Live News Now
  • గోదారిలో గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు
  • కేంద్రంపై ఆవిశ్వాసానికి టీడీపీ పావులు.. టీఆర్ఎస్ మద్దతు కోసం కేకేను కలిసిన ఎంపీలు
  • టీఆర్‌ఎస్ లో ఎంత మంది చేరినా నో ప్రాబ్లమ్.. పార్టీని పుష్పక విమానంతో పోల్చిన కవిత
  • వైభవంగా గొల్కొండ బోనాలు.. మొక్కులు చెల్లించేందుకు బారులు తీరిన భక్తులు
  • సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం విషం తాగినట్లే.. సంతృప్తిగా లేనని కంటతడి పెట్టిన కన్నడ సీఎం
  • కేంద్రంపై అవిశ్వాసానికి టీడీపీ సన్నాహాలు..
  • ఆర్టీసీ కార్మికులకు 19శాతం మధ్యంతర భృతి.. 240కోట్ల భారం పడుతుందన్న ఏపీ సర్కార్
  • 20 గంటలు గడిచిన లభించని ఆచూకీ.. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు
  • సిరిసిల్లలో పల్టీలు కొట్టిన ఆటో.. 11మందికి ప్రయాణికులకు గాయాలు
  • కాంగ్రెస్ సాగునీటి రంగాన్ని గాలికొదిలేసింది.. మీర్జాపూర్‌ సభలో నిప్పులు చెరిగిన మోడీ
ScrollLogo పార్లమెంట్ సెష‌న్‌పై నేడు టీడీపీ వ్యూహరచన ScrollLogo పోల‌వ‌రానికి అండ‌గా ఉంటామన్న గడ్కరీ.. చంద్రబాబు పట్టుదలపై ప్రశంసలు జల్లు ScrollLogo స్థానిక ఎన్నిక‌ల్లో బీసీ కోటా తగ్గదు.. ఎన్నికలంటే భయం లేదన్న ఈటెల ScrollLogo న‌గ‌ర బహిష్కరణపై ప‌రిపూర్ణానంద న్యాయ‌పోరాటం ScrollLogo ప‌రిపూర్ణానంద స్వామీజీకి మద్దతుగా వెల్లువెత్తిన నిర‌స‌న‌లు ScrollLogo రాష్ట్రానికి చేరుకున్న శ‌ర‌త్ మృత‌దేహం.. నేడు వ‌రంగ‌ల్‌లో అంత్యక్రియలు ScrollLogo నైరుతి జోరుతో కుండపోత వర్షాలు ScrollLogo తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు జలకళ ScrollLogo నంబ‌ర్‌వ‌న్ ర్యాంక్‌పై క‌న్నేసిన టీమిండియా ScrollLogo నేటి నుంచి ఇంగ్లండ్‌తో వ‌న్డే సిరీస్‌

సమాజ్ వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు...

Priyanka-Gandhi,-Dimple-Yadav-as-Star-Campaigners
Posted: 555 Days Ago
Views: 417   

పంచతంత్రంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. రాహుల్ గాంధీ ఫారిన్ టూర్ నుంచి రాగానే పార్టీ నేతలతో భేటీ అయ్యారు. యూపీలో అఖిలేష్ నాయకత్వంలోని సమాజ్ వాదీ పార్టీలో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించారు. ప్రియాంక గాంధీతో పాటు అఖిలేష్ భార్య డింపుల్ యాదవ్ చేత వీలైనంత ఎక్కువ ప్రచారం చేయించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. మరోవైపు, ములాయం, అఖిలేష్ సంధి చర్చలు విఫలమయ్యాయని లక్నోలో ప్రచారం జరుగుతోంది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల వ్యూహరచనపై కాంగ్రెస్ పార్టీ వేగం పెంచింది. ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విదేశీ టూర్ నుంచి తిరిగి వచ్చారు. ఆయన నివాసంలో సోనియా, ప్రియాంక తదితర నేతలు భేటీ అయ్యారు. ఎస్పీతో పొత్తు అనివార్యమని వారంతా అభిప్రాయపడ్డట్టు సమాచారం. అలాగే ప్రియాంక గాంధీతో పాటు అఖిలేష్ భార్య, ఎంపీ డింపుల్ యాదవ్ లచేత ఎక్కువ ప్రచారం చేయించాలని ఓ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది.
యూపీలో కాంగ్రెస్ పరిస్థితి ఆశాజనకంగా లేదు. మరోవైపు కుటుంబ పోరుతో సమాజ్ వాదీ పార్టీలోనూ అయోమయం నెలకొంది. దీంతో పొత్తు తప్పనిసరి అని అటు అఖిలేష్, ఇటు రాహుల్ ఇద్దరూ భావిస్తున్నారు. రేపో మాపో వీరిద్దరూ భేటీ అయి పొత్తును ఖరారు చేసే అవకాశం ఉంది. పొత్తు కుదిరితే కాంగ్రెస్ సుమారు 100 సీట్లకు పోటీ చేయవచ్చని తెలుస్తోంది.
అటు సమాజ్ వాదీ పార్టీలో పీటముడి వీడలేదు. లక్నోలో ములాయం, అఖిలేష్ ఏకాంత భేటీ వివరాలు ఏమిటనేది తెలియడం లేదు. వీరిద్దరూ తమతమ వాదనకు కట్టుబడి ఉన్నారని, కాబట్టి సంధి కుదరలేదని ఊహాగానాలు వినవస్తున్నాయి. ఎస్పీ చీలినా, ఒకటిగా ఉన్నా అఖిలేష్ వెంట వెళ్లాలనేది కాంగ్రెస్ నేతల ఉద్దేశం. షీలా దీక్షిత్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించినా ఒంటరి పోరుకు ఇప్పుడు కాంగ్రెస్ వెనుకాడుతోంది.
సర్జికల్ స్ట్రైక్, పెద్ద నోట్ల రద్దు అంశాలే అస్త్రాలుగా బీజేపీ బరిలోకి దిగనుంది. అలాగే ములాయం కుటుంబ పోరును వీలైనంత క్యాష్ చేసుకోవడానికి స్కెచ్ వేస్తోంది. మోడీ పాపులారిటీని, బీజేపీ దూకుడును అడ్డుకోవాలంటే ఒక అండ ఉండాలని అఖిలేష్ భావిస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ తో పొత్తును త్వరలోనే ఖరారు చేయనున్నారని ఎస్పీ వర్గాలు చెప్తున్నాయి.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials