Live News Now
  • రాజస్థాన్లో వరద బీభత్సం.. ఇళ్ల పైకప్పులు ఎక్కి ప్రాణాలు రక్షించుకున్న జనం
  • భారీ వర్షాలు వరదలతో గుజరాత్ అతలాకుతలం
  • నిరాశ్రయులుగా మారిన వేలాది మంది.. 30 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు
  • డోక్లాం వివాదంపై అందరికీ ఆమోదయోగ్య పరిష్కారం కనుగొంటాం.. లోక్‌సభకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం
  • చైనా పెత్తనానికి కళ్లెం వేసిన శ్రీలంక.. హంబన్‌ తోట ఓడరేవుపై చైనా పాత్ర తగ్గింపు
  • తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. 27 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు
  • శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం
  • ఎక్సైజ్‌ ఆఫీస్‌కు చేరుకున్న ముమైత్‌.. డ్రగ్స్‌ కేసులో ప్రశ్నించనున్న సిట్‌
  • కడప జిల్లాలో బైక్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి... ఒకరికి తీవ్ర గాయాలు
  • ఎమ్మెల్యేలతో లాలూ సమావేశం.. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చలు
ScrollLogo తెలంగాణలో భూములకు హై సెక్యూరిటీ కల్పించబోతున్న ప్రభుత్వం ScrollLogo భూముల క్రయవిక్రయాలు వెంటనే అప్‌లోడ్ ScrollLogo పట్టాదార్ పాస్ పుస్తకాల్లో భూ లావాదేవీల నమోదుకు చర్యలు ScrollLogo 2 వేల రూపాయల నోట్ల ముద్రణను నిలిపివేసిన ఆర్బీఐ ScrollLogo నోట్లను రద్దు చేస్తారా అన్న ప్రశ్నలకు సమాధానమివ్వని కేంద్ర ప్రభుత్వం ScrollLogo వచ్చే నెలలో కొత్త 2వందల నోటును తీసుకొచ్చే ఛాన్స్ ScrollLogo 28, 29 తేదీల్లో ఢిల్లీలో జల్ మంథన్.. హాజరవనున్న అన్ని రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు ScrollLogo నదుల అనుసంధానంపై చర్చే ప్రధాన అజెండా ScrollLogo దేశవ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగుల సమ్మె.. వేతన సవరణ కోరుతూ ఆందోళనకు దిగిన ఉద్యోగులు ScrollLogo గవర్నర్ నిర్ణయంపై తేజస్వి యాదవ్ మండిపాటు.. నితీష్ కుమార్ దారుణంగా మోసం చేశాడంటున్న లాలూ

నాని ఈజ్ ఎవ్విర్ థింగ్ 'నేను లోకల్'

Nani-nenu-local-review
Posted: 175 Days Ago
Views: 4186   

రివ్యూ : నేను లోకల్

నటీనటులు: నాని, కీర్తి సురేష్, నవీన్ చంద్ర, సచిన్ ఖేడ్కర్, పోసాని కృష్ణమురళి, ఈశ్వరి రావు, తులసి తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: నిజార్ షఫి
రచన: ప్రసన్న కుమార్ - సాయికృష్ణ - త్రినాథరావు నక్కిన
నిర్మాత: దిల్ రాజు
దర్శకత్వం: త్రినాథ రావు నక్కిన

నాని కి ఏ ఏరియాలో అయినా లోకల్ ఇమేజ్ ఉంటుంది. అంటే మన కుర్రాడే అన్నంత ఆదరణ ఉంటుంది. పెద్ద సౌండ్ చేయకుండా స్టార్ డమ్ లోకి వచ్చేసాడు నాని. నాని మంచి సినిమా చేసాడు అనే క్లాంప్లిమెంట్ తో పాటు నాని ఉంటే మంచి సినిమా అన్నంత కాన్ఫిడెంట్ ని పెంచేసాడు. ఇక దిల్ రాజు వంటి అభిరుచి గల నిర్మాత, కీర్తి సురష్ వంటి టాలెంటెడ్ బ్యూటీ, డియస్ పి వంటి స్వరాల సునామీ కలసి ‘‘నేను లోకల్ ’’ కి అన్ని ఏరియాస్ లో మంచి టాక్ ని తెచ్చాయి. నాని లోకల్ ఇమేజ్ ఏంటో చూద్దాం...

కథేంటి:
ఇంజనీరింగ్ కంప్లీట్ చేయడానికి మార్చ్ టు సెప్టెంబర్ లు తిరుగుతున్న బాబు(నాని) ఒక ఇన్విజలేటర్ సాయంతో బి.టెక్ అయ్యిందనిపిస్తాడు. ఒకసారి రోడ్డుమీద చూసిన కీర్తి(కీర్తిసురేష్) ని చూసి తనను ప్రేమిస్తాడు. తన ఎమ్.బి.ఎ. చదుతువుతుందని తెలసుకొని తన కాలేజ్ లోనే ఎమ్.బి.ఎ. జాయిన్ అవుతాడు. తనను డిస్టర్బ్ చేయడమే పనిగా పెట్టుకున్న బాబుకి కీర్తి కూడా ఇప్రెస్ అవుతుంది. కానీ తన ప్రేమకోసం తనకు దూరంగా వెళ్ళి పోలీస్ అధికారి గా తిరిగి వస్తాడు సిద్దు. కీర్తి తండ్రి అతనితో పెళ్ళి ఫిక్స్ చేస్తాడు. మరి యాట్యిటూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అని బతికే బాబు ని తన తండ్రిని ఒప్పించి పెళ్ళి చేసుకోమంటుంది కీర్తి .. మరి బాబు లవ్ స్టోరీ ఎలాంటి మలుపులుతీసుకుంది అనేది మిగిలిన కథ..?
కథనం:
హీరో ప్రవర్తన మీద పూర్తిగా ఆధారపడిన సినిమా ఇది. ఏ సమస్య వచ్చినా అతను హ్యాండిల్ చేసే విధానం ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తుంది. పెద్దగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోడు.. పెద్దగా లెక్కలు కట్టి అనుబంధాలను ఏర్పాటు చేసుకోడు.. చూడగానే లవ్ అంటాడు.. ఆ అమ్మాయి ఎమ్.బి.ఎ. చదువుతుందని తెలియగానే ఆలోచించకుండా తనూ అదే కాలేజ్ లో జాయిన్ అవుతాడు. ప్రేమించిన అమ్మాయి అడగకుండానే ఆమె ఫ్రెండ్ పెళ్ళిని లైఫ్ రిస్క్ చేసి మరీ చేస్తాడు. ఇదీ హీరో క్యారెక్టర్ ఇలాంటి హీరో యాట్యిటూడ్ మీద డింపెండ్ అయి సినిమా నంతా సరాదాగా నడిపాడు దర్శకుడు త్రినాథరావు. ఒక సీన్ లో పరీక్షకువెళుతున్న కొడుతుతో తల్లి ‘‘ భగవంతుడికి దణ్ణం పెట్టుకొని వెళ్ళరా మంచి జరుగుతుంది అంటుంది’’ అందుకు  హీరో ‘‘ అయినా నేను ఇది చేస్తే తాను అది చేస్తా అని బేరాలాడే దేవుడు నాకొద్దు’’ అంటాడు హీరో.. ఈ ఒక్క సీన్ తో హీరో ఎంటో అర్దం చేసుకోవచ్చు. ఎదుటవాళ్ళకు నచ్చాలంటే వారికి కావాల్సింది ఇవ్వాలి, వారికి నచ్చినట్లు మారాలి లేదా వారి అంచనాలకు మించి ఎదగాలి జనరల్ గా సమాజంలో ఉండే లెక్కలు ఇవి. కానీ ఆ లెక్కలును పట్టించుకోని లెక్కలేని తనం హీరో సొంతం. అందుకే ఆ క్యారెక్టర్ లో నిజాయితీ కథలో తనతో పాటు తిరిగే వారికే కాదు. ప్రేక్షకులకు కూడా బాగా నచ్చుతుంది. ప్రేమకథలో చాలా సాధారణంగా వచ్చే సమస్యలే లోకల్ హీరో బాబు కి వస్తాయి. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోమనే మామ, నాకోసం ఏదో ఒకటి చేయి అని బ్రతిమిలాడే ప్రేమించిన అమ్మాయి.. కానీ బాబు గాడు మారడు..కానీ గెలుస్తాడు. అది ఎలా అనే పాయింట్ ని ఎంటర్ టైన్మెంట్ గా నడిపాడు దర్శకుడు త్రినాథరావు. హీరో క్యారెక్టర్ లో ని కాన్ఫిడెంట్ కి తన టైమింగ్ యాడ్ చేసి నాని సినిమాని తన చుట్టూ తిప్పుకున్నాడు. కీర్తి సురేష్ చాలా అందంగా కనిపించింది. పాటల బాగున్నాయి. అరరే ఎక్కడ ఎక్కడ అనే పాట పిక్చరైజేషన్ బాగుంది. నాని క్యారెక్టర్ కి కాస్త కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి త్రినాథరావ్ డిజైన్ చేసిన ఫైట్ బాగావర్క్ అవుట్ అయ్యింది. ప్రేమించిన అమ్మాయి కోసం ఏం చేసి అయినా సరే ప్రేమను గెలిపించుకుందాం అనుకుంటారు.. కానీ ప్రేమించిన అమ్మాయి కోసం పెద్దగా ఏం చేయక్కర్లేదు నిజాయితీగా ప్రేమిస్తే చాలు అనే లాజిక్ ని  మిస్ అవ్వకుండా ఉంటే చాలనే పాయింట్ చుట్టూ అల్లిన ప్రేమకథే ఇది. రోటీన్ గా అనిపించే ప్రేమకథ గా అనిపించింనా డైలాగ్స్ తో సీన్స్ ని ఎంటర్ టైన్ చేసాడు దర్శకుడు. నవీన్ చంద్ర  చేయడం ఆ క్యారెక్టర్ కి ఫ్రెష్ నెస్ ని తెచ్చింది. కొత్త లుక్ లో కనిపించిన నవీన్ నేను లోకల్ తో తన కెరియర్ లో కొత్త టర్న్ తీసుకున్నాడనిపించింది. మిగతా క్యారెక్టర్స్ పెద్దగా చేసేంత స్కోప్ లేదు. కీర్తి సురేష్, నాని ల మద్య ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. రావు రమేష్  క్యారెక్టర్  క్లైమాక్స్ లో అటెన్షన్ ని రాబట్టగలిగింది. క్లైమాక్స్ లో మాత్రం డ్రామా డోస్ పెంచాడు దర్శకుడు. మొత్తానికి నాని కుండే ‘‘లోకల్’’ ఇమేజ్ బాబు క్యారెక్టర్ మరింత బలంగా మార్చింది  శతమానం భవతి వంటి ప్యామిలీ ఎంటర్ టైనర్ తర్వాత దిల్ రాజు ఈ లైట్ హార్టడ్ లవ్ స్టోరీ ని ఫుల్ ఎంటర్ టైన్మెంట్ తో అందించాడు. లోకల్ ప్రేమకథలు రోటీన్ గానే ఉంటాయి..కానీ కనెక్ట్ అవుతాయి. ఎంటర్ టైన్ చేస్తాయి.

చివరిగా:
నాని ఈజ్ ఎవ్రీథింగ్. సరదాగా సాగే ప్రేమకథలో నాని చేసిన అల్లరి ఆకట్టుకుంది. 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials