Live News Now
  • మృతులు పుదుచ్చేరికి చెందిన శరవన్,శాంతి,చిన్నారి పవిత్ర..
  • విజయవాడ: బందరు ఆర్టీఏ కార్యాలయ ఘటనపై ముగిసిన వివాదం..
  • ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ బాలసుబ్రమణ్యంను కలిసి క్షమాపణలు చెప్పిన టిడిపి నేతలు..
  • ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నాం.. కేశినేని నాని
  • ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం... ఎమ్మెల్యే బోండా ఉమ
  • విజయవాఢ: ఘటనపై టిడిపి నేతలు విచారం వ్యక్తం చేశారు..ట్రాన్స్ పోర్టు కమిషనర్ బాలసుబ్రమణ్యం
  • అవగాహన లోపం వల్లే కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి.. బాలసుబ్రహ్మణ్యం
  • వాషింగ్టన్: ఓహియోలోని సిన్సినాటి క్లబ్ లో కాల్పులకు తెగబడ్డ దుండగుడు..ఒకరి మృతి,14మందికి గాయాలు
  • హైదరాబాద్: వందమంది కెసిఆర్ లు వచ్చినా 2019లో కాంగ్రెస్ దే అధికారం...పొంగులేటి
  • కేరళ రవాణాశాఖా మంత్రి శశీంద్రన్ రాజీనామా...లైంగికవేధింపుల ఆరోపణలపై రాజీనామా చేసిన మంత్రి
ScrollLogo నెల్లూరు జిల్లాను ఓడిఎఫ్ గా ప్రకటించిన ఏపి ప్రభుత్వం... ScrollLogo రాష్ట్రంలో తొలి ఓడిఎఫ్ జిల్లాగా నెల్లూరు.. మంత్రి నారాయణ ScrollLogo గేట్ ఫలితాలను విడుదల చేసిన రూర్కి ఐఐటి.. గేట్ అధికారిక వెబ్ సైట్ లో ఫలితాలు.. ScrollLogo మే 5 వరకు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం.. ఈ ఏడాది పరీక్షకు హాజరైన 8 లక్షలకు పైగా విద్యార్ధులు ScrollLogo కృష్ణా: జిల్లాలో ముమ్మరంగా ఫైబర్ గ్రిడ్ పనులు.. అనధికార కేబుల్ తొలగించాలని ప్రభుత్వ ఆదేశం.. ScrollLogo ఫైబర్ గ్రిడ్ కు అనుసందానంగా వున్న కేబుల్ లను మాత్రమే అనుమతించాలని ప్రభుత్వం ఆదేశం... ScrollLogo కొత్తగా ఏర్పాటు చేసిన కేబుల్ లను తొలగిస్తున్న ట్రాన్స్ కో అధికారులు.. ScrollLogo కాంగ్రెస్ లో ఇంకా కొలిక్కిరాని సంపత్ ఎపిసోడ్.. అలకవీడని అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ScrollLogo బుజ్జగించేందుకు జానారెడ్డి,ఉత్తమ్ చేసిన ప్రయత్నాలు విఫలం.. ScrollLogo కర్నూలుం మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం వసతి గృహంలో చిన్నారికి విషమిచ్చి ఇద్దరి ఆత్మహత్య
Tollywood/Bollywood

రివ్యూ:ఇదో పీరియాడికల్ మూవీ 'అప్పట్లో ఒకడుండేవాడు'

Review:Nararohit,Srivishnu-starer-'Appatlo-Okadundevadu'
Posted: 87 Days Ago
Views: 1216   

రివ్యూ : అప్పట్లో ఒకడుండేవాడు
తారాగణం : నారా రోహిత్, శ్రీ విష్ణు, తాన్యహోప్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, ప్రభాస్ శ్రీను, సత్యదేవ్... 
ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరావు
సినిమాటోగ్రఫీ : నవీన్ యాదవ్
సంగీతం : సాయి కార్తీక్
నిర్మాత : ప్రశాంతి, కృష్ణ విజయ్
కథ, స్క్రీన్, మాటలు : సాగర్ కె చంద్ర
దర్శకత్వం : సాగర్ కె చంద్ర 
రిలీజ్ డేట్ : 30.12.16


ఈ యేడాది ఇండస్ట్రీకి యంగ్ డైరెక్టర్స్ చాలా ఫ్రెష్ మూవీస్ అందించారు. అలాగే గతంలో అయ్యారే అనే సినిమాతో గతంలో మంచి ఇంప్రెషన్ కొట్టేసిన సాగర్ చంద్ర కొంత గ్యాప్ తర్వాత అప్పట్లో ఒకడుండేవాడు తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాలో నారా రోహిత్, శ్రీ విష్ణు హీరోలు అన్నప్పుడు ఇంట్రెస్ట్ కలగలేదు కానీ.. విడుదలకు ముందు రెండు వారాలుగా టాక్ ఆఫ్ ది న్యూస్ అయిందీ సినిమా. మరి ఆ టాక్స్ లో ఏముందీ.. న్యూస్ గా మారేంత స్టఫ్  సినిమాలో ఏముందో చూద్దాం.. 

కథ : 
కాచిగూడ రైల్వే కాలనీలో ఉండే రాజుకు చిన్నప్పటి నుంచీ క్రికెటర్ కావాలని కల. తండ్రి ఉండడు.. ఒక అక్క ఉన్నా ఆమె నక్సలైట్స్ లో కలిసిపోతుంది. తల్లి రైల్వే ఎంప్లాయీ. తన కలకు అనుగుణంగానే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో మంచి స్కోర్స్ సాధించి రంజీకి సెలెక్ట్ అయిన టైమ్ లో అతనికి అడ్డుపడతాడు ఇన్స్ పెక్టర్ ఇంతియాజ్ అలీ.. గతంలో తన తల్లిదండ్రులను నక్సలైట్లు చంపేశారనే కసితో ఉన్న ఇంతియాజ్.. ఇప్పుడు ఇతని అక్క నక్సలైట్ కాబట్టి, రాజును అరెస్ట్ చేసి హింసిస్తుంటాడు.. ఈ క్రమంలో రైల్వే రాజు తన అక్కతో పాటు తల్లినీ, తను అత్యంత ప్రాణంగా ప్రేమించిన క్రికెట్ నూ కోల్పోతాడు.. కెరీర్ తో పాటు జీవితమూ నాశనమయిన రాజు అనూహ్యంగా నేర సామ్రాజ్యంలోకి ఎంటర్ అవుతాడు. ఆ తర్వాత అతను ఇంతియాజ్ పై ఎలా పగ తీర్చుకున్నాడు..? అసలీ ఇద్దరి గొడవేంటీ అనేది మిగతా కథ.. 

విశ్లేషణ :
అప్పట్లో ఒకడుండేవాడు.. టైటిల్ నుంచి మొదలై పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్స్ వరకూ ఏదో స్పెషల్ మూవీ చూపించబోతున్నారనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. అది అక్షరాలా నిజం అనిప్రతి సన్నివేశంలోనూ నిరూపిస్తుందీ సినిమా. ఒక్క సీన్ కూడా గత సినిమాలో వచ్చిందే కదా అనిపించదు.. అదే రైటర్ కూడా అయిన దర్శకుడి టాలెంట్. అసలు ఇలాంటి ఓ కథను ఊహించడమే ఆశ్చర్యం అంటే.. ఆ కథకు అన్నివిధాలా రీసెర్చ్ చేసి 1992ల నాటి పరిస్థితుల్ని.. పరిణామాల్ని అద్భుతంగా పోట్రెయిట్ చేశాడు. చెప్పాలంటే ఇదో పీరియాడికల్ మూవీ అని కూడా అనొచ్చు. ఇక ఇరవైయేళ్ల క్రితం సిట్యుయేషన్స్ ను అద్భుతంగా పిక్చరైజ్ చేశాడు. ఆ విషయంలో కెమెరామెన్ పనితం అబ్బురపరుస్తుంది.. అలాగే నేపథ్య సంగీతం కథకు బాగా కుదిరింది.. 

స్వతంత్ర భారతదేశంలో 1990ల తర్వాతి పరిస్థితులు అత్యంత కీలకం.. పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తున్న టైమ్ అది. మరి ఆ టైమ్ లో మన సమాజం ఎలాంటి కుదుపులకు లోనైంది. ఈ సమాజంలో సడెన్ గా చోటు చేసుకున్న పరిణామాలేంటీ అనే అంశాలను.. నాటికీ నేటికీ దేశవ్యవస్థలో కీలకంగా ఉన్న నక్సలిజం, క్రికెట్, రాజకీయాలు, హత్యలతో కూడిన రౌడీఇజంతో పాటు గ్లోబలైజేషన్ పీరియడ్.. వీటన్నిటినీ రెండు గంటల సినిమాలో చూపించడం.. అదీ కన్విన్సింగా అంటే దర్శకుడు ఈ కథను ఎంత పకడ్బందీగా రాసుకున్నాడు అనే విషయం అర్థమౌతుంది.. ఈ సినిమాలో అన్నిటికంటే కీలకం.. హీరోలు, హీరోయిన్లూ, విలన్లూ అంటూ పర్టిక్యులర్ గా ఉండరు.. అన్నీ పాత్రలే. ఆ పాత్రల లైఫ్ స్టైల్స్ నే మనం తెరపై చూస్తుంటాం.. అందుకే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని చెప్పలేం.. అలాగే రోహిత్, శ్రీ విష్ణుల మధ్య సీన్స్ మనం తెలుగు సినిమాల్లో ఊహించేవి కావు.  గ్లోబలైజేషన్ కోరలు చాస్తున్న టైమ్ లో రౌడీఇజం, రియల్ ఎస్టేట్ రంగాలు హైదరాబాద్ లో ఎన్ని వికృత పోకడలు పోయాయి అనే విషయాలు చూస్తున్నప్పుడు దర్శకుడిపై గౌరవం పెరుగుతుంది. ఒక సినిమా కోసం ఇంత డీటెయిల్ గా వర్క్ చేయడం ఈ మధ్య కాలంలో అరుదైపోవడమే అందుకు కారణం.. సినిమా టేకాఫ్ కు కొంత టైమ్ తీసుకున్నా.. మొత్తంగా దర్శకుడు చివరి అరగంట గుండెల్ని పిండేస్తాడు.. అలాగే 1993లో రిలీజ్ అయిన జెంటిల్మన్ పోస్టర్ ను 9992లో చూపించడం లాంటి చిన్న విషయాలు మినహా మనల్ని మళ్లీ 1990ల కాలానికి తీసుకువెళ్లాడు దర్శకుడు. 

నటన పరంగా శ్రీవిష్ణు ఆశ్చర్యపరిస్తే.. రోహిత్ అలవాటైన పాత్రను అలవోకగా చేశాడు. బ్రహ్మాజీకి చాలారోజులు తర్వాత మంచి పాత్ర. హీరోయిన్ కూడా ఆకట్టుకుంటుంది.. అలాగే శ్రీ విష్ణు కూతురుగా చేసిన అమ్మాయి కూడా... టెక్నికల్ గా ఆర్ట్ వర్క్, కెమెరా కలిసి 1990ల నాటి సిట్యుయేషన్స్ ను పర్ఫెక్ట్ గా ఆవిష్కరించాయి. కాస్ట్యూమ్స్, లొకేషన్స్, మాటలు, ఇలా ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్న ఈ టెక్నికల్ టీమ్ కు అభినందనలు చెప్పుకుండా ఉండలేం.. 

ఫైనల్ గా : దర్శకుడి సినిమా ..


Read Also
NRI Edition
AP News
Telangana News
Pata
Sports
Daily Specials