Live News Now
  • స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మండల రెవెన్యూ కార్యాలయాల్లోనే...
  • మిషన్‌ 2019కి ప్రాంతీయ పార్టీలు సిద్ధం
  • బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌కు చంద్రబాబు సారధ్యం
  • నేడు తెలంగాణ టీడీపీ మహానాడు.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు
  • తూత్తుకుడి హింసలో పెరుగుతున్న మృతులు
  • తూత్తుకుడిలో కాల్పులపై ఫైరవుతున్న పొలిటికల్‌ పార్టీలు
  • పగలు భానుడి భగభగలు.. సాయంత్రం వానలు
  • తెలుగు రాష్ట్రాల్లో ప్రాణాలు తీస్తున్న పిడుగులు
  • రాజస్థాన్‌ను ఇంటికి పంపిన నైట్‌ రైడర్స్‌
  • సన్‌ రైజర్స్‌తో క్వాలిఫయర్‌ 2కి నైట్‌ రైడర్స్‌ రెడీ
ScrollLogo రైతుకు పెట్టుబడి సాయం చరిత్రాత్మకం.. దేశమంతా చర్చ జరుగుతుందన్న హరీష్ ScrollLogo హెచ్చరిక బోర్డులు లేకుండా బ్రిడ్జి నిర్మాణం.. ScrollLogo బైక్ పై నుంచి పడిన వ్యక్తి శరీరంలోకి ఇనుపచువ్వలు ScrollLogo కన్నడనాట ముగిసిన ఉత్కంఠ రాజకీయం... ScrollLogo బుధవారం సీఎంగా కుమారస్వామి ప్రమాణం ScrollLogo సవాళ్లను ఎదుర్కొంటా... ఐదేళ్లు పక్కాగా పాలిస్తా.. కుమారస్వామి ScrollLogo మంత్రివర్గ కూర్పుపై మథనం.. చక్రం తిప్పేందుకు దేవెగౌడ వ్యూహం.. ScrollLogo రాజధానిపై విమర్శల వల్లే పెట్టుబడులకు ఎఫెక్ట్... చంద్రబాబు ScrollLogo సన్‌రైజర్స్‌పై నైట్‌ రైడర్స్‌ గెలుపు.. ప్లే ఆఫ్‌కు చేరిన కోల్‌కతా జట్టు ScrollLogo తెలంగాణ స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొత్త శకం..

అమ్మా నాన్న సెల్ఫీ పిచ్చి.. పాపం పసిపాప బలి

baby-falls-to-death-while-mother-was-busy-taking-selfie-on-escalator
Posted: 10 Days Ago
Views: 5109   

బిడ్డకు అనారోగ్యంగా ఉందని ఆసుపత్రికి తీసుకెళ్లారు అమ్మానాన్నలు. వైద్యపరీక్షల అనంతరం పక్కనే ఉన్నషాపింగ్ మాల్‌కి వెళ్లారు. అక్కడ సరదాగా సెల్ఫీలు దిగారు. ఎస్కలేటరపై నడుస్తున్న వారిచేతిలో ఉన్న బిడ్డ జారిపడి ప్రాణాలు కోల్పోయింది. ఈ హృదయ విదారక ఘటన రాజస్థాన్‌లో జరిగింది. చేతిలో సెల్ మాట్లాడుకోవడం కంటే సెల్ఫీలు దిగడానికి బాగా పనికొస్తున్నట్లుంది. ఎక్కడ చూసినా, ఎవరు చూసినా ఇదే పని. పక్కన ఏంజరుగుతున్నా పట్టించుకోలేనంత పిచ్చిలో పడిపోతున్నారు. పిల్లలే కాదు, పెద్దలు కూడా ఇదే పని. మాములుగా పెద్ద పెద్ద మాల్స్‌, సినిమా థియేటర్స్‌లో ఉన్న ఎస్కలేటర్స్ ఎక్కాలంటే చిన్నారులు, పెద్ద వయసు వారు భయపడుతుంటారు. మరి వారిని జాగ్రత్తగా తీసుకు వెళ్లవలసిన బాధ్యత పక్కనే ఉన్న వారిపై ఉంటుంది. అయితే వారు ఒక్క క్షణం ఆదమరిచినా జరగరాని నష్టం జరిగిపోతుంటుంది ఒక్కోసారి. 

అలాంటిదే రాజస్తాన్ గంగా నగర్‌కు చెందిన భార్యా భర్తలు కూతురికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడి డాక్టర్ చెకప్ అనంతరం పక్కనే ఉన్న షాపింగ్ మాల్‌కు వెళ్లారు. వెళ్తూనే మధ్యలో సెల్ఫీలు దిగారు. మాల్‌లోని పై ఫ్లోర్‌కి వెళ్లే నిమిత్తంగా ఎస్కలేటర్ ఎక్కారు. దానిపైకి ఎక్కిన తరువాత కూడా సెల్ఫీ దిగాలని ప్రయత్నించారు. ఇంతలో అమ్మ చంకలో ఉన్న చిన్నారి అదుపు తప్పి జారిపోయింది. ఎస్కలేటర్ బెల్ట్‌పై పడిపోయింది. ఎంత కంగారు పడ్డా ఏం లాభం. పక్కనే ఉన్న ఆసుపత్రికి తరలించినా ఉపయోగం లేకుండా పోయింది. ముక్కుపచ్చలారని ఆ చిన్నారి అప్పటికే ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు నిర్ధారించారు. కళ్లముందే బిడ్డ ప్రాణాలు కోల్పోయేసరికి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials