Live News Now
  • ప్రజల మన్ కీ బాత్ కావాలి.. పాలకులది కాదు.. పోరుబందర్‌లో రాహుల్‌ సెటైర్లు
  • ప్రాణం తీసిన సెల్ఫీ మోజు.. జల్పాయ్‌గురిలో వ్యక్తిని తొక్కిచంపిన గజరాజు
  • అయోధ్యలో మందిరం కట్టి తీరుతాం.. గడియలు దగ్గర పడ్డాయన్న మోహన్ భగవత్
  • డిసెంబర్‌ 21న పోలింగ్‌ ... 24న కౌంటింగ్‌.. ఆర్క్‌ నగర్‌ ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్‌
  • నాగపూర్ టెస్ట్ లో స్పిన్ మాయాజాలం..
  • 205పరుగులకు లంక ఆలౌట్, 11పరుగులకు 1వికెట్ కోల్పోయిన భారత్
  • సిద్ధిపేట జిల్లాలో పేలిన ఎయిర్ క్రాఫ్ట్.. ప్యారాచూట్‌తో ఇద్దరు పైలెట్లు జంప్‌
  • ఉద్రిక్తంగా SFI ఒంగోలు కలెక్టరేట్‌ ముట్టడి.. ఆందోళనకారులను ఈడ్చుకెళ్లిన పోలీసులు
  • సన్‌బర్న్‌కు హైకోర్టు పర్మిషన్.. పార్టీని వీడియో తీయాలని కండిషన్
  • ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురాలేక పోయారు: సీపీఐ రామకృష్ణ
ScrollLogo చంద్రబాబును కలిసిన సురేష్ గోపీ.. కేరళలో బనానా ఫెస్టివల్‌కు ఆహ్వానం ScrollLogo పూర్తి స్థాయి డీజీపీగా సాంబశివరావు.. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్ ScrollLogo యాదాద్రి అభివృద్ధిపై కేసీఆర్ సమీక్ష.. పనులు వేగవంతం చేయాలని ఆదేశం ScrollLogo 10 జిల్లాల ప్రాతిపదికనే టీఆర్టీ.. ఉన్నతాధికారులతో కడియం సమావేశం ScrollLogo మగ్గాలకు సబ్సిడీపై రా మెటీరియల్.. చేనేతకు 1200 కోట్లు కేటాయించామన్న KTR ScrollLogo విమాన ప్రమాదంపై అధికారుల దర్యాప్తు.. గాయపడ్డ పైలెట్ హైదరాబాద్ తరలింపు ScrollLogo భద్రాద్రి ఆలయ సమీపంలో లిక్కర్ షాప్.. తొలగించాలంటూ స్థానికుల ఆందోళన ScrollLogo పర్మిషన్లు లేకున్నా కాలేజీల ఏర్పాటు.. బోర్డు తిప్పేస్తున్న నిర్వాహకులు ScrollLogo ఉద్రిక్తంగా SFI ఒంగోలు కలెక్టరేట్‌ ముట్టడి.. ఆందోళనకారులను ఈడ్చుకెళ్లిన పోలీసులు ScrollLogo విశాఖలో సునామీ మాక్ డ్రిల్.. ఆకట్టుకున్న విన్యాసాలు

ఏపీ టీడీపీలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి

AP-MLC-Elections-Notification:-TDP-Leaders-Political-Strategies-for-MLC-Seats
Posted: 282 Days Ago
Views: 341   

టీడీపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలయ్యింది. ఐదు స్థానాలకు నోటిఫికేషన్‌ రావడం, గవర్నర్‌ కోటా, స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే కోటాలో టిక్కెట్‌ కోసం ఆశావహులు ఎవరి ప్రయత్నాలను వారు ముమ్మరం చేశారు. అటు సచివాలయంలో అధినేతను... ఇటు గుంటూరు పార్టీ ఆఫీస్‌లో చినబాబును కలిసి ఒక్క ఛాన్స్‌ ఒకే ఒక్క ఛాన్సంటున్నారు. ఇటు అధిష్టానం కూడా ఫైనల్‌ లిస్ట్‌ను సిద్ధం చేసేందుకు కసరత్తు చేస్తోంది. వచ్చే నెలలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం టీడీపీ నేతలు లాబీయింగ్‌లు ప్రారంభించారు. 22 స్థానాలకు ఎన్నికలు జరగనుండటంతో టిక్కెట్ల వేటలో బిజీ అయ్యారు. పార్టీ నేతలతో పాటు, వలస నేతలు చంద్రబాబు, నారా లోకేష్‌ను కలిసి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. 
టీడీపీలో ఎమ్మెల్సీ పదవి కోసం పోటీపడుతున్న నేతల లిస్ట్‌ చాంతాడంత ఉంది. రాయలసీమలోని చిత్తూరు జిల్లా నుంచి చూస్తే మాజీ ఎమ్మెల్యే హేమ‌ల‌త‌, ఎస్వీ నాయుడు ప‌ద‌వి కోసం పోటిప‌డుతున్నారు. ఇక క‌డ‌ప జిల్లాలో స‌తీష్‌కుమార్ రెడ్డి త‌న‌కు పదవి రెన్యువ‌ల్ అవుతుంద‌ని గ‌ట్టి ధీమాతో ఉన్నారు. అనంత‌పురం నుంచి అబ్దుల్ ఘ‌ని, క‌ర్నూల్‌ జిల్లా నుంచి సోమిశెట్టి వెంక‌టేశ్వర్లు, శిల్పా చ‌క్రపాణిరెడ్డిలు ఎమ్మెల్సీపై గంపెడాశ‌లు పెట్టుకున్నారు.
కోస్తాంధ్ర విషయానికొస్తే నెల్లూరు జిల్లా నుంచి ఆనం బ్రద‌ర్స్‌, వాకాటి నారాయ‌ణ రెడ్డి... ప్రకాశంలో జూపూడి ప్రభాక‌ర్‌ రావు, క‌ర‌ణం బ‌ల‌రామ్‌లు ప్రయ‌త్నం చేస్తున్నారు. ఇక గుంటూరు జిల్లాలో దాస‌రి రాజామాస్టార్‌, చందు సాంబ‌శివ‌రావు, గోనెగుంట్ల కోటేశ్వర‌రావు ప‌ద‌వి కోసం ప్రయ‌త్నిస్తున్నారు. ఇక కృష్ణా జిల్లాలో వ‌ర్ల రామ‌య్య, బ‌చ్చుల అర్జునుడు, నాగుల్‌ మీరాలు పోటీప‌డుతున్నారు. ఇక ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో మంతెన స‌త్యనారాయ‌ణ రాజు, అంగ‌ర‌రామ్మోహ‌న్‌లు ట్రై చేస్తున్నారు. ఇక తూర్పుగోదావ‌రిలో చైత‌న్యరాజు, చిక్కాల రామ‌చంద్రరావు... విశాఖ‌లో మాజీ ఎమ్మెల్యే రామానాయుడు, క‌న్నబాబు రాజులు ప‌ద‌వి ఆశిస్తున్నారు. విజ‌య‌న‌గ‌రంలో శోభాహైమావ‌తి, శ్రీ‌కాకుళంలో ప్రతిభాభార‌తిలు ఉన్నారు. ఆశావహుల లిస్ట్‌ అలా ఉంటే యువనేత లోకేష్‌ కూడా ఎమ్మెల్సీ కోటాలనే మంత్రివర్గంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. మొత్తం మీద ఏపీలో ఎమ్మెల్సీ పదవి కోసం టీడీపీ నేతలు గంపెడాశలతో ఎదురు చూస్తున్నారు. మరి అధిష్టానం ఎవరివైపు మొగ్గు చూపుతుందో చూడాలి. 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials