Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

ఆ మూడు రికార్డులూ అతని పేరు మీదే...హఠాత్తుగా వీడ్కోలు పలకడంపై

south-africas-ab-de-villiers-leaves-international-cricket-as-a-king-without-a-crown-but-with-a-rich-legacy
Posted: 24 Days Ago
Views: 227   

ప్రపంచ క్రికెట్‌లో విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌గా కంటే 360 డిగ్రీస్ ప్లేయర్‌గానే గుర్తింపు తెచ్చుకున్న డివీలియర్స్ రిటైర్మెంట్‌ అభిమానులకు బాధాకరమే... క్రికెట్‌లో ఎందరు ఆటగాళ్ళున్నా... ఏబీ లాంటి ప్లేయర్‌ను ఖచ్చితంగా చూడలేమన్నది అంగీకరించాల్సిందే. బ్యాటింగ్‌కు కొత్త యాంగిల్స్ నేర్పిన ఈ సఫారీ కెరీర్‌లో గుర్తిండిపోయే కొన్ని రికార్డులు మీ కోసం...


ఏబీ డివీలియర్స్‌... ఈ పేరు చెప్పగానే అతను ఆడిన 360 డిగ్రీస్ షాట్లే అందరికీ గుర్తొస్తాయి. బౌలర్ ఎవరైనా... బంతి ఎలా వేసినా... డివీలియర్స్ షాట్ కొడితే దాని కేరాఫ్ అడ్రస్ బౌండరీనే. మోకాలిపై కూర్చుని 360 డిగ్రీస్‌లా అతను కొట్టిన షాట్లు ఎప్పటికీ ప్రత్యేకమే. క్రికెట్‌లో ఇలాంటి షాట్లు కూడా కొట్టొచ్చా అన్న చర్చకు తెరతీసిన ఏకైక ఆటగాడు డివీలియర్సే. రొటీన్‌కు భిన్నంగా 14 ఏళ్ళ పాటు అభిమానులను అలరించిన ఏబీ రిటైర్మెంట్ నిర్ణయం అందరికీ షాక్‌కు గురిచేసింది.

కెరీర్‌లో 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ ట్వంటీలు ఆడిన ఏబీ ఖాతాలో ఎన్నో అరుదైన రికార్డులున్నాయి.  ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ, ఫాస్టెస్ట్ సెంచరీ , ఫాస్టెస్ట్ 150 ఈ మూడు రికార్డులూ ఈ సఫారీ క్రికెటర్‌ పేరిటే ఉన్నాయి. ఈ మూడు రికార్డులూ కేవలం రెండు మ్యాచ్‌ల్లోనూ అది కూడా ఒకే జట్టుపై సాధించడం మరో హైలెట్‌. సొంతగడ్డపై కేవలం 31 బంతుల్లోనే శతకం సాధించాడు.

40 రోజుల తర్వాత వన్డే ప్రపంచకప్‌లో మళ్ళీ అదే విండీస్‌ జట్టుపై పరుగుల సునామీ సృష్టించాడు. కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో రికార్డు నెలకొల్పిన ఏబీ..64 బంతుల్లోనే 150 పరుగుల రికార్డునూ ఖాతాలో వేసుకున్నాడు. గొప్ప బ్యాట్స్‌మెన్‌గానే కాదు అద్భుతమైన ఫీల్టర్‌గానూ డివీలియర్స్‌ పేరు తెచ్చుకున్నాడు. తాజాగా ఐపీఎల్‌లో పక్షిలా ఎగురుతూ ఒంటి చేత్తో అతను అందుకున్న క్యాచ్ ఈ సీజన్‌కే బెస్ట్‌గా నిలిచింది.

ఇదిలా ఉంటే కెరీర్‌ అత్యుత్తమంగా ఉన్నప్పుడే ఏబీ రిటైర్మెంట్ ప్రకటించాడు. మరికొన్నాళ్ళు ఆడే సత్తా ఉన్నప్పటకీ... అలసిపోయిన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు డివీలియర్స్ చెప్పాడు. తనకు మధ్ధతుగా నిలిచిన సఫారీ క్రికెట్ బోర్డుతో పాటు అభిమానులు, కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపాడు.

ఏ ఆటగాడైనా ఎప్పుడో ఒకప్పుడు రిటైరవ్వాల్సిందే.. ఏబీ కూడా దీనికి మినహాయింపు కాదు. అయితే డివీలియర్స్ లాంటి ఆటగాడిని మళ్ళీ చూడలేం. ఏ యాంగిల్‌లోనైనా షాట్లు కొట్టగలిగే ఇలాంటి ఆటగాడు హఠాత్తుగా వీడ్కోలు పలకడం చాలామంది క్రికెట్ ఫ్యాన్స్‌కు షాకిచ్చింది. ఆఫ్ ది ఫీల్డ్‌లోనూ వివాదరహిత వ్యక్తిగా గుర్తింపున్న ఏబీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినా... ఐపీఎల్‌లో కొనసాగుతాడని అభిమానులు ఆశిస్తున్నారు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials