Live News Now
  • బాహుబలులు మాకు అవసరం లేదు.. మోడినే మాకు బ్రహ్మాస్త్రం.. లక్ష్మణ్
  • చెన్నై: రజనీకాంత్ శ్రీలంక పర్యటన రద్దు.. వచ్చే నెల 9న శ్రీలంక వెళ్లాల్సిన రజనీ
  • తమిళుల నుంచి వ్యతిరేకత రావడంతో పర్యటన రద్దు చేసుకున్న రజనీకాంత్..
  • ఢిల్లీ: ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు ఇక్కట్లు..జైట్లీ వేసిన పరువు నష్టం దావా కేసులో దర్యాప్తుకు కోర్టు ఆదేశం
  • హైదరాబాద్: ఏప్రిల్ 21న హైదరాబాద్ లో టిఆర్ఎస్ ప్లీనరీ.. అదే రోజు టిఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నిక
  • ఏప్రిల్ 27న వరంగల్ లో భారీ బహిరంగ సభ.. ఏప్రిల్ 6లోపు సభ్యత్వ నమోదు..
  • గ్రామ కమిటీల ఏర్పాటును పూర్తిచేయాలన్న కెసిఆర్
  • విశాఖలో పాతనోట్ల మార్పిడి ముఠా అరెస్ట్.. రు.కోటి 20 లక్షలు స్వాధీనం..
  • విజయవాడ: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాం.. హోంమంత్రి చినరాజప్ప
  • 27న వరంగల్ లో జరిగే టిఆర్ఎస్ బహిరంగసభకు శ్రమదానం చేసి విరాళాలు సేకరించాలని కెసిఆర్ ఆదేశం
ScrollLogo అమెరికాలో అనుమానాస్పదంగా మృతిచెందిన శశికళ కేసులో.. ScrollLogo భర్త,అత్త శివపార్వతి,మామ సుబ్బారావుపై శశికళ తల్లిదండ్రుల అనుమానం.. ScrollLogo అమరావతి: గాలి ముద్దుకృష్ణమ వ్యాఖ్యలను ఖండించిన రోజా... ScrollLogo గాలి ముద్దుకృష్ణమ ఇప్పటికైనా గాలిమాటలు మానుకోవాలి.. రోజా ScrollLogo హైదరాబాద్: 2019 ఎన్నికల్లోనూ తెలంగాణలో టిఆర్ఎస్ దే అధికారం.. కెటిఆర్.. ScrollLogo వచ్చే ఎన్నికలనాటికి హామీలన్నీ నెరవేరుస్తాం.. కెటిఆర్ ScrollLogo అమరావతిలో నిర్మించే ప్రభుత్వ భవనాల ప్లాన్ ను అందించిన నార్మన్ ఫోస్టర్ కంపెనీ.. ScrollLogo ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలకు ప్లాన్ ను వివరించిన కంపెనీ ప్రతినిధులు.. ScrollLogo అమరావతి: దేశంలో అనేక రాష్ట్రాలు ఏర్పడ్డా ఇంత హంగామా ఎవరూ చేయలేదు.. బిజెపి ఎమ్మెల్సీ సోమువీర్రాజు ScrollLogo హైదరాబాద్: ఎన్నికలకు ఆరునెలల ముందే బిజెపి అభ్యర్దులను ప్రకటిస్తాం.. రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
Tollywood/Bollywood

రివ్యూ: కోటీశ్వరుడు నవ్వించడంలో సక్సెస్

Naveen-chandra-starrer-'MEELO-EVARU-KOTISWARUDU'-review
Posted: 100 Days Ago
Views: 1100   

రివ్యూ:  మీలో ఎవరు కోటీశ్వరుడు

నటీనటులు: పృథ్వీ, నవీన్‌చంద్ర, సలోని, శృతి సోధి, జయప్రకాష్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి  తదితరులు 

కథ, మాటలు: నాగేంద్రకుమార్‌ వేపూరి

పాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల
ఎడిటింగ్‌: గౌతమ్‌రాజు
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎం.ఎస్‌.కుమార్‌
సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌
నిర్మాత: కె.కె.రాధామోహన్‌
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఇ.సత్తిబాబు.
రిలీజ్ డేట్ : 16 డిసెంబర్  2016

ఒక ఐడియాకి కోటిరూపాయిలంటూ సినిమా టీజర్ తో ఎట్రాక్ చేసిన సత్తిబాబు కామెడీ తో కితకితలు పెట్టడంలో దిట్ట. ఇ.వి.వి వారసుడిగా మిగిలిన సత్తిబాబు తన ఐడియాతో ప్రొడ్యూసర్ ని ఇంప్రెస్ చేసాడు. మరి అతని ఐడియాకి ప్రేక్షకులు ఇంప్రెస్ అయ్యారో లేదో చూద్దాం...

కథ:
ప్రశాంత్(నవీన్ చంద్ర) అనే సిన్సియర్ స్టూడెంట్ కి ఒక రోజు రోడ్ మీద తాగి, తూగుతూ తిరిగే ప్రియ(శృతి సోది) కనిపిస్తుంది. తనను ఇంటికి చేర్చుతాడు ప్రశాంత్. ఆ పోజీషన్ లో ఒక అమ్మాయి కనిపిస్తే సేఫ్ గా ఇంటికి చేర్చిన ప్రియ అతని ప్రవర్తన నచ్చి తనతో లవ్ లో పడుతుంది. అయితే తన ప్రేమను రిజక్ట్ చేస్తాడు ప్రశాంత్.  దానికి కారణం తన ఒక గొప్పింటి అమ్మాయి అవ్వడం..ప్రియ  తండ్రి( మురళీ ప్రసాద్) డబ్బుకి విలువ ఇచ్చే మనిషి .. ప్రశాంత్ ప్రేమకు డబ్బు కారణం అంటాడు.. కాదు నా ప్రేమను డబ్బు కారణం కాదని మీకు తెలియాలంటే మీరు ఏదైనా వ్యాపారం చేసి ఓడిపోండి.. అని ఛాలెంజ్ విసురుతాడు.. అయితే ఆ ఛాలెంజ్ ని ప్రియ ఫాదర్ ఎలా ఎదుర్కొన్నాడు.. తనేం చేసి ఓడిపోయాడు.. ప్రియ, ప్రశాంత్ ల ప్రేమ గెలిచిందా లేదా అనేది మిగిలిన కథ..?

కథనం:
ప్రేమికులకు పేరెంట్స్ పందాలు పెట్టడం కామన్ కానీ ఇందులో ప్రేమికుడే తనకు కాబోయే మామకు ఒక సవాల్ విసురుతాడు.. సంతోషానికి, ఆనందానికి తేడా ఉంటుంది.. అది తెలియాలంటే ఏదైనా వ్యాపారం చేసి నష్టపోమంటాడు. ఈ ఐడియా  చుట్టూ కథను అల్లుకున్నాడు సత్తిబాబు. పెద్ద గా మలుపులు లేని ప్రేమకథగా మొదలైన ఈ కథ లో శృతి సోది చాలా గ్లామర్ గా కనిపించింది. ప్రశాంత్ గా నవీన్ చంద్ర నటన ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇంటెర్వెల్ కి ముందు 20 నిముషాలు కథ ఫన్ ట్రాక్ పై పరుగులు తీసింది. ‘‘ ఖచ్చితంగా నష్టం వచ్చే వ్యాపారం చెప్పమంటే సినిమా తీయడం కంటే బెస్ట్ ఆప్షన్ ’’ లేదన్న పోసాని ఎంట్రీ తో సినిమా స్పీడందుకుంది. తన దైన స్పూఫ్ లతో పృధ్వీ చెలరేగిపోయాడు.  ప్లాఫ్ లు తీయడంలో దిట్ట అయిన రోల్డ్ గోల్డ్ రమేష్ క్యారెక్టర్ లో గిరిబాబు విజృంభించాడు.  సినిమా కి కథ ఉంటుంది.. కానీ సినిమా తీయడం వెనకాల ఉన్న కథ ఇంట్రెస్ట్ గా అనిపించింది. ఇక సినిమాలో  సినిమా మొదలయ్యే వరకూ నాన్ స్టాప్ నవ్వులు పండాయి. ఇంటెర్వెల్ కి ముందు హిట్ సినిమా డైలాగ్స్ తో పృధ్వీ చెలరేగిపోయాడు. స్పూఫ్ లలో తన సత్తా చాటాడు. ఇక సినిమా లో మొదలైన సినిమా ఆ నవ్వులను కంటిన్యూ చేసింది. సలోని తో పృధ్వీ చెలిరేగిపోయాడు. ‘‘నేను చదువు కోవడానికి వచ్చాడు.. కేవలం చదువకు కోవడానికి మాత్రమే వచ్చాను’’ వంటి డైలాగ్స్ తో పృధ్వీ నవ్వించాడు. ప్రతి సీన్ కి దానికి బలంగా ఒక హిట్ సాంగ్ ని వాడుకున్నాడు దర్శకుడు.. శ్రీమంతుడు నుండి‘జతకలిసే’ నంబర్ ఒన్ కుర్రాడు నుండి ‘నువ్వు చూడు చూడకపో’. గీతాంజలి నుండి ‘ ఓం నమహా’ వంటి సాంగ్స్ తో పృధ్వీ, సలోని చెలరేగిపోయారు. కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకుంటున్న పృధ్వీ కి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ మంచి మైలేజ్ నిచ్చింది.   సినిమాలో హీరో ఎవరు అని అంటే తడుముకోకుండా పృధ్వీ అని చెప్పవచ్చు. పృధ్వీ పై నమ్మకంతో కథను మొత్తం అతని వైపు తిప్పాడు దర్శకుడు సత్తి బాబు. ఎటువంటి క్యారెక్టర్ ఇచ్చినా కాన్ఫిడెంట్ గా చేయగల పృధ్వీ వేరియేషన్ స్టార్ వీరబాబుగా ఇందులో మరో పాత్రను ప్రాణం పోసాడు. మిగిలన కథంతా మాములుగా అనిపించినా పృధ్వీ ఎంటరయిన తర్వాత కథనంలో వేగం వచ్చింది.. సినిమా ఆద్యంతం నవ్వులు పంచింది..పోసాని క్యారెక్టర్ తో పాటు జయప్రకాష్ నారాయణ తమ పాత్రలకు న్యాయం చేసారు. 

చివరిగా:
 ఈ కామెడీ కోటీశ్వరుడు నవ్వించడంలో సక్సెస్ అయ్యాడు. 


Read Also
NRI Edition
AP News
Telangana News
Pata
Sports
Daily Specials