Live News Now
  • బాహుబలులు మాకు అవసరం లేదు.. మోడినే మాకు బ్రహ్మాస్త్రం.. లక్ష్మణ్
  • చెన్నై: రజనీకాంత్ శ్రీలంక పర్యటన రద్దు.. వచ్చే నెల 9న శ్రీలంక వెళ్లాల్సిన రజనీ
  • తమిళుల నుంచి వ్యతిరేకత రావడంతో పర్యటన రద్దు చేసుకున్న రజనీకాంత్..
  • ఢిల్లీ: ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు ఇక్కట్లు..జైట్లీ వేసిన పరువు నష్టం దావా కేసులో దర్యాప్తుకు కోర్టు ఆదేశం
  • హైదరాబాద్: ఏప్రిల్ 21న హైదరాబాద్ లో టిఆర్ఎస్ ప్లీనరీ.. అదే రోజు టిఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నిక
  • ఏప్రిల్ 27న వరంగల్ లో భారీ బహిరంగ సభ.. ఏప్రిల్ 6లోపు సభ్యత్వ నమోదు..
  • గ్రామ కమిటీల ఏర్పాటును పూర్తిచేయాలన్న కెసిఆర్
  • విశాఖలో పాతనోట్ల మార్పిడి ముఠా అరెస్ట్.. రు.కోటి 20 లక్షలు స్వాధీనం..
  • విజయవాడ: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాం.. హోంమంత్రి చినరాజప్ప
  • 27న వరంగల్ లో జరిగే టిఆర్ఎస్ బహిరంగసభకు శ్రమదానం చేసి విరాళాలు సేకరించాలని కెసిఆర్ ఆదేశం
ScrollLogo అమెరికాలో అనుమానాస్పదంగా మృతిచెందిన శశికళ కేసులో.. ScrollLogo భర్త,అత్త శివపార్వతి,మామ సుబ్బారావుపై శశికళ తల్లిదండ్రుల అనుమానం.. ScrollLogo అమరావతి: గాలి ముద్దుకృష్ణమ వ్యాఖ్యలను ఖండించిన రోజా... ScrollLogo గాలి ముద్దుకృష్ణమ ఇప్పటికైనా గాలిమాటలు మానుకోవాలి.. రోజా ScrollLogo హైదరాబాద్: 2019 ఎన్నికల్లోనూ తెలంగాణలో టిఆర్ఎస్ దే అధికారం.. కెటిఆర్.. ScrollLogo వచ్చే ఎన్నికలనాటికి హామీలన్నీ నెరవేరుస్తాం.. కెటిఆర్ ScrollLogo అమరావతిలో నిర్మించే ప్రభుత్వ భవనాల ప్లాన్ ను అందించిన నార్మన్ ఫోస్టర్ కంపెనీ.. ScrollLogo ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలకు ప్లాన్ ను వివరించిన కంపెనీ ప్రతినిధులు.. ScrollLogo అమరావతి: దేశంలో అనేక రాష్ట్రాలు ఏర్పడ్డా ఇంత హంగామా ఎవరూ చేయలేదు.. బిజెపి ఎమ్మెల్సీ సోమువీర్రాజు ScrollLogo హైదరాబాద్: ఎన్నికలకు ఆరునెలల ముందే బిజెపి అభ్యర్దులను ప్రకటిస్తాం.. రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
Tollywood/Bollywood
National News
DMK-starts-election-campaign-in-RK-Nagar
ఆర్కేనగర్ ప్రచారంలో డీఎంకేలో ఆదిపత్య పోరు

తమిళనాడు ఆర్ కే నగర్ ఉప ఎన్నికల సందర్భంగా పార్టీ చీఫ్ కరుణానిధి కుమార్తె ఎంపీ కళిమొనికి ప్రచారం చేయడానికి అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది.  ఈ ఎన్నికల్లో డీఎంకే పార్టీ ఎలాగైనా విజయం సాధించాలని ప్రయత్నిస్తోంది.  డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తమిళనాడు శాసన సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎం.కే స్టాలిన్ అన్నీ తానై నడిపిస్తున్నాడు.  కళిమొని ప్రచారం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు.  అయితే ఇప్పటివరకు ప్రచారం చెయ్యడానికి అనుమతి ఇవ్వలేదని సమాచారం. మొత్తం మీద డీఎంకే పార్టీలో మరోసారి ఆదిపత్య పోరు మొదలయ్యింది. మొదటినుంచీ కూడా స్టాలిన్ తన సోదరి కళిమొనిని దూరం పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

India-plans-to-seal-border-with-Pak,-Bangladesh: Rajnath
పాక్, బంగ్లా సరిహద్దుల మూసివేతకు చర్యలు : రాజ్‌నాథ్

పాకిస్థాన్, బంగ్లాదేశ్‌తో ఉన్న అంతర్జాతీయ సరిహద్దులను వీలైనంత త్వరగా మూసివేసేందుకు భారత్ చర్యలు చేపడుతోందని కేంద్ర హోం శాఖా మంత్రి రాజ్‌నాధ్ సింగ్ అన్నారు. ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు భారత్ తీసుకోబోయే అతిపెద్ద నిర్ణయం ఇదే నన్నారు. మధ్యప్రదేశ్‌లోని తేకన్‌పూర్ సరిహద్దు భద్రతా దళాల అకాడమీలో జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాక్ ఉగ్రవాదంతో భారత్‌తో పాటు పొరుగుదేశాలు కూడ ఇబ్బందులు పడుతున్నాయన్నవిదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గోపాల్ భగ్లే గోపాల్ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే రాజ్‌నాధ్ మాటలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 

Countdown-has-begun: I-T-dept-warns-blackmoney-holders
ఈనెల 31 లోగా ఆస్తులు వెల్లడించకపోతే కఠిన చర్యలు తప్పవన్న ఐటీ

నల్లకుబేరులు స్వచ్ఛందంగా తమ ఆస్తులు వెల్లడించాలని, లేకపోతే చింతించక తప్పదని ఐటీ శాఖ హెచ్చరించింది.  పీఎంజీకేవై పథకం కింద ఆస్తులు వెల్లడించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఐటీ శాఖ హామీ ఇచ్చింది. ఆదాయాన్ని వెల్లడించని డిఫాల్టర్ల పేర్లను ఈడీ,సీబీఐ వంటి జాతీయ సంస్థలకు తెలియజేస్తామని ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు.  డిఫాల్టర్లపై బినామీ లావాదేవీల చట్టం కూడా ప్రయోగిస్తామని ఆయన చెప్పారు.  ఆదాయాన్ని వెల్లడించకుండా ఆధారాలు లేని డబ్బుతో దొరికిపోయిన వారికి 83.25 శాతం పన్ను విధిస్తామని, అధికారులు తనిఖీలు చేసి ఆధారాలు లేని ఆదాయాన్ని కనుగొంటే 107.25 శాతం పన్నుతో పాటు జరిమానా విధిస్తామని తెలిపారు.  అధికారుల తనిఖీలలో కూడా ఆదాయాన్ని బహిర్గతం చేనివారికి జరిమానాతోపాటు 137.25 శాతం పన్ను విధిస్తామని చెప్పారు.  ఒకవేళ ఉల్లంఘనలపై బినామీ చట్టాన్ని ప్రయోగిస్తే వారికి ఏడేండ్ల కఠిన కారాగారశిక్షతో పాటు ఐటీ చట్టం కింద ఆరోపణలు మోపే అవకాశం కూడా ఉంటుందని అధికారులు తెలిపారు.  

AAP's-survey-predicts-clean-sweep-in-municipal-bypolls
ఢిల్లీ క్లీన్ అండ్ గ్రీన్‌పై సర్వే ప్రారంభించిన ఆమ్ ఆద్మీ పార్టీ

ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఒక సర్వేను ప్రారంభించింది.  ప్రశ్నా పత్రం రూపంలో పలు ప్రశ్నలను ఆ పత్రంలో ముద్రించి ప్రజలకు పంచి పెడుతూ వారి అభిప్రాయాలను సేకరిస్తున్నారు.  ఎవరు ఢిల్లీని పరిశుభ్రంగా ఉంచుతున్నారు ఎవరు చెత్తగా ఉంచుతున్నారు అనేదానిపై ఒక అభిప్రాయ సేకరణను చేపట్టారు.  

UK-Judge-to-Consider-India's-Extradition-Request-for-Vijay-Mallya
మాల్యాను అప్పగించమన్న భారత్ అభ్యర్థనను స్వీకరించిన బ్రిటన్

బ్యాంకులకు 9వేల కోట్ల రూపాయల మేర రుణాలను ఎగవేసి రాత్రికి రాత్రే లండన్ పరారైన లిక్కర్ కింగ్ మాల్యాను తిరిగి రప్పించేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి.  మాల్యాను అప్పగించాల్సిందిగా భారత్ చేసిన అభ్యర్థనను బ్రిటన్ విదేశాంగ శాఖ గత నెల 21న సర్టిఫై చేసింది.  ఒక దేశానికి చెందిన నేరగాళ్లు, చట్టం కళ్ళుగప్పి పరారైన వ్యక్తులు మరో దేశంలో ఆశ్రయం తీసుకున్న పక్షంలో, వారిని బంధించి అప్పగించేందుకు భారత్, బ్రిటన్ మధ్య ద్వైపాక్షిక ఒప్పందం ఎప్పటినుంచో అమల్లో ఉంది. అయితే ఆశ్రయం తీసుకున్న వారి విషయంలో బ్రిటన్ ఉదారంగా ఉంటుంది.  అలాంటి వారిని వెనక్కి పంపిచని సందర్భాలు కూడా ఉన్నాయి.  అయితే మాల్యా కేసు విషయంలో తమ అభ్యర్థనకు పూర్తి చట్టబద్దత ఉందని, ఆయన నేరాన్ని థృవీకరించే అంశంలో అనేక అంశాల దృష్ట్య ఆయన్ను తిప్పి పంపించాలని భారత్ కోరింది. భారత అభ్యర్థనను స్వీకరించిన బ్రిటన్ విదేశాంగ శాఖ ఆమోదించింది.  ఈ అభ్యర్థనను మెజిస్ట్రేట్ కోర్టుకు పంపారు. 

 Yogi -Adityanath-to-go-on-a-2-day-visit-to-Gorakhpur
సొంత నియోజకవర్గం గోరఖ్‌పూర్‌లో సీఎం పర్యటన

గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయ అధ్యక్షుడు కూడా అయిన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గం గోరఖ్‌పూర్‌లో రెండు రోజులు పర్యటించనున్నారు.  దీంతో ఆయనకు స్వాగతం పలికేందుకు కాషాయ పతాకాలను ఏర్పాటు చేశారు.  గోరఖ్‌పూర్ అంతా కాషాయంతో నింపేశారు. 

fire-accident-in-delhi
ఢిల్లీలో భారీ అగ్నిప్ర‌మాదం..

ఢిల్లీలో ఈ ఉద‌యం భారీ అగ్నిప్రమాదం జ‌రిగింది. న‌రేలా పారిశ్రామిక ప్రాంతంలోని ప్లాస్టిక్ వ‌స్తువుల త‌యారీ ఫ్యాక్ట‌రీ ఒక్క‌సారిగా మంట‌ల్లో చిక్కుకుంది. దీంతో కార్మికులు హాహాకారులు చేస్తూ ప‌రుగులు తీశారు. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది వెంట‌నే ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. 32 ఫైర్ ఇంజిన్ల‌తో మంట‌ల‌ను అదుపులోకి తెచ్చే ప్ర‌యత్నం చేస్తున్నారు. మంట‌లు ఇంకా ఎగ‌సి ప‌డుతూనే ఉన్నాయి. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియ‌రాలేదు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ స‌ర్క్యూటే ప్ర‌మాదానికి కార‌ణం కావ‌చ్చ‌ని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. న‌ష్టానికి సంబంధించిన వివ‌రాలు అందాల్సి  ఉంది.

US-Targets-More-Than-200-Indians-For-Deportation-Says-Sushma
200 మంది పైగా భారతీయలపై ట్రంప్ ప్రభుత్వం టార్గెట్

అక్రమంగా అమెరికాలో నివసిస్తున్న భారతీయులపై ట్రంప్ టార్గెట్ చేశారు.  270 మందికి పైగా భారతీయులపై దేశ బహిష్కరణ వేటు వేయనున్నామని ట్రంప్ కార్యాలయం చెప్పినట్లు విదేశాంగమంత్రిత్వ శాఖ వెల్లడించింది.  బహిష్కరించడానికి ముందే 271 మంది జాబితాను తమకు అందజేయాలని ట్రంప్ ప్రభుత్వాన్ని భారత్ కోరినట్లు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో పార్లమెంటుకు తెలిపారు.  అయితే భారత్ అభ్యర్ధనపై ట్రంప్ కార్యాలయం ఇప్పటివరకు ఎలాంటి స్పందన తెలుపలేదు.  భారత్ నుంచి, ఆసియా నుంచి వచ్చిన చాలా మంది అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ స్టాటస్టిక్స్ తెలిపింది.  ఇప్పటికే వీసా జారీలో కఠినతరం నిబంధనలను తీసుకొస్తున్న ట్రంప్ ప్రభుత్వం, అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారిపై కూడా ఉక్కుపాదం మోపేందుకు కఠిన చర్యలు ప్రారంభించింది. 

Navjot-Singh-Sidhu-to-Play-Double-Role-as-Minister-and-TV-Show-Judge
మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ కామెడీ షో

సిక్సర్ల సిద్ధూ డబుల్‌ రోల్‌ చేసేందుకు సిద్ధమయ్యారు. కామెడీ షో జడ్జిగా కొనసాగేందుకు పంజాబ్‌ ముఖ్యమంత్రి అనుమతించారు. తన బతుకుదెరువు కోసమే టీవీషో చేస్తున్నట్టు సిద్ధూ చెప్పడం.. అందుకు మంత్రి పదవి అడ్డుకాదని ఏజీ నివేదిక ఇవ్వడంతో.. అభ్యంతరాలు సైడైపోయాయి. పొలిటికల్‌ పిచ్‌పై పంచ్‌లు విసిరే నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ.. బుల్లితెరపై నవ్వులకు పెట్టిందిపేరు. 'కామెడీ నైట్స్‌ విత్‌ కపిల్‌' అనే టీవీ షోలో న్యాయనిర్ణేతగా ఉన్నారు. అయితే.. ఇప్పుడాయన పంజాబ్‌ మంత్రి. అది కూడా సాంస్కృతిక, పర్యాటక శాఖ. దీంతో.. సిద్ధూ పకపకలకు శుభంకార్డు తప్పదని అంతా అనుకున్నారు. టీవీషోలో పాల్గొనడం కరెక్ట్‌ కాదనే వాదన తెరపైకి వచ్చింది. సిద్ధూ మాత్రం సూటిగా ఒకటే విషయం చెప్పారు. తన కుటుంబ పోషణకు, బతుకుదెరువుగా షో చేస్తున్నానని, ఆ కెరీర్‌ను ఏమాత్రం వదులుకునేది లేదని తేల్చేశారు. దీంతో.. సీఎం అమరీందర్‌సింగ్‌ సైతం కొంత డైలమాలో పడ్డారు. ముక్కుసూటిగా వెళ్లే సిద్ధూ విషయంలో ఎలా ముందుకెళ్లాలో అర్థంకాక.. అడ్వకేట్ జనరల్‌ అడ్వైజ్‌ తీసుకున్నారాయన. సిద్ధూ మంత్రి పదవికి, టీవీషోకు ఎమాత్రం లింక్‌ లేదంటూ ముఖ్యమంత్రికి ఏజీ రిపోర్ట్‌ ఇచ్చారు. చట్టాల ఉల్లంఘనేమీ జరగదని, న్యాయపరమైన చిక్కులు రావని నాలుగు పేజీలు నివేదించారు. సాంస్కృతిక, పర్యాటక శాఖను మార్చాల్సిన అవసరం కూడా లేదని చెప్పడంతో.. సిద్ధూకు లైన్‌క్లియర్‌ అయింది. సో, ఇటు మంత్రిగా, అటు.. టీవీషో జడ్జిగా.. సిద్ధూ డబుల్‌ రోల్‌ పోషించనున్నారు.

Meerut-beggar-paid-Rs-10-to-deliver-terror-threat-letter-to-police
కలకలం సృష్టిస్తున్న బెదిరింపు లేఖలు

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ పోలీసులకు అందిన లేఖ కలకలం రేపుతోంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఉగ్రవాదుల దాడులు జరగనున్నాయంటూ అందులో రాసి ఉంది. మూడు వాహనాల్లో టెర్రరిస్టులు ప్రవేశించారని చెప్పారు. ఢిల్లీ శివార్లలోని ఘజియాబాద్‌కు ఇప్పటికే చేరుకున్నారట. టార్గెట్ ఫిక్స్ అయిపోయిందని... ఢిల్లీని కాపాడుకోండని.. సినిమాటిక్‌గా రాశారు. ఈ విషయాన్ని లైట్‌ తీసుకుంటే లక్షల మంది ఇబ్బందులు పడాల్సి వస్తుందని బెదిరించారు. ఈ లేఖను గుర్తుతెలియని వ్యక్తులు ఓ బిచ్చగాడి ద్వారా పోలీసులకు పంపించారు. ఓ వ్యక్తి పది రూపాయలిచ్చి ఈ లెటర్‌ను పోలీసులకు ఇవ్వమన్నాడని అతను విచారణలో తెలిపాడు. అటువంటిదే మరో బెదిరింపు లేఖ మంగల్‌పాండే ప్రాంతంలో ఓ కానిస్టేబుల్‌కు చేరింది. అతడు దాన్ని ఉన్నతాధికారులకు అందించాడు. మూడు రోజుల క్రితం వారణాసిలోను బెదిరింపు లెటర్ కలకలం రేపింది. అందులో ఏకంగా పాకిస్తాన్ జిందాబాద్ అంటూ రాసి ఉంది. నిజంగానే ముష్కరులు ఢిల్లీని టార్గెట్ చేశారా? నిఘా వర్గాలకు దొరక్కుండా ఘజియాబాద్‌లోకి ఎంటరైపోయారా? ఇవే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నలు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చాక.. ఉగ్రవాదుల ఆటలు సాగడం లేదు. ఎప్పటికప్పుడు ఉగ్రవాదులు, వారి సానుభూతి పరుల అరెస్ట్‌లు జరుగుతున్నాయి. విచారణలు సాగుతున్నాయి. నిఘా వర్గాలు అత్యంత అలర్ట్‌గా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులకు అందిన లేఖలకు అంత సీన్‌ లేదని భావిస్తున్నా.. విశ్వవ్యాప్తంగా జరుగుతున్న దాడుల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

Mulayam Singh Yadav's choti bahu Aparna meets Yogi Adityanath
యూపీ సీఎంను కలిసిన ములాయం చిన్నకోడలు

యూపీలో అధికారం మారింది. సమాజ్ వాదీ పార్టీ ప్రతిపక్షంగా మారింది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో భేటీ అయ్యారు. భర్తతో కలిసి ఆమె యోగితో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై సీఎంతో మాట్లాడనని ఆమె చెప్పారు. అపర్ణా యాదవ్ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో లక్నో కంటోన్మెంట్ నుంచి పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ జోషి చేతిలో ఓడిపోయారు. శుక్రవారం హటాత్తుగా యోగి ఆదిత్యనాథ్ ను కలవడం విశేషం.

Navjot-Singh-Sidhu-can-continue-with-TV-duties
మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ కామెడీ షో చేసుకోవచ్చు!

మంత్రిగారు ఎక్కడున్నారు. కామెడీ షోలో బిజీగా ఉన్నారు. పంజాబ్ లో   ఇలాంటి జవాబు వినిపిస్తే అందులో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అక్కడ మొన్ననే మంత్రి పదవి పొందిన మాజీ  క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ డబుల్ రోల్ కు లైన్ క్లియర్ అయింది. టీవీలో కామెడీ షో జడ్జిగా హాస్యం పండించడంలో తప్పు లేదని ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తేల్చి చెప్పారు. దీనిపై రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ సలహా తీసుకున్నానని చెప్పారు. మంత్రి హోదాలో కామెడీ షో చేయడం తప్పు కాదని రూఢి చేసుకున్నాకే తాను   గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని ప్రకటించారు. దీంతో పగలు మంత్రిగా, రాత్రి కామెడీ కింగ్ గా సిద్ధూ నవ్వుల పూలు పూయిస్తారు. ప్రజా సేవ పార్ట్ టైమ్ మాత్రమే అన్నట్టు ప్రవర్తించడం సరికాదని ప్రతిపక్షాలు విమర్శించినా సిద్ధూ గానీ అతడి కెప్టెన్ గానీ పట్టించుకోవడం లేదు.


Hero-vishal-and-Prakash-raj-stage-protest-near-Jantar-mantar,Delhi
హీరో విశాల్, ప్రకాష్ రాజ్ ఢిల్లీలో దీక్ష

సెంట్రల్ గవర్నమెంట్  తమకు కరవు భత్యం ఇచ్చి ఆదుకోవాలని కోరుతూ ఢిల్లీలో ఆందోళన చేపట్టిన తమిళనాడు రైతులకు సంఘీభావం తెలిపారు సినీనటులు ప్రకాశ్‌రాజ్‌, విశాల్‌.  సినీ ఇండస్ట్రీ మద్దతివ్వడంతో పాటు వారితో కలిసి ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ దగ్గర చేపట్టిన దీక్షలో పాల్గొన్నారు. ‘రైతుల ఆవేదన ప్రభుత్వానికి వినిపించడం లేదు. మా దీక్ష వల్లనైనా సంబంధిత మంత్రులు గుర్తిస్తారని ఆశిస్తున్నాం’ అని ప్రకాశ్‌రాజ్‌ అన్నారు.

తీవ్ర కరవు పరిస్థితుల్లో ఉన్న తమను ఆదుకోవాలంటూ గత కొద్ది రోజులుగా తమిళనాడు రైతులు ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. పంటలు పండకపోవడంతో రైతులు సుసైడ్ చేసుకుంటున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. 

Modi-rewards-firebrand-IAS-officer-B-Chandrakala-with-key-assignment
నరేంద్ర మోడీ డ్రీం టీంలో మరో ఫైర్ బ్రాండ్

క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తున్న ఐఏఎస్ అధికారి బి. చంద్రకళ మరో అరుదైన అవకాశాన్ని అందుకున్నారు.  ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా మెజిస్ట్రేట్‌గా ఆమె పనిచేస్తున్నారు. ఫైర్‌బ్రాండ్ ఇమేజ్ ఉంది.  నాసిరకం రోడ్లు వేసిన కాంట్రాక్టర్లు, మున్సిపల్ అధికారులపై ఆమె ఓ సారి సీరియస్ అయ్యారు.  నిజాయితీగల ఆఫీసర్ అంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు.  ఇది గుర్తించిన మోడీ ఇప్పుడు ఆ అధికారిణికి అరుదైన గుర్తింపు ఇచ్చారు.  ప్రధాని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్చ భారత్ మిషన్‌కు ఐఏఎస్ ఆఫీస్ చంద్రకళను డైరక్టర్‌గా నియమించారు.  మినిస్ట్రీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ శాఖలోనూ ఆమెకు ఉప కార్యదర్శి బాధ్యతలను అప్పగించారు.  కాగా చంద్రకళ మన తెలంగాణా రాష్ట్రానికి చెందినవారు కావడం మనకు గర్వకారణం. 

 Focus-on-growth-don't-seek-favours-from-CM : Modi
యూపీ బీజేపీ ఎంపీలకు మోదీ క్లాస్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని సమూలంగా మార్చడానికే వారు పార్టీకి అవకాశమిచ్చారని కాబట్టి పైరవీల జోలికి పోకుండా, సీఎం యోగిపై ఒత్తిడి పెట్టకుండా తన పని తాను చేసుకోనివ్వండంటూ ప్రధాని మోదీ యూపీ బీజేపీ ఎంపీలకు క్లాస్ తీసుకున్నారు.  యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అద్బుత విజయం సాధించడానికి కష్టపడి పనిచేశారంటూ ఆ రాష్ట్ర బీజేపీ ఎంపీలను ప్రశంసించిన మోదీ, యూపీని సమూలంగా మార్చడానికి అక్కడి పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి పనిచేయాలని ఎంపీలకు సూచించారు.  ఎట్టిపరిస్థితుల్లోనూ ఆయనను కలిసి పైరవీలు చేయడానికి ప్రయత్నించవద్దని మోదీ బీజేపీ ఎంపీలు హెచ్చరించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని మోదీ సూచించారు. 

NRI Edition
AP News
Telangana News
Pata
Sports
Daily Specials