Live News Now
  • ఇద్దరు మహిళలను పదేపదేలాగి, ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన రోమియోలు
  • నరేశ్, స్వాతి చావుకు పోలీసులే కారణమని.. భువనగిరి పీఎస్ ముందు నరేశ్ పేరెంట్స్ ఆందోళన
  • గుంటూరు జిల్లా కాకుమానులో.. శ్రీలత ఆత్మహత్యకు భర్త, అత్తమామలే కారణమంటూ బంధువుల ఆందోళన
  • నిందితుల్ని అరెస్ట్ చేసేవరకు శ్రీలత అంత్యక్రియలు జరపబోమన్న బంధువులు
  • స్వర్గీయ ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించాలని మహానాడులో ఏకగ్రీవంగా తీర్మానం
  • ప.గో.జిల్లా ఆలంపురం వద్ద రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ట్రావెల్స్ బస్సు
  • హిజ్బుల్ కమాండర్‌ సజ్జాద్ అహ్మద్ మృతితో కాశ్మీర్‌లోయలో ఉద్రిక్తత
  • ఇంటర్నెట్ సేవల నిలిపివేత, స్కూల్స్, కాలేజీలు క్లోజ్.. ఈనెల 30న ఆందోళనలకు వేర్పాటువాదుల పిలుపు
  • జూలైలో రజనీకాంత్ కొత్త పార్టీ .. కొత్తపార్టీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన రజనీకాంత్ సోదరుడు
  • బెంగళూరును వణికిస్తున్న భారీ వర్షాలు.. జలదిగ్బంధంలో లోతట్టు ప్రాంతాలు
ScrollLogo నరేష్‌ను హత్య చేసింది స్వాతి తండ్రే..పోలీసులకు భయపడే స్వాతి ముంబై నుంచి వచ్చిందా..! ScrollLogo ఎన్టీఆర్‌కి నివాళులు అర్పించిన నారా కుటుంబ సభ్యులు.. ముత్తాతకు నివాళులు అర్పించిన నారా దేవాన్ష్ ScrollLogo స్వచ్ఛ్‌ పాలిటిక్స్‌పై హైదరాబాద్‌లో సదస్సు.. ముఖ్య అతిథిగా పాల్గొన్న జేపీ ScrollLogo రాజకీయం అంటే పరిపాలన.. కలిసి పోరాడితేనే సమస్యల పరిష్కారం: జేపీ ScrollLogo వరుస హత్యలతో రాయలసీమలో కలకలం .. చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్ నేత రాజశేఖర్‌రెడ్డి దారుణ హత్య ScrollLogo రాజశేఖర్‌రెడ్డి(42)పై యాసిడ్ పోసి, కత్తులతో దాడి చేసిన ప్రత్యర్థులు.. అక్కడికక్కడే మృతి ScrollLogo తిరుమల భక్తుల వసతి కోసం దేవస్థానం సరికొత్త కార్యాచరణ పథకం ScrollLogo భక్తులు బుక్ చేసుకున్న రూముల్ని త్వరగా అప్పగిస్తే సగం డబ్బులు తిరిగి ఇచ్చేలా ప్రణాళిక ScrollLogo అమెరికాలో అట్టహాసంగా తానా 21వ మహాసభలు.. పాల్గొన్న తెలుగు సినీ, రాజకీయ ప్రముఖులు ScrollLogo యూపీలో మహిళలపై ఆగని వేధింపులు .. వైరల్‌గా మారిన టీనేజర్ల వేధింపు వీడియో

తెలుగుదేశం పార్టీలో పక్కదారి పడుతున్న నేతలు

AP-TDP-Leaders-Turn-Rowdies
Posted: 137 Days Ago
Views: 1186   

క్రమశిక్షణకు మారుపేరైన తెలుగుదేశం పార్టీలో నేతలు పక్కదారి పడుతున్నారు. ఒకరు తుపాకీతో హంగామా చేస్తే.. మరొకరు బీచ్‌లో రచ్చరచ్చ చేశారు. ఈ రెండు ఘటనలు మర్చిపోకముందే.. మరో ఎమ్మెల్యే భూకబ్జా కేసులో ఇరుక్కున్నారు. పార్టీ నేతల క్రమశిక్షణారాహిత్యంపై సీఎం చంద్రబాబు మండిపడుతున్నారు.
తెలుగుదేశం నేతల్లో క్రమశిక్షణ కరువవుతోంది. ఒకరి తర్వాత ఒకరు.. పార్టీ ప్రతిష్టను మంటగలుపుతున్నారు. ఇటీవల గుడివాడ క్లబ్‌లో మాజీ ఎమ్మెల్యే రావి వెంక‌టేశ్వరరావు గాల్లోకి కాల్పులు జ‌రిపి నానా హంగామా చేశారు.
గుంటూరు జిల్లా బాప‌ట్ల సూర్యలంక బీచ్ లో హ‌రితా హొట‌ల్ లో ఎమ్మెల్సీ అన్నం స‌తీశ్‌ ప్రభాకర్‌..అనుచరులతో కలిసి తాగిన మైకంలో హోట‌ల్ సిబ్బందిపై దాడికి చేశారు. ఈ ఇద్దరి నేతల యవ్వారం మర్చిపోకముందే.. మరో ఎమ్మెల్యే భూకజ్జా కేసులో ఇరుక్కున్నారు. విశాఖ జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే గోవింద్ సత్యనారాయణపై 447, 427, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు ఫైల్ చేశారు. పెందుర్తి BRTS రోడ్డుసమీపంలో రాజేష్ అనే వ్యక్తి  ఇంటి పక్కనే.. ఎమ్మెల్యే సత్యనారాయణ స్థలం కొన్నారు. అయితే..రాజేష్ ఇంటిపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసి జేసీబీతో ప్రహారీ కూల్చేశారు. భయబ్రాంతులకు గురిచేశారు. దీనిపై పోలీస్ కమిషనర్ కు రాజేష్ ఈమెయిల్ చేశారు. దీనిపై స్పందించిన సీపీ.. ఎమ్మెల్యే సత్యనారాయణపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో సీఐ మురళీ పలు సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. వ‌రుస ఘ‌ట‌న‌ల‌పై అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్లు ఇలాంటి పనులు చేయడంపై ఆయ‌న సీరియ‌స్ అయ్యారు. ఇప్పటికే..మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ సతీష్ ప్రభాకర్ కు పెద్ద క్లాస్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు భూకబ్జాకేసులో మరో ఎమ్మెల్యే ఇరుక్కోవడంతో పార్టీ పరువు పోయినంత పనైపోయింది. దీనిపై అధినేత ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.


Read Also
NRI Edition
AP News
Telangana News
Pata
Sports
Daily Specials