Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

స్టేషన్‌లో ప్రేమజంట పంచాయితీ...అక్కడ నుంచి ఇంటికి వెళ్లిన 4 గంటలకే..

new-bribe-kills-in-anatapoor
Posted: 23 Days Ago
Views: 6749   

అనంతపురం జిల్లాలో పరువు హత్య జరిగింది. ప్రేమజంటను బలవంతంగా విడదీసిన అమ్మాయి బంధువులు.. చివరికి కూతుర్నే చంపేసినట్టు తెలిసి.. అబ్బాయి బంధువులు ఆందోళన

చిన్నకొండాయపల్లికి చెందిన వినోద్, లక్మీదేవి ధర్మవరంలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. మూడు సంవత్సరాలుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. రెండు నెలల క్రితం ఇంటి నుంచి పారిపోగా  తల్లిదండ్రుల నచ్చచెప్పి వాళ్లను తిరిగి తీసుకొచ్చారు. పెళ్లి చేస్తామని అమ్మాయి తల్లిదండ్రులు మాట ఇచ్చి తప్పడంతో.. పది రోజుల క్రితం మళ్ళీ పారిపోయి వీళ్లిద్దరూ వివాహం చేసుకున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు కిడ్నాప్ కేసుపెట్టడంతో  తాడిమర్రి సబ్‌ఇన్స్పెక్టర్ వేణుగోపాల్.. ప్రేమాజంటను స్టేషన్ రప్పించారు. అక్కడ పంచాయితీ చేసి 5 రోజుల తరువాత మాట్లాడదామని ఇద్దరినీ బలవంతంగా విడదీసి వారి తల్లిదండ్రులతో పంపించారు. పెళ్లి ఫొటోలు ..ఇతర ఆధారాలు తీసుకొని స్టేషన్‌లోనే పెట్టుకున్నారు. తీరా స్టేషన్ నుంచి ఇంటికి వెళ్లిన 4 గంటల తర్వాత అమ్మాయి చనిపోయిందన్న సమాచారంతో.. అబ్బాయి బంధువులు షాక్ అయ్యారు. అమ్మాయి తల్లిదండ్రులే చంపేశారని ఆరోపిస్తూ.. పీఎస్ వద్ద ఆందోళనకు దిగారు.

ప్రేమజంటను వీడదీయడమే కాకుండా అమ్మాయి చావుకు పోలీసులే కారణమయ్యారన్న కోపంతో గ్రామస్థులు ఊగిపోయారు. ఆనంతపురము జిల్లా తాడిమర్రి మండల పోలీస్ స్టేషన్‌ను రణరంగంగా మార్చేసారు. చిన్నకొందయపల్లి గ్రామస్థుల ఆగ్రహానికి స్టేషన్లో చైర్లు గాల్లోకి ఎగిరాయి. ఫర్నిచర్  ద్వంసం అయింది. భయంతో పోలీసులు.. స్టేషన్ తలుపులు వేసుకున్నా గ్రామస్థులు వాటిని సైతం పగులగొట్టారు. దాదాపు 250 మంది గ్రామస్థులు ఏకమై పోలీసుస్టేషన్ పై దాడి చేశారు.

SI వేణుగోపాల్ తమ దగ్గర రూ.20 వేలు తీసుకొని న్యాయం చేస్తానని చెప్పి, బలవంతంగా అమ్మాయిని పంపడం వల్లే లక్మి చనిపోయిందని అబ్బాయి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ గొడవ కారణంగా స్టేషన్‌లో పరిస్థితి అదుపు తప్పుతోందని భావించి, బత్తలపల్లి నుంచి అదనపు బలగాలను తాడిమర్రికి రప్పించారు. ఐతే, బత్తలపల్లి SI     బాషాను గ్రామస్థులు స్టేషన్ బయట అడ్డుకున్నారు.CI తో వాగ్వివాదానికి దిగారు. తమకు న్యాయం చేయాలంటూ ఆందోళకు దిగారు.

లక్ష్మి మరణంపై విచారణకు డిమాండ్ చేస్తున్నారు చిన్నకొందయపల్లి గ్రామస్థులు. కడుపు నొప్పితో చనిపోయిందని చెప్తున్న మాటలు అబద్దమని వాదిస్తున్నారు. చివరికి వాళ్ల ఆందోళనతో దిగొచ్చిన పోలీసులు.. అర్థరాత్రి విచారణ చేపట్టారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వస్తే తప్ప పూర్తి వివరాలు చెప్పలేమని అంటున్నారు. తాను ప్రేమించిన లక్ష్మి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఆమె చావుకు బంధువులు, ఎస్‌ఐ కారణమని అబ్బాయి వినోద్ అంటున్నాడు. ఈ పరువు హత్య కేసులో బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలంటున్నాడు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials