Live News Now
  • బాహుబలులు మాకు అవసరం లేదు.. మోడినే మాకు బ్రహ్మాస్త్రం.. లక్ష్మణ్
  • చెన్నై: రజనీకాంత్ శ్రీలంక పర్యటన రద్దు.. వచ్చే నెల 9న శ్రీలంక వెళ్లాల్సిన రజనీ
  • తమిళుల నుంచి వ్యతిరేకత రావడంతో పర్యటన రద్దు చేసుకున్న రజనీకాంత్..
  • ఢిల్లీ: ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు ఇక్కట్లు..జైట్లీ వేసిన పరువు నష్టం దావా కేసులో దర్యాప్తుకు కోర్టు ఆదేశం
  • హైదరాబాద్: ఏప్రిల్ 21న హైదరాబాద్ లో టిఆర్ఎస్ ప్లీనరీ.. అదే రోజు టిఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నిక
  • ఏప్రిల్ 27న వరంగల్ లో భారీ బహిరంగ సభ.. ఏప్రిల్ 6లోపు సభ్యత్వ నమోదు..
  • గ్రామ కమిటీల ఏర్పాటును పూర్తిచేయాలన్న కెసిఆర్
  • విశాఖలో పాతనోట్ల మార్పిడి ముఠా అరెస్ట్.. రు.కోటి 20 లక్షలు స్వాధీనం..
  • విజయవాడ: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాం.. హోంమంత్రి చినరాజప్ప
  • 27న వరంగల్ లో జరిగే టిఆర్ఎస్ బహిరంగసభకు శ్రమదానం చేసి విరాళాలు సేకరించాలని కెసిఆర్ ఆదేశం
ScrollLogo అమెరికాలో అనుమానాస్పదంగా మృతిచెందిన శశికళ కేసులో.. ScrollLogo భర్త,అత్త శివపార్వతి,మామ సుబ్బారావుపై శశికళ తల్లిదండ్రుల అనుమానం.. ScrollLogo అమరావతి: గాలి ముద్దుకృష్ణమ వ్యాఖ్యలను ఖండించిన రోజా... ScrollLogo గాలి ముద్దుకృష్ణమ ఇప్పటికైనా గాలిమాటలు మానుకోవాలి.. రోజా ScrollLogo హైదరాబాద్: 2019 ఎన్నికల్లోనూ తెలంగాణలో టిఆర్ఎస్ దే అధికారం.. కెటిఆర్.. ScrollLogo వచ్చే ఎన్నికలనాటికి హామీలన్నీ నెరవేరుస్తాం.. కెటిఆర్ ScrollLogo అమరావతిలో నిర్మించే ప్రభుత్వ భవనాల ప్లాన్ ను అందించిన నార్మన్ ఫోస్టర్ కంపెనీ.. ScrollLogo ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలకు ప్లాన్ ను వివరించిన కంపెనీ ప్రతినిధులు.. ScrollLogo అమరావతి: దేశంలో అనేక రాష్ట్రాలు ఏర్పడ్డా ఇంత హంగామా ఎవరూ చేయలేదు.. బిజెపి ఎమ్మెల్సీ సోమువీర్రాజు ScrollLogo హైదరాబాద్: ఎన్నికలకు ఆరునెలల ముందే బిజెపి అభ్యర్దులను ప్రకటిస్తాం.. రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
Tollywood/Bollywood

రివ్యూ : యాక్షన్ థ్రిల్లర్ ధృవ

dhruva-movie-review
Posted: 107 Days Ago
Views: 7880   

రివ్యూ    : ధృవ

బ్యానర్ : గీతా ఆర్ట్స్ బ్యానర్
తారాగణం: రామ్ చరణ్, అరవింద్ స్వామి, రకుల్ ప్రీతి సింగ్, నవదీప్, పోసాని కృష్ణ మురళి,  తదితరులు
సంగీతం : హిప్ అప్
ఛాయాగ్రహణం: పియస్ వినోద్
నిర్మాతలు: అల్లు అరవింద్, ఎన్ వి ప్రసాద్
దర్శకత్వం: సురేందర్ రెడ్డి

తమిళ ఇండస్ట్రీని ఒక కుదుపు కుదిపిన సినిమా తని ఒరువన్. ఎమాత్రం అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ గతేడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాదు తమిళ టాప్ టెన్ మూవీస్ లో చోటు సంపాదించుకుంది. ఇంత సక్సెస్ ని సొంతం చేసుకున్న ఈమూవీ రీమేక్ అంటే ఒరిజనల్ ని జిరాక్స్ చేసినంత తేలిక కాదు. అందుకే ధృవ టీం కూడా ఆ సక్సెస్ ని గౌరవించింది. మరి రాంచరణ్ మేకోవర్ తో మరింత అంచనాలను సొంత చేసుకున్న ధృవ రేంజ్ ఎంటో చూద్దాం..

కథ:
ధృవ (రాంచరణ్) ఐపియస్ ట్రైనింగ్ లో ఉండగానే తన బ్యాచ్ మేట్స్ తో కలసి సొసైటిలో జరుగుతున్న నేరాలను అరికడుతుంటాడు. ఒక చైన్ స్నాచింగ్ గ్యాంగ్ ని పట్టుకున్న ధృవ కి ఈ గ్యాంగ్ వెనక పెద్ద ఆర్గనైజడ్ క్రైమ్ ఉందని అర్ధం అవుతుంది. ఐపియస్ ట్రైనింగ్ అయిన తర్వాత ఈ వైట్ కాలర్ నేరాలపై దృష్టిపెడతాడు. తను అంత చేయాలనుకొని ఎంచుకున్న శక్తి సిద్దార్ద అభిమన్యు(అరవింద్ స్వామి), పద్మశ్రీ పురస్కారం అందుకున్న ఈ సైంటిస్ట్  పెద్ద మెడికల్ మాఫియా నడుపుతున్నాడని తెలుసుకుంటాడు. తన గ్యాంగ్ ని గుర్తించి సిద్దార్ధ చెక్ పెట్టేలోపు తన ప్లాన్స్ అన్నీ రివర్స్ అవుతుంటాయి. తన బ్యాచ్ లోని ఆత్మీయులు చనిపోతుంటారు. తను ఎంతో రీసెర్చ్ చేసి సేకరించిన సాక్షాలు కళ్లముందే దూరం అవుతుంటాయి. మరి సిద్దార్ధ అభిమన్యు తో ధృవ ఆడుతున్న ఆటలో గెలుపెవరిది అనేది మిగిలిన కథ..?

కథనం:
హిట్ అయిన ప్రతి మూవీకి ఒక సోల్ ఉంటుంది. ఆ సోల్ ని అర్దంచేసుకోకపోతే సక్సెస్ మిస్ అవుతుందని చాలా హిట్ సినిమాలు తెలుగు లో ప్లాఫ్ అయి నిరూపించాయి. ధృవలో ఒరిజనల్ సినిమాలోని సోల్ ని ఒడిసి పట్టుకోవడంలో మొత్తం టీం సక్సస్ అయ్యింది. రాంచరణ్ లుక్స్ తో మొదటి ఇంప్రెషన్ సినిమా పై కల్గించాడు. ధృవ టైటిల్ సాంగ్ లో చరణ్ వర్క్ అవుట్స్ సూపర్బ్ అనిపించాయి. కనిపించే ప్రతి చిన్న క్రైమ్ వెనుక జాగ్రత్తగా వెతికితే ఒక ఆర్గనైజన్ క్రైమ్ ఉంటుంది. దాని వెనక బలమైన వ్యక్తులు పనిచేస్తుంటారు.. అనే పాయింట్ నుండి పుట్టిన ధృవ కథనం కూడా అంతే ఇంప్రెసివ్ గా సాగింది. ఇద్దరు ఇంటెలిజెంట్స్ మద్య నడిచే మైండ్ గేమ్ చాలా ఆసక్తి కరంగా సాగింది. ఒక వ్యక్తి తన మేథస్సును తన స్వార్ధం కోసం ఉపయోగిచడం మొదలెడతాడే అక్కడే సమాజం లో జరిగే దారుణాలకు మొదటి అడుగు పడుతుంది. ఆ ఆడుగులు పరుగుగా మారితే ఆ వ్యక్తి ఒక శక్తిగా ఎదిగితే, క్రైమ్ వరల్డ్ ని బేస్ చేసుకొని ఒక ఫార్మా సామ్రాజ్యాన్ని నిర్మిస్తే..ఆ వ్యక్తి ఎలా ఉంటాడు.. అరవింద్ స్వామి కంటే మరో నటుడ్ని ఈ పాత్రలో ఊహించడం కష్టం.. అంత బాగా యాప్ట్ అయ్యాడు అరవింద్ స్వామి. యూత్ ని ఆకట్టుకొని... ఫ్యామిలీ ఆడియన్స్ లో చెరగని ముద్రని వేసి కొంత కాలం గ్యాప్ లో ఉన్న అరవింద్ ఫినిక్స్ లా దూసుకొచ్చాడు. జగపతి కెరియర్ తో పోల్చతగ్గ కెరియర్ అరవింద్ స్వామిది. తన పాత్రలోని గ్రేస్ ని మరోసారి రిపీట్ చేసి ఆడియన్స్ కి ఒక కొత్త అనుభూతిని మిగిల్చాడు. క్రూయల్ గా అనిపించే సన్నివేశాలను సైతం అరవింద్ స్టైల్ గా మలిచాడు. ముఖ్యంగా హాస్పటల్ లో చరణ్ ని చూసి వెళ్లే సన్నివేశం లో అరవింద్ ని యాంటీ హీరో అని మరచిపోతాం. అమాయకపు తండ్రి గా పోసాని మరోసారి ఆకట్టుకున్నాడు. అరవింద్ స్వామి, పోసాని మద్య సీన్స్ లో హ్యుమర్ పండింది. ఇక రాంచరణ్ టఫ్ అండ్ ఇంటిలిజెంట్ అధికారిగా ఇంప్రెసివ్ నటనను కనబరిచాడు. కమర్షియల్ పోలీస్ కుండే లౌడ్ సన్నివేశాలు లేకపోయినా చరణ్ అంతకు మించి అగ్రెసివ్ గా ఈ మూవీ లో కనపడ్డాడు. అరవింద్ స్వామిని తను ఆధీనంలోకి తీసుకున్నాక వచ్చే ప్రతి సన్నివేశం చాలా ఆసక్తిగా మారింది. హీరో క్యారెక్టర్ ని వార్తల మద్య సంబంధాలను ముఖ్యంగా ఒక బిజినెస్ న్యూస్ మిగతా అన్ని న్యూస్ లను ఇన్ ప్లూయన్స్ చేస్తుందనే రీజనింగ్ ఇచ్చే సన్నివేశం చాలా బాగుంది. ఇద్దరు బలమైన వ్యక్తుల మద్య జరిగే మైండ్ గేమ్ ని మరింత ఇంట్రెస్టెగా నడిపాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. ఎక్కడా కూడా ఏదో కొత్తగా చూపించాలనే కోరిక కంటే ఒరిజనల్ లోని ఫీల్ ని క్రియేట్ చేయాలనే తపనే టీం లో ఎక్కువ కనిపించింది. రకుల్ చేసిన నిషిక పాత్ర సినిమా లో కీ రోల్ ప్లే చేసింది. తమిజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి అదనపు ఆకర్షణగా మారింది. సినిమాలో పోరాటలు తక్కువ కానీ మైండ్ గేమింగ్ ఎక్కువ .. ప్రత్యర్దిని ఎదుర్కోవడం అంటే తలపడటం కాదు.. వాడి ఆలోచనలతో పోరాడటం ఇలాంటి సన్నివేశాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదనపు బలాన్ని చేకూర్చాడు తమిజా. పాటలు కధకు దూరంగా ఉన్నాయి.. హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అండ్ చూసా...చసా.. సాంగ్ పిక్చరైజేషన్ బాగుంది... మిగిలన పాటలు కమర్షియల్ కాలుక్యులేషన్స్ కోసమే కానీ కథకు అవసరం లేదనిపించింది. నవదీప్ కీలకమైన పాత్రను పోషించాడు. ఇంట్రెవెల్ ట్విస్ట్ నుండి క్లైమాక్స్ వరకూ సినిమా గ్రిప్పింగ్ సాగుతుంది. ఎక్కడా కూడా బిగిసడలని కథనం ధృవను సక్సెస్ ట్రాక్ పై నిలిపాయి. రెగ్యులర్ హీరోయిజం కొలతలను దాటుకొని చరణ్ ధృవ తో కథను హీరోను చేసాడు, తను బలమైన పాత్రగా మారాడు. పియస్ వినోద్ సినిమాటోగ్రఫీ సినిమాకి రిచ్ లుక్ నిచ్చింది. దృవ టైటిల్ లో కనిపించే 8 అంకెకు దర్శకుడు ఇచ్చిన క్లారిటీ బాగుంది. యాంటీ హీరో క్యారెక్టర్ ని కూడా చిన్న సింపతీ టచ్ తో ముగించాడు దర్శకడు. సాధారణంగా రీమేక్ లు హిట్ అయితే ఆ క్రెడిట్ ఒరిజినల్ దర్శకునికి, ప్లాఫ్ అయితే రీమేక్ చేసిన దర్శకునికి చెందుతుంది. కానీ ఒరిజనల్ సోల్ ని మిస్ చేయకుండా అదే సక్సెస్ ని రిపీట్ చేసిన సురేందర్ రెడ్డికి రాంచరణ్ తో పాటు అతని అభిమానులు కూడా థ్యాంక్స్ చెప్పాలి.

చివరిగా:
మాసివ్ యాక్షన్ థ్రిల్లర్


Read Also
NRI Edition
AP News
Telangana News
Pata
Sports
Daily Specials