Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

మహానటి రివ్యూ..రంగుల ప్రపంచం లోని వాస్తవాలకు ప్రతిబింబం

review-of-mahanati
Posted: 40 Days Ago
Views: 1437   

మహానటి రివ్యూ

చిత్రం: మహానటి
నటీనటులు: కీర్తిసురేష్‌.. దుల్కర్‌ సల్మాన్‌.. సమంత.. విజయ్‌ దేవరకొండ..మోహన్‌బాబు.. నాగచైతన్య.. ప్రకాష్‌రాజ్‌.. రాజేంద్రప్రసాద్‌.. తనికెళ్ల భరణి.. భానుప్రియ.. మాళవికా నాయర్‌.. షాలిని పాండే.. తులసి.. దివ్యవాణి..  నరేష్‌.. క్రిష్‌.. శ్రీనివాస్‌ అవసరాల.. తరుణ్‌ భాస్కర్‌ తదితరులు
నిర్మాత: స్వప్నాదత్‌.. ప్రియాంక దత్‌
దర్శకత్వం: నాగ్‌ అశ్విన్‌
బ్యానర్‌: వైజయంతీ మూవీస్‌, స్వప్న మూవీస్‌
సంగీతం: మిక్కీ జె. మేయర్‌
ఛాయాగ్రహణం: డానీ శాంచెజ్‌ లోపెజ్‌

తెలుగు తెరపై తరగని ఖ్యాతి, చెరగని సంతకం సావిత్రి.  తెలుగు సినిమా పునాదులు వేసిన అతికొద్దిమంది నటులలో సావిత్రి ముందుంటారు. అటువంటి నటి జీవితం రంగుల ప్రపంచం లోని వాస్తవాలకు ప్రతిబింబం. అలాంటి కథను ఈ తరం ముందుకు తీసుకు వచ్చాడు దర్శకుడు నాగ్ అశ్విన్. మరి ఈ వెండితెరకు వెలుగు కథలో మలుపులేంటో చూద్దాం..

కథ:
షూటింగ్ కోసం బెంగళూరు వెళ్ళిన సావిత్రి(కీర్తి సురేష్) కోమాలోకి వెళుతుంది. అక్కడ నుండి సావిత్రి  వార్తను కవర్ చేసేందుకు వెళ్ళిన మధురవాణి ( సమంత)కు సావిత్రి జీవితంలో కొత్త కోణాలు పరిచయం అవుతాయి. అందరూ గొప్ప నటిగా చూసే సావిత్రిలో అంతకు మించిన గొప్పదనం దాగుంది అని ఆమె గమనిస్తుంది. ఆమె జీవితం కు పుస్తకరూపం ఇచ్చేందుకు మధురవాణి చేసిన ప్రయత్నంలో ఆమెకు ఎదురైన సంఘటనలు ఏంటి ..? సావిత్రి కథ, మధురవాణి కథను ఎలా మలుపు తిప్పింది అనేది మిగిలిన కథ..?

కథనం:
నటిగా తనో శిఖరం కానీ వ్యక్తిగత జీవితంలో ఆమెగురించి తెలిసిన వాటిలో కథలు, కల్పనలు చాలా ఉంటాయి.  కానీ మహానటి సినిమా చూసిన ప్రేక్షకులకు మాత్రం సావిత్రి గొప్ప నటే కాదు, అంతకంటే గొప్ప మనిషి గా కనిపిస్తుంది. తెరముందు, తెర వెనుక కూడా ఆమె గొప్పగానే కనిపించింది. ఆడుతూ పాడుతూ తిరగే వయస్సు నుండి కోమాలో పడిన సందర్భం వరకూ ఆమె ఎప్పుడూ ఓటమిని అంగీకరించలేదు.. చేతకాదు అంటే ఒప్పుకోలేదు అదే సావిత్రి జీవితం గుర్తు చేసే పాటం. కీర్తి సురేష్ సావిత్రి పాత్రకోసమే పుట్టిందా అనేంతగా ఆకట్టుకుంది. చిలిపిదనం, అమాకత్వం, మొండితనం.. ఎప్పుడూ కనిపించే అమ్మదనం ఇలాంటి లక్షణాలను అణువణువూ ఆవాహనం చేసుకోని తెలిసిన పాత్రలోకి వెళ్ళి మెప్పించింది.  జెమినీ గణేశన్‌గా దుల్కర్‌ సల్మాన్‌ చాలా బాగా నటించారు. జెమినీ గణేషన్  శైలిలోనే దుల్కర్‌ హావభావాలు ఉన్నాయి . అయితే ఈ పాత్ర గురించి  చాలా మంది నెగేటివ్ గా రోల్  అనుకున్న  దర్శకుడు  మాత్రం  ఆ పాత్రను అలా  చూపించలేదు.   చివరికి వచ్చే సరికి పరిస్థితులే విలన్‌ అన్నట్లు చూపించాడు.  కె.వి. చౌదరి పాత్రలో రాజేంద్ర ప్రసాద్  ఆద్యంతం ఆకట్టుకున్నాడు.  కాసేపు మహానటి చూస్తున్న ప్రేక్షకుల పెదవులు మీదకు చిరునవ్వులు మెరిసాయంటే అది నటికిరీటి నటనతోనే.  పసిపిల్ల మనస్తత్వం నుండి ‘నేను కెమెరా లేకుండా నటించేంత మహానటి ని’ కాదు అనేంత వరకూ ఎదిగిన మహానటి జీవితంలో మలుపులను సులువుగా తెరమీదకు తీసుకు వచ్చింది కీర్తి సురేష్. సావిత్రి నటించిన మరిచిపోలేని సన్నివేశాలను బ్లాక్ అండ్ వైట్ లో చూపించాడు దర్శకడు అందులో కీర్తి సురష్ అభినయం సావిత్రిని కళ్ళముందు కదిలేలా చేసింది ముఖ్యంగా ‘ అహానా పెళ్ళంట పాటలో కీర్తి సురేష్ ఇచ్చిన హావ భావాలు మహానటితో పొల్చతగ్గ నటి అనిపించాయి.  తన ప్రేమలో ఎంత స్వచ్ఛంగా ఉందో జరిగన మోసం లో అంతలా కుమలిపోయింది.  జీవితంలో ప్రేమ ఒక భాగం అనుకోలేదు.. జీవితం ప్రేమను వేరుగా చూడలేదు.. అందుకే మైకంలో మునిగిపోయింది. ఆ సన్నివేశంలో కీర్తి సురేష్ , దుల్కర్ సల్మాన్ లమద్య వచ్చే మాటలు చాలా బాగున్నాయి. ఒక జీవిత చరిత్రను తెరమీదకు తీసుకు వస్తున్నప్పుడు ఆ కథను ఎలా చెప్పాలి అనే విషయంలో నాగ్ అశ్విన్ గొప్ప ప్రతిభ చూపించాడు. ఆ కథను అన్వేషించే మధువాణి, విజయ్ పాత్రలను సృష్టించాడు. ఆ పాత్రల మద్య ప్రేమ అందులో వారు సాధించే విజయం ను వారు అన్వేషించే కథకు లింక్ చేసాడు. అందుకే రెండు కథలు ప్రేక్షకులకు కనిపించాయి. ఒకటి సావిత్రి కథ, మరొకటి మధురవాణి కథ. మధురవాణి భావోద్వేగాలతో ప్రేక్షకులు ప్రయాణం మొదలవుతుంది. క్లైమాక్స్ కి వచ్చేసరికి ప్రేక్షకుడిమనసులోని మాటలు సమంతనోట వింటునట్లు అనిపిస్తుంది. కథను  ప్రేక్షకులతో లింక్ చేయడంలోదర్శకుడు చూపిన ప్రతిభ అక్కడ ఆశ్చర్య పరుస్తుంది.  రంగస్థలం నుండి నటిగా మరో దారిలో ప్రయాణం మొదలు పెట్టిన సమంతకు మధురవాణి పాత్ర మరింత గౌరవాన్ని పెంచింది. విజయ్ దేవరకొండ కూడా పాత్ర గా మారాడు. గత  సినిమాల తాలూకు ప్రభావాలు కనిపించకుండా ఆపాత్ర పరిధిలో నటించాడు. ఇక కె.వి. రెడ్డిగా క్రిష్, చక్రపాణి గా ప్రకాష్ రాజ్,  యస్.వి.ఆర్ గా మోహన్ బాబు ఆ పాత్రల గౌరవాన్ని కాపాడారు. 1956 నుండి సావిత్రి చనిపోయే వరకూ బ్యాక్ డ్రాప్ లను క్రియేట్ చేయడంలో ఆర్ట్ డిపార్ట్ మెంట్ పనితనం గొప్పగా కనిపించింది. అలాగే సావిత్రి పాత్ర లోకి కీర్తి సురేష్ ని ప్రవేశ పెట్టింది మేకప్ డిపార్ట్ మెంట్ అనడంలో సందేహం లేదు. తాగుడుకు బానిస అయిన సావిత్రిలా కీర్తి సురేష్ ని తయారు చేయడంలో వారు అద్బుతమైన ప్రతిభ చూపారు. ఒక్కోసారి సావిత్రి నటించింది అనిపించింది.  గొప్పతనం డబ్బులో కనపడదు.. గుణంలో కనపడుతుంది. తనను మోసం చేసిన వారిని కూడా నవ్వుతూ పలకరించగల గల గొప్ప మనసు కు చెయ్యెత్తి నమస్కరించాలని పించింది. ఆ సంఘటనలను ఎవరో చెబితే విన్నాం.. ఎక్కడో చదివాం. .కానీ కళ్ళముందు కనబడుతుంటే మాత్రం కళ్ళు చమర్చక మానవు. ఆ సన్నివేశంలో కీర్తి సురేష్ కనిపించదు అంతలా సావిత్రి లా మారిపోయింది. ఇలాంటి ప్రయత్నం చేసి ఆ కథను తెరమీదకు ఎక్కించడంలో దర్శకుడు నాగ్ అశ్విన్ విజయం సాధించాడు.


చివరిగా:
నటన కోసం మాహానటి, మహానటి కోసం కీర్తి సురేష్


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials