీమేక్ గా వచ్చిన సుడిగాడు చిత్రామే అల్లరి నరేష్ కి చివరి హిట్ సినిమాగా ఉంది. భీమనేని దర్శకత్వంలోనే ఆ సినిమాకి సీక్వెల్ తీసి హిట్ కొట్టాలనుకుంటున్నాడు అల్లరి నరేష్. తమిళంలో ఈ చిత్రానికి సీక్వెల్ తీస్తున్నారు. ఆ రైట్స్ ని తీసుకుని తెలుగులో రీమేక్ చేయడానికి చూస్తున్నారు అల్లరి నరేష్ అండ్ టీమ్. మరి సుడిగాడు2తో అల్లరి నరేష్ కి లక్ వస్తుందో లేదో చూడాలి. 

Sri-Vishnu-starer-'Mental-Madhilo'-creates-positive-buzz
పాజిటివ్ టాక్‌తో 'మెంటల్ మదిలో'

పెళ్ళిచూపులు చిత్రంతో దాదాపు కొత్తవారిని పరిచయం చేసి మంచి విజయాన్ని అందుకున్న నిర్మాత రాజ్ కుందుకూరి, లేటెస్ట్ గా మెంటల్ మదిలో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శ్రీవిష్ణు, నివేతా పేతురాజ్, అమృత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి దర్శకుడు వివేక్ ఆత్రేయ.

ఇద్దరు అమ్మాయిలను లవ్ చేసిన ఓ అబ్బాయి కథే ఈ మెంటల్ మదిలో మూవీ స్టోరీ. హీరోగా శ్రీవిష్ణు నటనకి ప్రశంసలు దక్కుతున్నాయి. ఆహ్లాదకరమైన రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో హీరోయిన్ల పెర్ఫార్మెన్స్, డైరెక్టర్ టేకింగ్, కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. నిర్మాత రాజ్ కుందుకూరి మరో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకోబోతున్నారు.

Rakul-Preet-signs-of-organ-donation-declaration-form
అవయవ దాన పత్రంపై అందాల తార సంతకం

మనిషి మరణించినా మరొకరికి వెలుగుల్ని పంచొచ్చు అని మొదలైన అవయవదాన కార్యక్రమం రాను రాను వైద్య రంగంలో చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పుల కారణంగా మనిషి శరీరంలోని చాలా భాగాలు మరణానంతరం మరికొద్దిమందికి ఉపయోగించవచ్చని తెలిపింది. అవయవ దానంపై అందరికీ అవగాహన కల్పిస్తూ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. భాగ్యనగర ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ నెల 26న నిర్వహించే 10కే రన్‌లో పాల్గొనమంటూ అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ అభిమానుల్ని కోరుతోంది. ఈ సందర్భంగా తాను కూడా అవయదానం చేస్తున్నట్లు ఆర్గాన్ డొనేషన్ పత్రంపై సంతకం చేసింది. 

Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials