Live News Now
  • నంద్యాల ఉప ఎన్నిక వైసీపీ అభ్యర్ధిగా శిల్పా మోహన్‌రెడ్డి పేరును ఖరారు చేసిన జగన్
  • తూర్పుగోదావరి ఏజెన్సీలో అనూహ్య మరణాలు.. చాపరాయి గ్రామంలో 3రోజుల్లో 15 మంది మృతి
  • వాంతులు, విరోచనాలతో బాధపడుతున్న గిరిజనులు.. ప్రత్యేక వైద్య బృందాన్ని పంపిన అధికారులు
  • అత్యుత్తమ చికిత్స ఇవ్వాలని ఆదేశించిన సీఎం చంద్రబాబు
  • హైదరాబాద్ లో భారీ వర్షం: పాతబస్తీలో వర్షంతో రంజాన్ మార్కెట్లు ఖాళీ
  • తెలంగాణకు మరో రెండు రోజులు వర్ష సూచన.. బంగాళాఖాతంలో అల్పపీడనం
  • దేశ వ్యాప్తంగా రంజాన్ పండుగ సంబరాలు.. ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
  • నంద్యాల వైసీపీ అభ్యర్థిగా శిల్పా మోహన్ రెడ్డి.. ఉప ఎన్నికలో గెలుపుపై ధీమా
  • గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన శిల్పా మోహన్ రెడ్డి.. ఇప్పుడు ఫ్యాన్ గుర్తుపై బరిలో
  • 2014లో ఫ్యాన్ వైసీపీ జెండాతో గెలిచిన భూమా నాగిరెడ్డి.. ఇప్పుడు సైకిల్‌ తో ఢీకొడుతున్న భూమా బ్రహ్మానందరెడ్డి
ScrollLogo ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. హీరో రవితేజ సోదరుడు భరత్‌ మృతి ScrollLogo శంషాబాద్‌ మండలం కోత్వాల్‌గూడ దగ్గర లారీని ఢీకొట్టిన భరత్‌ కారు ScrollLogo ప్రమాదంలో అక్కడికక్కడే చనిపోయిన భరత్‌ ScrollLogo విజయవాడలో దారుణం .. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమన్నందుకు స్ర్కూడైవర్ తో దాడి ScrollLogo తీవ్రంగా గాయపడిన వ్యాపారి.. వ్యాపారి పరిస్థితి విషమన్న డాక్టర్లు ScrollLogo పాకిస్తాన్‌లో చమురు ట్యాంకర్‌కు నిప్పు.. 123మంది మృతి.. 40మందికి గాయాలు.. ScrollLogo బోరుబావిలో పడిన చిన్నారి మృతి..ఫ్లష్ ఔట్ ద్వారా చిన్నారి అవశేషాలు వెలికితీత..కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు.. ScrollLogo స్వగ్రామంలో చిన్నారి మీనా అంత్యక్రియలు.. శోకసంద్రంలో తల్లిదండ్రులు.. ScrollLogo ఉస్మానియాకు భరత్ మృతదేహం.. ప్రమాద స్థలంలో మద్యం సీసాలు లభ్యం ScrollLogo జీఎస్టీకి వ్యతిరేకంగా రాజమండ్రి వస్త్ర వ్యాపారుల ఆందోళన... 27 నుంచి 29 వరకూ షాపులు బంద్

రాయిలా మారుతున్న బాలుడి శరీరం

Child-Suffering-with-Mysterious-Skin-Disease-In-Bangladesh
Posted: 134 Days Ago
Views: 18692   

ఓ బాలుడి శరీరం రాతిలా మారిపోతోంది. కాళ్లుచేతులున్నా తోటి పిల్లలతో ఆడుకోలేడు. స్వయంగా  తినలేడు. నడవలేడు. దాని ప్రభావం అంతటితో ఆగలేదు. అదిప్పుడు ఆ పిల్లాడి కుటుంబానికి సామాజిక సమస్యగా కూడా మారింది. ఇంతకీ ఎందుకలా జరుగుతోంది? అదేమైనా వింతనా!  విచిత్రమా!
బండలా మారుతున్న బాలుడి శరీరం ముఖం తప్ప మిగతా బాగాల్లో ముట్టుకుంటేనే భరించలేని నొప్పి. చర్మం దళసరిగా మారిపోతోంది. ఈ బాధను అనుభవిస్తున్న ఈ బాలుడి పేరు మెహందీ హసన్. బంగ్లాదేశ్‌కు చెందిన ఈ ఎనిమిదేళ్ల బాలుడు అరుదైన చర్మ వ్యాధితో నరకం అనుభవిస్తున్నాడు. చేతులున్నా స్వయంగా తినలేడు. కాళ్లున్నా నడవలేని దయనీయ స్థితి. అందరు పిల్లల్లా ఆడుకోవాలని ఉన్నా ఈ  చర్మవ్యాధి అడ్డుపడుతోంది. చికిత్స చేయించినా తగ్గడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతులు, కాళ్లపై ఉన్న చర్మం పొలుసుబారడంతో శరీరం అంద వికారంగా మారింది. ఇదిప్పుడు ఆరోగ్య సమస్యతోపాటు సామాజిక సమస్యను తెచ్చింది. రాయిలా మారిపోతున్న శరీరం వల్ల ఇరుగుపొరుగువారు బాలుడిని చూసి భయపడిపోతున్నారు. ఎక్కడ తమ పిల్లలకు వ్యాధి అంటుకుంటుందేమోనని టెన్షన్ పడుతున్నారు. దీంతో హసన్, ఇతడి కుటుంబం మానసికంగా కుంగిపోతోంది. బాలుడికి చికిత్స చేయించే ఆర్థిక స్థోమత లేకపోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ప్రభుత్వమే ఆదుకుని తమ కుమారుడికి చికిత్స చేయించాలని, మామూలు పిల్లల్లా మార్చాలని వేడుకుంటున్నారు. 


Read Also
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials