Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

మీరే బీజేపీకి అన్యాయం చేశారు.. కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు

njp-leaders-oppose-to-tdp
Posted: 23 Days Ago
Views: 153   

టీడీపీ టార్గెట్‌గా బీజేపీ నేతలంతా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తున్నా, తమపై  అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ధర్మ పోరాట దీక్షల్లో చిత్తశుద్ధి ఎంత ఉందో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా లక్ష్మీనారాయణ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. 2019లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని క్యాడర్‌కు పిలుపిచ్చారు. NDA అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయిన సందర్భంగా గుంటూరులో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభ  వేదికగానే కన్నా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేయలేదని, టీడీపీయే బీజేపీకి అన్యాయం చేసిందని కన్నా అన్నారు. అటు, రాంమాధవ్ కూడా విపక్ష పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో మోడీని ఎదుర్కొనే దీటైన ప్రతిపక్షమే లేదని అన్నారు. ప్రజాసేవే లక్ష్యంగా ఈ నాలుగేళ్ల పాలన సాగించామని అన్నారు. ఎన్ని ఫ్రంట్‌లు వచ్చినా బీజేపీ ముందు నిలబడలేవన్నారు రాంమాధవ్‌. ఈ ఎన్డీయే విజయోత్సవ సభకు సిద్ధార్థ్‌నాథ్‌సింగ్, జీవీఎల్, పురంధేశ్వరి సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్యనేతలు హాజరయ్యారు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials