Live News Now
 • విశాఖ: మల్కాపురం సిఐఎస్ఎఫ్ క్వార్టర్స్ లో నేవి హెలికాప్టర్ నుంచి జారిపడిన వెజల్..
 • కడప:జమ్మలమడుగు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసిబి దాడులు..
 • కార్యాలయంలో అదనంగా వున్న రు.79 వేలు స్వాధీనం.. సబ్ రిజిస్ట్రార్ అరెస్ట్...
 • సెప్టెంబర్ 2 న దేశవ్యాప్తంగా ఉద్యోగుల సమ్మెకు ఏపి ఉద్యోగుల పూర్తి మద్దతు..
 • కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీరణకు వచ్చే నెల 28 లేదా 29న ఒక రోజు దీక్ష
 • విజయవాడ: కరువు నివారణ చర్యల కోసం చిత్తూరు,అనంతపురం జిల్లాలకు ప్రత్యేక అధికారులు
 • ఏపిపిఎస్సీ ఇన్ ఛార్జి సెక్రటరీగా ఐఏఎస్ అధికారి ఎం.రవిచంద్రను నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు..
 • ఖమ్మం: భద్రాద్రి ఆలయంలో ఆబరణాలు మాయం వ్యవహారంలో ఇద్దరు అర్చకుల సస్పెన్షన్..
 • హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే అఖిలపక్ష సమావేశాలకు టివైసిపిన ఆహ్వానించాలని
 • ఆదేశించిన హైకోర్టు...అఖిలపక్షానికి ఆహ్వానించకపోవడంపై రిట్ వేసిన వైసిపి
ScrollLogo ప్రత్యేక హోదా కోసం మా ప్రభుత్వం పోరాడుతూనే వుంటుంది.. టిజి ScrollLogo ఢిల్లీ: విజయ్ మాల్యా కేసు వచ్చే నెల 27కు వాయిదా.. ScrollLogo ఢిల్లీ: రాష్ట్రపతి భవన్ లో ఖేల్ రత్న అవార్డుల ప్రదానం..నలుగురు క్రీడాకారులకు ఖేల్ రత్న అవార్డు ScrollLogo రాష్ట్రపతి చేతుల మీదుగా రాజీవ్ ఖేల్ రత్న అవార్డులు అందుకున్న పివి సింధు,సాక్షిమాలిక్.. ScrollLogo దీపా కర్మకర్,జీతురాయ్.. ScrollLogo ఖమ్మం: నేలకొండపల్లి(మ)ఆరెగూడెంలో 10 రజక కుటుంబాలకు సంఘ బహిష్కరణ. ScrollLogo రజకులతో పనిచేయించుకుంటే వెయ్యిరూపాయల జరిమాన విధిస్తామంటూ.. ScrollLogo గ్రామస్తులకు హెచ్చరిక జారీ చేస్తూ గ్రామపెద్దల దండోరా..ముత్యాలమ్మ వేడుక వద్ద వివాదం.. ScrollLogo యెమెన్ లో సైనిక శిబిరంపై ఆత్మాహుతి దాడి.. 40 మంది మృతి ScrollLogo ఢిల్లీ: సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట..కొత్త విసిల కొనసాగింపునకు అంగీకరించిన సుప్రీంకోర్టు
టాలీవుడ్
 • nagarjuna-birthday-wishes-poster
 • Okkadochchadu-Movie-poster
 • Reshmi-Balapam-Patti-Bhama-Odilo-poster
 • DJ-Duvvada-Jagannadham-movie-logo-poster
 • Pellichoopulu-super-hit-poster
సినీ గాసిప్స్
Chiranjeevi-151-Movie-director-confirmed? చిరంజీవి 150 సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకొంటున్న సంగతి విధితమే.. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమని రామ్ చరణ్ కొణిదెల బ్యానర్ పై నిర్మిస్తున్నారు.. కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది... మెగా స్టార్ రీ ఎంట్రీ గ్రాండ్ ఉండాలని.. సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసే సన్నాహాల్లో ఉన్నారు.. కాగా చిరు నెక్స్ట్ సినిమా కు సబంధించిన చర్చలు కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది.. చిరు 151 సినిమాను నిర్మించాలని చాలా మంది నిర్మాతలు భావిస్తోండగా... చిరు మాత్రం మెగా ఫ్యామిలీకి చెందిన గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నటించేందుకు ఆసక్తిని చూపిస్తున్నారట... ఈ సినిమా సన్నాహాల్లో ఇప్పటికే అల్లు అరవింద్ మునిగినట్లు తెలుస్తోంది.. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై సరైనోడు వంటి హిట్ ఇచ్చిన బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.. ఇప్పటికే బోయపాటి శ్రీను ఓ కథను చిరంజీవి కి వినిపించగా.. కథను ఒకే చేసి.. చిరు మార్పులు చూచించినట్లు.. దానికి అనుగుణంగా స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తిచేసే యోచనలో బోయపాటి ఉన్నట్లు ఓ వార్త... మరి ఈ వార్తలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

VV-Vinayak-Reveals-Dialogue-from-Khaidi-No-150 దాదాపు ఎనిమిది ఏళ్ల తర్వాత పూర్తి స్థాయిలో వెండితెరపై సందడి చేయడానికి మెగా స్టార్ చిరంజీవి రెడీ అవుతున్నాడు. వివి వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. కత్తి రీమేక్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా లోని "పొగరు నా ఒంట్లో ఉంటది... హీరోయిజం నా ఇంట్లో ఉంటది" అనే డైలాగ్ ను వినాయక్ ఇటీవల చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా జరిగిన ఫంక్షన్ లో చెప్పారు. అంతేకాదు ప్రేక్షకులను అలరించే ఇటువంటి డైలాగ్స్ ఇంకా ఈ సినిమాలో ఉంటాయని తెలుస్తోంది.. ఈ సినిమాకు వినాయక్ మాస్ టచ్ కనుక సరైన విధంగా టచ్ అయితే.. ఇంద్ర రేంజ్ లో హిట్ అవుతుంది అని అంటున్నారు. మెగా స్టార్ చిరంజీవి హీరోయిజం వెండి తెరపై చూసి చాలా కాలం అయింది కనుక ఓ పెనింగ్ కలెక్షన్లు అదిరిపోతాయని అంటున్నారు...
charan-and-merlapaka-gandhi-movie-as-mega-express తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నంత సెంటి మెంట్స్ మరెవరికి ఉండవేమో..! ఒక హిట్ టైటిల్ తో సినిమా హిట్ అయితే.. వెంటవెంటనే అదే హిట్ టైటిల్ ను బేస్ చేసుకొని సినిమాలు దింపేస్తారు.. లేదా ఒక హిట్ సాంగ్ పల్లవి ని మూవీ టైటిల్ గా పెట్టేస్తారు.. కాగా ఇటీవల టాలీవుడ్ లో ఎక్స్ ప్రెస్ లు దూసుకొస్తున్నాయి.. విశాఖ ఎక్స్ ప్రెస్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా.. మేర్ల పాక్ గాంధీ తీసిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో దూసుకొచ్చాడు.. ఇండస్ట్రీ చూపు తన వైపు తిప్పుకొన్నాడు.. నెక్స్ట్ సంక్రాంతికి ఎక్స్ ప్రెస్ రాజాగా సందడి చేశాడు.. కాగా ఇప్పుడు మెగా హీరో రామ్ చరణ్ తో మరో సారి ఎక్స్ ప్రెస్ గా రానున్నాడు. చరణ్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి తో ధృవ సినిమా చేస్తున్నాడు.. వెంటనే సుకుమార్ తో సినిమాను పట్టలేక్కించే యోచనలో ఉన్నాడు.. అనంతరం మేర్లపాక గాంధీతో సినిమా చేస్తాడనే టాక్ ఫిల్మ్ నగర్ లో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా కోసం స్క్రిప్ట్ ను రెడీ చేసే పనిలో గాంధీ ఉన్నదట.. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందే ఈ సినిమాకు "మెగా ఎక్స్ ప్రెస్" అనే టైటిల్ ను పెట్టనున్నట్లు సమాచారం... కాగా మెగా వారసుడిగా మెగా భజన చేయాల్సిన అవసరం చరణ్ కు లేదుకనుక ఈ టైటిల్ కు చెర్రీ అంగీకరిస్తాడా అని అంటున్నారు..
Vangaveeti-Shoot-In-Krishna-Pushkaralu
వివాదాల వర్మ వంగవీటి మోహనరంగ జీవిత కథను తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించి చాలా కాలం అయ్యింది. ప్రకటన అనంతరం అంతే వేగంగా ఫస్ట్‌లుక్‌ విడుదల చేసిన వర్మ ఆ తర్వాత సినిమా గురించి ఒక్క వార్త కూడా బైటికి రానివ్వడం లేదు. దీంతో ఆ సినిమాను వర్మ అటకెక్కించాడని అంతా అనుకుంటున్నారు. కానీ వర్మ మాత్రం సైలెంట్ గా సినిమా షూటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే కృష్ణా పుష్కరాలను వర్మ తన టీంతో షూట్‌ చేయిస్తున్నాడట! ఇక రంగాది విజయవాడ కాబట్టి పుష్కరాలకు ఆయన జీవిత కథకు ఏదో సంబంధం ఉంటుందని, అందుకే వర్మ అక్కడ షూట్ చేస్తున్నాడని ఫిల్మ్ నగర్ జనాలు అనుకుంటున్నారు. ఇది నిజమో కాదో తెలియాలి అంటే మాత్రం వర్మ మరో ట్వీట్ చేసి చెప్పాల్సిందే తప్ప ఎవరికీ తెలియడం లేదు. 
sharwanand-hike-his-remuneration దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి.. నటీనటులు డిమాండ్ ఉన్నప్పుడే కోట్లు సంపాదించుకోవాలి. యంగ్ హీరో కూడా తన రెమ్యూనరేషన్ ను పెంచేశాడు.. వరస విజయాల మీద జోరుగా ఉన్న శర్వానంద్ ఇదివరకు కోటి రూపాయల వరకూ రెమ్యునరేషన్ తీసుకొనే వాడు. కాగా శర్వానంద్ తాజా సినిమా ను కొత్త దర్శకుడు చంద్ర మోహన్ అనే దర్శకుడితో చేస్తున్నాడు.. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి గాను క్యాష్ రూపంలో కోటి రూపాయలను తీసుకొని.. అదనంగా ఓవర్సీస్ రైట్స్ ను కూడా తీసుకున్నాడు. ఈ సినిమా రైట్స్ ను ఓవర్సీస్ లో 1.6కోట్లకు అమ్మేసినట్లు సమాచారం. దీంతో ఇప్పుడు శర్వానంద్ రెమ్యునరేషన్ 2.6 కోట్లు అయ్యింది. ఈ సినిమాలో అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి మొదటిసారిగా శర్వానంద్ తో జోడీ కట్టింది.. ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలో దింపేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు.
manchu-lakshmi-shocking-comments-on-tollywood మంచు లక్ష్మీ ప్రసన్న మల్టీ టాలెంటెడ్ పర్సన్. మంచి నటి అనే సంగతి విధితమే.. కాగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తన టాలెంటును గుర్తించడం లేదని.. సరిగ్గా వాడుకోవడం లేదని వెల్లడించింది. అన్నీ భాషల్లో విభిన్న నేపద్య కథ.. ప్రయోగాత్మక సినిమాలు వస్తున్నాయి కానే... తెలుగులో మాత్రం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. అందుకనే తాను.. సినిమాల కంటే బుల్లి తెరకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నానని చెప్పింది. అనగనగా ఓ ధీరుడు, దొంగాట, గుండెల్లో గోదారి వంటి వైవిధ్యమైన సినిమాల్లో నటించినా సినిమాల్లో తగినంత గుర్తింపు రాలేదు..  కానీ బుల్లి తెరపై షోల ద్వారా ఎక్కువ పేరు వచ్చింది అని తెలిపింది. అంతేకాదు తన తాజా షో.. మేము సైతం కు కూడా మంచి స్పందన వచ్చింది. ఈ షోకి అతిధులుగా హాజరైన వారు కూడా చాలా సంతోష పడుతున్నారు.. తాము కూడా ఓ మంచి పనిలో భాగమయ్యామని తృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అని లక్ష్మి చెప్పింది,...

10th తర్వాత హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు జాయిన్ అవ్వొచ్చా?ఇంటర్, +2 తర్వాత మేనేజ్‌మెంట్ హోటల్ మేనేజ్‌మెంట్ చేస్తే భవిష్యత్ ఎలా ఉంటుంది?డిగ్రీ,ఇంజనీరింగ్ పూర్తయిన విద్యార్థులు మంచి భవిష్యత్ పొందడానికి సన్ ఇంటర్నేషనల్ ఎలాంటి కోర్సులు అందిస్తుంది ఆడపిల్లలు టూరిజం హోటల్ మేనేజ్‌మెంట్ ఎంచుకుంటే భవిష్యత్‌లో ఎలా రాణిస్తారు?సన్ ఇంటర్నేషనల్ ఛైర్మన్ చాస్తి శ్రీకాంత్ సమాధానాలు

TS-ICET-2016-Counselling-starts-today TS ICET కౌన్సెలింగ్‌ ఇవ్వాల్టి నుంచి ప్రారంభం కానుంది. తెలంగాణవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 16 హెల్ప్‌ లైన్‌ కేంద్రాల్లో ఈ నెల 30 వరకు సర్టిఫికెట్లు పరిశీలించనున్నారు. తొలివిడత కౌన్సెలింగ్‌లో 20 వేలకు పైగా ఎంబీఏ సీట్లు, 18 వందల ఎంసీఏ సీట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెప్పారు. తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఇవ్వాల్టి నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 30 వరకు అంటే ఐదు రోజుల పాటు అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలించనున్నారు. కౌన్సెలింగ్‌ కోసం తెలంగాణవ్యాప్తంగా 16 హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశారు. తొలిరోజు ఒకటి నుంచి ర్యాంకు నుంచి 12 వేల ర్యాంకు వరకు సర్టిఫికెట్లు పరిశీలించనున్నారు. అభ్యర్థులు ప్రవేశ పరీక్ష రాసినపుడు నమోదు చేసుకున్న బయోమెట్రిక్ వివరాలను కూడా పరిశీలిస్తారని అధికారులు చెప్పారు. తొలివిడత కౌన్సెలింగ్‌లో మొత్తం 20,120 ఎంబీఏ సీట్లు , 1,845 ఎంసీఏ సీట్లు అందుబాటులో ఉన్నాయి. మొదటి దశ కౌన్సెలింగ్‌లోనే మెరుగైన కాలేజీలో సీటు పొందేందుకు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఇచ్చుకోవాలని అధికారులు సూచించారు. అభ్యర్థులు తమవెంట ర్యాంకు కార్డు, హాల్‌టికెట్, ఆధార్ కార్డు, డిగ్రీ ప్రొవిజనల్, మార్కుల మెమోలు, ఇంటర్, టెన్త్ పాస్ సర్టిఫికెట్లు, టీసీ, కుల, ఆదాయ, నివాస ధ్రువ పత్రాలు, వికలాంగులైతే వైకల్య ధ్రువపత్రం, స్పోర్ట్స్, ఎన్‌సీసీ అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లు తప్పనిసరిగా తీసుకొచ్చుకోవాలన్నారు. ప్రాసెసింగ్ ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 500 రూపాయలు, ఇతర కేటగిరీల అభ్యర్థులు వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
Sri Visista Sri Visista
NRI Edition
AP News
Telangana News
Pata
Sports
Daily Specials