Live News Now
  • వైద్యులు, పోలీసుల మధ్య కొరవడిన సమన్వయం...పిఠాపురంలో ప్రభుత్వాసుపత్రిలో కుళ్లిన మతృదేహం
  • బెంగళూరులో భారీ వర్షం...లోతట్టు ప్రాంతాలు జలమయం
  • వరద గుప్పిట్లో ఉత్తరాది రాష్ట్రాలు...అసోం, బీహార్ లో మెరుగుపడని పరిస్థితులు
  • పోలీసులు-డాక్టర్ల పోస్టుమార్టం పంచాయితీ...పిఠాపురం ఆస్పత్రిలో చీమలుపట్టిన మృతదేహం
  • ఏపీ, తెలంగాణలో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు..ఆకట్టుకున్న సాంస్కృతి కార్యక్రమాలు, శకటాల ప్రదర్శనలు
  • 2019కి పోలవరం పూర్తి చేయడమే లక్ష్యం...పట్టిసీమతో సీమ దాహార్తి తీరుస్తున్నామన్న చంద్రబాబు
  • ఈ ఏడాదే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు...బిజినెస్ సమ్మిట్‌ తో నవశకం ఆవిష్కృతమౌతుందన్న కేసీఆర్
  • సూర్యాపేటలో జాతీయ జెండా ఆవిష్కరణకు నేతల పోటీ...టీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ
  • యువ భారతంతో నవ భారత సుసాధ్యం...2022 టార్గెట్‌గా దూసుకెళ్లాలన్న మోడీ
  • వరద గుప్పిట్లో ఉత్తరాది రాష్ట్రాలు...అసోం, బీహార్ లో మెరుగుపడని పరిస్థితులు
ScrollLogo ఎర్రకోటపై త్రివర్ణపతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ ScrollLogo దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు - మోడీ ScrollLogo స్వాతంత్ర్య వేడుకలతో పాటు జన్మాష్టమి కూడా జరుపుకొంటున్నాం - మోడీ ScrollLogo దేశం కోసం కృషి చేసిన, ప్రాణాలర్పించిన మహానుభావులకు నా వందనం - మోడీ ScrollLogo గోరఖ్ పూర్‌ ఘటన దురదృష్టకరం, చాలా మంది అమాయక పిల్లలు ప్రాణాలు కోల్పోయారు -మోడీ ScrollLogo దేశ వ్యాప్తంగా పంద్రాగస్టు వేడుకలు...తెలుగు రాష్ట్రాల్లో అంబరాన్నంటిన సంబరాలు ScrollLogo జెండా వందనంలో కుప్పకూలిన ఒడిశా సీఎం...తక్షణ వైద్యంతో కోలుకున్న నవీన్ పట్నాయక్ ScrollLogo ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామాకు ఆమోదం...అధికార ముద్ర వేసిన మండలి డిప్యూటీ ఛైర్మన్ ScrollLogo నంద్యాలలో హోరెత్తుతున్న ఉప ఎన్నిక ప్రచారం...మాటల యుద్ధంతో కాకరేపుతున్న అధికార,ప్రతిపక్షం ScrollLogo ప్రారంభోత్సవానికి సిద్ధమైన పురుషోత్తపట్నం పథకం...మరికొద్ది గంటల్లో ప్రజలకు అంకితమివ్వనున్న చంద్రబాబు

రసపట్టులో భారత్‌-బంగ్లా టెస్ట్..

India-vs-Bangladesh-Test-Match
Posted: 186 Days Ago
Views: 1463   

విజయానికి ఏడు వికెట్ల దూరమే మిగులుంది. ఉప్పల్‌ టెస్ట్‌లో భారత్‌ పట్టు బిగించింది. అటు బ్యాట్స్‌మెన్‌, ఇటు బౌలర్లు రఫ్పాడిస్తుండటంతో బంగ్లా కూనలు బెంబేలెత్తిపోతున్నాయి. ఈరోజు చివరిరోజు కావడంతో లంచ్‌కి ముందే బంగ్లాదేశ్‌ను ఇంటికి పంపేయాలన్న కసితో ఉంది. బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న ఏకైక టెస్టులో టీమిండియా విజయానికి 7 వికెట్ల దూరంలో నిలిచింది. మూడోరోజు టెయిలెండర్ల పోరాటంతో కోలుకున్న బంగ్లాను తొలి ఇన్నింగ్స్‌లో 398 పరుగులకు భారత్  ఆలౌట్ చేసింది. తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో వేగంగా పరుగులు చేయడం ద్వారా ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. పుజారా హాఫ్ సెంచరీతో భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 159 పరుగుల దగ్గర డిక్లేర్ చేసింది. చివరి సెషన్‌లో స్పిన్నర్లు చెలరేగడంతో ఆటముగిసే సమయానికి బంగ్లాదేశ్ మూడు కీలక వికెట్లు చేజార్చుకుని 103 పరుగులు చేసింది. పిచ్‌ స్పిన్‌కు అనుకూలిస్తోన్న నేపథ్యంలో బంగ్లాదేశ్ అసాధారణంగా పోరాడితే తప్ప భారత్ విజయాన్ని అడ్డుకునే అవకాశం లేదు.
అటు ఉప్పల్‌ టెస్ట్‌లో రికార్డుల పరంపర కొనసాగుతోంది. మొన్న కోహ్లీ అరుదైన ఘనతను సొంతం చేసుకుంటే, ఇప్పుడు స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 
టెస్టుల్లో అత్యంత వేగంగా 250 వికెట్లు తీసిన బౌల‌ర్‌గా రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియా బౌల‌ర్ డెన్నిస్ లిల్లీ పేరు మీదున్న రికార్డును అధిగ‌మించాడు. లిల్లీ 48 మ్యాచుల్లో 250 వికెట్లు తీయ‌గా.. అశ్విన్ కేవ‌లం 45 మ్యాచుల్లో ఈ మైల్‌స్టోన్‌ను అందుకున్నాడు. గ‌తేడాది టాప్ ఫామ్‌లో ఉన్న అశ్విన్‌.. 12  మ్యాచుల్లో ఏకంగా 72 వికెట్లు తీశాడు. వ‌రుస‌గా రెండో ఏడాది కూడా అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా అశ్విన్ నిలిచిన విష‌యం తెలిసిందే. బంగ్లా కెప్టెన్ ముష్ఫిక‌ర్ ర‌హీమ్‌ను ఔట్ చేసిన అశ్విన్‌..  టెస్టుల్లో 250 వికెట్లు మైలురాయిని అందుకున్నాడు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials