Live News Now
  • నవంబర్ 28న మెట్రో ప్రారంభానికి మోడీ గ్రీన్ సిగ్నల్.. రేపు తెలంగాణ సర్కార్‌కు వర్తమానం
  • శ్రీశైలంకు కొనసాగుతున్న వరద ఉధృతి.. జల విద్యుత్‌ ఉత్పత్తి, కాలువలకు నీటి విడుదల
  • ఎడతెరపిలేని వర్షాలతో హైదరాబాద్‌ అతలాకుతలం.. కుత్బుల్లాపూర్‌ నాలాలో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు
  • నల్గొండ జిల్లా చిట్యాలలో దారుణం.. గొంతు కోసి యువకున్ని చంపిన దుండగులు
  • వేములవాడలో యువకుడి ఆత్మహత్యాయత్నం.. పోలీస్‌స్టేషన్‌లోనే పురుగుల మందు తాగిన జకీర్‌
  • ప్రధానిని చేస్తారనుకుంటే రాష్ట్రపతి పదవి ఇచ్చారు.. ఆటో బయోగ్రఫీలో ప్రణబ్‌ రాతలపై కలకలం
  • హైదరాబాద్‌లో ఇంటర్ విద్యార్థి అదృశ్యం.. కాలేజీ ఒత్తిడే కారణమని తల్లిదండ్రులకు లేఖ
  • కాసేపట్లో తెలంగాణ జేఏసీ స్టీరింగ్‌ కమిటీ భేటీ.. అమరుల స్ఫూర్తి యాత్ర, అరెస్ట్‌ లపై చర్చ
  • విశాఖలో వీడిన గేదెల రాజు హత్య కేసు మిస్టరీ.. తొమ్మిది మంది అరెస్ట్‌, పరారీలో A-1 డీఎస్పీ రవిబాబు
  • రేపు అల్పపీడనం.. తర్వాత వాయుగుండం.. సీమ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు
ScrollLogo కలెక్టర్‌ నుంచి ఎమ్మెల్యేల వరకు కేటీఆర్ క్లాస్.. సీఎం హామీల్నే పట్టించుకోరా అంటూ ఫైర్‌ ScrollLogo విద్యార్థుల ఆత్మహత్యలపై ఏపీ సర్కార్ ‌సీరియస్.. యాజమాన్యాలే కారణమైతే చర్యలు తప్పవని వార్నింగ్ ScrollLogo తెలుగు రాష్ట్రాల్లో మరో ఐదు రోజులు వర్షాలు.. కుత్బుల్లాపూర్‌ నాలాలో యువకుడి గల్లంతు ScrollLogo గౌరీ లంకేష్ హత్య కేసులో కీలక ముందడుగు.. నిందితుల్ని గుర్తించిన సిట్..ఊహాచిత్రాల విడుదల ScrollLogo మహిళల్ని అనుమతిస్తే శబరిమల అపవిత్రం.. నిప్పు రాజేసిన ట్రావెన్‌కోర్టు బోర్డ్‌ ఛైర్మన్ ScrollLogo మరో క్షిపణి దాడికి సిద్ధమవుతున్న ఉత్తర కొరియా.. శాటిలైట్‌ చిత్రాలతో నిపుణుల అంచనా ScrollLogo హైదరాబాద్‌ ను కుదిపేస్తున్న వర్షాలు.. మరో 5 రోజులపాటు నగరానికి వానగండం ScrollLogo గంటకు గంటకు పెరుగుతున్న వరద.. శ్రీశైలం డ్యామ్‌ 7 గేట్లు ఎత్తి నీటి విడుదల ScrollLogo AP లో అన్ని విభాగాలకు సిటిజన్‌ ఛార్టర్. సకాలంలో పనులు చేయకుంటే జరిమానా ScrollLogo ఫార్ములా వన్ రేసింగ్ పేరుతో 8 కోట్లు వసూలు.. మహిళా పారిశ్రామికవేత్తపై కేసు నమోదు
Tollywood/Bollywood

సంక్రాంతి సంబరం తీసుకొచ్చిన శతమనం భవతి

Shatamanam-Bhavati-Review
Posted: 275 Days Ago
Views: 9235   

రివ్యూ         : శతమానం భవతి...
తారాగణం         : శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్, జయసుధ... తదితరులు
సంగీతం          : మిక్కీ జే మేయర్
నిర్మాత         : దిల్‌రాజు
రచన, దర్శకత్వం: వేగేశ్న సతీష్
విడుదల తేదీ    : 14.01.16


కథ :
ఆత్రేయపురం ఊరిలో ఉండే రఘురామరాజు(ప్రకాష్ రాజ్) , జానికమ్మ(జయసుధ) దంపతులకు ఆది దంపతులు అన్నంత పేరుటుంది. ఇద్దరు కొడుకులు ఒక కూతురు పెళ్ళళ్ళు చేసుకొని విదేశాలలో స్థిర పడతారు. ఎవరి సంపాదనలలో వారు మునిగిపోయి ఇంటివైపు చూడటం మానేస్తారు. అయితే వారి కొడుకులకు, కూతురికి రాజు గారు తాము విడిపోవాలనకుంటున్నాం అని కబురు పంపిస్తారు. మనవళ్ళతో  ఆడుకునే వయస్సులో వీరు విడిపోవాలనుకోవడం ఏంటని వారి కొడుకులు, కూతురు తమ ఊరికి వస్తారు. అయితే విడిపోవాలనుకునే వారిఆలోచనలకు కారణం రాజుగారు కాదు వారి మనవడు రాజు(శర్వానంద్) ఆ ఇంట్లో పెరిగిన ఆ మనవడు వారిని విడిపోయేందుకు ఎందుకు సహాకరించాడు..?
అనేది మిగిలిన కథ..?
కథనం:
‘శతమానం భవతి’ అంటే వందేళ్ళు బతకమని.. అయితే ఆ బతుకు ఎలా ఉండాలి.. ఎవరితో ఉండాలో అనేది మాత్రం ప్రశ్నగా.. ఒక వ్యధగా మారకూడదు.. ప్రతి సగటు మనిషి కుటుంబమే జీవితంగా బతుకుతాడు.. పిల్లలే సర్వసం అనుకుంటాడు. అయితే సర్వసం అనుకున్న పిల్లలు మిగిల్చిన శూన్యం భరించడం అంత తేలిక కాదు. కన్నవాళ్ళను కన్నల నిండా చూసుకోవడమే అదృష్టమవడం నిజంగా దురదృష్టకరం. ఈ పాయింటే చుట్టూ అల్లుకున్న అందమైన కుటంబ కథాచిత్రం. ప్రకాష్ రాజ్ , జయసుధ వంటి క్లాస్ ఆర్టిస్ట్ లు శర్వానంద్ వంటి  హీరో ఈ కథకు దొరకడం కథ ను మరింత ఆసక్తిగా మార్చింది. ఊళ్ళళ్ళో ఏముంటుంది అనే పడికట్టు పదాలను రాజు క్యారెక్టర్ తో సమాధానం చెప్పాడు దర్శకుడు సతీష్ విగ్నేష్. పండుగ మూడ్ కి తగిన సినిమా. అందమైన ఆత్రేయపురం అందాలను సమీర్ రెడ్డి కెమెరాలో మరింత అందంగా కనిపించాయి. కొన్ని ఎమోషన్స్ కి ఎక్స్ పయిరీ డెట్ ఉండదు సరైన సన్నివేశంలో పడితే పాత ఫార్ములా అయినా ఇబ్బంది పెట్టదు. అలాంటి సన్నివేశాలనే నమ్ముకున్నాడు దర్శకుడు సతీష్. తన బాబాయి ప్రేమకథను చెప్పే సన్నివేశంలో వచ్చే పాట తో తన లోని టాలెంట్ ని చూపించాడు. అయితే సినిమా అంతా నల్లేరు మీద ప్రయాణం లా సాగుతుంది. అలవాటయిన సన్నివేశాలే అయిన ఆహ్లాదకరంగా సాగడం ఈ సినిమాకు బలంగా మారింది. ఆస్ట్రేలియాలో శాటిలైట్ సైన్స్ చదివిన మేనకోడలు నిత్య, ఆత్రేయపురంలో ఐటిఐ చదివిన రాజుకు ఇంప్రెస్ అవుతుంది. తన చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదకరంగా మార్చే రాజుని ఇష్టపడటానికి బలమైన సన్నివేశం లేకపోయినా వచ్చే ప్రతి సన్నివేశం సరదాగా సాగుతుంది. షష్టిపూర్తి వయస్సులో బార్యకు విడాకులు ఇచ్చేందుకు రెడీ అయిన రాఘవరాజు, ఆ విషయం తెలుసుకొని కంగారుగా ఇంటిక వచ్చిన కుటుంబ సభ్యులు.. అసలు విషయం తెలియక వారంతా నిజంగా తనను చూసేందుకు వచ్చారని ముచ్చటపడిపోయే తల్లి.. ఆ ఇంట్లో, ఆ ఊళ్ళో అందరనీ తన వారిగా చూసుకునే రాజు.. అమాయకత్వం, కంగారు కలగలిపిన బంగార్రాజు.. అనుపమ పరమేశ్వరన్ క్యారెక్టర్ మోడ్రన్ టు ట్రెడిషనల్ మారే పరిణామాన్ని దర్శకుడు చూపించిన విధానం బాగుంది. ఇవీ ఈ సినిమాలో  పాత్రల తీరు.. వీరి మద్య నడిచే సన్నివేశాలను కొత్తగా అనిపించకోయినా మనసుకు హత్తుకుంటాయి. ఇంటర్వెల్ లో విడాకుల సంగతి తెలిసిన జానికమ్మ మీనాన్న కాదు.. నేనే విడాకులు కావాలని అడిగానని అనడం తో సినిమా కొత్త టర్న్ తీసుకుంటుంది. అయితే సినిమా లో రాజు క్యారెక్టర్ ని మరీ మంచోడుగా చూపించాడు దర్శకుడు.. అతను కనిపించే ప్రతి సీన్ లోనూ అతని గొప్పతనం చాటాలనే ప్రయత్నం కనపడుతుంది. సెకండాఫ్ లో సందర్బోచితంగా వాడిన శ్రీనివాసుని కళ్యాణం..సూపర్ హిట్ సినిమాల తో కుటుంబ సభ్యులు చేసిన డబ్ స్మాష్ వంటి సన్నివేశాలు కథ ను గుర్తురాకుండా సమర్ధవంతంగా నడిపాడు దర్శకుడు. నాల్రోజులు ఇంట్లో టివిలు బంద్ అయితే సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆగిపోతే కుటుంబం ఎలా ఉంటుందో అన్న ఆలోచన బాగుంది. నిజమే కదా అనిపిస్తుంది. జీతం ఇచ్చేవారికోసం సర్దుకు పోతారు.. జీవితం ఇచ్చిన వారి కోసం నాలుగు రోజులు కేటాయించలేరా..? అన్న ప్రశ్నకుటుంబం వదలి వెళ్ళిన వారికి సూటిగా తగులుతుంది. కంగార్రాజుగా నరేష్ నటన తప్పక ఆకట్టుకుంటుంది. ఆయన కంగారు పుట్టించే సునిశిత హాస్యం జంధ్యాలను గుర్తు చేసింది. ప్రతి కుటుంబాన్ని కదిలించే కథను రెడీ చేసుకున్న దిల్ రాజు వెంకటేశ్వరా క్రియేషన్స్ నుండి మరో మనోరంజకమైన కుటుంబ కథాచిత్రాన్ని అందించాడు.
శర్వానంద్ పాత్ర.. తన తోటి పాత్రలతో సహా అందరూ ఇష్టపడతారు. వీరభద్రం, రచ్చరవి, ప్రవీణ్ లు కామెడీ ట్రాక్ లా కాకుండా సహాజమైన హాస్యాన్ని పండించారు. బలవంతంగా నవ్వించే ప్రయత్నంకానీ ఏడిపించే ప్రయత్నం కానీ చేయలేదు దర్శకుడు. పాత్రల తాలూకు ఎమోషన్స్ ని సహజంగా పలికించేందుకు ప్రయత్నించాడు. ఇంద్రజ తన పాత్రకు మరింత అందాన్ని తెచ్చింది. ఏదో కారణంతో మాట్లాడుకోని అహాన్ని దాటితో కలిగే ఆనందాన్ని నీరజ బాగా పలికించింది. మొత్తంగా ఇది కుటుంబకథాచిత్రం... సంక్రాంతి సీజన్ ని ప్రతిబింబించే సినిమా.

చివరిగా:
సంక్రాంతి సంబరాలను అందించిన శతమానం భవతి


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials