Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

మహానాడులో పసందైన వంటకాలు..లక్షన్నర మందికి..

andhra-pradeshs-mahanadu-to-commence-today-annual-conclave-all-set-to-corner-centre
Posted: 22 Days Ago
Views: 673   

నలభీమ పాకాలు.. షడ్రషోపేత రుచులు.. సంప్రదాయ వంటకాల ఘుమఘుమలు.. టీడీపీ మహానాడులో తమ్ముళ్లకు పసందైన రుచులు కనువిందు చేయనున్నాయి.. మహానాడులో ఫుడ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. మూడు రోజుల పసుపు పండుగలో ఈసారి కూడా నోరూరించే వంటకాలు సిద్ధమవుతున్నాయి..

ఇలా ఎన్నో ఘుమఘుమలు మహానాడుకు తరలివచ్చే అతిథులకు నోరూరించనున్నాయి..నేటి నుంచి మూడు రోజులపాటు జరిగే టీడీపీ మహానాడుకు వేల సంఖ్యలో ప్రతినిధులు వస్తున్న నేపథ్యంలో.. వారందరికీ ప్రత్యేకంగా భోజనాల కోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఉదయం అల్పాహారం మొదలు, మధ్యాహ్నం, రాత్రి పంచభక్ష్య పరమాన్నాలతో భోజనాలు, సాయంత్రం స్నాక్స్‌ వరకు ఎన్నో రుచులు పసందు చేయనున్నాయి. రోజూ పాతికవేల మందికి అల్పాహారం అందించనున్నారు. మూడు రోజుల్లో మొత్తం లక్షన్నర మందికి భోజనాల ఏర్పాట్లు చేస్తున్నారు. మహానాడు జరిగే సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కాలేజీ ఆవరణలో వంటలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన సంప్రదాయ వంటలు, స్వీట్స్‌ను ప్రత్యేకంగా వడ్డించనున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం నుంచి పూతరేకులు, తాపేశ్వరం నుంచి కాజాలు ప్రత్యేకంగా తెప్పించారు. మొత్తం 400 మంది నిపుణులు వంటల్లో బిజీ అయిపోయారు. ఒకేసారి వెయ్యిమంది కూర్చుని భోజనం చేసేలా ఏర్పాట్లు చేశారు. ఇదే సమయంలో మిగిలిన వారికి బఫే పద్ధతిలో భోజనాలు అందించనున్నారు. మూడు రోజుల్లో మొత్తం 15 టన్నుల బియ్యం, 5 టన్నుల కందిపప్పు వాడనున్నారు. సోమవారం ఎన్టీఆర్‌ జయంతి నేపథ్యంలో.. ఆయనకు ఇష్టమైన ప్రత్యేక వంటకాల్ని అతిథులకు వడ్డించనున్నారు. పాలతాలికలు, బాదం బర్ఫీ, బొబ్బట్లు, చక్కెర పొంగలి వంటివి వడ్డిస్తారు.

మూడు రోజుల్లో అల్పాహారంలో, భోజనాల్లో వడ్డించే వంటల్లో పూర్ణాలు, మద్రాసు పకోడీ, కొబ్బరి అన్నం, మామిడికాయ పప్పు, దొండకాయ వేపుడు, గుత్తి వంకాయ, బీరకాయ రోటిపచ్చడి, సేమ్యా కేసరి, మిర్చి బజ్జీలు, గారెలు, పునుగులు, ఇడ్లీలు, మైసూరు బోండాలు, గులాబ్‌జాంలు, మసాలా వడలు, చింతపండు పులిహోర, గుమ్మడికాయ కూర, వంకాయ బఠానీ కూర, బెండకాయ కొబ్బరి వేపుడు, వంటి అనేక రకాలున్నాయి.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials