Posted: 430 Days Ago
Views: 651
హైదరాబాద్ పాతబస్తీలోని సుల్తానా షాహిలో దారుణం జరిగింది. మైనర్ బాలికను ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. బాలిక ఉంటున్న ప్రాంతంలో అజయ్, కరణ్‌లు హౌస్ కీపింగ్ పనులు చేస్తున్నారు. బాలిక మానసిక వికలాంగురాలు కావడంతో ఈ నెల 10న బాధితురాలికి మాయ మాటలు చెప్పి ఓ గదికి తీసుకెళ్లారు. అక్కడ ఇద్దరు అత్యాచారం చేశారు. రెండు రోజుల తర్వాత బాలిక సైగల ద్వారా తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు. వారిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.