Live News Now
  • 108లో బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపాడు దగ్గర ఘటన
  • హైదరాబాద్‌ నుంచి గుంటూరుకు బయలుదేరిన గర్భిణి
  • విజయవాడ స్నాచింగ్‌ కేసులో పోలీసుల నజరానా.. దుండగుల ఆచూకీ చెబితే 25 వేల బహుమానం
  • దొంగల సీసీ ఫుటేజ్ విడుదల చేసిన పోలీసులు
  • వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలం శేర్‌పల్లిలో దారుణం
  • టీచర్‌ మందలించాడని విద్యార్థి ఆత్మహత్యాయత్నం
  • ఆనంద్‌కు తీవ్ర గాయాలు... ఆస్పత్రికి తరలింపు
  • బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి.. ఒడిశా నుండి తెలంగాణ వరకు ద్రోణి
  • తెలుగు రాష్ట్రాలకు రెండ్రోజులు భారీ వర్ష సూచన
  • తమిళనాడులో మారుతున్న రాజకీయాలు.. మద్దతు దారులతో ఈపీఎస్, ఓపీఎస్‌ల భేటీ
ScrollLogo కాకినాడలో కార్పొరేషన్‌ ఫైట్‌ హీట్‌.. ముగిసిన నామినేషన్ల ప్రక్రియ.. వార్డుల్లో ఊపందుకున్న ప్రచారం ScrollLogo అరబ్‌ షేక్‌ మోసానికి హైదరాబాద్‌ పాతబస్తీ బాలిక బలి ScrollLogo అరబ్‌ షేక్‌తో 16 ఏళ్ల అమ్మాయికి పెళ్లి ScrollLogo మస్కట్‌లో బాలికకు చిత్రహింసలు... పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు ScrollLogo రాజమండ్రి కార్పొరేషన్ కార్యాలయంలో అగ్నిప్రమాదం ScrollLogo అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌లో కాలిపోయిన కొన్ని ఫైళ్లు.. ScrollLogo ప్రమాదం జరిగిన తీరుపై అనుమానాలు ScrollLogo యాదాద్రి భవనగిరి జిల్లాలో ర్యాగింగ్ కలకలం.. ScrollLogo బీబీనగర్‌లోని పాలిటిక్నిక్‌ కాలేజీ సీనియర్‌ విద్యార్థుల ఓవరాక్షన్ ScrollLogo ఫస్ట్ ఇయర్‌ స్టూడెంట్‌ గిరిధర్‌ను చితకబాదిన సీనియర్లు

బంగ్లా పై 208 పరుగుల తేడాతో భారత్‌ ఘనవిజయం

india-vs-bangladesh-only-test-hyderabad-india-won-208-runs
Posted: 187 Days Ago
Views: 1190   

బంగ్లాదేశ్‌తో హైదరాబాద్‌ వేదికగా జరిగిన ఏకైక టెస్టులో కోహ్లిసేన ఘనవిజయం సాధించింది. న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌లపై సిరీస్‌ల విజయాలతో వూపుమీదున్న భారత్‌ తాజాగా బంగ్లాతో ఏకైక టెస్ట్‌ కైవసం చేసుకుని సొంతగడ్డపై తిరుగులేని కింగ్‌మేకర్‌గా అవతరించింది. బ్యాట్స్‌మన్‌, బౌలర్లు సమష్టిగా రాణించడంతో భారత్‌ 208 పరుగుల తేడాతో గెలుపొందింది. చివరిరోజు కనీసం డ్రా అయినా చేయాలని పోరాడిన బంగ్లాకు భారత స్పిన్నర్లు అశ్విన్‌ , జడేజా ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. చెరొక నాలుగు వికెట్లు పడగొట్టి జట్టుకు విజయాన్నందించారు. డ్రా కోసం బంగ్లా జట్టులో మహ్మదుల్లా చేసిన పోరాటం భారత విజయాన్ని అడ్డుకోలేకపోయింది. బంగ్లాదేశ్ కేవలం 8 పరుగుల తేడాతో చివరి మూడు వికెట్లను కోల్పోయింది. ప్రపంచ టెస్ట్ క్రికెట్‌లో సరికొత్త రికార్డులకు కేరాఫ్‌గా మారిపోయిన విరాట్‌కోహ్లీ మరో మైలురాయి అందుకున్నాడు. కెప్టెన్‌గా వరుసగా ఆరు సిరీస్ విజయాలతో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. కోహ్లి టెస్ట్‌ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి... శ్రీలంకపై 2-1 తేడాతోనూ , దక్షిణాఫ్రికాపై 3-0తోనూ , వెస్టిండీస్‌పై 2-0 తోనూ , న్యూజిలాండ్‌పై 3-0,తోనూ , ఇంగ్లండ్‌పై 4-0 తేడాతోనూ భారత్‌ సిరీస్‌లు కైవసం చేసుకుంది. అలాగే 19 మ్యాచ్‌లలో ఓటమెరుగని కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు. బంగ్లాతో మ్యాచ్‌ ముగిసిన తర్వాత 15వ విజయాన్ని అందుకున్న కోహ్లీ సునీల్ గవాస్కర్ రికార్డును అధిగమించాడు. సొంతగడ్డపై తనకు తిరుగులేదని భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి రుజువు చేశాడు. వరుసగా గత ఆరు సిరీస్ విజయాల్లో కీలకపాత్ర పోషించిన అశ్విన్ బంగ్లాదేశ్‌పైనా సత్తా చాటాడు. ఇదే మ్యాచ్‌లో అత్యంత వేగంగా 250 వికెట్ల మైలురాయిని కూడా అందుకున్నాడు. గతంలో షేన్‌వార్న్ , మురళీధరన్ లాంటి దిగ్గజ స్పిన్నర్లు కూడా ఇంత వేగంగా ఈ మైలురాయి అందుకోలేకపోయారు. 2011లో అరంగేట్రం చేసిన అశ్విన్ తొలి 10 టెస్టుల్లోనే 50 వికెట్లు పడగొట్టాడు. అలాగే 39 మ్యాచ్‌లో 200 వికెట్ల క్లబ్‌లో చేరిన అశ్విన్ తర్వాతి 50 వికెట్లను 6 టెస్టుల్లోనే పడగొట్టాడు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials