Posted: 434 Days Ago
Views: 437
అనుమానం పెనుభూతం అని పెద్దలు ఉవాచ.. సెల్ రీఛార్జ్ తెచ్చిన అనుమానం తో తన భార్యను చంపేసి పరారీలో ఉన్న భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు.. ఈ దారుణ ఘటన కర్నాటకలో చోటు చేసుకొన్నది. వివరాల్లోకి వెళ్తే...
దాదా ఖలందర్ శంషాద్ భాను కు 2016 ఆగష్టు 14న కర్నాటక లోని బాగేపల్లి తాలూకా బిల్లూరులో వివాహం జరిగింది.. కాగా దాదాఖలందర్ తన ఇంటిలోని సెల్ ఫోన్ కు రూ.200 లతో రీఛార్జ్ చేయించేవాడు.. కాగా మొదట్లో ఎక్కువ రోజులు వచ్చే ఈ రీఛార్జ్.. రాను రాను రెండు మూడు రోజులకే అయిపోతుంది. దీంతో భర్తకు భార్యమీద అనుమానం వచ్చి, కాల్ రిజిస్టర్ చూడగా.. కాల్స్ తనతో, తనకుటుంబ సభ్యులతో మాట్లాడినవే కనిపించాయి.. మిగిలినవి డిలిట్ చేయ్యడం గమనించాడు.. దీంతో భార్య భర్తల మధ్య వివాదం చోటు చేసుకొన్నది.. అప్పటి నుంచి దాదా ఖలండర్ కు భార్య మీద అనుమానం మొదలైంది.. ఈ నేపద్యంలో ఈ నెల 9 న భార్యని నమ్మించి.. రాజీవ్ కాలనీ సమీపంలోని జాలికంప వంకలోకి తీసుకొని వెళ్ళాడు.. కాగా అప్పటికే దాదా ఖలండర్ తమ్ముడు జబీవుల్లా కిరోసిన్, బ్లేడ్ అక్కడ పెట్టాడు.. వీరు వెళ్ళేసమయానికి అక్కడ అమ్మ తమ్ముడు వచ్చారు.. వారు రాగానే భార్యని గట్టిగా సృహతప్పేలా కొట్టాడు.. వెంటనే భార్య నోట్లో గుడ్డలు పెట్టి.. కిరోసిన్ పోసి సజీవ దహనం చేశాడు.. శంషాద్ భాను మృతి పై అన్న ఖలీల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు.. బెంగుళూరు వెళ్తున్న ముగ్గురిని అదుపులోని తీసుకొని విచారణ చేసి అనంతరం పెనుకొండ కోర్టు లో హాజరు పరిచారు.