Live News Now
  • మిషన్ భగీరథ దేశానికే ఆదర్శమన్న కేసీఆర్ పెండింగ్ పనులు పరుగులు పెట్టించాలని ఆదేశం
  • ఎంపీలు, ముఖ్యనేతలతో జగన్ కీలక భేటీ ప్రత్యేక హోదా, భవిష్యత్ కార్యాచరణపై చర్చ
  • కాల్పుల మోతతో దద్దరిల్లిన గడ్చిరోలి ఎన్‌కౌంటర్లో 14మంది మావోయిస్టులు మృతి
  • కొడుకుతో సహా తల్లి ఆత్మహత్య.. విజయనగరం జిల్లాలో విషాదం..
  • వైసీపీ, జనసేన కుమ్మక్కయ్యాయన్న బోండా
  • 58 లక్షల మంది రైతులకు 6 వేల కోట్లు.. రైతు బంధు పథకం చారిత్రాత్మకమన్న హరీష్
  • టీడీపీపై మహా కుట్ర జరుగుతోంది: బోండా
  • పోలవరం స్పిల్‌ ఛానల్‌ కాంక్రీట్ పనులు ప్రారంభం..
  • ఐపీఎల్‌లో పంజాబ్ వర్సెస్ ఢిల్లీ.. క్రిస్‌గేల్‌పైనే అందరి చూపు
  • ప్రగతి భవన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత.. సాక్షర భారత్‌ మిషన్ కోఆర్డినేటర్ల ఆందోళన..
ScrollLogo హోదాపై కేంద్రం దిగి రాక తప్పదా.. చంద్రబాబు దీక్షతో మారుతున్న సీన్.. ScrollLogo కేసీఆర్‌ విధానాలపై పోరాడండి.. టీ కాంగ్ నేతలకు రాహుల్‌ మార్గనిర్దేశం.. ScrollLogo తెలంగాణ ఎయిమ్స్ కు నిధులు.. విభజన హామీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్‌ ScrollLogo మైనర్లను రేప్‌ చేస్తే ఉరే... నేడు ఆర్డినెన్స్ తేనున్న మోడీ సర్కారు ScrollLogo సమ్మర్‌లో చమురు ధరల సెగలు.. రికార్డ్ స్థాయికి చేరిన పెట్రో రేట్లు ScrollLogo చంద్రబాబు దీక్షతో కేంద్రంపై ఒత్తిడి.. ఎందాకైనా వెళ్తామన్న ముఖ్యమంత్రి ScrollLogo టీటీడీ సభ్యురాలిగా అనిత తొలగింపు ఎమ్మెల్యే విజ్ఞప్తి లేఖకు చంద్రబాబు ఓకే ScrollLogo సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఏచూరి ఎన్డీఏ వైఫల్యాలపై గర్జించిన కామ్రేడ్లు ScrollLogo విభజన హామీలు.. తాజా రాజకీయాలే అజెండా గవర్నర్‌తో సుదీర్ఘంగా సాగిన చంద్రబాబు భేటీ ScrollLogo మిషన్ భగీరథ దేశానికే ఆదర్శమన్న కేసీఆర్ పెండింగ్ పనులు పరుగులు పెట్టించాలని ఆదేశం

ఖైదీ నెంబర్ 150 రివ్యూ: బాస్ ఈజ్ బ్యాక్ విత్ పుల్ గ్రేస్

Megastar-Chiranjeevi's-'Khaidi-No.150'-review
Posted: 468 Days Ago
Views: 3116   

ఖైదీ నెంబర్ 150 రివ్యూ

డైరెక్టర్‌: వి.వి.వినాయక్‌
నిర్మాత: రామ్‌చరణ్‌
మ్యూజిక్‌ డైరెక్టర్‌: దేవిశ్రీప్రసాద్‌

స్టర్ డమ్ లో మెగాస్టార్ లో మెగాస్టర్ .. అభిమానుల గుండెల్లో జీవితకాలపు ఖైదీ. గ్రేస్ కి బాస్..మాస్ కి కేరాఫ్ అయిన చిరు రీ-ఎంట్రీ పై అంచనాలు ఆకాశాన్నంటాయి.. ఆల్రెడీ సూపర్ హిట్ అయిన కథలోకి పెద్దగా రిస్క్ లేకుండా ఫాలో అవటానికి రెడీ అయ్యాడు మెగాస్టార్.  మరి మెగాస్టార్ మళ్ళీ మెగాస్టార్ అనిపించుకోవడానికి చేసిన ప్రయత్నం ఎలా ఉందో చూద్దాం..


కథగా చెప్పుకుంటే:
శీను(చిరంజీవి) అనే ఖైదీ జైలు నుంచి తప్పించకుంటాడు. అతని స్నేహితుడు(ఆలీ) తో కలసి బ్యాంకాక్ వెళ్లడానికి దొంగదారిలో ప్రయత్నిస్తుంటాడు. ఒకరోజు  ఒక యాక్సిడెంట్ లో తనలాగే(చిరంజీవి) ఉండే శంకర్ ని చంపాలని ప్రయత్నిస్తారు.  ఆ ప్రమాదంలో శంకర్ గాయ పడతాడు,  శీను, శంకర్ ని తనే అనటానికి కొన్ని ఆధారాలు పుట్టించి.. తను శంకర్ ప్లేస్ లోకి వెళ్ళిపోతాడు. శంకర్ స్థానంలో ఉంటే డబ్బులు సంపాదించవచ్చని ఆశించిన శీనుకి, శంకర్ చేస్తున్న పోరాటం గురించి తెలుస్తుంది. శంకర్ ని నమ్ముకొని ఒక గ్రామం బతుకుతుందని శంకర్ తోనే ఆ ఊరి రైతులకు జీవితం వస్తుందని అర్ధం అవుతుంది. శీను స్థానంలో శంకర్ ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అయితే శీను, శంకర్ స్థానంలో పోరాటం చేయటానికి పూనుకుంటాడు. మరి శీను తన పంథాలో.. ఎలా గెలుస్తాడు..? శంకర్  చేయాల్సిన పోరాటం శీను చేయడానికి కారణం ఎంటి..? అనేది మిగిలిన కథ..?

కథనం:
మెగాస్టార్ చిరంజీవి 150 మూవీ  అదీ పదేళ్ల విరామం తర్వాత ... సహాజంగానే అంచనాలు పెరుగుతాయి.. చాలా కథలను పరిశీలించిన చిరంజీవి తమిళ సినిమా కత్తిని పట్టుకున్నాడు. రైతు సమస్యల బ్యాక్ డ్రాప్ వచ్చిన ఆ సినిమా తమిళనాట సంచలన విజయం నమోదు చేసుకుంది. తమిళ సినిమా రమణను రీమేక్ చేసి సంచలన విజయం సాధించిన అనుభవం చిరంజీవికుంది. అదే దర్శకుడు వినాయక్ కి తన కమ్ బ్యాక్ మూవీ బాద్యతలు అప్పగించాడు చిరంజీవి. ముందుగా ఖైదీ నెంబర్ 150  సినిమాలో అందరిని ఆకట్టుకునేది చిరంజీవి లుక్. పదేళ్ళ తర్వాత చిరంజీవిని మేకప్ తో చూడటం,ఆయన డ్యాన్స్  స్టెప్ లను ఆస్వాదించడం అనేది సగటు సినిమా ప్రేక్షకుడు కోరుకుంటాడు. ఈ రెండు విషయాల్లో చిరంజీవి చాలా జాగ్రత్తగా తీసుకున్నాడు. తన లుక్ అండ్ ఫీల్ ని అదే గ్రేస్ తో ప్రజెంట్ చేయగలిగాడు. సినిమా ప్రారంభంలో వచ్చే ‘రత్తాలు పాట’ తో మరిచిపోయిన తనలోని మాస్ ని గుర్తు చేసాడు బాస్. చిరు గ్రేస్ తో చేసిన ఆ పాట మంచి ఊపుని తెస్తుంది. కత్తి శీనుగా చిరు పాత్ర సరదాగా సాగుతుంది. ఆలీ కాంబినేషన్ లో సీన్స్ ఆహ్లాదంగా మారాయి. ‘ఒక వృద్ధుడు చెక్ చించేసే సీన్ లో చిరు హావభావాలు బాగా నవ్వించాయి’. ఎప్పుడయితే కథలోని ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ స్టార్ట్ అవుతందో అక్కడి నుండి సినిమా మూడ్ మారిపోయింది.  వ్యవసాయం అనేది 'బాద్యత' అది లాభనష్టాలు చూసుకొని చేసే వ్యాపారం కాదు అనే విషయాన్ని సమాజానికి గుర్తు చేసే శంకర్ పాత్రకు పూర్తి న్యాయం చేసాడు చిరంజీవి. తన ఊరి పేరులోనే ‘నీరు’ ఉంది కానీ తన ప్రాంతం కన్నీళ్లు తాగి బతుకుతుంది. హైడ్రాలజిస్ట్ గా తను చదువుకున్న చదువు తన గ్రామంలోని రైతుల కన్నీళ్లు తుడవడానికి ఉపయోగపడాలి.. అనే ప్రయత్నంలో కార్పోరేట్ కంపెనీల కర్కశానికి తన కుటుంబాన్ని కోల్పోతాడు శంకర్. ఆ ఎపిసోడ్ అంతా తన ఇమేజ్ చాయలు కనిపించవు. కేవలం శంకర్ పాత్ర తాలూకు పరిథులు మాత్రమే కనిపిస్తాయి. ఆ ఎపిసోడ్ లో చిరంజీవి ప్రెష్ గా కనిపించాడు.  తమ సమస్యలు కోసం రైతులు ప్రాణాలనర్పించే సీన్ కంటతడి పెట్టిస్తుంది. అక్కడి వరకూ మెగాస్టార్ ఇమేజ్ ని ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు, ఆ కాసేపు కథలోని గాఢత హృదయాలకు పట్టేస్తుంది. ఇంటెర్వల్ బ్యాంగ్ కొచ్చే సరికి కథలోని తీవ్రతకి కనెక్ట్ అవుతాడు ఆడియన్స్.. సీరియస్ గా పోరాడే ఒక నిజాయితీ గల శంకర్ పాత్రలోకి వచ్చిన శీను ఆ పోరాటాన్ని కంటిన్యూ చేస్తాడు.  అక్కడి నుండి హైప్ పెరగాల్సిన సినిమా  ఆ స్థాయికి చేరలేదు. కాజోల్ చేసిన లక్ష్మి పాత్ర కేవలం పాటలకు మాత్రమే పరిమితం అయ్యింది. పెద్దగా చెప్పుకోదగ్గ సన్నివేశాలు లేవు. చిరంజీవి ఇమేజ్ ని సంతృప్తి పరిచేందుకు డిజైన్ చేసిన పోసాని సన్నివేశం నవ్వులు పడించింది.  అయితే బాస్ తో చేయించిన ఫైట్స్ బాగున్నాయి. సీరియస్ గా పోరాటంలోకి శీను ఎంటరయిన తర్వాత అది పక్కా కమర్షియల్ రూట్ లో సాగింది. అక్కడ దెబ్బకు దెబ్బ వంటి కమర్షియల్ లెక్కలుంటాయి. వందమందిని చితకబాదే కమర్షియల్ ఫార్ములాలుంటాయి.  విలన్ బలహీనమవడం సినిమాకి మైనస్ గా మారింది..  నీరు లేక అల్లాడుతున్న రైతుల బాధలు అర్దమవడానికి డిజైన్ చేసిన ఎపిసోడ్  బాగుంది. సినిమాలోని కంటెంట్ కి కమర్షియల్ లెక్కలకు  ఎప్పుడూ ఒక అంతర్యుధ్దం జరుగుతుంటుంది. బాస్ తన గ్రేస్ ని ప్రజెంట్ చేసేందుకు చేసిన ప్రయత్నంలో కంటెంట్ లోని ఇంటెన్సిటీ కొన్ని చోట్ల వీక్ అయ్యింది.  బ్రహ్మానందం ఎప్పటిలాగే హీరో చేతిలో ఇరుక్కుపోయిన క్యారెక్టర్ తో నవ్వించే ప్రయత్నం చేసాడు. ఆలీ కూడా తనకు  అలవాటయిన ఆడ క్యారెక్టర్ తో నవ్వించేందుకు ట్రై చేసాడు.  సుందరీ సుందరీ పాటలో ‘లేస్ స్టెప్స్ ’ ని బాగా ఎంజాయ్ చేస్తారు అభిమానులు. అమ్మడు లెట్స్  డు  కుమ్ముడు పాటలో చెర్రీ ఎంట్రీ ఇచ్చి మెగా అభిమానులకు ఎక్స్ ట్రా కిక్ ఇచ్చాడు. మెగా స్టార్  చరణ్ తో పోటీ పడాల్సి వచ్చింది. వి.వి. వినాయక్ సినిమాలోని ఇంటెన్షన్ ని క్రియేట్ చేసినా, అది సినిమాలో కంటిన్యూ చేయలేకపోయాడు. జంప్ కట్ లాగా వచ్చే కామెడీ సీన్స్ అండ్ సాంగ్స్ ప్రేక్షకుల మూడ్ ని మారుస్తాయి. వి.వి. వినాయక్ కథను  మాస్ ఎలిమెంట్స్ ని బాలెన్స్ చేసాడు.  మొత్తంగా ఖైదీతో చిరు తనలోని గ్రేస్ ని మాస్ మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. 

చివరిగా:
బాస్ ఈజ్ బ్యాక్ విత్ పుల్ గ్రేస్


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials