Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

కర్ణాటక ఓకే.. నెక్స్ట్ తెలంగాణే!

congress-plan-in-telangana
Posted: 24 Days Ago
Views: 2542   

కర్ణాటకలో బీజేపీకి అధికారం దక్కకుండా నిలువరించిన కాంగ్రెస్..  తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టింది. చాలాకాలంగా  పెండింగ్ లో ఉన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను నియమించింది   హైకమాండ్. పాత ప‌ది జిల్లాల‌కే సారథులను ప్రకటించింది. కొత్తగా ఏర్పడిన మొత్తం 31  జిల్లాల‌కు డీసీసీల‌ను నియ‌మించాల‌ని ముందుగా భావించింది. అయితే కొత్త జిల్లాల నియామ‌కాలు చేపడితే స‌మ‌స్యలు త‌లెత్తే ప్రమాదం ఉంద‌ని అధిష్టానికి నివేదించారు పీసీసీ చీఫ్ ఉత్తమ్. దీంతో ప‌ది జిల్లాలనే పరిగణలోనికి తీసుకుంది ఏఐసీసీ. 

ప్రస్తుతం డిసిసి అధ్యక్షులుగా కొనసాగుతున్నవారినే ఎక్కువగా తిరిగి నియమించింది. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ డీసీసీ గా  ఒబెదుల్లా కొత్వాల్ , న‌ల్గొండ డీసీసీగా  బూడిద భిక్షమ‌య్య గౌడ్ కు మరోసారి బాధ్యతలు కట్టబెట్టింది. వ‌రంగ‌ల్ డీసీసీ గా రాజేంద‌ర్ రెడ్డి, నిజామాబాద్ తాహెర్బిన్ అహ్మద్, మెద‌క్ డీసీసీ సునీతా ల‌క్ష్మారెడ్డిని తిరిగి నియమించింది. ఆదిలాబాద్ డీసీసీగా మ‌హేశ్వర్ రెడ్డి, క‌రీంన‌గ‌ర్ డీసీసీగా మృత్యుంజ‌యంల‌ు మళ్లీ అవకాశం దక్కించుకున్నారు. ఇక గ్రేట‌ర్ ఎన్నిక‌ల త‌రువాత స‌రిహ‌ద్దు రగడతో  స్థబ్దుగా ఉన్న హైద‌రాబాద్, రంగారెడ్డి డీసీసీలను ప్రకటించింది అధిష్టానం. హైద‌రాబాద్ డీసీసీ గా దానం నాగేంద‌ర్ స్థానంలో మాజీ ఎంపీ అంజ‌న్ కుమార్ యాద‌వ్‌ను నియమించింది. రంగారెడ్డి డీసీసీగా క్యామ‌ మ‌ల్లేశ్ మరోసారి పగ్గాలు చేపట్టనున్నారు. వ‌రంగ‌ల్ సీటీ బాధ్యతలు శ్రీ‌నివాస‌రావుకు .. క‌రీంన‌గ‌ర్ సీటీ డీసీసీ పగ్గాలు క‌ర్రా రాజ‌శేఖ‌ర్ రెడ్డికి అప్పగించింది.  నిజామాబాద్ సీటీ డీసీసీగా కేశ వేణు .. రామ‌గుండం సీటీ డీసీసీగా లింగ‌స్వామి యాద‌వ్ ల‌ను నియ‌మిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏఐసీసీ. 

మరోవైపు ఖ‌మ్మం జిల్లా నేత‌ల మ‌ద్య పంచాయితీతో ఆ జిల్లా డీసీసీ నియామ‌కాన్ని పెండింగ్ లో పెట్టింది హైకమాండ్. రేణుకా చౌద‌రీ,భ‌ట్టి విక్ర‌మార్క, పొంగులేటి సుధాక‌ర్ రెడ్డిలతో కుంతియా చర్చలు  జ‌రిగినా ఎంపిక కొలిక్కి రాలేదు. దీంతో ప్రస్తుతానికి ఖ‌మ్మం డీసీసీ నియామ‌కాన్ని ప‌క్కన‌పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials