Live News Now
  • ఏడుగురికి తీవ్ర గాయాలు.. తిరుపతి నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం..
  • టెలికాం సెక్టార్ లో మరో బిగ్ డీల్.. టెలినార్ ను టేకోవర్ చేయనున్న భారతి ఎయిర్ టెల్
  • ప్రస్తుతం దేశంలోని ఏడు సర్కిళ్లలో సేవలందిస్తున్న టెలినార్..
  • ఇవాళ విద్యాసంస్థల బంద్ కు టిజెఎసి పిలుపు..
  • నిరుద్యోగ ర్యాలిపట్ల ప్రభుత్వ వైఖరికి నిరసనగా బంద్..
  • రంగారెడ్డి: కొత్తూరులోని అమెజాన్ గోదాములో చోరి.. 36 ల్యాప్ టాప్ లు అపహరణ.. ఐదుగురు అరెస్ట్
  • గుంటూరు: ఐడిబిఐ కుంభకోణంలో మూడో ఎఫ్ఐఆర్ నమోదు.. మరో 31 మందిపై సిబిఐ కేసు..
  • గుంటూరుతో పాటు బాపట్ల ఆంధ్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులను కూడా మోసం చేసిన ముఠా..
  • ఢాకా: బంగ్లాదేశ్ లో దొంగనోట్ల ముఠా అరెస్ట్.. రు.2వేల నకిలీ నోట్లను భారత్ కు తరలిస్తున్న..
  • పలువురు పాకిస్థానీయులను అరెస్ట్ చేసిన బంగ్లాదేశ్ పోలీసులు..
ScrollLogo హైదరాబాద్: కామాటిపుర పిఎస్ నుంచి జెఎసి ఛైర్మన్ కోదండరామ్ విడుదల... ScrollLogo ఇవాళ్టినుంచి విజయవాడ-హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ ఆంక్షలు.... ScrollLogo దుర్గగుడి టోల్ గేట్ కుమ్మరిపాలెం సెంటర్ వరకు వాహనాల మళ్లింపు.. ScrollLogo హైవే పనుల నిమిత్తం ఇబ్రహీంపట్నం మీదుగా వచ్చే వాహనాలు.. ScrollLogo గొల్లపూడి మీదుగా సీతారాం సెంటర్ వైపు దారి మళ్లింపు.. ScrollLogo విజయవాడ-హైదరాబాద్ వాహనాలు చిట్టినగర్ నుంచి గొల్లపూడి మీదుగా మళ్లింపు.. ScrollLogo జమ్ముకాశ్మీర్: పోషియన్ లో ఉగ్రవాదుల దాడి.. ఐదుగురు జవాన్లు సహా మహిళ మృతి ScrollLogo మరో ముగ్గురు జవాన్లకు తీవ్రగాయాలు.. ScrollLogo పెట్రోలింగ్ నిర్వహిస్తున్న జవాన్లపై కాల్పులకు పాల్పడిన ఉగ్రవాదులు.. ScrollLogo కడప: దువ్వూరు(మ)కానగూడురు వద్ద డివైడర్ ను ఢీకొని టాటా ఏస్ వాహనం బోల్తా..ముగ్గురు మృతి
International News
Flooding-forces-hundreds-from-homes-in-San-Jose-California
కాలిఫోర్నియాలో తుఫాన్‌ బీభత్సం:అస్తవ్యస్తమైన జన జీవనం

కాలిఫోర్నియాలో తుఫాన్‌ బీభత్సం సృష్టించింది. తుఫాన్ ధాటికి.. దక్షిణ, సెంట్రల్‌ కాలిఫోర్నియాలో జనజీవితం అస్తవ్యస్తమైంది. గత వారం రోజులుగా ప్రజలు  వరద నీటిలోనే మగ్గుతున్నారు. శాండియాగోలో ఇద్దరు మృతి చెందగా.. రంగంలోకి దిగిన రెస్య్కూ టీమ్‌.. సుమారు 200 మందిని రక్షించారు. శాన్‌జోస్‌ నగరంలో వరద నీటిలో చిక్కుకున్న వారిని.. బోట్ల సహాయంతో రక్షించారు. ఇంకా కొద్దిరోజులు ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు తెలిపారు.

Trump-administration-widens-net-for-immigrant-deportation
అక్రమ వలసదారులపై అమెరికా ప్రభుత్వం కొరడా

వలస ప్రజలపై వివక్షకు వ్యతిరేకంగా ఫెడరల్ కోర్టు తీర్పు చెప్పినా పట్టించుకోని ట్రంప్ ప్రభుత్వం తాజాగా కొత్త ఆదేశాలు జారీ చేసింది.  అక్రమ వలసదారులను సాధ్యమైనంత త్వరగా దేశం నుంచి పంపించేయాలని అమెరికా అంతర్గత భద్రతా విభాగం కొత్త ఆదేశాలు జారీ చేసింది.  పిల్లలు, మరికొందరిని మినహాయించి అక్రమ వలసదారులందర్నీ పంపించాలని సెక్రటరీ జాన్ కెల్లీ సరిహద్దు గస్తీ వలస అధికారులకు మంగళవారం రెండు కఠిన ఉత్తర్వులు జారీ చేశారు.  నేరాల్లో దోషులుగా తేలిన, నేరారోపణలు ఎదుర్కుంటున్న అక్రమ వలసదారులను ముందుగా తరలించాలన్న ప్రాధాన్యాన్ని అలాగే కొనసాగించనున్నారు.  వలస చట్టాలను ఉల్లంఘించిన వారందరిపైనా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొంది. ఈ ఆదేశాలతో అవసమైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న 1.1 కోట్ల మంది అక్రమ వలసదారులు కష్టాలు ఎదుర్కోనున్నారు. 

New-Yorkers-rally-to-say-'Today-I-am-a-Muslim-too'
ముస్లింలకు మద్దతుగా ‘నేనూ ముస్లింనే’ నినాదంతో యుఎస్ ర్యాలీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వలస విధానాలకు వ్యతిరేకంగా, ముస్లింలకు మద్దతుగా టైమ్స్‌ స్క్వేర్‌ వద్ద వేలాదిమంది ‘నేనూ ముస్లింనే’ నినాదంతో ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా విభిన్న మతాలకు చెందిన వారంతా ‘నేనూ ముస్లింనే’ అంటూ మద్దతు ప్రకటించారు. ట్రంప్‌ను వ్యతిరేకించండి, ముస్లింపై నిషేధం వద్దు అన్న బ్యానర్లు ప్రదర్శిస్తూ సాగిన ఈ ర్యాలీ రచయిత రసెల్‌ సిమన్స్, నటి సుసాన్ శారండన్  ఆధ్వర్యంలో సాగింది.

Major-Elements-of-Trump's-New-Immigration-Policies
ముస్లిం దేశాల వలసల నిషేధాన్ని సవరిస్తూ ట్రంప్ కొత్త పాలసీ

ఏడు ముస్లిం దేశాల పౌరుల వలసపై నిషేధం విధస్తూ అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై.. దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో కొంత వెనక్కి తగ్గిన ట్రంప్‌ మళ్లీ వలసలపై కొత్త విధానాన్ని ప్రకటించాలని భావిస్తున్నారు. అయితే సవరించిన ఆర్డర్ లో కూడా ఆ ఏడు దేశాలనే లక్ష్యంగా చేసుకుంటారని తెలుస్తోంది. అయితే ఈసారి వెలువడే ఆర్డర్స్ లో మాత్రం.. గ్రీన్ కార్డులు ఉన్నవారికి మినహాయింపు ఇవ్వొచ్చని తెలుస్తోంది. ఇప్పటికే అమెరికా వీసా ఉన్న వారిని దేశంలోకి అనుమతిస్తారని అధికారులు చెబుతున్నారు. కొత్త ఉత్తర్వులు ప్రస్తుతం ముసాయిదా రూపంలో అధికారులకు అందాయి. వాటికి తుదిరూపునిచ్చి... త్వరలోనే విడుదల చేస్తామని వైట్‌ హౌస్‌ ప్రకటించింది. 

Trump-Chooses-H.R. McMaster-as-National-Security-Adviser
అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా హెచ్ఆర్ మెక్ మాస్టర్

అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా  హెచ్ఆర్ మెక్ మాస్టర్ ను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నియమించారు. మెక్ మాస్టర్.. గల్ఫ్, ఇరాక్ యుద్ధ సమయంలో మిలటరీలో కీలక పాత్ర పోషించారని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అంతేకాకుండా యాంటీ కరప్షన్, ట్రాన్సరెన్సీ టాస్క్ ఫోర్స్ లకు నాయకత్వం వహించాడు. దేశానికి సేవ చేసే అవకాశం కల్పించిన ట్రంప్ కి.. మెక్ మాస్టర్ క్రుతజ్నతలు తెలిపారు.   

Historians-rank-Obama-12th-best-president
బెస్ట్ ప్రెసిడెంట్ సర్వేలో 12వ ర్యాంక్ సాధించిన ఒబామా

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా.. అమెరికన్ బెస్ట్ ప్రెసిడెంట్ సర్వేలో 12వ ర్యాంక్ సాధించారు. ప్రెసిడెంట్ డే సందర్బంగా సీ స్పాన్ అనే సంస్థ నిర్వహించిన సర్వేల్లో అబ్రహం లింకన్ మొదటిస్థానంలో నిలువగా..జార్జ్ వాషింగ్టన్, ఫ్రాక్లిన్ డి రూజ్వేల్ట్, ధియోడోన్ రూజ్వేల్ట్ మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నారు. 10 కేటగిరిల్లో 43మంది అమెరికా మాజీ అధ్యక్షుల నుంచి ఈ ర్యాంకులను తీశారు. జార్జ్ డబ్ల్యూబుష్ 33వ ర్యాంక్ సాధించగా... బిల్ క్లింటన్ మాత్రం 15వ స్థానంలో ఉన్నారు. అధ్యక్షుడి చారిత్రక సర్వేలో ఒబామాకు చోటు దక్కడం ఇదే మొదటిసారి.  సమన్యాయం పాటించడంలో ఒబామా 3 స్థానంలో ఉండగా.. కాంగ్రెస్ తో సంబంధాల విషయంలో మాత్రం 39 స్థానానికి పడిపోయాడు. 
 

Jet-Airways-flight-scare-One-pilot-was-'asleep'-another-on-wrong
నిద్రలో పైలట్, ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న ప్రయాణీకులు

విమాన పైలట్లు ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా ప్రయాణీకుల ప్రాణాలు గాల్లో కలిసిపోవలసిందే. అలాంటిది ఓ పైలట్ నిద్రపోవడం వల్ల దాదాపు 330 మంది ప్రయాణీకులు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. ఇటీవల ముంబయి నుంచి లండన్ బయలుదేరిన జెట్ ఎయిర్‌లైన్స్ విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు కోల్పోవడంపై అధికారులు విచారణ చేపట్టి నివేదిక తయారు చేశారు. విమానాన్ని నడపాల్సిన పైలట్ నిద్రపోతుండగా, మరో పైలట్ పెట్టుకున్న హెడ్‌సెట్ వాల్యూమ్ తగ్గించి ఉండడం వల్ల ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్న సూచనలు వినిపించకపోవడంతో తప్పుడు ఫ్రీక్వెన్సీలో విమానాన్ని నడిపారు.  దీంతో విమానం సరైన మార్గంలో కాకుండా దారితప్పడంతో పాటు ఎయిర్ కంట్రోల్ సిబ్బందితో సంబంధాలు తెగిపోయాయి.  దీంతో 9డబ్ల్యూ 118 విమానం జర్మనీ గగనతలంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు కోల్పోయింది.  దీంతో ఆ విమానానికి మార్గనిర్ధేశం చేసేందుకు 9 డబ్ల్యూ 122 విమానాన్ని అధికారులు పంపించారు.  దాదాపు 15 నిమిషాల అనంతరం సంబంధాలు పునరుద్ధరించారు.  విమానంలో 330 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది ఉన్నారు.

Pakistan-blasts:3-explosions-outside-Charsadda-court,-4-dead-and-15-injured
పాక్‌లో పేట్రేగిపోయిన ఉగ్రవాదులు: నలుగురి మృతి

పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు మళ్లీ పేట్రేగిపోయారు. చార్‌సద్దా టౌన్‌లోని కోర్టు ప్రాంగణంలో బాంబు పేలుళ్లలో నలుగురు మృతి చెందారు. పదుల సంఖ్యలో జనం గాయపడ్డారు. ఈ దాడికి పాల్పడ్డది తామే అని జమాత్ ఉర్ అహ్‌రార్ సంస్థ ప్రకటించుకుంది. ఈ పేలుడుతో చార్‌సద్దా కోర్టు ఆవరణలో భీతావహ వాతావరణం నెలకొంది. రక్తమోడుతున్న వారిని రక్షణ బలగాలు ఆస్పత్రులకు తరలించాయి. చికిత్స పొందుతున్న వారిలో చాలా మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. గత కొన్ని రోజులుగా పాకిస్తాన్‌లో వరుసగా ఆత్మాహుతి దాడులు జరుగుతున్నాయి. 

Adolf-Hitler's-phone-sells-for-$243,000-at-auction
వేలంలో జర్మనీ నియంత హిట్లర్ ఫోన్: ఖరీదు రూ.1.63 కోట్లు

జర్మనీ నియంత హిట్లర్ వ్యక్తిగత టెలిఫోన్ వేలంలో రూ.163 కోట్ల ధర పలికింది.  దీనిపై హిట్లర్ పేరు, నాజీ స్వస్తిక ముద్ర ఉన్నాయి.  945లో బెర్లిన్‌లో హిట్లర్ తన చివరి రోజుల్లో తలదాచుకున్న ఒక బంకర్‌లో ఈ ఫోన్ లభించింది.  దీనిని ఆదివారం అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం చెసాపీక్ నగరంలో అలెగ్జాండర్ హిస్టారికల్ ఆక్షన్స్ సంస్థ వేలం వేసింది.  రూ.1.34 కోట్లు అంచనా వేయగా రూ.1.63 కోట్లు పలికింది.  

 Five-passenger-plane-crashes-near-Melbourne's-Essendon-Airport
షాపింగ్ మాల్‌పై కుప్పకూలిన ఆస్ట్రేలియా ఛార్టర్డ్ ఫ్లైట్: 5గురు మృతి

ఆస్ట్రేలియాలో ఓ ఛార్టర్డ్ ఫ్లైట్ షాపింగ్ మాల్ పై కూలింది. మెల్ బోర్న్ నుంచి టాస్మేనియా సమీపంలోని కింగ్ ఐలాండ్ కు ఐదుగురు ప్రయాణికులతో వెళ్తున్న ఈ ఛార్టర్డ్ ఫ్లైట్ ఈ ఉదయం తెల్లవారు జామున ఎస్సెన్ డన్ ఎయిర్ పోర్టు నుంచి ఎగిరిన కాసేపటికే ఇంజిన్ లోని సాంకేతిక లోపంతో షాపింగ్ మాల్ పై అది కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో షాపింగ్ మాల్ దెబ్బతినగా, విమానం మంటల్లో పేలిపోయింది. దీంతో విమానంలో ప్రయాణిస్తున్న ఐదుగురు మృత్యువాత పడ్డారు. దీంతో షాపింగ్ మాల్ పరిసరాల్లో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. 
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఓ చార్టర్ విమానం షాపింగ్ మాల్‌పై కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ప్లేన్‌లో ఉన్న ఆరుగురు చనిపోయారు. తేలికపాటి రకానికి చెందిన విమానం కావడంతో మాల్‌లో ఉన్న వాళ్లకు పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. ఇంజన్ ఫెయిల్యూర్ కారణంగా ఇది కూలిపోయినట్టు ప్రాధమికంగా అంచనా వేస్తున్నారు. 
విమానం కూలిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వంద అడుగుల ఎత్తువరకూ దట్టమైన పొగ కమ్మేసింది. దీంతో అంతా కంగారు పడ్డారు. టెర్రస్‌ పైభాగం పూర్తిగా డామేజ్ అయినా అదృష్టవశాత్తూ ఆ టైమ్‌కి మాల్ క్లోజ్ చేసి ఉండడంతో భారీ ప్రాణహాని తప్పింది. అటు, ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. రెండు ఇంజన్లు ఉన్న ఈ చార్టర్ ఫ్లైట్‌ ప్రమాదానికి గురయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని, ఐనా దుర్ఘటన జరగడం తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని అంటున్నారు. మెల్‌బోర్న్‌కి 13 కిలోమీటర్ల దూరంలోని ఎస్సన్‌డన్ ఎయిర్‌పోర్ట్ నుంచి కింగ్ ఐలాండ్‌కు బయలుదేరిన కాసేపటికే ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. 

Protests-Against-Donald-Trump-Continue-in-Los-Angeles,-Chicago-and-Many-Other-Places
నెల రోజులైనా ఆగని నిరసనలు

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టి నెలరోజులు గడిచినా.. ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వేలాదిమంది  ఫేస్ బుక్ యూజర్లు  దేశంలోని వివిధ నగరాల్లో నిరసనలు చేపట్టేందుకు సిద్దంకాగా... ముందస్తుగా వారిని అదుపులోకి తీసుకున్నారు.  లాస్ ఎంజిల్స్, చికాగో, న్యూయార్క్ నగరాల్లో వేలాది మంది రోడ్లమీదకు వచ్చి వేలాదిమంది ట్రంప్ కు వ్యతిరేకంగా ఆందోళన చేసేందుకు సిద్దమవగా పోలీసు అధికారులు విఫలం చేశారు. ట్రంప్ ను తమ అధ్యక్షుడిగా అంగీకరించడం లేదంటూ నిరసన కారులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

Caught-on-CCTV,-Man-Jumps-onto-Railway-Track-to-Save-8-year-old-Boy
బాలుడి ప్రాణాలు కాపాడిన నల్ల జాతీయుడు

రష్యాలోని ఓ రైల్వేస్టేషన్ లో ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. రైల్వే ప్లాట్ ఫామ్ పై ఉన్న ఓ బాలుడు ఫోన్ లో మాట్లాడుతూ అనూహ్యంగా రైలు పట్టాలపడి పడిపోయాడు.  అదే పట్టాలపై రైలు వస్తోంది. అంతలోనే అక్కడే ఉన్న ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి పిల్లాడిని రక్షించారు. రష్యాలోని యేకతరికన్ బర్గ్ రైల్వే స్టేషన్ లో ఈ ఘటన  చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల బాలుడు ఫోన్ లో మాట్లాడుతూ ప్లాట్ ఫామ్ పై పరధ్యానంగా నడుస్తూ రైలు పట్టాలపై పడిపోయాడు. అప్పుడే ఓ రైలు అదేపట్టాలపై దూసుకొస్తోంది. ఆ సమయంలో బాలున్ని రక్షించేందుకు ఎవరు ముందుకు రాలేదు.దీంతో ఓ నల్లజాతీయుడు సాహసం ప్రదర్శించి పట్టాలపైకి దూకి బాలుడిని పైకెత్తి ప్లాట్ ఫామ్ మీద ఉన్నవారికి అందించాడు. వెంటనే తాను పైకి ఎక్కాడు. అంతా క్షణాల్లో జరిగిపోయింది. అతను పైకి ఎక్కిన అరక్షనంలోనే రైలు అదే పట్టాలపై దూసుకుపోయింది. అక్కడున్నవారంతా అతన్ని పొగడ్తలతో  ముంచెత్తారు.

Melania-Trump-Speech-at-President-Trump-Rally-in-Melbourne
ఫ్లోరిడా ర్యాలీలో అమెరికా ఫస్ట్ లేడీ తొలి ప్రసంగం

డొనాల్డ్ ట్రంప్ అమెరికాను గొప్ప దేశంగా తీర్చిదిద్దే పనిలో ఉన్నారని ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ అన్నారు. అమెరికన్ల ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేయడమే తమ లక్ష్యమన్నారు. ఫ్లోరిడాలో జరిగిన ర్యాలీలో ప్రజలను ఉద్దేశించి మెలానియా తొలిసారి ప్రసంగించారు. విపక్షాలు తన గురించి ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోనన్నారు. తన మనస్సాక్షి పట్ల, మీ పట్ల ఎప్పుడూ నిజాయితీగా ఉంటానని మెలానియా అన్నారు. 

Heavy-rain,-floods-in-Saudi-Arabia
సౌదీని ముంచెత్తుతున్న వరదలు... స్తంభించిన జనజీవనం

పశ్చిమ సౌదీ అరేబియాను భారీ వరదలు ముంచెత్తాయి. కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలకు జన జీవనం స్తంభించింది. కుండపోత వర్షాల కారణంగా దేశ దక్షిణ ప్రాంతాన్ని వరదల తాకిడి భారీగా ఉంది. ఇంకా భారీ వరదల కారణంగా పెద్ద ఎత్తున రోడ్లు, వంతెనలు కూలిపోయాయి. పరిస్థితి తీవ్రరూపం దాల్చడంతో ఏ డ్యామ్‌ ఎప్పుడు బద్ధలవుతుందోననే భయంతో సమీప గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. రెండు వారాల నుంచి వందలాది గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. తుఫాన్‌ కారణంగా వందలాది మంది ఆస్పత్రుల పాలయ్యారు. చాలా ప్రాంతాల్లో జనం రోడ్లపైకి వచ్చేందుకు జంకుతున్నారు. నగరాలు కరెంట్‌ కోతలతో అల్లాడుతున్నాయి.

President-Trump-Rallies-in-Florida
ఫ్లోరిడాలోని మెల్ బోర్న్ ర్యాలీలో ట్రంప్

అమెరికా ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఫ్లోరిడాలోని మెల్ బోర్న్ లో నిర్వహించిన ర్యాలీలో ట్రంప్ తోపాటు ఫస్ట్ లేడీ మెలానియా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మరోసారి అక్కడి మీడియాపై ఫైర్ అయ్యారు. నకిలీ వార్తలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వారికి సొంత ఎజెండా ఉందని.. వారి ఎజెండా మన ఎజెండా కాదని ట్రంప్ స్ఫష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ట్రంప్ సమర్థించుకున్నారు. 

NRI Edition
AP News
Telangana News
Pata
Sports
Daily Specials