Live News Now
  • ఏడుగురికి తీవ్ర గాయాలు.. తిరుపతి నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం..
  • టెలికాం సెక్టార్ లో మరో బిగ్ డీల్.. టెలినార్ ను టేకోవర్ చేయనున్న భారతి ఎయిర్ టెల్
  • ప్రస్తుతం దేశంలోని ఏడు సర్కిళ్లలో సేవలందిస్తున్న టెలినార్..
  • ఇవాళ విద్యాసంస్థల బంద్ కు టిజెఎసి పిలుపు..
  • నిరుద్యోగ ర్యాలిపట్ల ప్రభుత్వ వైఖరికి నిరసనగా బంద్..
  • రంగారెడ్డి: కొత్తూరులోని అమెజాన్ గోదాములో చోరి.. 36 ల్యాప్ టాప్ లు అపహరణ.. ఐదుగురు అరెస్ట్
  • గుంటూరు: ఐడిబిఐ కుంభకోణంలో మూడో ఎఫ్ఐఆర్ నమోదు.. మరో 31 మందిపై సిబిఐ కేసు..
  • గుంటూరుతో పాటు బాపట్ల ఆంధ్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులను కూడా మోసం చేసిన ముఠా..
  • ఢాకా: బంగ్లాదేశ్ లో దొంగనోట్ల ముఠా అరెస్ట్.. రు.2వేల నకిలీ నోట్లను భారత్ కు తరలిస్తున్న..
  • పలువురు పాకిస్థానీయులను అరెస్ట్ చేసిన బంగ్లాదేశ్ పోలీసులు..
ScrollLogo హైదరాబాద్: కామాటిపుర పిఎస్ నుంచి జెఎసి ఛైర్మన్ కోదండరామ్ విడుదల... ScrollLogo ఇవాళ్టినుంచి విజయవాడ-హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ ఆంక్షలు.... ScrollLogo దుర్గగుడి టోల్ గేట్ కుమ్మరిపాలెం సెంటర్ వరకు వాహనాల మళ్లింపు.. ScrollLogo హైవే పనుల నిమిత్తం ఇబ్రహీంపట్నం మీదుగా వచ్చే వాహనాలు.. ScrollLogo గొల్లపూడి మీదుగా సీతారాం సెంటర్ వైపు దారి మళ్లింపు.. ScrollLogo విజయవాడ-హైదరాబాద్ వాహనాలు చిట్టినగర్ నుంచి గొల్లపూడి మీదుగా మళ్లింపు.. ScrollLogo జమ్ముకాశ్మీర్: పోషియన్ లో ఉగ్రవాదుల దాడి.. ఐదుగురు జవాన్లు సహా మహిళ మృతి ScrollLogo మరో ముగ్గురు జవాన్లకు తీవ్రగాయాలు.. ScrollLogo పెట్రోలింగ్ నిర్వహిస్తున్న జవాన్లపై కాల్పులకు పాల్పడిన ఉగ్రవాదులు.. ScrollLogo కడప: దువ్వూరు(మ)కానగూడురు వద్ద డివైడర్ ను ఢీకొని టాటా ఏస్ వాహనం బోల్తా..ముగ్గురు మృతి

ఫెదరర్, నాదల్ ఢీ.. అందరి చూపు మెల్‌బోర్న్ వైపే

Roger-Federer-vs-Rafael-Nadal-Australian-Open-2017-men's-final
Posted: 25 Days Ago
Views: 519   

ఎన్నాళ్ళో వేచిన ఉదయం. ప్రస్తుతం టెన్నిస్ ఫ్యాన్స్ అంతా ఇదే పాట పాడుకుంటున్నారు. మళ్ళీ చూడలేమనుకున్న మ్యాచ్‌ను  ఎంజాయ్‌ చేయబోతున్నారు. రెండు కొదమసింహాలు టెన్నిస్ కోర్టులో తలపడుతోన్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అందరి చూపు మెల్‌బోర్న్ పైనే నిలుస్తోంది.
ప్రపంచ టెన్నిస్‌లో కొందరి ఆటగాళ్ళ మధ్య జరిగే మ్యాచ్‌లు చిరకాలం గుర్తిండిపోతాయి. దీనిలో రోజర్ ఫెదరర్,రఫెల్ నాదల్ మధ్య పోరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గ్రాండ్‌శ్లామ్ అయినా ఏటీపీ టోర్నీ అయినా వీరిద్దరూ తలపడితే అభిమానులకు పండగే. తాజాగా మూడు పదుల వయసు మరోసారి ఫెదరర్‌-నాదల్ గ్రాండ్‌శ్లామ్ కోసం తలపడబోతున్నారు. ఈ పోరులో ఎవరు గెలిచినా చరిత్రే.. ఎందుకంటే గ్రాండ్‌శ్లామ్ విజయం గత కొన్నేళ్ళుగా వీరిద్దరినీ ఊరిస్తూ వస్తోంది. 35 ఏళ్ళ వయసులో తనదైన ఆటతీరుతో ఫైనల్‌కు దూసుకొచ్చిన ఫెదరర్ 18వ గ్రాండ్‌శ్లామ్ గెలుచుకునేందుకు ఉవ్విళ్ళూరుతున్నాడు. రిటైర్మెంట్‌పై చాలా కాలంగా వార్తలు వస్తున్నా... ఎప్పటికప్పుడు వాటిని కొట్టిపారేస్తోన్న ఫెడెక్స్ తాజా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరడం ద్వారా అరుదైన రికార్డులకు చేరువయ్యాడు. అయితే నాదల్‌తో గత రికార్డులు మాత్రం ఫెదరర్‌కు ప్రతికూలంగా ఉన్నాయి.
వాయిస్ ఓవర్ 2 ః
మరోవైపు ఫిట్‌నెస్ సమస్యలతో చాలా కాలంగా మేజర్ టోర్నీల్లో పెద్దగా రాణించని నాదల్ రెండేళ్ళ తర్వాత గ్రాండ్‌శ్లామ్ ఫైనల్‌కు చేరుకున్నాడు. కెరీర్ ముగిసిపోయిందనుకున్న విమర్శల మధ్య ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అతని ఆటతీరు అందరికీ షాకిస్తోంది. గ్రాండ్‌శ్లామ్ విజయం అందని ద్రాక్షే అనుకున్న సమయంలో రఫా జూలు విదిల్చి చిరకాల ప్రత్యర్థితో టైటిల్ పోరుకు సిధ్ధమయ్యాడు. ఇప్పటి వరకూ రికార్డులను చూస్తే ఫెదరర్‌పై నాదల్‌దే పైచేయిగా ఉంది. వీరిద్దరూ 8 సార్లు తలపడితే.. ఆరింటిలో నాదలే గెలిచాడు. అయితే చాలా వరకూ ఐదు సెట్ల హోరాహోరీ పోరు జరిగిన నేపథ్యంలో ఎవ్వరినీ తక్కువ అంచనా వేయలేం. మొత్తం మీద ఏడాది తొలి గ్రాండ్‌శ్లామ్ ఫైనల్లో దిగ్గజాల పోరు అభిమానులకు సూపర్ సండేగా మిగిలిపోవడం ఖాయం.


Read Also
NRI Edition
AP News
Telangana News
Pata
Sports
Daily Specials