Live News Now
  • చెన్నైలో విశాల్ భారీ ర్యాలీ.. కాసేపట్లో నామినేషన్
  • కాలుష్యంలో మ్యాచ్ ఎలా నిర్వహిస్తారు.. BCCIపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సీరియస్
  • ప్రాజెక్టుల పరుగుపై కేసీఆర్ సంతోషం.. రివ్యూలో హరీష్‌రావుపై ప్రశంసల వర్షం
  • మిస్‌ వైజాగ్‌ కాంటెస్ట్‌పై వ్యతిరేక స్వరం.. మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిరసనల పర్వం
  • భర్తను చంపి ప్రియుడితో హైడ్రామా.. పాలమూరులో కిలాడీ లేడీ అరెస్ట్‌
  • గుజరాత్‌ యుద్ధంలో ట్యాంపరింగ్‌ రాజకీయం.. మోడీ ఎన్నికల ఎజెండా మార్చేశారని రాహుల్‌ ఫైర్‌
  • శ్రీలంకతో నేటి నుంచి వన్డే సిరీస్‌.. రెట్టించిన ఉత్సాహంతో టీమిండియా
  • బంజారాహిల్స్‌లో అర్ధరాత్రి ఉద్రిక్తత.. పబ్బులపై బీజేవైఎం దాడులు
  • గుజరాత్‌ తొలిదశలో 68శాతం పోలింగ్‌.. ఈవీఎంల ట్యాంపరింగ్‌పై కాంగ్రెస్‌ ఆరోపణ
  • నాలుగు రోజులు.. 40 ఇష్యూలు.. పవన్‌ పర్యటనతో కేడర్‌లో ఉత్సాహం
ScrollLogo గుజరాత్ లో పతాక స్థాయికి చేరిన ప్రచారం.. పోటాపోటీ ర్యాలీలు నిర్వహించిన పార్టీలు ScrollLogo అల్లకల్లోలంగా అరేబియా సముద్రం.. లక్షద్వీవులను వణికిస్తున్న ఓఖి తుపాను ScrollLogo ఢిల్లీ టెస్ట్‌కు పొల్యూషన్ సెగ.. మాస్క్‌లతోనే శ్రీలంక ఫీల్డింగ్ - మ్యాచ్ కు కొద్దిసేపు ఆటంకం ScrollLogo హైదరాబాద్‌లో మెట్రో మేనియా.. స్టేషన్ల వద్ద ప్రయాణికుల రద్దీ ScrollLogo ఏలూరులో ఉత్సాహంగా 5కే రన్.. డ్యాన్సుతో అదరగొట్టిన ఎంపీ మాగంటి ScrollLogo 536 పరుగులకు భారత్ డిక్లేర్.. రెండు వికెట్లు కోల్పోయిన లంక ScrollLogo కొరియా సిటీ స్ఫూర్తిగా అమరావతి అభివృద్ధి.. పారిశ్రామికవేత్తలకు బాబు ప్రజెంటేషన్ ScrollLogo త్వరలోనే గ్రేటర్‌లో టౌన్‌హాల్ మీటింగ్స్.. సమస్యల పరిష్కారానికి కేటీఆర్ ప్లాన్ ScrollLogo కొలువులకై కొట్లాట సభతో టెన్షన్.. ఎక్కడికక్కడ విద్యార్థుల కట్టడిలో పోలీస్ ScrollLogo కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఒకే నామినేషన్.. రాహుల్ ఎన్నికతో నేతల్లో నయా జోష్

రామగుండం థర్మల్ ప్లాంట్ లో యాష్ కుంభకోణం

yash-scam-in-thermal-power-plants
Posted: 301 Days Ago
Views: 1299   

అక్రమార్కుల కుంభకోణాలకు కాదేది అనర్హం. ఇప్పటి వరకు విద్యుత్ ప్రాజెక్టుల్లో బొగ్గు కుంభకోణాలే చూశాం. తాజాగా బూడిద స్కాం వెలుగులోకి వచ్చింది. దేశంలోనే అతిపెద్ద బొగ్గు ఆధారిత విద్యుత్ ప్రాజెక్టుగా పేరున్న రామగుండం థర్మల్ ప్లాంట్ లో బూడిదను కొల్లగొట్టి కోట్లు గడిస్తోన్న వైనం.. వివరాల్లోకి వెళ్తే...

రామగుండం థర్మల్ కేంద్రంలో వెలుగులోకి వచ్చిన యాష్ కుంభకోణం.. సంచలనంగా మారింది. విద్యుత్‌ ఉత్పత్తి ప్రక్రియలో బొగ్గును కాల్చగా ఏర్పడిన బూడిదను నిబంధనలకు విరుద్ధంగా అమ్ముకుంటూ కోట్లు గడిస్తున్నారు అక్రమార్కులు. గతంలో ఈ యాష్ ను వృధాగా పడేశారు. అయితే, మారుతున్న కాలనుగుణంగా బూడిదను సైతం లైట్ వెయిట్ ఇటుకల తయారిలో వాడే టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో..ఈ యాష్ కు భారీగా డిమాండ్ పెరిగింది. దీంతో థర్మల్ ప్లాంట్ ను వృధాగా బయటకు వచ్చే యాష్ ను కూలిలతో తరలించి, 18 ఏళ్లుగా స్థానికంగా ఇటుకలు తయారు చేసేవారికి అమ్మేస్తున్నారు ప్లాంట్ అధికారులు. వృధాగా వస్తోన్న ఈ బూడిదపై కన్నేసిన ఓ స్థానిక ప్రజాప్రతినిధి కుమారుడు.. బూడిదను తక్కువగా చూపించే పథకం వేశాడు. తన పలుకుపడితో ప్లాంట్ నుంచి వస్తోన్న బూడిదను యంత్రాల ద్వారా యుద్దప్రాతిపదికన తరలిస్తు, అడ్డుగా వచ్చిన వారిని బెదిరిస్తున్నాడనే ఆరోపణలు  ఉన్నాయి. రోజుకు సుమారు 200 లారీల్లో యాష్‌ను తరలిస్తూ నెలకు అరకోటి పైనే ఖాతాలో వేసుకుంటున్నాడు. ఈ స్థానిక నేత ఆగడాలతో బూడిదను తీసేందుకు కాంట్రాక్టు కూలీలుగా వచ్చిన వారు, ఇటుకల తయారీ యజమానులు రోడ్డున పడ్డారు. అటు ఈ కుంభకోణంలో ప్లాంట్ లోని కొందరు అధికారుల ప్రమేయం కూడా ఉండవచ్చనే వాదన వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే, అటు ప్రభుత్వ ఆదాయానికి, ఇటు స్థానికుల ఉపాధికి గండి కొడుతున్న స్థానిక నేత కుమారుడి ఆగడాలకు అడ్డుకట్ట పడాల్సిన అవసరం ఉంది.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials