Live News Now
  • గుజరాత్‌ యుద్ధంలో ట్యాంపరింగ్‌ రాజకీయం.. మోడీ ఎన్నికల ఎజెండా మార్చేశారని రాహుల్‌ ఫైర్‌
  • శ్రీలంకతో నేటి నుంచి వన్డే సిరీస్‌.. రెట్టించిన ఉత్సాహంతో టీమిండియా
  • బంజారాహిల్స్‌లో అర్ధరాత్రి ఉద్రిక్తత.. పబ్బులపై బీజేవైఎం దాడులు
  • గుజరాత్‌ తొలిదశలో 68శాతం పోలింగ్‌.. ఈవీఎంల ట్యాంపరింగ్‌పై కాంగ్రెస్‌ ఆరోపణ
  • నాలుగు రోజులు.. 40 ఇష్యూలు.. పవన్‌ పర్యటనతో కేడర్‌లో ఉత్సాహం
  • నేడు పోలవరంలో చంద్రబాబు పర్యటన..నిర్మాణ పనుల పరిశీలన, అధికారులతో సమీక్ష
  • లోపల అందాలు.. బయట నిరసనలు.. ఆందోళనల మధ్యే మిస్‌ వైజాగ్‌ పోటీలు
  • కర్నూల్‌ జిల్లాలో నెత్తురోడిన రోడ్లు.. వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం
  • హథీరాం మఠం మహంత్‌పై మహిళ ఆరోపణలు.. వీడియో వెనుక కుట్ర ఉందన్న అర్జున్‌ దాస్‌
  • రాహుల్‌ పట్టాభిషేకానికి 16 ముహూర్తం.. సీనియర్ల సమక్షంలో బాధ్యతల స్వీకారం
ScrollLogo 536 పరుగులకు భారత్ డిక్లేర్.. రెండు వికెట్లు కోల్పోయిన లంక ScrollLogo కొరియా సిటీ స్ఫూర్తిగా అమరావతి అభివృద్ధి.. పారిశ్రామికవేత్తలకు బాబు ప్రజెంటేషన్ ScrollLogo త్వరలోనే గ్రేటర్‌లో టౌన్‌హాల్ మీటింగ్స్.. సమస్యల పరిష్కారానికి కేటీఆర్ ప్లాన్ ScrollLogo కొలువులకై కొట్లాట సభతో టెన్షన్.. ఎక్కడికక్కడ విద్యార్థుల కట్టడిలో పోలీస్ ScrollLogo కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఒకే నామినేషన్.. రాహుల్ ఎన్నికతో నేతల్లో నయా జోష్ ScrollLogo చెన్నైలో విశాల్ భారీ ర్యాలీ.. కాసేపట్లో నామినేషన్ ScrollLogo కాలుష్యంలో మ్యాచ్ ఎలా నిర్వహిస్తారు.. BCCIపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సీరియస్ ScrollLogo ప్రాజెక్టుల పరుగుపై కేసీఆర్ సంతోషం.. రివ్యూలో హరీష్‌రావుపై ప్రశంసల వర్షం ScrollLogo మిస్‌ వైజాగ్‌ కాంటెస్ట్‌పై వ్యతిరేక స్వరం.. మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిరసనల పర్వం ScrollLogo భర్తను చంపి ప్రియుడితో హైడ్రామా.. పాలమూరులో కిలాడీ లేడీ అరెస్ట్‌

గౌతమిపుత్ర శాతకర్ణి రివ్యూ

Balakrishna's-'GautamiPutra-Satakarni'-review
Posted: 335 Days Ago
Views: 1082   

గౌతమిపుత్ర శాతకర్ణి రివ్యూ...

నటినటులు:  నందమూరి బాలకృష్ణ, హేమామాలిని, శ్రేయ, క‌బీర్ బేడి త‌దిత‌ర‌లు 

సమర్పణ: బిబో శ్రీనివాస్

సినిమాటోగ్రాఫర్: జ్ఞాన శేఖర్

మాటలు: సాయిమాధవ్ బుర్రా

సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు

నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు

దర్శకత్వం: క్రిష్

రిలీజ్ డేట్ : 2017 జనవరి 12

తెలిసిన చరిత్రను చెప్పాలంటేనే ధైర్యం కావాలి .. కానీ అంతగా తెలియని చరిత్రను చెప్పేందుకు మాత్రం ధైర్యంతో పాటు ఈ మట్టి పై మమకారం కావాలి.. ఆ రెండు గుండెలనిండా ఉన్న క్రిష్ శాతకర్ణి చరిత్రను వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. తన 100వ సినిమా కోసం కథలు వింటున్న బాలకృష్ణ శాతకర్ణి కథకు ముగ్దుడయ్యాడు. వెంటనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు బాలకృష్ణ. చరిత్ర పుటల్లో దాగున్న అగ్నికణాన్ని వెండితెరపై ఆవిష్కరించాడు క్రిష్.
తెలుగు తెరకు బ్లాక్ బస్టర్ కొత్తేమీ కాదు.. కానీ శాతకర్ణి అందించిన అనుభవాలు మాత్రం కొత్తగా ఉంటాయి.. మరి ఆ అనుభవాలేంటో చూద్దాం...

కథ:
క్రీస్తుశకం మొదట్లో మొదలైన ఈ కథలో శాతకర్ణి దండయాత్రలో ఉండగా ప్రారంభమవుతుంది. దక్షణ ప్రాంతంమంతా జయించిన శాతకర్ణి ఉత్తర భారతదేశంలో ఇద్దరు రాజులు ఎదురు తిరుగుతారు. వారిని పడగొట్టి ఒక ఎలుబడిలోకి తెచ్చిన శాతకర్ణికి శామంత రాజులనుండి .. కుటుంబం నుండి ప్రతికూల అంశాలు ఎదరవుతాయి.. విరామం, విశ్రామం లేకుండా భరతఖండంను ఒక ఎలుబడిలోకి తెచ్చిన శాతకర్ణి  పరాయి పాలకులనుండి పెను సవాళ్లు ఎదరవుతాయి.? రక్తాన్ని ఎరులుగా పారించి.. శవాల గుట్టలపై నిర్మించిన స్మశానం తమకు వద్దని అమరావతిలోని బౌద్దులు రాజ్యాన్ని వదలి వెళతారు..? శాతకర్ణి లక్ష్యానికి తల్లి గౌతమి బాల ఇచ్చిన ప్రేరణ ఏంటి..? తల్లి పేరును ముందుంచుకొని పాలించాలనే ఆలోచన ఎలాంటి వ్యతిరేకతలోంచి పుడుతుందనేది మిగిలిన కథ..?

కథనం:
శాతకర్ణి ఒక రాజ్యాన్ని జయింస్తాడు.. తనకు ఎదురు నిలబడిపోరాడని ఆ రోజు తన లొంగుబాటుకు చిహ్నాంగా  తల వంచుకొని శాతకర్ణి ముందు నిలబడతాడు..‘‘ అది నేను గెలిచిన తల వంచకు’’ అంటాడు శాతకర్ణి. అది ఒక రాజుకు ఉండే పొగరు. ఇటువంటి ఎక్స్ ప్రెషన్ తో  సినిమా పై పెంచుకున్న అంచనాలు నిజం అవుతున్నాయనే నమ్మకం కలుగుతుంది. సినిమా ఎలా సాగుతుందో చెప్పడానికి ఈ ఒక్క డైలాగ్ చాలు. అయితే ఒక వీరోచిత చరిత్రను తీసుకున్నప్పుడు ఎక్కడ నుండి మొదలెట్టాలి.. ఎక్కడ ఆపాలి అనే నిర్ణయం తీసుకోవడంలోనే క్రిష్ విజయం సాధించాడు. సినిమాకి కావాల్సిన సరంజామాను కథ గతి తప్పకుండా అమర్చాడు. గ్రాఫిక్స్ జోలికి పెద్దగా వెళ్ళకుండా తక్కువ టైంలో అవుట్ పుట్ వచ్చే ప్రణాళిక సిద్దం చేసుకున్నాడు. అందుకే శాతకర్ణి ఒక అద్భుత చిత్రరాజంగా నిలుస్తుంది. అంతర్యుద్దాలను నిలిపివేసి ఒక తాటిపై భరతఖండంను తెచ్చేందుకు శాతకర్ణి సాగించిన జైత్రయాత్రలోని పోరాటాలను క్రిష్ చిత్రీకరించిన తీరు అద్భుతంగా ఉంది. ప్రతి పోరాటంలో శాతకర్ణి తీసుకున్న ధృడ నిశ్చయంమే కనపడుతుంది.  తన బిడ్డను పణంగా పెట్టాల్సి వచ్చినా.. తన వైవాహిక జీవితాన్ని వదులుకోవాల్సి వచ్చిన తన నిర్ణయం ముందు తేలిపోతాయి. ఇటువంటి రాజు చరిత్ర చెప్పాలనుకుంటే ఎక్కడ నుండి మొదలెట్టాలి  అనే విషయంలో క్రిష్ గీసుకున్న గీతలు అబ్బుర పరుస్తాయి. ఆయన జీవితంలోని కీలకఘట్టాలను.. ఆయన సాధించిన విజయాలను మాత్రమే ముఖ్య ఘట్టాలుగా తీసుకొని  ఆకట్టుకునే కమర్షియల్ అంశాలను వీడకుండా కథను బిగువుగా నడిపాడు. జైత్రయాత్ర సంగం ముగిసిన తర్వాత మొదలైన కథ రాజ్యాన్ని ఎక చత్రాధి పత్యం కింద తేవడం.. ఎగబడిన విదేశయలను తరిమి కొట్టడంతో కథ ఆగుతుంది. ఈ విషయంలో క్రిష్ కున్న స్పష్టతను మెచ్చుకోవాలి. తను రాసుకున్న ప్రతి సన్నివేశాన్ని తన కలంతో బలాన్ని నింపాడు బుర్రా సాయిమాధవ్. దర్శకుడు, రచయిత కలసి కన్న వెండితెర కలేమో అన్నంతగా శాతకర్ణి కనిపిస్తాడు. ఇక బాలకృష్ణ నట విశ్వరూపం చూడొచ్చు.. అంత గొప్ప చక్రవర్తికుండే రాజసం.. ఆ పాత్రకుండే దృఢనిశ్చయం వంటి మాటలను తన ఆహార్యంలో బాలకృష్ణ సునాయాసంగా పలికించాడు. బాలకృష్ణ తెరమీద కనిపించే ముందు జరిగిన ఐదు నిముషాలు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. యుధ్దం సమయంలో రాజుకుండే నిబ్బరం.. అవసరమైన చోట ఉండే తెగింపు వంటి లక్షణాలను పోరాట సమయంలో పొందు పరిచాడు కాబట్టే ఆయుద్దాలు అంతగా ఆకట్టుకన్నాయి. ఇంటెర్వెల్ కి ముందు జరిగిన బ్యాంగ్ సినిమాకే హైలెట్ గా ఉంటుంది. కొడుకును తీసుకొని శాతకర్ణి చేసే యుద్దం ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ‘కథలు మనం చెప్పకూడదు మనగురించి చెప్పాలి’ వంటి డైలాగ్స్ బాలకృష్ణ చెబితే ఉండే రెస్పాన్స్ ఊహించవచ్చు. అలాంటి మాటలతో పాటు తన తల్లి గౌతమిబాలకి అగ్రతాంబూలం ఇచ్చే సన్నివేశంలో  బాలకృష్ణ పలికే మాటలు హృదయానికి హాత్తుకుంటాయి. తన తల్లి పేరును మందుంచుకొని పరిపాలన చేసేందుకు సన్నిద్దుడయిన సన్నివేశం ఈ సినిమా హైలెట్స్ లో ఒకటిగా నిలుస్తుంది. పోరాటాలతో శాంతిని స్థాపించడం అనే ప్రశ్నలకు శాతకర్నితోనే సమాధానం ఇప్పించాడు దర్శకుడు. మీరు ‘ వెలుతురును వెతుక్కుంటు వెళతారు.. నేను చీకటిని చీల్చుకుంటూ వెళతాను’ ఇంత కంటే ఆ క్యారెక్టర్ అర్దం అవడానికి సన్నివేశాలు అనవసరం.. తన కల గురించి బార్యతో చెప్పే సన్నివేశం బాగా డిజైన్ చేసాడు దర్శకుడు. శ్రియ వాశిష్టి దేవిగా మారిపోయింది. కడుపున పుట్టిన వారికోసం కట్టుకన్న వాడినే ఎదిరించే సన్నివేశంలో శ్రియ బాలకృష్ణకు ధీటుగా నటించింది. గౌతమి బాలశ్రీ హేమమాలని తప్ప మరెవ్వరినీ ఊహించలేం.. బాలకృష్ణ అన్నట్లు హేమమాలని లేకపోతే సినిమానే లేదు. అయితే కొన్ని శాసనాలు కొంత సమాచారం మాత్రమే ఉన్న కథలో కొన్ని సన్నివేశాలు క్రిష్ ఊహనుండి పుట్టినవే అయినా అవి పాత్రల ఔచిత్యాన్ని దెబ్బతీయలేదు. అఖండ భారతావనిని కలిపేందుకు శరణమా..రణమా.. అనగలడు.. లేదంటే రణమా.. వీర మరణమా అనగలడు.. ఇది శాతకర్ణి కుండే ధృడ సంకల్పం.. ‘ కాలం చేసయినా కాలాన్ని కందాం’ వంటి మాటలతో శాతకర్ణి ని గండెల్లో చొచ్చుకుపోయేలా చేసాడు రచయిత. చిరంతన్ భట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, జ్నానశేఖర్ సినిమటోగ్రఫీ శాతకర్ణి కి ప్రధాన బలాలుగా మారాయి. కథే కథానాయకుడ్ని ఎంచుకుంటుంది అన్నట్లుగా కథే సాంకేతిక నిపుణుల్ని కూడా సమకూర్చగలిగిందా అనేంతగా వీరి ప్రతిభ కనపడుతుంది. క్లైమాక్స్ ముందు వచ్చే పాట ‘శాతకర్ణి బహుపరాక్’ పాట రోమాలు నిఖ్కబొడుకుంటాయి. 
క్రిష్ కన్న కలకు రూపంగా మారాడు బాలకృష్ణ అందుకే వీరి ప్రయత్నం కమర్షియల్ లెక్కలో చొప్పించలేం.. ఎంత కలెక్ట్ చేసింది .. మెదటి రోజు ఎంత రాబట్టగలిగింది అనే తూకంలో తూయలేం.. చూసిన ప్రేక్షకుల మదిలో ఎంత కాలం ఉంటుంది.. తెలుగు సినిమా కి ఏం మిగిల్చింది అనుకుంటే మాత్రం నిజంగా తెలుగు వారు గర్వపడే సినిమా ‘గౌతమి పుత్ర శాతకర్ణి’  

చివరిగా:
బాలకృష్ణ వందో చిత్రం ఆయన సినిమాల గురించి మాట్లాడుకోవాలంటే మొదటి చిత్రం అవుతంది. సాహా శాతకర్ణి.. క్రిష్ తెలుగు సినిమా ఆస్థి అని సగర్వంగా చెప్పుకోవచ్చు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials