Posted: 443 Days Ago
Views: 357
లండన్ లో ఎన్నారై టీఆర్ఎస్ సెల్ నూతన కార్యవర్గ సమావేశం జరిగింది. అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను లండన్ లో ఘనంగా నిర్వహించడంతోపాటు.. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. ఖండాతరాల్లో ఉన్నా... పార్టీ కోసం పనిచేసే అవకాశం కల్పించిన కెసిఆర్కి.. ఎన్నారై కార్యకర్తల్ని ప్రోత్సహిస్తున్న ఎంపీ కవితకు లండన్ ఎన్నారై సెల్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం కృతఙ్ఞతలు తెలిపారు.