Live News Now
  • స్మార్ట్ సిటీ నిర్మాణానికి దుబాయ్ కంపెనీలు.. చంద్రబాబు సమక్షంలో MOUలు
  • చంద్రబాబు డైరెక్షన్‌లో TTDP నేతల భేటీ.. రేవంత్‌ రెడ్డి వ్యవహారంపై కీలక చర్చ
  • కాసులిస్తే క్షణాల్లో ఫేక్ సర్టిఫికేట్స్.. హైదరాబాద్‌లో ముఠా అరెస్ట్
  • ముంబై వన్డేలో కివీస్‌ టార్గెట్‌ 281 రన్స్.. 2 వందల మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ..
  • పంచాయతీలుగా గిరిజన తండాలు.. అసెంబ్లీలో బిల్లు తెస్తామన్న KCR
  • పంటలు నష్టపోతున్నా పట్టించుకోరా.. TRS సర్కార్‌పై ఉత్తమ్ నిప్పులు
  • పేదల కోసం పోరాడి గుర్తింపు తెచ్చుకున్నా.. కొడంగల్ నుంచే పోటీ చేస్తానన్న రేవంత్
  • డిసెంబర్‌లో జనంలోకి పవన్.. రెండు రాష్ట్రాల్లో ప్లీనరీలకు ప్లాన్
  • నంద్యాలలో కుప్పకూలిన శోభా లాడ్జీ.. రోడ్డు విస్తరణ పనుల్లో అపశృతి
  • ఆసియా కప్ హాకి విజేత భారత్.. ఫైనల్లో మలేషియాపై విజయం
ScrollLogo దుబాయ్‌లో బిజిబిజీగా చంద్రబాబు.. పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు ScrollLogo కాసేపట్లో టెక్స్‌టైల్ పార్క్‌కు శంకుస్థాపన.. వరంగల్‌ జిల్లాలో విపక్ష నేతల అరెస్ట్ ScrollLogo 15 సంస్థలు..3 వేల కోట్ల పెట్టుబడులు.. KTR, కడియం సమక్షంలో MOUలు ScrollLogo హక్కుల సాధనకు బీసీల గర్జన.. రాజమండ్రిలో భారీ బహిరంగ సభ ScrollLogo అమరావతికి దుబాయ్ కంపెనీల క్యూ.. చంద్రబాబు సమక్షంలో MOUలు ScrollLogo గంజాయి కేసులో ముగ్గురు అరెస్ట్.. ప్రతిపక్షాలను భయపెడుతున్నారన్న శ్రీధర్ బాబు ScrollLogo ఘెఘా, దహేజా మధ్య ఫెర్రీ సేవలు.. గుజరాత్ అభివృద్ధికి మోడీ వరాలు ScrollLogo ముంబై వన్డేలో కోహ్లీ హాఫ్‌ సెంచరీ.. నిలకడగా భారత్ బ్యాటింగ్ ScrollLogo గడువులోగానే పంచాయితీ ఎన్నికలు.. TRS పారిపోయే పార్టీ కాదన్న KCR ScrollLogo భూమి ఇచ్చిన ప్రతి కుటుంబానికి ఉద్యోగం.. టెక్స్ టైల్ పార్క్ వరంగల్‌కు వరమన్న సీఎం

వైభవంగా లింగమంతుల జాతర: భక్త సంద్రమైన పెద్దగట్టు

Devotees-Rush-to-Peddagattu-Jathara-in-Suryapet
Posted: 252 Days Ago
Views: 196   

సూర్యాపేట్‌ జిల్లా దురాజ్ పల్లి భక్త జనసంద్రమైంది. ఓ లింగా నినాదాలతో పెద్దగట్టు మార్మోగింది. లక్షలాది మంది  భక్తులు.. సాంప్రదాయ నృత్యాలతో స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. బోనాల గంపలతో ప్రదణక్ష చేసి మొక్కులు చెల్లించుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుండటంతో పెద్దగట్టు దారులన్నీ రద్దీగా మారాయి. తెలంగాణలోనే రెండో అతిపెద్ద పండుగైన దురాజ్‌పల్లి పెద్దగట్టుకు భక్తలు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించి ఒలింగా స్మరణతో గుట్ట వద్దకు చేరుకుంటున్నారు. బోనాల గంపలతో దేవుడికి మొక్కులు సమర్పించుకుంటున్నారు. అమ్మవారికి నైవేధ్యంగా పసుపు కుంకుమ, దండలతో అలంకరించిన మేక, గొర్రె పోతులను గుడిచుట్టూ తిప్పుతూ, నృత్యాలతో ఊగిపోతున్నారు. పూనకం వచ్చిన మహిళల లింగో ఓ లింగా నినాదాలతో పెద్దగట్టు పరిసరాలు మారుమోగిపోతున్నాయి. జాతర పరిసరాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. యాదవ భక్తులు చేసే భేరీల మోతలు, కటారులు, వీరనాలతో చేసిన విన్యాసాలు కనుల పండువగా సాగాయి. డప్పు చప్పుళ్లతో ఈలలు వేసుకుంటూ బరిశెలు, ఢమరుకం చప్పుళ్లు, కొరడా, త్రిశూలాలు చేతబూని ఎదురెదురుగా పరుగులు తీస్తూ భక్తులు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. 
పెద్దగట్టు జాతరకు ప్రజాప్రతినిధులు భారీగా హాజరయ్యారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు  చేశారు. దేవాలయ అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయిస్తామని చెప్పారు. తెలుగు రాష్ట్రాలతో పాటు  మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. దీంతో పెద్దగట్టుకు చేరుతున్న వాహనాలు చీమలదండును తలపిస్తున్నాయి. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా  పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో 50 సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. తొలిసారిగా డ్రోన్‌ కెమెరాలను వినియోగిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్‌- విజయవాడ రహదారిపై వాహనాలను దారి మళ్లిస్తున్నారు. జాతరలో మూడోరోజు మంగళవారం చంద్రపట్నం, నెల వారం నిర్వహిస్తారు. చివరి రెండు రోజులు పెరగనున్న  భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials