Live News Now
  • లక్షల రూపాయల జీతం ఇస్తున్నా వైద్యులు ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లడం లేదన్న మంత్రి కామినేని
  • జులై 4న ఏపీ, తెలంగాణాలో ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ పర్యటన
  • ప్రకాశం: రు.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన సీఎస్‌పురం వీఆర్వో బ్రహ్మయ్య
  • జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం ...రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి ఇద్దరు బలి
  • భారత్ నెదర్లాండ్స్ ద్వైపాక్షిక సంబంధాలకు శతాబ్దాల చరిత్ర ఉందిః మోడీ
  • నిర్మల్ జిల్లాలో టర్కీ రాయబారి..కొయ్యబొమ్మలు,పేయింటింగ్ పరిశ్రమ కేంద్రాల సందర్శన
  • దివాకర్ ట్రావెల్స్ కు క్లీన్ చిట్ ...అఫిడవిట్ లో ఏపీ రవాణా శాఖ వివరణ
  • శిరీషది హత్య అనడానికి ఎలాంటి ఆధారాలు లేవుః డీసీపీ వెంకటేశ్వరరావు
  • జీఎస్టీ పై ఫర్నీచర్ వ్యాపారుల ఆందోళన... 28 నుంచి 18 శాతానికి తగ్గించాలని డిమాండ్
  • మత్తు మందిచ్చి యశ్వంత్‌పూర్‌-లక్నో ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ..ఆరుగురు ప్రయాణికులు బలి
ScrollLogo అంటువ్యాదులు ప్రబలకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి: చంద్రబాబు ScrollLogo శిరీష మృతి కేసులో రాజీవ్, శ్రవణ్‌లను రెండో రోజు విచారిస్తున్న పోలీసులు ScrollLogo రాష్ట్రానికి రు.4600 కోట్ల ప్రాజెక్టు రాకుండా అడ్డుకున్న వైసీపీ అధినేత జగన్‌పై మండిపడ్డ మంత్రి యనమల ScrollLogo సివిల్స్ మూడో ర్యాంకర్ గోపాల కృష్ణకు హైకోర్టు నోటీసులు ScrollLogo తప్పుడు ధృవపత్రాలతో దివ్యాంగులకోటాలో ర్యాంకు పొందారని ఆరోపణ ScrollLogo గుంటూరు రొంపిచర్ల(మ) వీరపట్నంలో ఆస్తి తగాదాలతో అన్నా, వదినను హత్య చేసిన తమ్ముడు ScrollLogo సర్వీసు చార్జి పేరుతో రు.20 అదనంగా వసూలు చేస్తున్న ScrollLogo మాధవ గ్యాస్ కంపెనీపై కేసు నమోదు ScrollLogo వనపర్తి: రంగాపురం మండలం షేరుపల్లిలో ట్రాక్టర్ బోల్తా ScrollLogo 30 మంది ఉపాధి కూలీలకు గాయాలు
Crime Watch
Road-contractor-Negligence,father-and-son-Die-on-Bridge,Gadwal
రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి ఇద్దరు బలి

జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఇద్దరు ప్రాణాలను బలి తీసుకుంది. మానపాడ్ మండలం శ్రీనగర్ వద్ద కల్వర్టులోకి బైక్ దూసుకెళ్లడంతో తండ్రి కొడుకులు మృతి చెందారు. అరగిద్ద గ్రామానికి చెందిన స్వాములు అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమారుడిని ఆస్పత్రి నుంచి తీసుకువస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుకు మధ్యలో బ్రిడ్జీ వేసే క్రమంలో ఎక్కడా ప్రమాద సూచికలు అమర్చలేదు. దీంతో ఆ కల్వర్టులో పడి ఇద్దరు దుర్మరణం చెందారు. కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు.

Narayankhed-rtc-depot-manager-committed-suicide-by-consuming-pesticides
నడిరోడ్డు పై ఆర్టీసీ డిపో మేనేజర్ సూసైడ్, ఎందుకు ?

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లోని సెవాలాల్‌ చౌక్‌ వద్ద నడిరోడ్డుపై స్థానిక ఆర్టీసీ డిపో మేనేజర్‌ కట్టా మహేందర్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.ఇతనికి భార్య,ఇద్దరు కుమారులున్నారు.గత నెల 12న  నారాయణ్‌ఖేడ్‌ డిపో మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించాడు.. మృతుడి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. తమ డిపో మేనేజర్‌  ఆత్మహత్య చేసున్నాడన్న వార్త విని ఆర్టీసీ కార్మికులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు.మహేందర్‌ అందరితో కలుపుగోలుగా ఉండేవాడని కార్మికులు చెబుతున్నారు.

Sirisha-Suicide-Case-Latest-Revealed-Updates
శిరీష కేసులో తేజస్విని స్టేట్ మెంట్ రికార్డు చేసిన పోలీసులు

శిరీష కేసుకు సంబంధించి తేజస్విని స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. కేసులో ఆమెను ఎందుకు ప్రశ్నించడం లేదంటూ శిరీష కుటుంబసభ్యులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కేసులో ఆమె ప్రధానంగా మారారు. దీంతో తేజస్వినిని పిలిచి ఆమె స్టేట్ మెంట్ రికార్డు చేశారు పోలీసులు. రాజీవ్ అంటే తనకు ఎంతో ఇష్టమని ఆమె ఈ సందర్భంగా చెప్పినట్టు తెలుస్తోంది. రాజీవ్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్నా.. అందుకు రాజీవ్ తల్లిదండ్రులు ఒప్పుకోలేదని చెప్పింది. శిరీషతో గొడవపడినట్టు స్టేట్ మెంట్‌లో చెప్పిన తేజస్విని.. తనకు బెదిరింపు కాల్స్ వచ్చినట్టు కూడా పోలీసులకు వివరించింది.

ఇక శిరీష కేసుకు సంబంధించి రాజీవ్, శ్రావణ్‌ కస్టడీ రేపు ఉదయంతో ముగస్తుంది. ఇవాళ సాయంత్రంలోపు వారి దగ్గరి నుంచి వీలైనంత సమాచారం రాబట్టే పనిలో ఉన్నారు పోలీసులు. బంజారాహిల్స్ పోలీసులతో పాటు.. కుకునూరుపల్లి పోలీసులు కూడా నిందితులను ప్రశ్నిస్తున్నారు.

Rajeev,-Shravan-Interrogation,-Sirisha-Suicide-Case
రెండోరోజు కొనసాగుతున్న రాజీవ్, శ్రవణ్ విచారణ

శిరీష మృతి కేసులో నిందితులు రాజీవ్, శ్రవణ్‌ల రిమాండ్‌లో కీలకమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇవాళ ఇద్దరినీ కుకునూర్‌పల్లి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఎస్సై క్వార్టర్స్‌లో ఏ జరిగిందో సీన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. శిరీషను వదిలించుకునేందుకు రాజీవ్ వేసిన ప్లాన్‌లో భాగంగానే ఈ మొత్తం వ్యవహారం జరిగినట్టు అర్థమవుతోంది. ఐతే, విచారణలో శ్రవణ్ కూడా కొన్ని కీలమైన అంశాల్ని చెప్పినట్టు తెలుస్తోంది.


సంచలనం రేపుతున్న శిరీష మృతి కేసులో పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం.. ఈనెల 12వ తేదీన ఆమెకు మ్యారేజ్ అపాయింట్‌మెంట్ ఉంది, సాయంత్రం వస్తానంటూ మధ్యాహ్నం రెండున్నర గంటలకు శిరీష ఇంటి నుండి బయటకు వెళ్లింది. రాత్రి 8గంటల 40నిమిషాలకు తాను రావడం లేటవుతుందని భర్త సతీష్ చంద్రకు ఫోన్ చేసింది. రాత్రి 11గంటల వరకు ఎదురుచూసి..భర్త సతీష్ చంద్ర, కూతురు దివ్య భోజనం చేసి పడుకున్నారు. 13వ తేదీ ఉదయం  నాలుగు గంటల 10నిమిషాలకు సతీష్ చంద్ర, శిరీషకు ఫోన్ చేశాడు. ఆమె కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో 5గంటల 40నిమిషాలకు బేగంపేటలోని తన ఆఫీసుకు వెళ్లిపోయాడు. ఉదయం 6గంటల 40నిమిషాలకు శిరీష చనిపోయిందని బంజారాహిల్స్ పోలీసులు సతీష్ చంద్రకు ఫోన్ చేశారు. హుటాహుటిన ఆర్జే స్టూడియోకు సతీష్ చంద్ర వెళ్లాడు. ఆయన వచ్చే సరికి శిరీష బెడ్ పై పడి ఉంది. భార్య మృతిపై సతీష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శిరీష ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని అందులో చెప్పినట్లు.. పోలీసులు ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. మరోవైపు పోలీసుల విచారణలో శ్రవణ్ కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. మే 30న కుకునూరుపల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డికి శ్రవణ్ ఫోన్ చేశాడు. బంజారా హిల్స్ పిఎస్ లో సమస్య ఉంది. ఎస్ఐ హరిందర్ కు ఫోన్ చేసి దానిని సెటిల్ చేయాలని కోరాడు. 31వ తేదీన ఎస్ఐ హరిందర్ కు ప్రభాకర్ రెడ్డి ఫోన్ చేశాడు. అయితే.. శిరీష, తేజస్వినిల కేసును ఎస్ఐ శ్రీనివాస్ చూస్తున్నారని ప్రభాకర్ రెడ్డికి హరిందర్ చెప్పారు. ఆ తరువాత ఇదే కేసు విషయమై ప్రభాకర్ రెడ్డికి శ్రవణ్ రెండు సార్లు ఫోన్ చేశాడు. బంజారాహిల్స్  పోలీసులు కేసు పరిష్కరించక పోవడంతో.. కుకునూరు పల్లి వస్తామని ప్రభాకర్ రెడ్డికి చెప్పాడు. తన వెంట రాజీవ్, శిరీషను తీసుకువస్తానన్నాడు. కేసు సెటిల్ మెంట్ కోసం జూన్ 4న రాజీవ్, శిరీషలతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వెళ్లామన్నాడు. అక్కడ కేసు సెటిల్ కాకపోవడంతో జూన్ 12న రాజీవ్, శిరీషలతో కలిసి కుకునూరు పల్లి వెళ్లినట్లు పోలీసుల విచారణలో శ్రవణ్  చెప్పినట్లు తెలుస్తోంది.

Petrol-Pump-Owner-Shot-Dead-by-Robber-In-Bihar
పెట్రోల్ బంక్ యజమానిని తుపాకీతో కాల్చిన దుండగుడు

పెట్రోల్ బంక్ యజమానిని తుపాకీతో కాల్చిన దుండగుడు

Love-Affair,-Horrible-Murder-in-Hyderabad-Balapur
ఎదురింటి అమ్మాయిని వేధిస్తున్నాడని దాడి

హైదరాబాద్‌ శివారు బాలాపూర్‌లో ఓ యువకుడిని ఐదుగురు వ్యక్తులు దారుణంగా కొట్టి చంపేశారు. పది రోజుల కిందట వీరి దెబ్బలకు తీవ్ర గాయాలపాలైన సునీల్ చివరికిప్పుడు కన్నుమూశాడు. ఈ ఘటన ఎలా జరిగింది.

Adulteration-Blood-Mafia-Gang-Arrested-In-Hyderabad
రక్తంలో సెలైన్ కలుపుతున్న ముఠా అరెస్ట్

కల్తీ రక్తం అమ్మకాలపై పోలీసులు డొంక కదిలించారు. హైదరాబాద్‌లో కలకలం సృష్టించిన ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు. రక్తంలో సెలైన్ కలుపుతున్నట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. సీజ్ చేసిన రక్తాన్ని పరీక్షల కోసం ల్యాబ్ కు పంపిన పోలీసులు దీని వెనుక ఇంకా ఎవరెవరున్నారు, ఎక్కడెక్కడ ఇది జరుగుతోంది అనే అంశాలపై దృష్టి సారించారు. రోజుకో కల్తీ.. పాల నుంచి మొదలు పెడితే నూనెల వరకు.. పప్పు నుంచి ప్రారంభిస్తే ఉప్పు వరకు. ఇప్పుడన్నీ కల్తీమయమే. ఈ జాబితాలోకి ఎవరూ ఊహించనిది చేరిపోయింది. అదే రక్తం. రక్తాన్ని కల్తీ చేస్తూ.. అందరిలో ఆందోళన నింపిన దుర్మార్గులను ఎల్‌బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కల్తీ చేశారనే ఆరోపణలతో మలక్‌పేట వీనస్ ఆస్పత్రి డైరెక్టర్ చక్రవర్తితోపాటూ  బ్లడ్ బ్యాంక్ ఇన్‌ఛార్జ్ శ్రావణ్, టెక్నీషియన్ ప్రేమ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. తమ ప్రాథమిక విచారణలో రక్తంలో సెలైన్ కలుపుతున్నట్టు గుర్తించారు. ఎల్బీ నగర్ లోని అవేర్ గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నర్సింహారెడ్డి అనే రోగికి రక్తం ఎక్కిస్తున్నప్పుడు కల్తీ రక్తం గుట్టు బయటపడింది. మలక్‌ పేటలోని బ్లడ్‌ బ్యాంకు నుంచి రక్తాన్ని కొనుక్కొచ్చారు. దాన్ని టెస్ట్ చేసిన డాక్టర్లు.. రక్తం తక్కువ, సెలైన్ ఎక్కువ ఉండడంతో అదిరిపడ్డారు. వారు డ్రగ్ కంట్రోల్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో కల్తీ రక్తం సరఫరా చేస్తున్న బ్లడ్ బ్యాంక్‌లో సోదాలు జరిగాయి. కల్తీ రక్తం కలకలంతో అన్ని బ్లడ్ బ్యాంకులు, ఆస్పత్రుల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. వీనస్ ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తం పాకెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపారు. ఆస్పత్రిలో రక్తం కల్తీ ఎప్పటి నుంచి సాగుతోంది.. నగరంలో ఇంకా ఎన్ని ఆస్పత్రుల్లో ఇది సాగుతోంది.. ఇంకా ఎవరెవరు దీనికి సహకరిస్తున్నారు. కల్తీ రక్తం ఎవరెవరికి సరఫరా చేస్తున్నారు అనేదానిపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Beautician-Sirisha-death-case-latest-updates
శిరీష కేసు.. తొలి రోజు విచారణలో నిందితులు సంచలన విషయాలు వెల్లడి

బ్యూటీషియన్ శిరీష కేసులో పోలీసులు స్పీడు పెంచారు. ప్రధాన నిందితులైన రాజీవ్‌, శ్రావణ్‌లను కస్టడీకి తీసుకుని నిజాలు కక్కించే ప్రయత్నం చేస్తున్నారు. శిరీష ఆత్మహత్య చేసుకున్నట్టు కనిపిస్తున్నా.. కేసులో సమాధానం లేని ప్రశ్నలు చాలానే కనిపిస్తున్నాయి. తొలి రోజు విచారణలో నిందితులు సంచలన విషయాలు వెల్లడించినట్టు తెలుస్తోంది.
శిరీష మృతి వెనుక ఇంకా ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సందేహాలు.. అన్నిటికీ సమాధానాలు వెతికే పనిలో పడ్డారు పోలీసులు. ప్రధాన నిందితులు రాజీవ్, శ్రావణ్‌ను రెండు రోజుల కష్టడీకి తీసుకున్న పోలీసులు.. విచారణ కూడా ప్రారంభించారు. మొదటిరోజు విచారణలోనే రాజీవ్ సంచలన విషయాలు బయటపెట్టినట్టు సమాచారం. శిరీషను వదిలించుకోవాలనుకునే ఆమెను కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్‌కు అతడు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.
ఇంట్లోవాళ్లు పెళ్లి సంబంధాలు చూస్తుండడంతో తేజస్విని, శిరీష ఇద్దరినీ వదిలించుకోవాలనుకున్నట్టు రాజీవ్ పోలీసులకు చెప్పాడు. తేజ‌స్వినిని పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం తనకు లేదని, శిరీష‌ను వ‌దిలించుకోడానికి శ్రావణ్ సహకరించాడని అతడు పోలీసుల దగ్గర అంగీకరించినట్టు తెలుస్తోంది. తను వదిలించుకోవాలనుకుంటున్నట్టు తెలిసే శిరీష ఆత్మహత్య చేసుకుందని కస్టడీలో రాజీవ్ చెప్పాడు. తనను పెళ్లి చేసుకుంటానని తేజస్విని తన తల్లికి చెప్పిందని.. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో శిరీషతో గొడవపడిందని రాజీవ్ చెప్పాడు. ఈ గొడవ పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లడంతో శిరీషను బెదిరించాలనుకున్నానని తెలిపాడు. కానీ ఎస్సై ఏం చేశాడో తనకు తెలీదని, శిరీష మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. తనకు శిరీషను చంపే ఉద్దేశం లేదని రాజీవ్ పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు రాజీవ్‌కు ఈ వ్యవహారానికి సంబంధం లేదంటున్నారు అతని తరపు లాయర్‌. ఇష్యూను సెటిల్‌మెంట్ చేసుకోవడం కోసమే అంతా కలిసి కుకునూర్ పల్లికి వెళ్లారన్నారు. కానీ విచారణలో రాజీవ్ వెల్లడించిన విషయాలు ఇంకా అధికారులు బయటకు వెల్లడించలేదు. ఇప్పటికీ సమాధానం దొరకని కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే యోచనలో ఉన్నారు. శిరీషను వదిలించుకోవాలనుకున్న రాజీవ్ ఆమెను కుకునూరు పల్లి ఎందుకు తీసుకెళ్లాడు. అక్కడ శిరీష ఎందుకు అరిచింది.. దారిలో రాజీవ్ ఆమెపై ఎందుకు చేయిచేసుకున్నాడు..అనే దానిపై రెండో రోజు పోలీసు విచారణలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Car Hits-Women-on-Outer-Ring-Road,-One-Killed-and-Other-Seriously-Injured
పాదచారులపైకి దూసువెళ్లిన కారు.. ఒకరు మృతి

హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్ మరోసారి రక్తమోడింది. సినీ నటుడు భరత్‌ యాక్సిడెంట్‌ని మరిచిపోకముందే.. మరో  ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్లిన కారు.. పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనసో ఒకరు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది

Women-murdered-due-family-disputes,Chittoor
కుటుంబంలో వివాదాలు...మంజుల దారుణ హత్య

చిత్తూరు జిల్లాలో మహిళ దారుణ హత్య కలకలం రేపింది. పూతలపట్టు మండలం గొడుగుచింత గ్రామానికి చెందిన మంజుల నాలుగు రోజుల కిందట చిత్తూరు వచ్చి కనిపించకుండా పోయింది. కాణిపాకంలో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అయితే అక్కడ మొండెం మాత్రమే లభ్యమైంది. పాకాలలో ఓ పాడుబడిన బావిలో చేతులను గుర్తించారు పోలీసులు. కుటుంబ వివాదాలతే హత్యకు కారణమని తెలుస్తోంది. మంజుల, ఆమె మరిది మధ్య కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఆమెపై పగ పెంచుకున్న చంద్రశేఖర్ రెడ్డి.. పథకం ప్రకారం హత్య చేశాడు. పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు నిజాన్ని బయటపెట్టాడు చంద్రశేఖర్ రెడ్డి.

Three-years-Old-kid-died-after-falling-in-Water-tank,L.B.nagar
తల్లికి షాక్: ఆడుకుంటూ సంపులో పడి... బాలుడి మృతి

హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ గుంటి జంగయ్య నగర్‌కాలనీలోని విషాదం జరిగింది. ఇంట్లో ముందు ఆడుకుంటు మూడేళ్ల చిన్నారి సంపులో పడి చనిపోయాడు. కాసేపటి తర్వాత తల్లి గమనించగా... సంపులో పడి ఉన్నాడు. అప్పటికే చిన్నారి చనిపోయాడు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తల్లిదండ్రులు ఉపాధి కోసం నల్గొండ జిల్లా రామన్నపేట మండలం బాచుపల్లి నుంచి హైదరాబాద్‌ వచ్చారు.

sirisha-death-mystery-police-custody-of-rajiv-sravan
శిరీష ఆత్మహత్య కేసులో పోలీస్ కస్టడీకి రాజీవ్, శ్రావణ్

బ్యూటీషియన్ శిరిష ఆత్మహత్య కేసులో నిందితులు రాజీవ్, శ్రావణ్‌లకు కోర్టు రెండు రోజుల పోలీసు కస్టడీకి అనుమతి ఇచ్చింది. కోర్టు అనుమతితో నిందితులను చంచల్‌గూడ జైలు నుంచి బంజారాహిల్స్ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. శిరీష ఆత్మహత్య కేసును పోలీసులు మరింత లోతుగా విచారించనున్నారు.

బ్యూటీషియన్ శిరీష డెత్‌ మిస్టరీని పోలీసులు చేధించినా.. ఇంకా కొన్ని ప్రశ్నలు మాత్రం అలాగే ఉన్నాయి. శ్రవణ్ చేసిన కుట్ర ఏమిటి?  కుకునూరుపల్లికి రాజీవ్, శిరీషలను అతను ఏ ఉద్దేశంతో తీసుకెళ్లాడు?సంచలనం సృష్టించిన శిరీష, ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యలపై ఇలాంటి ప్రశ్నలెన్నో ఉన్నాయి. సెటిల్మెంట్‌ కోసం వచ్చిన శిరీషపై ప్రభాకర్ రెడ్డి ఎందుకు అత్యాచారానికి యత్నిస్తాడు. అసలు అర్థరాత్రి ఎవరైనా ఫ్యామిలీ సమస్యల పరిష్కారం కోసం ఎవరైనా వెళతారా? శిరీష ఆత్మహత్య కేసులో శ్రావణ్ ఏ1 ముద్దాయిగా ఎందుకయ్యాడనే దానిపైనా చర్చ మొదలైంది. శిరీషను రాజీవ్, శ్రావణ్‌లు ఆమెను కేవలం చర్చలకే తీసుకెళ్లారా? లేక ఎస్సైతో ఏదైనా లోపాయికారీ ఒప్పందం చేసుకుని తీసుకెళ్లారా? సెటిల్‌మెంట్‌ కోసం తీసుకెళ్లిన శిరీషపై ఎస్సై ఎందుకు అత్యాచారయత్నం చేయాల్సి వచ్చింది?ఆరు అడుగుల పొడవు, 80 కేజీల బరువున్న శిరీష ఫ్యాన్‌కు ఉరివేసుకోవడం సాధ్యమా? అంటూ వారి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీటన్నింటిని పోలీసులు రాజీవ్, శ్రవణ్‌లను ప్రశ్నించనున్నారు.

Mother-attempts-suicide-with-her-child
భర్తతో గొడవ పడి భార్య కూతురుతో సహా ఆత్మహత్య యత్నం.. పరిస్థితి విషమం

ప్రకాశం జిల్లా వేటపాలెంలో దారుణం జరిగింది. భర్తతో గొడవ పడిన భార్య ఆవేశంగా తన నాలుగేళ్ల కూతురుతో సహా ఆత్మహత్యకు యత్నించింది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడంతో.. ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారికి చీరాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో.. మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ACB-seizes-assets-worth-Rs-600-crore-from-chief-engineer
దేశంలోనే అతిపెద్ద అనకొండ: లాకర్లు తెరవకుండానే.. బయల్పడ్డ 600 కోట్లు ఆస్తులు

ఆంధ్రప్రదేశ్‌ ప్రజారోగ్య శాఖ చీఫ్‌ ఇంజినీర్‌ పాండు రంగారావు అవినీతి తవ్వేకొద్దీ బయటకు వస్తోంది.తనిఖీల్లో బయటపడ్డ ఆస్తుల విలువ చూసి ఏసీబీ అధికారులే కాదు.. మొత్తం ప్రభుత్వ పెద్దలే షాక్‌ అవుతున్నారు. ఈ మధ్యకాలంలో ఈ రేంజ్‌లో అక్రమాస్తులు వెలుగు చూసిన ఉదంతం ఇదేనని చర్చించుకుంటున్నారు. ఏసీబీ సోదాల్లో ఇప్పటి వరకు 600 కోట్ల రూపాయల ఆస్తులు బయటపడ్డాయి. ఇంత పెద్దమొత్తంలో ఆస్తులు ఎలా సంపాదించాడనే దానిపై ఆరా తీస్తున్నారు అధికారులు. సోదాల్లోనే ఇంత మొత్తంలో దొరికితే, లాకర్లలో ఇంకెంత దాచుంటాడోనని అనుమానిస్తున్నారు.
పాండు రంగారావు ఒక్కడే ఇంత ఆస్తి సంపాదించాడా..? అంటే, కాదు.. ఇందులో చాలా మంది పాత్ర ఉంది. కొంతమంది అధికారులు ఈ అవినీతిలో పాలు పంచుకుంటే.. కొందరు రాజకీయ నేతలు కూడా చేతులు కలిపినట్లు సమాచారం. అధికార పార్టీ నేతల అండదండలు పాండు రంగారావుకు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది.  అంతేకాదు, ముఖ్య నేతలకు ఈ అవినీతి అధికారి బినామీగా ఉన్నట్లు సమాచారం. ఏసీబీ అధికారుల సోదాల్లో బయటపడ్డ ఆస్తుల్లో పాండురంగారావుకి చెందిన వాటికంటే రాజకీయ నాయకుల ఆస్తులే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా కృష్ణా జిల్లాకు చెందిన కీలక నేత ఆస్తులు ఇందులో ఉన్నట్లు సమాచారం. తెలంగాణకు చెందిన కాంగ్రెస్‌ ముఖ్యనేతల ఆస్తులు కూడా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. మొన్నటి వరకు అంతా సవ్యంగానే నడిచినా, ఈ మధ్య కాలంలో ఏపీకి చెందిన మంత్రితో తలెత్తిన విభేదాలతో పాండురంగారావు పాపం పండింది. ఆ విభేదాలే ఏసీబీ దాడులకు కారణమయ్యాయని అధికార వర్గాలు చర్చించుకుంటున్నాయి.
అయితే తన వెనుక రాజకీయ నేతల పాత్ర ఉండటంతో ఏసీబీకి పాండురంగారావు సరైన సమాచారం ఇవ్వడం లేదనే మాటు విబనడుతోంది. ముఖ్యంగా బ్యాంకు లాకర్ల సమాచారం విషయంలో పాండు రంగారావు నోరు మెదపకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆస్తుల చిట్టా బయటపెట్టిన ఏబీసీ అధికారులు లాకర్ల గురించి చెప్పకపోవడం వెనుకా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అయితే ఈ లాకర్ల విషయమై బ్యాంకులకు లేఖలు రాసే ఆలోచనలో ఏసీబీ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.
దేశంలోనే ఏసీబీ సోదాల్లో ఇంత పెద్ద మొత్తంలో రికవరీ కావడం ఇదే మొదటి సారని అధికారులు చెబుతున్నారు. లాకర్లు తెరిస్తే ఇంతకు రెండింతలు ఆస్తులు దొరికే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు లాకర్లపై ప్రత్యేక దృష్టిపెట్టారు. మరోవైపు తపాండు రంగారావును అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు.. కోర్టులో హాజరుపరిచారు. మరిన్ని వివరాలు రాబట్టేందుకు కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మొత్తంగా పాండురంగారావు ఎపిసోడ్‌లో ఎంతమంది రాజకీయ నేతలు బయటికొస్తారోననే ప్రచారం జరుగుతోంది.

ASI's-wife-commits-suicide-in-warangal
వరంగల్‌ జిల్లాలో ఏఎస్సై భార్య ఆత్మహత్య

వరంగల్‌ అర్బన్ జిల్లాలో ఓ ASI భార్య మృతి కలకలం సృష్టించింది. మడికొండ పోలీస్‌ ట్రైనింగ్‌ కాలేజీలో యాకయ్య ASIగా పనిచేస్తున్నాడు. ఆయన భార్య రాధిక ఆత్మహత్య చేసుకుంది. అయితే యాకయ్యే చంపాడని మృతిరాలి బంధువులు ఆరోపిస్తున్నారు. కానీ ఆయన మాత్రం తనకేమీ తెలియదంటున్నాడు. తను లేని సమయంలో ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నాడు.

NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials