Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

కిరీటం ఎవరిదో.. ఫిక్సింగ్‌తో మసకబారిన..

southern-spice-grips-mumbai-as-csk-face-srh-in-pressure-cooker-battle
Posted: 22 Days Ago
Views: 1000   

ఐపీఎల్‌ పదకొండో సీజన్‌ ఫైనల్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. మూడో సారి టైటిల్ గెలిచేందుకు చెన్నై సూపర్‌కింగ్స్ , సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉవ్విళ్ళూరుతున్నాయి. రికార్డుల పరంగా ధోనీసేనదే పైచేయిగా కనిపిస్తున్నా... బౌలింగ్‌ బలంతో అదరగొడుతోన్న హైదరాబాద్‌ను తక్కువ అంచనా వేయలేం.  ఫిక్సింగ్‌తో మసకబారిన చరిత్రకు ప్రాణం పోయాలన్న ఆలోచన చెన్నైది.. రెండో టైటిల్ గెలిచి మరోసారి సత్తా చాటాలన్న  కోరిక సన్‌రైజర్స్‌ది.ఈ నేపథ్యంలో వాంఖేడే స్టేడియం వేదికగా హోరాహోరీ టైటిల్ పోరు ఖాయంగా కనిపిస్తోంది.

దాదాపు 50 రోజులుగా అభిమానులను అలరిస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదకొండో సీజన్‌ తుది అంకానికి చేరుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన లీగ్ స్టేజ్‌ , ప్లే ఆఫ్స్‌ ముగిసిపోగా... ఇప్పుడు టైటిల్ పోరుకు కౌంట్‌డౌన్ మొదలైంది. ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్‌ టీమ్స్‌లో ఒకటైన చెన్నై సూపర్‌కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఫైనల్లో తలపడబోతోంది.

టీ ట్వంటీ ఫార్మేట్‌లో ఎవరినీ ఫేవరెట్‌గా చెప్పలేకున్నా... ఈ ఫైనల్లో మాత్రం చెన్నై సూపర్‌కింగ్స్‌కే ఎడ్జ్‌ కనిపిస్తోంది. గత రికార్డులు, అనుభవుజ్ఞులైన ఆటగాళ్ళు , అన్నింటికీ మించి ధోనీ కెప్టెన్సీ ఆ జట్టుకు ప్రధాన బలంగా చెప్పొచ్చు.ఈ సీజన్‌లో తలపడిన మూడుసార్లూ చెన్నైదే పైచేయిగా నిలిచింది. తొలి క్వాలిఫైయిర్‌లో ఇరు జట్ల పోరాటంతో మ్యాచ్‌ ఉత్కంఠతో ఊపేసింది. బౌలింగ్‌ బలంతో చెన్నైని దాదాపు దెబ్బతీసిన సన్‌రైజర్స్‌ డుప్లెసిస్ ఇన్నింగ్స్ కారణంగా గెలుపును అందుకోలేకపోయింది.

రెండేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన చెన్నై సూపర్‌కింగ్స్ ఆరంభం నుంచీ అంచనాలకు తగ్గట్టే రాణించింది. అన్ని విభాగాల్లోనూ సీనియర్ ఆటగాళ్ళు సమిష్టిగా రాణించడంతో సునాయాసంగానే ఫైనల్‌ చేరింది. అయితే ఈ సీజన్‌లో చెన్నైకి చెమటలు పట్టించిన టీమ్ మాత్రం సన్‌రైజర్సే. మూడు మ్యాచ్‌లలో రెండు సార్లు చివరి బంతి వరకూ ఫలితం తేలలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

మరోవైపు ఈ సీజన్‌లోనూ తిరుగులేని బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది పోరులో తమ జోరు కొనసాగించాలని పట్టుదలగా ఉంది. వ్యక్తిగతంగానూ, కెప్టెన్‌గానూ జట్టును సమర్థవంతంగా నడిపిస్తోన్న విలియమ్సన్ టైటిల్ విజయంతో సీజన్‌ను ఘనంగా ముగించాలని భావిస్తున్నాడు. తొలి క్వాలిఫైయిర్‌లో చెన్నైపై ఓడినప్పటకీ... రెండో క్వాలిపైయిర్‌లో కోల్‌కతాను నిలువరించి ఫైనల్‌కు దూసుకొచ్చింది. బ్యాటింగ్‌లో ధావన్, విలియమ్సన్ సత్తా చాటుతుంటే... బౌలర్లు సమిష్టిగా రాణిస్తున్నారు. ముఖ్యంగా స్పిన్నర్ రషీద్‌ఖాన్‌ ఒంటిచేత్తో మ్యాచ్‌లను మలుపు తిప్పుతూ జట్టు విజయాలకు చిరునామాగా మారిపోయాడు. టైటిల్ పోరులోనూ రషీద్‌పై భారీ అంచనాలున్నాయి. కాగా ఇరు జట్లలోనూ స్టార్ ప్లేయర్స్‌కు కొదవ లేకపోవడంతో ఈ ఫైనల్‌ చివరి బంతి వరకూ హైటెన్షన్‌గా సాగడం ఖాయమని విశ్లేషకుల అంచనా.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials