Live News Now
  • రాష్ట్రంలో శాంతిభద్రతల్ని భగ్నం చేయాలని చూస్తున్నారని విమర్శలు
  • తెలుగు రాష్ట్రాల్లో ఫేక్‌ సర్టిఫికెట్ల కలకలం.. ప్రమోషన్లు పొందిన ఉద్యోగులపై ఆరా
  • పదోన్నతులు రద్దు చేసి విచారణ చేపట్టి ప్రభుత్వం
  • విశాఖ జిల్లాలో చంద్రబాబు పర్యటన.. రెండో విడత పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం
  • రెండో విడతగా 21వేల 225 మందికి పట్టాలు
  • కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా సైన్యం త్యాగాలను స్మరించుకున్న ప్రధాని మోడీ
  • ప్రాణత్యాగాలు చేసి దేశాన్ని రక్షించారని ట్వీట్
  • తదుపరి సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ దీపక్ మిశ్రా
  • మిశ్రా పేరును సిఫార్సు చేసిన సీజేఐ జస్టిస్ ఖేహార్
  • ఆగస్ట్ 27న పదవీ విరమణ చేయనున్న జస్టిస్ ఖేహార్
ScrollLogo విచారణ బృందంలో మహిళా అధికారులు ScrollLogo ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఆత్మహత్య ScrollLogo పాలేరు రిజర్వాయర్‌లోకి దూకి కుటుంబం ఆత్మహత్య ScrollLogo విశాఖలో ఇంజినీరింగ్ విద్యార్థిని కిడ్నాప్.. బలవంతంగా కారులో ఎక్కించుకుపోయిన పోకిరి ScrollLogo కారు నెంబర్ నోట్ చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసిన తోటి విద్యార్థులు ScrollLogo కిడ్నాపర్‌ను పట్టుకున్న పీఎం పాలెం పోలీసులు ScrollLogo ఢిల్లీ టూర్‌లో బిజీబిజీగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ScrollLogo రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, అనుమతులపై ఫోకస్‌ ScrollLogo ముద్రగడ పాదయాత్ర వెనుక వైసీపీ హస్తం ఉందన్న చినరాజప్ప ScrollLogo రాజకీయ లబ్ది కోసమే పాదయాత్ర చేస్తున్నారని ఫైర్

రెండేళ్ల చిన్నారికి వాతలు పెట్టిన తల్లి

Mother-Hits-Child-With-Hot-Spoon
Posted: 164 Days Ago
Views: 6904   

బిడ్డకు చిన్న దెబ్బ తగిలితేనే తల్లి గుండె తల్లడిల్లుతుంది. కానీ, కనికరమే మరచిన ఆ తల్లి కన్నబిడ్డకు వాతలు పెట్టి రాక్షసానందాన్ని పొందింది. కూతర్ని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లి కసాయిగా మారింది. అమ్మతనానికే మాయని మచ్చ తెచ్చిన ఈ ఘటన విజయవాడ నడిబొడ్డున జరిగింది. పసిబిడ్డ ఒళ్లంతా వాతలు నొప్పులు తాళలేక ఈ పసిబిడ్డ పడే బాధ చెప్పనలవి కాకుండా ఉంది. ఓ శాడిస్ట్‌ తల్లి కడుపున పుట్టిన పాపానికి లోకం తెలియని వయసులో నరకం అనుభవిస్తోంది ఈ చిట్టితల్లి. రెండేళ్లు కూడా నిండని ఈ పసిగుడ్డు ఏం చేసిందని ఇంత శిక్ష వేసింది..? పక్క తడిపినందుకే ఇంతటి దండనా..? విజయవాడలో జరిగిన ఈ దారుణం అందరినీ కలవరానికి గురిచేసింది. చిన్నారి పడే బాధను చూసిన ప్రతి ఒక్కరి కళ్లూ చెమ్మగిల్లుతున్నాయి. కానీ, ఆ తల్లికి మాత్రం కనీసం కనికరం కూడా లేదు. రాజరాజేశ్వరిపేటకు చెందిన అలీ, ఆస్మాన్‌ బేగం దంపతులకు ఇద్దరు పిల్లలు. పెళ్లయిన దగ్గర్నుంచే ఇద్దరి మధ్యా గొడవలు జరుగుతున్నాయి. అయితే భర్తమీద కోపాన్ని తన పిల్లలపై చూపించేది ఆస్మాన్‌ బేగం. ఈ నేపథ్యంలోనే నిద్రలో పక్క తడిపిందన్న కారణంతో తన రెండేళ్ల బిడ్డ ఆస్రిన్‌కు నరకం చూపించింది. నూడుల్స్‌ స్టిక్‌ను కాల్చి వాతలు పెట్టింది. గుక్కపట్టి ఏడుస్తున్నా కనీసం తల్లిగుండె కరగలేదు. కసిగా ఒళ్లంతా వాతలు పెట్టింది. అలీ ఇంటికి రాగానే, శరీరంపై గాయాలతో ఆస్రిన్‌ ఏడుస్తూ కనిపించింది. వెంటనే అతను చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. భర్తపై కోపాన్ని ఇలా పిల్లలపై తీర్చుకుంటోంది ఆస్మా బేగం. పెళ్లయిన దగ్గర్నుంచి ఇలాగే ప్రవర్తిస్తోందని అలీ చెబుతున్నాడు. ఆమె బంధువులకు చెప్పినా ఫలితం లేదని, చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ ఘటన ఇరుగు పొరుగుకు తెలియడంతో ఆస్మా బేగం అక్కడ్నుంచి పరారైంది. ఘటనపై మంత్రి కామినేని ఆదేశాలతో ఆస్మా బేగంపై పోలీసులు కేసు నమోదు చేశారు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials