Live News Now
  • స్మార్ట్ సిటీ నిర్మాణానికి దుబాయ్ కంపెనీలు.. చంద్రబాబు సమక్షంలో MOUలు
  • చంద్రబాబు డైరెక్షన్‌లో TTDP నేతల భేటీ.. రేవంత్‌ రెడ్డి వ్యవహారంపై కీలక చర్చ
  • కాసులిస్తే క్షణాల్లో ఫేక్ సర్టిఫికేట్స్.. హైదరాబాద్‌లో ముఠా అరెస్ట్
  • ముంబై వన్డేలో కివీస్‌ టార్గెట్‌ 281 రన్స్.. 2 వందల మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ..
  • పంచాయతీలుగా గిరిజన తండాలు.. అసెంబ్లీలో బిల్లు తెస్తామన్న KCR
  • పంటలు నష్టపోతున్నా పట్టించుకోరా.. TRS సర్కార్‌పై ఉత్తమ్ నిప్పులు
  • పేదల కోసం పోరాడి గుర్తింపు తెచ్చుకున్నా.. కొడంగల్ నుంచే పోటీ చేస్తానన్న రేవంత్
  • డిసెంబర్‌లో జనంలోకి పవన్.. రెండు రాష్ట్రాల్లో ప్లీనరీలకు ప్లాన్
  • నంద్యాలలో కుప్పకూలిన శోభా లాడ్జీ.. రోడ్డు విస్తరణ పనుల్లో అపశృతి
  • ఆసియా కప్ హాకి విజేత భారత్.. ఫైనల్లో మలేషియాపై విజయం
ScrollLogo దుబాయ్‌లో బిజిబిజీగా చంద్రబాబు.. పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు ScrollLogo కాసేపట్లో టెక్స్‌టైల్ పార్క్‌కు శంకుస్థాపన.. వరంగల్‌ జిల్లాలో విపక్ష నేతల అరెస్ట్ ScrollLogo 15 సంస్థలు..3 వేల కోట్ల పెట్టుబడులు.. KTR, కడియం సమక్షంలో MOUలు ScrollLogo హక్కుల సాధనకు బీసీల గర్జన.. రాజమండ్రిలో భారీ బహిరంగ సభ ScrollLogo అమరావతికి దుబాయ్ కంపెనీల క్యూ.. చంద్రబాబు సమక్షంలో MOUలు ScrollLogo గంజాయి కేసులో ముగ్గురు అరెస్ట్.. ప్రతిపక్షాలను భయపెడుతున్నారన్న శ్రీధర్ బాబు ScrollLogo ఘెఘా, దహేజా మధ్య ఫెర్రీ సేవలు.. గుజరాత్ అభివృద్ధికి మోడీ వరాలు ScrollLogo ముంబై వన్డేలో కోహ్లీ హాఫ్‌ సెంచరీ.. నిలకడగా భారత్ బ్యాటింగ్ ScrollLogo గడువులోగానే పంచాయితీ ఎన్నికలు.. TRS పారిపోయే పార్టీ కాదన్న KCR ScrollLogo భూమి ఇచ్చిన ప్రతి కుటుంబానికి ఉద్యోగం.. టెక్స్ టైల్ పార్క్ వరంగల్‌కు వరమన్న సీఎం

ప్రజలతో నేరుగా మమేకం కానున్న కేసీఆర్‌

Janahitha-Program-to-Be-Launched-by-CM-KCR-on-His-Birthday
Posted: 251 Days Ago
Views: 213   

జర్నలిస్టులను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని కేసీఆర్ తెలిపారు. చనిపోయన జర్నలిస్టుల కుటుంబాలను జనహితలో తానే స్వయంగా కలుసుకుని ఆర్థికసాయం అందిస్తానని చెప్పారు. హైదరాబాద్ లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు గుర్తించి,అందించే బాధ్యతను కేటీఆర్ కు అప్పగించారు. చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వం తరపునే ఆర్డర్లు ఇవ్వాలని సూచించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలతో మమేకం కానున్నారు. తన పుట్టిన రోజైన  ఫిబ్రవరి 17న ప్రగతి భవన్‌లో జనహితకు శ్రీకారం చుట్టనున్నారు. చనిపోయన జర్నలిస్టుల కుటుంబాలను మొదటగా కలుసుకోనున్నారు తెలంగాణ సీఎం. ప్రభుత్వం తరపున వారికి ఆర్థిక సాయం అందించనున్నారు. జర్నలిస్టుల సంక్షేమంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కేసీఆర్..దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా జర్నలిస్టుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతీ ఏటా పది కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని, చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలతో పాటు, అనారోగ్యం పాలైనవారికి కూడా సహాయం అందిస్తున్నామని తెలిపారు. జర్నలిస్టుల పిల్లలకు  ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకం వర్తింపచేస్తామన్నారు. హైదరాబాద్ లో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు గుర్తించి, అందించే బాధ్యతలను మంత్రి కేటీఆర్ కు అప్పగించారు. 
హ్యాండ్లూమ్, పవర్‌లూమ్ కార్మికుల కోసం తీసుకోవాల్సిన చర్యలపైనా కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. చేనేతకు మార్కెటింగ్ కల్పించాలని, ప్రభుత్వం తరపునే ఆర్డర్లు ఇవ్వాలని సూచించారు. స్కూల్ పిల్లల యూనిఫారాలు, ఆస్పత్రులు, హాస్టళ్లలో చద్దర్లు, పండుగలప్పుడు ప్రభుత్వం తరపున పేదలకు పంచే దుస్తులు, పోలీస్ యూనిఫాం ఆర్డర్లన్నీ చేనేత కార్మికులకు ఇవ్వాలన్నారు. పవర్‌లూమ్‌లకు కూడా కావాల్సినంత సాయంతో  పాటు పని కల్పించాలని సూచించారు. ప్రభుత్వం తమను బతికిస్తుందనే నమ్మకం నేతన్నలలో కలగాలన్నారు. ఎంత డబ్బయినా ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు కేసీఆర్. తెలంగాణకు ప్రత్యేకమైన చేనేత కళను  కాపాడుకోవాలన్నారు కేసీఆర్. హైదరాబాద్‌లో గతంలో సిద్ధిపేట గొల్లబామ చీరలను ప్రత్యేకంగా అమ్మేవారని గుర్తుచేశారు. అలాంటి ప్రత్యేకతలున్న వస్ర్తాలకు పూర్వ వైభవం తీసుకురావలన్నారు. అంతర్జాతీయ మార్కెట్  ఉన్న నారాయణపేట, గద్వాల, పోచంపల్లి కళాత్మకమైన పట్టు వస్ర్తాలను ప్రోత్సహించడంతో పాటు అవసరమైన చేయూతనివ్వాలని కేసీఆర్ ఆదేశించారు. 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials