Live News Now
  • దక్షిణాదిలో బీజేపీ అధికారానికి తెలంగాణ ముఖద్వారం.. తెలంగాణ అభివృద్ధికి మోడి సర్కార్ కట్టుబడిఉంది
  • ఢిల్లీ: కవ్వింపుల పాక్ కు గుణపాఠం విరుచుకుపడ్డ భారత సైన్యం
  • ముంబై: దిగివచ్చిన పసిడి ధర రూ.28,915 పలికిన 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం
  • రూ.315 పెరిగి రూ.39,815కి చేరిన కిలో వెండి
  • ఆప్ఘనిస్తాన్ లో ఉగ్రవాదుల ఘాతుకం.. ఆప్ఘాన్ సైనిక శిబిరం పై ముష్కరుల దాడి..
  • 10 మంది జవాన్లు మృతి, పలువురికి గాయాలు
  • బొగ్గు కుంభకోణం కేసులో నవీన్ జిందాల్ పై సీబీఐ చార్జిషీటు..
  • జిందాల్‌తో పాటు మరో నలుగురికి సమన్లు జారీ..
  • సెప్టెంబర్ 4న విచారణకు హాజరుకావాలని సమన్లు
  • అమరావతి: జూన్ 2 నుంచి ఏపీలో మూడో విడత నవనిర్మాణ దీక్ష.. దీక్షలో పాల్గొననున్న చంద్రబాబు
ScrollLogo పత్తికొండ వైసీపీ ఇన్‌ఛార్జ్ చెరుకులపాడు నారాయణ రెడ్డి అంత్యక్రియలు.. అంత్యక్రియలకు హాజరైన జగన్ ScrollLogo ఢిల్లీ: కేజ్రీవాల్ పై రెండో పరువు నష్టం దావా వేసిన జైట్లీ... రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేసిన జైట్లీ ScrollLogo కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేసిన హైకోర్టు.. జూలై 26న కోర్టుకు హాజరు కావాలని నోటీసులు ScrollLogo విజయవాడలో ఈ నెల 25న బూత్ కమిటీ సభ్యుల మహా సమ్మేళనం.. ScrollLogo సంస్థాగత నిర్మాణంలో పార్టీని బలోపేతం చేయడానికే ఈ కార్యక్రమం: కంభంపాటి హరిబాబు ScrollLogo కార్యకర్తలకు అమిత్ షా దిశానిర్ధేశం చేస్తారు ScrollLogo రేపు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో టీడీపీ మినీ మహానాడు.. ఏర్పాట్లను పరిశీలించిన ఎల్.రమణ ScrollLogo మినీ మహానాడుకు చంద్రబాబు హాజరవుతారు.. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ScrollLogo కడప: వైఎస్ రాజారెడ్డి 19వ వర్ధంతి సందర్భంగా పులివెందులలో నివాళులర్పించిన వైఎస్ జగన్ ScrollLogo నల్గొండ: 2019లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం: అమిత్ షా

తాత్కాలిక అసెంబ్లీ భవనం ముస్తాబవుతోంది

ap-new-assembly-ready
Posted: 97 Days Ago
Views: 1752   

అసెంబ్లీ కొత్త భవనాల్లో ప్రధాన ప్రతిపక్ష నేతకు, శాసనసభా పక్షానికి పేషీలు కేటాయించకపోవడాన్ని వైసీపీ నేతలు తప్పు బడుతున్నారు. స్టిక్కర్లు అంటించిన ప్రభుత్వం తమ పార్టీకి గదులు ఇచ్చినట్టు ఎక్కడా స్టిక్కర్లు లేవని ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ అలసత్వం, ప్రతిపక్షాలంటే చులకన భావానికి అద్దం పడుతుందని అంటున్నారు. కనీసం ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్‌ రెడ్డికి గది కూడా కేటాయించలేదన్నారు. ప్రతిపక్షాల పట్ల కనీస బాధ్యత కూడా లేని ప్రభుత్వాన్ని అసెంబ్లీ సమావేశాల్లోనే నిలదీస్తామంటున్నారు.

వైసీపీ ఆరోపణలను అధికార పార్టీ ఖండించింది. భవన నిర్మాణం పూర్తికాకముందే తొందరపడి విమర్శలు చేయడం తగదంటున్నారు. అమరావతికి అసెంబ్లీ వస్తుందని సంతోషించాల్సిన వైఎస్సార్‌ పార్టీ నాయకులు దిగజారుడు విమర్శలతో రాజకీయాలు చేయడంపై అధికార పార్టీ నాయకులు మండిపడుతున్నారు. రాష్ట్రమంతా అసెంబ్లీ సమావేశాల కోసం ఎదురుచూస్తుండగా.. వీరు మాత్రం స్వార్ధ ప్రయోజనాల కోసం వివాదాలు సృష్టిస్తున్నట్టు ఆరోపించారు. జగన్‌కు, వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్దిచెబుతారన్నారు. జగన్‌కు చిత్తశుద్ది ఉంటే.. అమరావతిపై రాజకీయాలు మాని.. ప్రజాసమస్యలపై చట్టసభలో ప్రశ్నించాలంటున్నారు.

గృహప్రవేశం కాలేదు.. అడుగైనా పెట్టలేదు.. అప్పుడే రాజకీయాలు. సరికొత్త పేచీలు. తొలి సమావేశాలకు సంతోషంగా వెళ్లాల్సిన నాయకులు విమర్శలు-ప్రతివిమర్శలతో వీధికెక్కుతున్నారు. నవ్యాంధ్ర రాజధానిలోని తాత్కాలిక అసెంబ్లీ సమావేశ భవనంలో సదుపాయాలపై అధికార, విపక్షాల మధ్య యుద్ధం జరుగుతోంది. వాణి వినిపించే నాయకుల రాకకోసం జనాలు చూస్తున్నారు. తాము అడుగుపెట్టే అసెంబ్లీ ఎలా ఉంటుందో నాయకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంతోషంగా.. సంబరాలు జరుపుకోవాల్సిన వెళ.. వివాదాలకు కొత్త అసెంబ్లీ వేదికగా మారింది. రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. తమ చెంతకే అసెంబ్లీ వస్తుందన్న జన సంతోషాన్ని ఆవిరి చేస్తున్నారు నాయకులు. తమ స్వార్ధ ప్రయోజనాల కోసం చిన్న చిన్న సమస్యలను కూడా రాజకీయం చేస్తున్నారు. ఇదే ఇప్పుడు నవ్యాంధ్ర వాసులను కలవరపెడుతోంది. జనాల్లో రాజకీయాల పట్ల అసహనం రాజేస్తోంది. అసెంబ్లీ భవానలను పరిశీలించడానికి వచ్చిన వైసీపీ నాయకులు తమ పార్టీకి పేషీలు ఇవ్వలేదని.. ప్రతిపక్ష నేతకు గౌరవం దక్కలేదని అంటున్నారు. పూర్తికాని భవనాలు చూసి రాజకీయాలు తగవని అధికార టీడీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. గృహప్రవేశం జరగలేదు. అడుగైనా పెట్టలేదు. ఇంకా అసెంబ్లీ భవనాల్లో అధికారిక కార్యకలాపాలు మొదలుకాలేదు. అయినా అప్పడే రాజకీయంగా జరుగుతున్న మాటలయుద్ధం చూస్తుంటే అనుమానాలు తలెత్తుతున్నాయి. నవ్యాంధ్ర వేదికగా జరుగనున్న తొలి అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాసమస్యలపై అర్ధవంతమైన చర్చలు జరుగుతాయని ప్రజలంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇందుకు భిన్నంగా భవన నిర్మాణం పూర్తికాకముందే వివాదాలతో నాయకులు రాజకీయం చేస్తున్నారు. దీంతో ప్రజల్లో కూడా చర్చ జరుగుతుందన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి.


Read Also
NRI Edition
AP News
Telangana News
Pata
Sports
Daily Specials