Live News Now
  • నంద్యాల ఉప ఎన్నిక వైసీపీ అభ్యర్ధిగా శిల్పా మోహన్‌రెడ్డి పేరును ఖరారు చేసిన జగన్
  • తూర్పుగోదావరి ఏజెన్సీలో అనూహ్య మరణాలు.. చాపరాయి గ్రామంలో 3రోజుల్లో 15 మంది మృతి
  • వాంతులు, విరోచనాలతో బాధపడుతున్న గిరిజనులు.. ప్రత్యేక వైద్య బృందాన్ని పంపిన అధికారులు
  • అత్యుత్తమ చికిత్స ఇవ్వాలని ఆదేశించిన సీఎం చంద్రబాబు
  • హైదరాబాద్ లో భారీ వర్షం: పాతబస్తీలో వర్షంతో రంజాన్ మార్కెట్లు ఖాళీ
  • తెలంగాణకు మరో రెండు రోజులు వర్ష సూచన.. బంగాళాఖాతంలో అల్పపీడనం
  • దేశ వ్యాప్తంగా రంజాన్ పండుగ సంబరాలు.. ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
  • నంద్యాల వైసీపీ అభ్యర్థిగా శిల్పా మోహన్ రెడ్డి.. ఉప ఎన్నికలో గెలుపుపై ధీమా
  • గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన శిల్పా మోహన్ రెడ్డి.. ఇప్పుడు ఫ్యాన్ గుర్తుపై బరిలో
  • 2014లో ఫ్యాన్ వైసీపీ జెండాతో గెలిచిన భూమా నాగిరెడ్డి.. ఇప్పుడు సైకిల్‌ తో ఢీకొడుతున్న భూమా బ్రహ్మానందరెడ్డి
ScrollLogo ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. హీరో రవితేజ సోదరుడు భరత్‌ మృతి ScrollLogo శంషాబాద్‌ మండలం కోత్వాల్‌గూడ దగ్గర లారీని ఢీకొట్టిన భరత్‌ కారు ScrollLogo ప్రమాదంలో అక్కడికక్కడే చనిపోయిన భరత్‌ ScrollLogo విజయవాడలో దారుణం .. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమన్నందుకు స్ర్కూడైవర్ తో దాడి ScrollLogo తీవ్రంగా గాయపడిన వ్యాపారి.. వ్యాపారి పరిస్థితి విషమన్న డాక్టర్లు ScrollLogo పాకిస్తాన్‌లో చమురు ట్యాంకర్‌కు నిప్పు.. 123మంది మృతి.. 40మందికి గాయాలు.. ScrollLogo బోరుబావిలో పడిన చిన్నారి మృతి..ఫ్లష్ ఔట్ ద్వారా చిన్నారి అవశేషాలు వెలికితీత..కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు.. ScrollLogo స్వగ్రామంలో చిన్నారి మీనా అంత్యక్రియలు.. శోకసంద్రంలో తల్లిదండ్రులు.. ScrollLogo ఉస్మానియాకు భరత్ మృతదేహం.. ప్రమాద స్థలంలో మద్యం సీసాలు లభ్యం ScrollLogo జీఎస్టీకి వ్యతిరేకంగా రాజమండ్రి వస్త్ర వ్యాపారుల ఆందోళన... 27 నుంచి 29 వరకూ షాపులు బంద్

రివ్యూ: అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సింగం3

Review:Singham-3-action-movie
Posted: 137 Days Ago
Views: 3482   

రివ్యూ: సింగం-3 
నటీనటులు: సూర్య , శ్రుతిహ‌స‌న్‌, అనుష్క‌,రాధికా శరత్‌కుమార్, నాజర్, రాడాన్ రవి, సుమిత్ర..... 
సంగీతం:  హారిస్ జైరాజ్
నిర్మాత: మల్కాపురం శివకుమార్‌
దర్శకత్వం: హ‌రి
రిలీజ్ డేట్ : 2017 ఫిబ్రవరి 9 
పవర్ పుల్ పోలీస్ పాత్రలకు పేటెంట్ తీసుకున్నాడు సూర్య. సింగం తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న సూర్య కి ఈ పోలీస్ పాత్రే మాస్ లో బేస్ ని కాపాడుతుంది. సింగం 3 తో మరోసారి తన లౌడ్ యాక్షన్ ని చూపాడు.. మరి సింగం ఎప్పటిలాగే గర్జించిందా..?

కథ:
మంగళూరు లో ఒక పోలీస్ అధికారి మర్డర్ జరుగుతుంది. ఈ సంఘటన మొత్తం కర్నాటక ను కుదిపేస్తుంది. ఈ కేస్ ని నరసింహా(సూర్య) కి అప్పగిస్తుంది కర్నాటక ప్రభుత్వం. డెప్యూటేషన్ పై మంగుళూర్ కి వచ్చిన నరసింహా తనదైన శైలిలో ఈ కేస్ ని సాల్వ్ చేసేందుకు ప్రయత్నిస్తాడు.  అగ్ని(శృతిహాసన్) అనే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ నరసింహాకు ఫ్రెండ్ గా దగ్గరయి, నరసింహా ఆపరేషన్స్ ని తప్పుగా అర్దం చేసుకొని అతను అవినీతి అధికారి అని న్యూస్ వేస్తుంది.  కమీషనర్ హాత్య వెనుక రాజకీయకోణమే కాదు ఒక మాఫియా దాగుందని తెలుసుకుంటాడు నరసింహా. ఆస్ట్రేలియాలోని విఠల్ అనే బిజినెస్ మాన్ చేస్తున్న కమీషనర్ హాత్యకు కారణం . మరి నరసింహా  వీటిని ఎలా ఛేదించాడు. తనపై వచ్చిన ఆరోపణలను ఎలా ఎదుర్కున్నాడు..? కావ్యకు విడాకులు ఇచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మిగిలిన కథ..? 

కథనం:
సింగం, రెండు పార్ట్ లు ఎంజాయ్ చేసిన ప్రేక్షకుల ను ఏమాత్రం డిజప్పాయింట్ చేయలేదు సూర్య. పోలీస్ ఆఫీసర్ గా సూర్య అదే పవర్ ని చూపాడు. ఈసారి మొబైల్ నెటెవర్క్ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథనం ఇంట్రెస్ట్ గా ఉంది. కాల్ డేటాను ఎలా మేనేజ్ చేయవచ్చో చేప్పే సన్నివేశాలు ఇంట్రెస్ట్ గా ఉన్నాయి. పోలీస్ ఆట్యిటూడ్ ని ఎమాత్రం మిస్ చేయకుండా పవర్ పుల్ గా కనిపించాడు సూర్య.  ఇక పరిగెత్తే కెమెరాలు.. పాస్ట్ ఫార్వడ్ లో కనిపించే పోలీస్ ఆపరేషన్స్ తో పాటు మొబైల్ సజేషన్ లో కూడా షాట్స్ ని తీసాడు దర్శకుడు హారి. ఫైట్స్ సీన్స్ లో ప్రతక్ష్యమయ్యే సింహా లాగా అవికూడా కాస్త ఇబ్బందిగానే మారాయి. పోలీస్ కమీషనర్ హాత్య కేసుపై మంగుళూరు కి వచ్చిన సూర్య ఆ హాత్య ను పరిశోదించే సన్నివేశాలు బాగున్నాయి. సన్నివేశాల్లోని స్పీడ్ గానీ అందులోని పంచ్ లు గానీ కొత్తగా అనిపించకపోవడం సింగం 3 కి ప్రధాన సమస్యగా మారింది.  స్ర్కాప్ ని ఇండియాకి డంప్ చేస్తూ ఇక్కడ వాతావరణాన్ని కలుషితం చేస్తూ ప్రాణాలతో ఆడుకంటున్న ఒక ఇంటర్నేషనల్ వ్యాపారితో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ సాగించే పోరాటం ఆసక్తిగా మార్చాడు. సింగం ఆట్యిటూడ్ ని కంటిన్యూ చేసాడు. సీక్వెల్ కి ఉన్న పెద్ద అడ్డంకి కొన్ని  పాత్రలను కొనసాగించడం.. పార్ట్ వన్ నుండి కంటిన్యూ అవుతున్న పాత్రలను కొనసాగిస్తూనే కొత్త పాత్రలతో కథను నడపాలి. అందుకే అనుష్క, రాజారవి, నాజర్ వంటి పాత్రల ఈ సీక్వెల్ కూడా నామమాత్రంగానే కంటిన్యూ అవుతాయి. అనుష్క రెండు సెంటిమెంట్ సీన్స్ మరో రెండు పాటలకు మాత్రమే పరిమితం అయ్యింది. శృతిహాసన్ క్యారెక్టర్ కాస్త సెంకండ్ పార్ట్ లో హాన్సికను  తలపించినా ఆ పాత్రను ఒక ఇంపార్టెంట్ ని కలిపించాడు దర్శకుడు హారి. సింగం 3 కి ప్రధాన బలం సూర్య మాత్రమే. వన్ డే ఆపరేషన్ ఇన్ మాంగళూర్ ఎపిసోడ్  బాగా డిజైన్ చేసాడు హారి. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో థాకూర్ అనూప్ క్యాబిన్  లో సూర్య ఇచ్చే ఝలక్ మాస్ ఆడియన్స్ తో ఈలలు వేయిస్తుంది.  పోలీస్ ఆపరేషన్స్ అండ్ ఎమోషన్స్ ని రియాలిటీకి దగ్గరగా చూపించడంలో తన బ్రాండ్ కనిపించింది. ఇక ఈ సీక్వెల్ లో కామెడీ బాగా ఫెయిల్ అయ్యింది. పోలీస్ ఆపరేషన్స్ ని బాగా డిజైన్ చేయడంతో సెకండాఫ్ సింగం చాలా గ్రిప్పింగా ఉంది. పాటలు  సినిమా మూడ్ కి బ్రేక్ లు వేసాయి. శరత్ సక్సెనా పాత్రను ఎండ్ చేసేందుకు సూర్య చేసిన ఛేజింగ్ ఆపరేషన్ హైలెట్ గా ఉంది. మొబైల్ నెట్ వర్క్ లను హ్యాక్ చేస్తూ ఈసారి సింగం చేసే ఆపరేషన్స్ ఈసారి కొత్తగా అనిపించాయి. ఒక రాజకీయాలు, పోలీస్ ఛేజింగ్స్ వంటివి సింగం తో పాటు ఆడియన్స్ కి కూడా అలవాటు అయ్యాయి. సినిమా అంతా సూర్య పై నడిచింది. ఆ పాత్రను ఇష్టపడే ప్రేక్షకులకు సింగం 3 తప్పకుండా నచ్చుతుంది. ఒక సిన్సియర్ అండ్ స్మార్ట్ పోలీస్  ఇంటర్నేషనల్ క్రిమినల్స్ తో సాగించే వేట ఇంట్రెస్ట్ గా ఉంది. అయితే థ్రిల్లింగ్ గా అనిపించే సన్నివేశాలను ఆశిస్తే మాత్ర సింగం 3 కాస్త డిజప్పాయింట్ చేస్తుంది. ఎమోషన్స్ కంటే యాక్షన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన హారి సింగం ను లౌడ్ యాక్షన్ తో మలిచాడు.   అవుట్ అండ్ అవుట్ పోలీస్ యాక్షన్ తో పరిగెత్తే ఈమూవీ సూర్య ఖాతాలో మరో మాస్ హిట్ గా చేరుతుంది. 

చివరిగా:
అవుట్ అండ్ అవుట్ యాక్షన్ 


Read Also
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials