Live News Now
  • స్మార్ట్ సిటీ నిర్మాణానికి దుబాయ్ కంపెనీలు.. చంద్రబాబు సమక్షంలో MOUలు
  • చంద్రబాబు డైరెక్షన్‌లో TTDP నేతల భేటీ.. రేవంత్‌ రెడ్డి వ్యవహారంపై కీలక చర్చ
  • కాసులిస్తే క్షణాల్లో ఫేక్ సర్టిఫికేట్స్.. హైదరాబాద్‌లో ముఠా అరెస్ట్
  • ముంబై వన్డేలో కివీస్‌ టార్గెట్‌ 281 రన్స్.. 2 వందల మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ..
  • పంచాయతీలుగా గిరిజన తండాలు.. అసెంబ్లీలో బిల్లు తెస్తామన్న KCR
  • పంటలు నష్టపోతున్నా పట్టించుకోరా.. TRS సర్కార్‌పై ఉత్తమ్ నిప్పులు
  • పేదల కోసం పోరాడి గుర్తింపు తెచ్చుకున్నా.. కొడంగల్ నుంచే పోటీ చేస్తానన్న రేవంత్
  • డిసెంబర్‌లో జనంలోకి పవన్.. రెండు రాష్ట్రాల్లో ప్లీనరీలకు ప్లాన్
  • నంద్యాలలో కుప్పకూలిన శోభా లాడ్జీ.. రోడ్డు విస్తరణ పనుల్లో అపశృతి
  • ఆసియా కప్ హాకి విజేత భారత్.. ఫైనల్లో మలేషియాపై విజయం
ScrollLogo దుబాయ్‌లో బిజిబిజీగా చంద్రబాబు.. పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు ScrollLogo కాసేపట్లో టెక్స్‌టైల్ పార్క్‌కు శంకుస్థాపన.. వరంగల్‌ జిల్లాలో విపక్ష నేతల అరెస్ట్ ScrollLogo 15 సంస్థలు..3 వేల కోట్ల పెట్టుబడులు.. KTR, కడియం సమక్షంలో MOUలు ScrollLogo హక్కుల సాధనకు బీసీల గర్జన.. రాజమండ్రిలో భారీ బహిరంగ సభ ScrollLogo అమరావతికి దుబాయ్ కంపెనీల క్యూ.. చంద్రబాబు సమక్షంలో MOUలు ScrollLogo గంజాయి కేసులో ముగ్గురు అరెస్ట్.. ప్రతిపక్షాలను భయపెడుతున్నారన్న శ్రీధర్ బాబు ScrollLogo ఘెఘా, దహేజా మధ్య ఫెర్రీ సేవలు.. గుజరాత్ అభివృద్ధికి మోడీ వరాలు ScrollLogo ముంబై వన్డేలో కోహ్లీ హాఫ్‌ సెంచరీ.. నిలకడగా భారత్ బ్యాటింగ్ ScrollLogo గడువులోగానే పంచాయితీ ఎన్నికలు.. TRS పారిపోయే పార్టీ కాదన్న KCR ScrollLogo భూమి ఇచ్చిన ప్రతి కుటుంబానికి ఉద్యోగం.. టెక్స్ టైల్ పార్క్ వరంగల్‌కు వరమన్న సీఎం
NRI News
Man-Cheats-2nd-Wife ,-Case-Filed
దుబాయ్‌లో భార్యాపిల్లల్ని వదిలేసిన ప్రబుద్దుడు

దుబాయ్‌లో భార్యాపిల్లల్ని కట్టుబట్టలతో నడిరోడ్డుపై వదిలేశాడో ప్రబుద్ధుడు. దీంతో వారు దిక్కులేనివారయ్యారు. సాయం కోసం అర్థిస్తున్నారు. జయశంకర్‌ భూపాల్‌పల్లి జిల్లా వెంగళరావుపేటకు చెందిన కట్ట స్వాతి ఏడేళ్ల కిందట హైదరాబాద్‌లోని ఓ బట్టల షాపులో పని చేసేది. అక్కడే పరిచయమైన మహ్మద్‌ రఫీ.. ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఐతే.. రఫీకి అంతకుముందే పెళ్లైనట్లు స్వాతికి ఆలస్యంగా తెలిసింది. రెండు నెలల కిందట.. దుబాయ్‌లో పని చేసుకుంటూ.. హ్యాపీగా బతుకుదామని స్వాతిని నమ్మించాడు. మొదటి భార్యతోపాటు స్వాతిని కూడా దుబాయ్ తీసుకెళ్లాడు. స్వాతిని అక్కడే వదిలేసిన రఫీ.. మొదటి భార్యతో తిరిగి హైదరాబాద్‌ చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న స్వాతి నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. గత పది రోజులుగా దుబాయ్‌ రోడ్ల వెంట తిరుగుతోంది. స్థానికుల సహాయంతో తన అక్క నాగమణికి ఫోన్‌ చేసింది. దేశంకాని దేశంలో తాను పడుతున్న బాధల్ని వివరించింది. ఎలాగైనా తనను స్వదేశం చేర్చాలని వేడుకుంది.  దీంతో స్వాతి అక్క నాగమణి.. వెంకటాపురం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.  దుబాయ్‌లో ఉన్న తన చెల్లిని సురక్షితంగా తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

AP-CM-Chandrababu-Begins-Dubai-Tour
ప్రవాసాంధ్రులు సొంత గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్న చంద్రబాబు

మూడు దేశాల పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు యూఏఈలో పర్యటిస్తున్నారు. అమెరికా పర్యటన తర్వాత దుబాయ్‌ చేరుకున్న ముఖ్యమంత్రి బృందానికి ఘన స్వాగతం లభించింది. దుబాయల్‌లోని ఇండియన్ హైస్కూల్ ఆడిటోరియంలో ముఖ్యమంత్రి తెలుగువారి సదస్సులో పాల్గొన్నారు. ఏపీ అభివృద్ధికి భాగస్వాములయ్యేవారికి APNRT మార్గదర్శనం అన్నారు. రాష్ట్రంలో వ్యాపారుల చేసే NRIలకు సహకరిస్తామని భరోసా ఇచ్చారు. ప్రవాసాంధ్రుల సంక్షేమానికి 40 కోట్ల ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామని తెలిపారు.
రాష్ట్రంలో యువత నైపుణ్యాలు మెరుగుపర్చేందుకు మైగ్రెంట్ ఎకనమిక్ రిహాబిలిటేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. దుబాయ్ కంటే విశాఖ బాగుందనే ప్రశంసలు దక్కించుకున్నామని తెలిపారు. విభజన తర్వాత ఏడాదిలోనే రాష్ట్రంలో మిగులు విద్యుదుత్పత్తి సాధించామని చెప్పారు. ప్రవాసాంధ్రులు సొంత గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు. బిజినెస్ లీడర్స్ ఫోరం సమావేశంలో కూడా పాల్గొన్న సీఎం.. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై దుబాయ్ పారిశ్రామిక, వాణిజ్య వేత్తలకు వివరించారు.
ప్రవాసాంధ్రుల నుంచి డబ్బు ఇవ్వమని అడగడం లేదన్నారు ముఖ్యమంత్రి. మంచి సలహాలు ఇచ్చేందుకు ముందుకు రావాలని కోరారు. గల్ఫ్‌లో APNRT సమన్వయకర్తల భేటీలో చంద్రబాబు పాల్గొన్నారు. రాజధాని అమరావతి, నవ్యాంధ్ర నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ సమావేశంలో పలు సాంస్కృతిక ప్రదర్శనలను ముఖ్యమంత్రి తిలకించారు. తర్వాత ప్రసంగించిన బాబు గ్రామాభివృద్ధికి సాంకేతికత, ఉత్తమ పద్ధతులను తీసుకురావాలని, నిధుల కంటే ఆలోచనలు అత్యంత ముఖ్యమని వ్యాఖ్యానించారు.
ఏపీ సీఎం హాజరైన సదస్సులో కువైట్, బహ్రెయిన్, దుబాయ్, అబుదాబీ, ఇటలీ నుంచి వచ్చిన ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రితో కలిసి ఫొటోలు దిగారు. 23 వరకూ బాబు యూఏఈలో పర్యటిస్తారు. తర్వాత యూకే వెళ్తారు. లండన్‌లో ఈనెల 26 వరకూ పర్యటించనున్న సీఎం.. నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో సుదీర్ఘ సమావేశం కానున్నారు. డిజైన్ల మార్పులపై చర్చించిన తర్వాత అక్కడే వాటిని ఫైనల్ చేస్తారు. ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ పీకాక్ అవార్డును కూడా స్వీకరించనున్నారు. పెట్టుబడిదారులతో కూడా భేటీ అవుతారు.

Diwali-celebrations-held-in-Detroit
అమెరికాలోని డెట్రాయిట్‌లో ఘనంగా దీపావళి సంబరాలు

అమెరికాలోని డెట్రాయిట్ లో దీపావళి సంబరాలను ప్రవాస తెలుగువారు ఘనంగా నిర్వహించుకున్నారు. డెట్రాయిట్ లోని ప్రముఖ పారిశ్రామిక వేత్త  క్రిష్ణప్రసాద్, తన నివాసంలో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు అమెరికా మాజీ ప్రెసిడెంట్ జాన్ కెనడీ మనుమడు, డిస్ట్రిక్ కాంగ్రెస్ మెన్ జో కెనడీ, ఏపి ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ లు ముఖ్యఅతిధులుగా హాజరయ్యారు. జో కెనడీని ఎన్నారైలు  సాంప్రదాయబద్దంగా సత్కరించారు. ఈ సందర్భంగా భారత్ తో తమకుటుంబానికి ఉన్న అనుబంధాన్ని జో కెనడీ గుర్తుచేశారు.  భారతీయుల సాంప్రదాయాలంటే తనకు ఇష్టమన్నారు.. ఈ వేడుకల్లో రెండువందల మంది తెలుగువారు పాల్గొని దీపావళి సంబరాలను ఆనందంగా నిర్వహించుకున్నారు.


Tags: Diwali, celebrations, Detroit

CM-Chandrababu-Meet-with-IT-Companies-in-Chicago
చికాగాలో ఐటీ ప్రతినిధులతో చంద్రబాబు సమావేశం...

అమెరికా పర్యటనలో భాగంగా చికాగాలో ఉన్న చంద్రబాబు తొలి రోజు ఐటీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. 5 వందల మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. మొదటి రోజే ఏపీకి పెట్టుబడులు వెల్లువలా వచ్చాయి. విశాఖ, విజయవాడలో ఐటీ సంస్థల ఏర్పాటుకు 60 మంది ముందుకొచ్చారు. వ్యాపారనుకూల రాష్ట్రాల్లో ఏపీ అగ్రగామిగా ఉందని చంద్రబాబు తెలిపారు.
ఐయోవా స్టేట్ వర్శిటీని చంద్రబాబు సందర్శించారు. మెగా సీడ్ ప్రాజెక్ట్‌పై అక్కడ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆ ప్రాజెక్ట్‌పై ఐయోవా ప్రతినిధి దిలీప్ ప్రెజంటేషన్ ఇచ్చారు. ఏపీలో విత్తనాభివృద్ధిపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సోమిరెడ్డి, యనమల పాల్గొన్నారు. ఐయోవా గవర్నర్ ఇచ్చిన విందుకు చంద్రబాబు బృందం హాజరైంది.
మరోవైపు.. అమరావతిలో తానా భవన్‌కు స్థలం కేటాయించాలని ఆ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రిని కోరారు. ప్రతిపాదనలు పంపిస్తే పరిశీలిస్తామని చంద్రబాబు వారికి తెలిపారు.

Actor-Ravi-Teja-'Raja-The-Great'-review-by-NRIs,Dallas
రవితేజ 'రాజాదిగ్రేట్' నిజంగానే గ్రేట్

హీరో రవితేజ నటించిన రాజాదిగ్రేట్ సినిమా అమెరికాలో   గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ సినిమాను చూసేందుకు ఎన్నారైలు సినిమాక్స్ ధియేటర్ వద్దకు తరలివచ్చారు. సినిమా చాలా భాగుందన్నారు. పాటలు, కామిడీ నచ్చిందన్నారు.  ఈ సందర్భంగా డల్లాస్, చికాగోలోని ధియేటర్ల వద్ద ఎన్నారైల సందడి కనిపించింది.

Portland-TDF-Bathukamma-and- Dasara-Celebrations,-USA
అమెరికా పోర్ట్ ల్యాండ్ లో బతుకమ్మ, దసరా సంబరాలు

అమెరికాలోని పోర్ట్ ల్యాండ్ లో బతుకమ్మ, దసరా సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం.. ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పెద్ద సంఖ్యలో తెలుగు ఎన్నారైలు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. మహిళలంతా కలిసి బతుకమ్మలను పేర్చి ఆటా, పాటలతో సందడి చేశారు. బతుకమ్మలను అందంగా తయారు చేసిన వారికి టీడీఎఫ్ ప్రతినిధులు బహుమతులను అందజేశారు.

Saudi-Royal-Palace-Attacked-By-Gunman,-Two-Guards-Killed
సౌదీ రాయల్ ప్యాలెస్‌పై ఉగ్రదాడి...ఇద్దరు గార్డ్లు మృతి

ప్రపంచంలోనే అత్యంత పటిష్ట భద్రతను కలిగి ఉండే సౌదీ రాయల్ ప్యాలెస్‌పై ఉగ్రదాడి జరిగింది. అత్యాధునిక ఏకే 47 తుపాకితో, గ్రానేడ్లతో దాడికి దిగిన ఓ యువకుడు కాపలాగా ఉన్న ఇద్దరిని కాల్చి చంపాడని సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని..వారిని ఆసుపత్రికి తరలించామని తెలిపారు. హ్యుందాయ్ కారులో దూసుకువచ్చిన ఆ వ్యక్తి..వచ్చి రావడంతోనే కాల్పులకు దిగాడని, భద్రతా దళాలు అప్రమత్తమయ్యే లోపు నష్టం జరిగిపోయిందని అయితే ఆ వెంటనే దుండగుడిని మట్టుబెట్టామని పేర్కొన్నారు. తాజా దాడితో జెడ్డాలో హైఅలర్ట్ ప్రకటించారు.

University-of-Washington-South-Asian-center-Felicitates-tollywood-comedy-king-Brahmanandam
బ్రహ్మానందం కామెడీకి స‌న్మానం..!

అమెరికాలోని సియాటెల్ నగరంలో తస్వీర్ 12వ సౌత్ ఏషియన్ ఫిలిం ఫెస్టివల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.  ఈ క్యారక్రమానికి తెలుగు వాడి పెదవులపై చెరగని చిర్నవ్వుగా మారిన బ్రహ్మానందం గౌరవ అతిధిగా హాజ‌ర‌య్యారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ సౌత్ ఏషియా సెంటర్  బ్రహ్మానందంను ఘనంగా సన్మానించింది. ఎన్నోవైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో న‌వ్వించిన హాస్య బ్ర‌హ్మా బ్ర‌హ్మానందం విశేష ప్రతిభకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు దక్కడం ముదావహం. నాట్స్ సియోటెల్, యూనివ‌ర్శిటీ ఆఫ్ వాషింగ్‌ట‌న్, అక్క‌డ ఉన్న తెలుగు వాళ్లు ఎంత‌గానో స‌హ‌క‌రించి ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేశారు. కాగా ప్రస్తుతం బ్రహ్మనందం ఆచారి అమెరికా యాత్ర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. 


bathukamma,-dasara,-bakrid-celebrations-in-qatar
ఖతర్ లో ఘనంగా బతుకమ్మ, దసరా, బక్రీద్ సంబరాలు

తెలంగాణా సంస్కృతికి ప్రతీక అయిన మహా బతుకమ్మ, దసరా, బక్రీద్ పండుగలను అంగరంగ వైభవంగా తెలంగాణా ప్రజా సమితి -ఖతర్ ఆధ్వర్యంలో ఖతర్లో ఉంటున్న తెలంగానీయులందరు ఎంతో ఘనంగా జరుపుకున్నారు.
ఈ బతుకమ్మ సంబరాలను ఖతర్ లోని ఇండియా సోషల్ సెంటర్ ఆడిటోరియంలో దాదాపు పదిహేను వందల మంది తెలుగువారి సమక్షంలో ఎంతో ఆనంద ఉత్సాహాలతో జరుపుకున్నారు. డ్యాన్స్ లతో ఖతర్ తెలుగింటి ఆడబిడ్డలు కార్యస్థలానికి చేరాక, ప్రార్ధనగీతంతో కార్యక్రమం మొదలుపెట్టారు. కార్యనిర్వాహక బృందం తరుపున తెలంగాణ ప్రజా సమితి ప్రెసిడెంట్ శ్రీధర్ అమ్బగౌని  ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Dowry-Harassment:Hanamkonda-residents-Swathi-killed-by-rajesh-in-London
లండన్‌లో అదనపు కట్నం కోసం స్వాతిని, రాజేష్ వేధించాడా..?

వరంగల్‌ హన్మకొండకు చెందిన స్వాతి లండన్‌లో అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. అయితే భర్త ఆయన కుటుంబ సభ్యులే చంపేసారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. హన్మకొండకు చెందిన రాజేష్‌, స్వాతిలకు గత నవంబర్ 4న వివాహం జరిగింది.  సుమారు 35 లక్షల కట్నకానుకలుగా ముట్టచెప్పారు. పెళ్లి జరిగిన తర్వాత స్వాతి, రాజేష్‌ లండన్ వెళ్లారు. అక్కడికి వెళ్లిన స్వాతిని, రాజేష్ అదనపు కట్నం కోసం వేధించేవాడు. కనీసం కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడనివ్వలేదు. అయితే అక్టోబర్ 2న స్వాతి కనిపించడం లేదని రాజేష్‌ బావ ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు తెలిపాడు.  మూడో  తేదీన ఆమె దొరికిందని, ఆస్పత్రిలో చికిత్స పొందుతుందని మళ్లీ ఫోన్‌ చేశాడు. ఇక ఐదున స్వాతి చనిపోయిందని రాజేష్ సమాచారం ఇచ్చాడు. ఇంతకీ ఏం  జరిగింది? స్వాతి ఎక్కడికి వెళ్లింది?  ఒకరోజు తరువాత ఆమె ఎందుకు హాస్పటల్ లో చికిత్స తీసుకుంది?  అనే వివారాలు తెలియల్సి ఉంది.

Bathukamma-Celebrations-in-Muscat
మస్కట్ లో బతుకమ్మ మరియు దసరా సంబరాలు

గురువారము రాత్రి మస్కట్ నగర నడిబొడ్డున అల్ఫాలజ్ హోటల్ నందు అంగరంగ వైభవముగా 2000 మంది తెలుగు ప్రజలు మధ్య బతుకమ్మ మరియు దసరా సంబరాలను చిరు మెగా యూత్ ఫోర్స్, మస్కట్ వారు అద్భుతముగా నిర్వహించారు. భారత రాయబార కార్యాలయము నుంచి అంబాసడార్ శ్రీ ఇంద్రమని పాండే ముఖ్య అతిధిగా వచ్చి కార్యక్రమముకు కొత్త అలంకారము తెచ్చారు. CMYF వారు ఈ కార్యక్రముములో మస్కట్ ,ఒమాన్ దేశములో వున్న సీనియర్ తెలుగు దంపతులును అంబాసడార్ తో సన్మానము చేసి మంచి సంప్రదాయముకు తెర తీసారు ..మరి ముక్యముగా హైదరాబాద్ నుంచి వచ్చిన  కమెడియన్ బిత్తరసత్తి మరియు వర్ధమాన గాయని మధుప్రియ ఆహుతులను అలరించారు. కార్యక్రమం అనంతరము CMYF మస్కట్ వారు మంచి విందు భోజనము ఏర్పాటు చేశారు.

Dasara-Celebrations-By-Telugu-People-In-Dubai
దుబాయ్ లో ఘనంగా దసరా సంబరాలు

దసరా సంబరాలు దుబాయ్ లోను ప్రవాస భారతీయులు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. దుబాయ్ లోని లహేజ్, సుల్తాన్ బజార్ లో నవరాత్రి ఉత్సవాలను సాంప్రదాయ బద్దంగా నిర్వహిస్తున్నారు. ముస్లీం దేశంలోను ఎన్నారైలు అమ్మవారిని ప్రతిష్టించి, భక్తిశ్రద్దలతో పూజలు చేస్తున్నారు. గత 12 సంవత్సరాలుగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఎన్నారైలు తెలిపారు. ఈ పూజాది కార్యక్రమాలకు ముస్లీం సోదరులు సైతం తమవంతు సహాయం చేస్తున్నారని వెల్లడించారు.

Dussehra-Celebration-in-Dubai
ఎడారిలో వైభవంగా దసరా సంబరాలు

భారతీయ సంస్కృతిలో పండుగలు ఒక ప్రత్యేక పాత్ర ను పోషిస్తాయి. పండుగ వస్తోందంటే ఊరూరా సందడి నెలకొంటుంది. నవరాత్రుల శోభా, ఆడవారి దాండియా తో దసరా ఎంతో కన్నులపండువగా జరుగుతుంది. భారత దేశంలో ఇంత ఘనంగా జరగటం పెద్ద విషయమేమీ కాదు కానీ ఇంతే సందడితో, కోలాహలంతో ముస్లిం దేశాలైనటువంటి గల్ఫ్ దేశాల్లో జరిగితే విశేషమే మరి. దుబాయ్ లో లహెజ్ & సుల్తాన్(జెబెల్ అలీ)లో గల వర్కర్స్ క్యాంపు లో గత పన్నెండు సంవత్సరాలుగా పదివేల మంది కలిసి శరన్నవరాత్రులు అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు. ఒక్క దసరా నే కాకుండా వినాయక చవితి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడి భారతీయులు జరుపుకుంటున్నారు. ఈ వేడుకల్లో హిందూ సోదరులకు అండగా ముస్లిం సోదరులు కూడా తమ వంతు సాయం అందిస్తూ ఉండటం గమనార్హం. ఈ కార్యక్రమాన్ని బెత్ రెడ్డి వెంకట్ రెడ్డి,సూర్య నారాయణ్ రెడ్డి మాడపాటి, కొండా బాబు బొర్రా, రామ కృష్ణ, బాపి రాజు తదితరుల ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నారు.

Anchor-Rashmi,Actor-Laya-In-Bathukamma-Celebrations,Greater-Seattle,USA
బతుకమ్మ సంబురాల్లో హీరోయిన్ లయ, యాంకర్ రష్మీ

బతుకమ్మ సంబురాల్లో హీరోయిన్ లయ, యాంకర్ రష్మీ

Bathukamma-Festival-Celebrations-In-California
కాలిఫోర్నియాలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

అమెరికాలోని కాలిఫోర్నియా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ అమెరికా  తెలుగు సంఘం టాటా ప్రెస్నో సెంట్రల్ వాలీలో  బతుకమ్మ, దసరా సంబరాలను ఘనంగా నిర్వహిస్తోంది. ఎన్నారై తెలంగాణ మహిళలు బతుకమ్మలను అందంగా ముస్తాబు చేసి ఆటలాడుతూ పాటలు పాడుతూ ఉత్సాహంగా నిర్వహించుకున్నారు.  ప్రవాస తెలంగాణ పౌరుల అవరాసరాలు తీర్చడం, తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణే ముఖ్య ఉద్దేశంగా టాటా సంఘాన్ని ఏర్పాటుచేసినట్లు సంస్థ అధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ బతుకమ్మలకు బహుమతులను అందజేశారు.

Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials