Live News Now
  • బాహుబలులు మాకు అవసరం లేదు.. మోడినే మాకు బ్రహ్మాస్త్రం.. లక్ష్మణ్
  • చెన్నై: రజనీకాంత్ శ్రీలంక పర్యటన రద్దు.. వచ్చే నెల 9న శ్రీలంక వెళ్లాల్సిన రజనీ
  • తమిళుల నుంచి వ్యతిరేకత రావడంతో పర్యటన రద్దు చేసుకున్న రజనీకాంత్..
  • ఢిల్లీ: ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు ఇక్కట్లు..జైట్లీ వేసిన పరువు నష్టం దావా కేసులో దర్యాప్తుకు కోర్టు ఆదేశం
  • హైదరాబాద్: ఏప్రిల్ 21న హైదరాబాద్ లో టిఆర్ఎస్ ప్లీనరీ.. అదే రోజు టిఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నిక
  • ఏప్రిల్ 27న వరంగల్ లో భారీ బహిరంగ సభ.. ఏప్రిల్ 6లోపు సభ్యత్వ నమోదు..
  • గ్రామ కమిటీల ఏర్పాటును పూర్తిచేయాలన్న కెసిఆర్
  • విశాఖలో పాతనోట్ల మార్పిడి ముఠా అరెస్ట్.. రు.కోటి 20 లక్షలు స్వాధీనం..
  • విజయవాడ: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాం.. హోంమంత్రి చినరాజప్ప
  • 27న వరంగల్ లో జరిగే టిఆర్ఎస్ బహిరంగసభకు శ్రమదానం చేసి విరాళాలు సేకరించాలని కెసిఆర్ ఆదేశం
ScrollLogo అమెరికాలో అనుమానాస్పదంగా మృతిచెందిన శశికళ కేసులో.. ScrollLogo భర్త,అత్త శివపార్వతి,మామ సుబ్బారావుపై శశికళ తల్లిదండ్రుల అనుమానం.. ScrollLogo అమరావతి: గాలి ముద్దుకృష్ణమ వ్యాఖ్యలను ఖండించిన రోజా... ScrollLogo గాలి ముద్దుకృష్ణమ ఇప్పటికైనా గాలిమాటలు మానుకోవాలి.. రోజా ScrollLogo హైదరాబాద్: 2019 ఎన్నికల్లోనూ తెలంగాణలో టిఆర్ఎస్ దే అధికారం.. కెటిఆర్.. ScrollLogo వచ్చే ఎన్నికలనాటికి హామీలన్నీ నెరవేరుస్తాం.. కెటిఆర్ ScrollLogo అమరావతిలో నిర్మించే ప్రభుత్వ భవనాల ప్లాన్ ను అందించిన నార్మన్ ఫోస్టర్ కంపెనీ.. ScrollLogo ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలకు ప్లాన్ ను వివరించిన కంపెనీ ప్రతినిధులు.. ScrollLogo అమరావతి: దేశంలో అనేక రాష్ట్రాలు ఏర్పడ్డా ఇంత హంగామా ఎవరూ చేయలేదు.. బిజెపి ఎమ్మెల్సీ సోమువీర్రాజు ScrollLogo హైదరాబాద్: ఎన్నికలకు ఆరునెలల ముందే బిజెపి అభ్యర్దులను ప్రకటిస్తాం.. రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
Tollywood/Bollywood
Business News
Quality-Inspector-became-President-and-CEO-of-SS-White-Technologies
ఉద్యోగిగా చేరి అదే కంపెనీకి సీఈవోగా ఎదిగిన రాహుల్ శుక్లా

గుజరాత్‌కు చెందిన రాహుల్ శుక్లా చదువు పూర్తయిన తరువాత అందరిలానే జాబ్‌లో జాయినయ్యాడు. అయితే కొంత కాలానికి ఆ కంపెనీ నష్టాల్లో ఉందని తెలుసుకున్నాడు.  తన ఆలోచనలు ఆచరణలో పెట్టే ప్రయత్నంలో 9నెలలు బ్యాంకుల చుట్టూ తిరిగి వారికి నమ్మకాన్ని కలిగించి కంపెనీని కొనేసి లాభాల బాట పట్టించాడు.  రాహుల్ శుక్లా సొంత ఊరు గుజరాత్ రాష్ట్రం సురేంద్రనగర్ జిల్లాలోని వాద్వాన్ ప్రాంతానికి చెందిన వ్యక్తి.  ఆయన విద్యాభ్యాసం మొత్తం వాద్వాన్, భావ్ నగర్, అహ్మదాబాద్‌లలో గడిచింది.  1971లో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌లో ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్ళిన శుక్లా చదువుకుంటూ పార్ట్‌టైమ్ ఉద్యోగిగా ఎస్ఎస్ వైట్ టెక్నాలజీలో చేరారు.  ఎంఎస్ పూర్తయిన తరువాత ఎస్ఎస్ వైట్ టెక్నాలజీలోనే క్వాలిటీ కంట్రోల్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. 1988లో ఎస్ఎస్ వైట్  కంపెనీ కష్టాల్లో కూరుకుపోయింది.  దాదాపు తొమ్మిది నెలల పాటు బ్యాంకుల చుట్టూ తిరిగిన శుక్లా కంపెనీ భవిష్యత్తులో లాభాలను ఆర్జిస్తుందని నమ్మించగలిగాడు.  విమానాలు ల్యాండ్ అయ్యే సమయంలో అవసరమయ్యే థ్రస్ట్ రివర్సల్ సిస్టమ్స్‌ను తయారు చేసి లాభాల బాట పట్టించారు. అక్కడి నుంచి శుక్లా వెనుదిరిగి చూసుకోలేదు.  విమాన రంగంతో పాటు  స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఎస్ఎస్‌వైట్‌కు అమెరికా, యూకే, ఇండియాల్లో ఉన్నాయి. తమ కంపెనీకి చెందిన యూనిట్లను చైనా,భారత్‌లలో పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు. 

Infosys-earnings-beat-estimates
ఐటీ రంగంలో అగ్రస్థానంలో ఉన్న ఇన్ఫోసిస్

అత్యధిక లాభాలు ఆర్జిస్తున్న కంపెనీగా ఇన్ఫోసిస్ కంపెనీ దూసుకెళుతున్నది.  డిసెంబర్ క్వార్టర్‌లో ఆ కంపెనీ సుమారు రూ.3708 కోట్ల లాభాన్ని ఆర్జించింది.  దీంతో కంపెనీ షేర్లు సుమారు మూడు శాతం పెరిగాయి.  మొత్తం మీద గత ఏడాది ఇన్ఫోసిస్ రెవెన్యూ పది బిలియన్ల డాలర్లు దాటినట్లు ఆ కంపెనీ ఈసీవో వివాల్ షిక్కా తెలిపారు.  మరోవైపు కంపెనీ డిప్యూటీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా రవికుమార్‌ను నియమించారు.  మార్చ్ వరకు కంపెనీ ఆదాయం 8.4 శాతం నుంచి 8.8 శాతం వరకు పెరిగే అవకాశాలున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. 

Sbi-reduced-House-and-vehicle-loan-interest-rate
గృహ, వాహన రుణాలపై వడ్డీ రేటును తగ్గించిన ఎస్బీఐ

సొంతిల్లు, కొత్త వాహనం కొనుక్కునే వారికి శుభవార్త. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ, వాహన రుణాలపై వడ్డీ రేటును తగ్గించింది. ఈ తగ్గింపు 0.90 శాతంగా ప్రకటించింది. కొత్త వడ్డీ రేట్లు జనవరి 1 నుంచే వర్తిస్తాయని తెలిపింది. సవరించిన రేట్ల ప్రకారం ఏడాదికి వడ్డీ 8 శాతంగా ఉంటుందని బ్యాంకు తెలిపింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లోకి భారీగా డబ్బు చేరింది. పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్ అయింది. దీంతో వీలైనన్ని ఎక్కువ రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు వడ్డీరేట్ల తగ్గింపును ప్రకటిస్తున్నాయి. గత వారం రెండు బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. 


My-Home-Industries-Rebranding-as-MAHA-Cement
మైహోమ్ ఇండస్ట్రీస్ ఇకపై మహా పేరుతో సిమెంట్ అమ్మకాలు

మహా సిమెంట్, మహాశక్తి, మహాగోల్డ్ బ్రాండ్ల స్థానంలో ఇక నుంచి ఒకే బ్రాండ్‌ 'మహా' పేరుతో సిమెంటును విక్రయించన్నట్లు  మై హోమ్ ఇండస్ట్రీస్ ఇ.డి సాంబశివరావు తెలిపారు. తమిళనాడులోని ట్యూటికోరిన్ వద్ద 250 కోట్ల రూపాయలతో నెలకొల్పుతున్న ప్లాంటు జనవరికల్లా సిద్ధం అవుతుందని, ఈ ప్లాంటు తోడైతే కంపెనీ సామర్థ్యం 10 మిలియన్ టన్నులకు చేరనుందని ఆయన తెలిపారు.  మై హోమ్ గ్రూప్ టర్నోవర్‌ అయిదు వేల కోట్ల రూపాయలు కాగా  ఇందులో సిమెంటు వ్యాపారం వాటా మూడు వేల కోట్ల రూపాయలుగా ఉంది. ఇప్పటికే పలు రంగాల వ్యాపారంలో ఉన్న మై హోమ్ గ్రూప్ బల్క్ డ్రగ్, ఫార్మా విభాగంలోకి ప్రవేశించాలని నిర్ణయించిందని, దీనిపై మరో ఆరు నెలల్లో స్పష్టత రానుందని సాంబశివరావ్ తెలిపారు.

Unusual-mystery-in-the-Tata-Mistry-episode
డైలీ సీరియల్‌ తలపిస్తున్న టాటా-మిస్ట్రీ ఎపిసోడ్‌ మలుపు

డైలీ సీరియల్‌ మాదిరిగా రతన్‌ టాటా - సైరస్‌ మిస్ట్రీ ఎపిసోడ్‌ రోజుకో మలుపు తిరుగుతోంది. రతన్‌ టాటాపై సైరస్‌ మిస్త్రీ విరుచుకపడగా... మిస్త్రీ అసమర్ధతపై ఉద్యోగులకు రాసిన లేఖలో రతన్‌ టాటా మండిపడ్డారు. తాజాగా మిస్ట్రీ పర్ఫార్మెన్స్‌ ఎంతో భేషుగ్గా ఉందని, నాలుగు నెలల కిందట ఆయన వేతనాన్ని పెంచాల్సిందిగా టాటా సన్స్‌ బోర్డు వేతన కమిటీ సిఫార్సు చేసినట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.


Gold-sales-during-Dhanteras-and-diwali-is-high
దంతేరాస్, దీపావళి సందర్భంగా బంగారం అమ్మకాల్లో వృద్ధి

దంతేరాస్, దీపావళి సందర్భంగా బంగారం అమ్మకాల్లో వృద్ధి కనిపించింది. హైదరాబాద్ జ్యుయెలరీ మార్కెట్లు ఈ సీజన్‌లో కళకళలాడాయి. దంతేరాస్ సెంటిమెంట్ ఉండడంతో వినియోగదారులు బంగారాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. వీటికి తోడు పసిడి ధరలు పెరగకపోవడంతో కొనుగోళ్లు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. బంగారం ధరల్లో 10 శాతం పెరిగే అవకాశం ఉండడంతో మరింత కొనుగోళ్లు జరిగాయని చెబుతున్నారు. వచ్చే ఏడాదిలోపు గోల్డ్ ధరలు మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. బంగారం కొనుగోళ్లపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉమ అందిస్తారు. 

GoAir-operations-started-in-hyderabad,as-its-23rd-destination
హైదరాబాద్ నుంచి ఆపరేషన్స్ ప్రారంభించిన గో ఎయిర్

లోకాస్ట్ కారియర్.. గో ఎయిర్ హైదరాబాద్ నుంచి తమ కార్యకలాపాలు ప్రారంభించింది. బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై , కోల్ కొతా కు డైలీ నాన్ స్టాప్ ఫ్లైట్స్ సర్వీస్ ను స్టార్ట్ చేస్తోన్నట్లు గో ఎయిర్ సీఈఓ వోల్ఫ్ గాంగ్ ప్రాక్ తెలిపారు. హైదరాబాద్ తమ 23వ డెస్టినేషన్ అని, వచ్చే ఏడాది సమ్మర్ సీజన్ నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ నడపనున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం డొమెస్టిక్ ఎయిర్ లైన్స్ లో 5వ స్థానం లో ఉన్న గో ఎయిర్ 8 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది.


Loan-EMIs-may-fall-as-RBI-cuts-repo-rate-by-25-basis-points
తగ్గనున్న రుణాలు, డిపాజిట్ల వడ్డీ రేట్లు

పండుగల వేళ, రిజర్వ్ బ్యాంకు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును ఆరున్నర నుంచి 6.25 శాతానికి తగ్గించింది. రివర్స్ రెపోరేటును 6 నుంచి 5.75కు తగ్గించింది. దీనివల్ల రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. డిపాజిట్లపై వడ్డీ రేట్లు కూడా తగ్గే అవకాశం ఉంది. మరోవైపు, స్టాక్ మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. ఆర్ బిఐ నిర్ణయం షేర్ బజార్ కు మరింత ఉత్సాహాన్నిచ్చింది. ఆర్ బి ఐ కొత్త గవర్నర్ ఉర్జిత్ పటేల్ నాయకత్వంలో రిజర్వ్ బ్యాంకు మొదటిసారిగా వడ్డీ రేట్లను సమీక్షించింది. 


India's-August-retail-inflation-at-five-month-low
5 నెలల కనిష్ట స్థాయికి రిటైల్‌ ద్రవ్యోల్బణం

రిటైల్‌ ద్రవ్యోల్బణం 5 నెలల కనిష్ట స్థాయికి దిగివచ్చింది. ఆగస్ట్‌ నెలలో రిటైల్  ఇన్‌ఫ్లేషన్‌ 6.07 శాతం నుంచి 5.05 శాతానికి తగ్గింది. ఆహార ఉత్పత్తుల ధరల  దిగిరావడంతో రిటైల్‌ ద్రవ్యోల్బణం దాదాపు 100 బేసిస్ పాయింట్లు తగ్గింది. కీలక  విభాగాలను చూస్తే...  ఫుడ్ అండ్ బేవరేజెస్ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 5.83  శాతంగా నమోదయ్యింది. పాన్, పొగాకు ఇతర మత్తు ప్రేరిత ఉత్పత్తుల ధరలు 6.86  శాతం, క్లాథింగ్ అండ్ ఫుట్‌వేర్ ధరలు 5.21 శాతం, హౌసింగ్ ధరలు 5.29 శాతం  పెరిగాయి. ఇంధనం, లైట్‌లో ధరలు కూడా 2.49 శాతం ఎగబాకాయి. 


Reliance-Jio-to-raise-Rs.15000-crore-via-preference-shares
15 వేల కోట్లు సమీకరించబోతున్న రిలయన్స్ జియో

ఆప్షనల్లీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్ల ద్వారా 15 వేల కోట్ల రూపాయలు సమీకరించబోతున్నట్టు రిలయన్స్ జియో వెల్లడించింది. పది రూపాయల ముఖ విలువ ఉన్న ఒక్కో ప్రిఫరెన్స్‌ షేర్‌కు 40 రూపాయల ప్రీమియం వసూలు చేస్తున్నారు. అయితే తాజాగా సమీకరించబోయే 15 వేల కోట్ల రూపాయలను ఎందుకోసం వినియోగించబోతున్నారనే విషయాన్ని మాత్రం జియో వెల్లడించలేదు. ఇప్పటికే జనవరిలో ఈ సంస్థ జనవరిలో ఇలాంటి షేర్ల జారీ ద్వారా నిధులను సేకరించింది. 


KTR-Speech-At-CREDAI-Property-Show-2016
హైదరాబాద్‌లో ప్రారంభమైన క్రెడాయ్‌ ప్రాపర్టీ షో

హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో  క్రెడాయ్‌ ప్రాపర్టీ షో ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ ప్రాపర్టీ షోను తెలంగాణ ఐటీ శాఖ కేటీఆర్‌ ప్రారంభించారు. అపనమ్మకాల నీలినీడల నుంచి బయటపడిందని, ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని ఈ సందర్భంగా కేటీఆర్‌ అన్నారు. జెఎల్ఎల్, కుష్మన్‌వేక్ ఫీల్డ్, సిబిఆర్ఈ రిపోర్టులన్నీ హైదరాబాద్‌కు పెద్ద పీట వేస్తున్నాయని, దీంతో తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు మరింత పెరగబోతున్నాయని చెప్పారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల కార్యక్రమం కోసం తెలంగాణ ప్రభుత్వంతో  క్రెడాయ్ భాగస్వామ్యం కావాలని, ప్రభుత్వం అండగా ఉన్నప్పుడు సంస్థలు కూడా ముందుకొచ్చి సాయం చేయాలని కేటీఆర్‌ తెలిపారు. 


2016-Rolls-Royce-Dawn-released-in-Indian-market
దక్షిణాది మార్కెట్లోకి రోల్స్‌ రాయిస్‌ కొత్త మోడల్‌

దక్షిణాది మార్కెట్లోకి సరికొత్త డాన్‌ మోడల్‌ కారును బ్రిటిష్‌ సూపర్‌ లగ్జరీ కార్ల దిగ్గజం రోల్స్‌ రాయిస్‌ మోటార్‌ విడుదల చేసింది. డాన్‌ మోడల్‌ ధర 6.25 కోట్ల రూపాయలు. . రోల్స్‌ రాయిస్‌కు భారత మార్కెట్‌ ఎంతో కీలకమైనదని కంపెనీ వెల్లడించింది. దక్షిణాదిలో లగ్జరీ కార్ల మార్కెట్‌ వేగవంతంగా వృద్ధి చెందుతోందని,  హైదరాబాద్‌, చెన్నై, కోచిలో రోల్స్‌ రాయిస్‌ కార్లకు మంచి గిరాకీ ఉందని కంపెనీ తెలిపింది.


Gruhapravesam-property-show-2016-in-HITEX
హైటెక్స్‌లో 'గృహప్రవేశం' ప్రాపర్టీ షో

హైదరాబాద్‌ హైటెక్స్‌లో గృహప్రవేశం పేరుతో ప్రాపర్టీ షోను ప్రారంభించింది ఇండియా ప్రాపర్టీ డాట్‌ కామ్‌.  ఈ కార్యక్రమానికి క్రెడాయ్‌ మాజీ అధ్యక్షలు శేఖర్‌ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరైయ్యారు. ఇవాళ, రేపు  అందుబాటులో ఉండే ఈ ఎక్స్‌పోలో 65 మంది బిల్డర్లు 300 పైగా ప్రాపర్టీస్‌ను ప్రదర్శిస్తూ స్టాల్స్‌ ఏర్పాటు  చేశారు. ఈ రెండు రోజుల్లో పది వేల మంది విజిటర్స్‌ ఈ ప్రాపర్టీ షోకు హాజరౌతారని , బిల్డర్లు 35 లక్షల  రూపాయల నుంచి 6 కోట్ల రూపాయల వరకూ ప్రాపర్టీస్ సందర్శకులకు అందుబాటులో ఉంచామని  ఇండియా ప్రాపర్టీ డాట్‌ కామ్‌ ప్రతినిధి శ్రీనివాస వర్మ  తెలిపారు.


TV5 News: Indo-American Chamber bid to boost bilateral trade- Rajnath Singh
హైదరాబాద్‌లో ఇండో అమెరికన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రారంభం

ఇండో అమెరికన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌... భారత్‌ అమెరికాల వ్యాపార సంబంధాల పై హైదరాబాద్‌లో ఓ జాతీయ  సదస్సును నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి రాజనాథ్ సింగ్‌ , గవర్నర్‌  నర్శింహన్‌లు ముఖ్య అతిధులుగా హాజరైయ్యారు. ఇండియా అమెరికాల మధ్య వ్యాపారం 500 బిలియన్‌ డాలర్లకు పెంచడం ఎలా అనే అంశంపై వివిధ రంగాలకు  చెందిన పారిశ్రామిక వేత్తలు రెండు రోజుల పాటు ఈ సదస్సులో చర్చించి ప్రభుత్వానికి నివేదిక  అందిస్తారని నిర్వాహకులు తెలిపారు. భారత్‌లో అపారమైన వ్యాపార అవకాశాలున్నాయని... ఫార్మా,  ఐటీ రంగాలతో పాటు ఏవియేషన్‌ అండ్‌ డిఫెన్స్‌, ఇన్‌ఫ్రా, ఎనర్జీ, మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ రంగాల్లో  ఎన్నో వ్యాపార అవకాశాలున్నాయని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ అన్నారు. ఈ రంగాలతో పాటు  కేంద్రం రూరల్‌ ఎకానమీ మీద మరింత దృష్టి సారిస్తోందని ఆయన తెలిపారు. చిన్నా, మధ్య తరహా  పరిశ్రమలను ప్రోత్సహిస్తే ఉపాధి అవకాశాలు మెరుగౌతాయని  గవర్నర్‌ నరశింహన్‌ అన్నారు.


TV5 News: Indian stock market closed with Profit
లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

నాలుగు రోజుల వరుస నష్టాలకు ఇవాళ స్టాక్‌ మార్కెట్లో బ్రేక్‌ పడింది. మార్నింగ్‌ సెషన్లో నష్టాల్లో ట్రేడైనప్పటికీ... మిడ్‌ సెషన్లో మార్కెట్లు లాభాల బాటలోకి మళ్ళాయి. ఆటో, బ్యాంకింగ్, కన్జ్యూమర్‌ గూడ్స్‌, మెటల్‌ కౌంటర్లకు కొనుగోళ్ల మద్దతు లభించగా... ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, హెల్త్‌కేర్‌, టెక్నాలజీ, ఇన్‌ఫ్రా, ఐటీ సూచీలు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మనం తినే బ్రెడ్‌లో రసాయనాల అవశేషాలు ఉన్నాయని సీఎస్‌ఈ సర్వేను విడుదల చేయడంతో ఆ రంగ షేర్లు భారీగా పతనమయ్యాయి. ఇంట్రాడే కనిష్ట స్థాయి నుంచి సెన్సెక్స్‌ 259 పాయింట్లు కోలుకోగా... నిఫ్టీ 46 పాయింట్లు కోలుకుంది. మొత్తం మీద సెన్సెక్స్‌ 75 పాయింట్ల లాభంతో 25 వేల 305 పాయింట్ల దగ్గర... నిఫ్టీ 15 పాయింట్ల లాభంతో 7 వేల 746 దగ్గర ఇవాళ్టి ట్రేడింగ్‌ను ముగించాయి. ఇక నిఫ్టీ ప్రధాన షేర్లలో గ్రాసీం ఇండస్ట్రీస్‌, ఎన్టీపీసీ, ఏసీసీ, టాటామోటార్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ లాభపడగా... అరబిందో ఫార్మా, ఐడియా, బీపీసీఎల్‌, బజాజ్‌ ఆటో, సన్‌ఫార్మాలు నష్టాన్ని చవిచూశాయి. 


NRI Edition
AP News
Telangana News
Pata
Sports
Daily Specials