Live News Now
  • ప్రగతి భవన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత.. సాక్షర భారత్‌ మిషన్ కోఆర్డినేటర్ల ఆందోళన..
  • రికార్డు గరిష్ట స్థాయికి పెట్రో ధరలు..
  • కేంద్రానికి నరసింహన్ నివేదికపై సస్పెన్స్..
  • ఏపీలో హోరెత్తుతున్న హోదా ఆందోళనలు.. శ్రీశైలం భ్రమరాంబకు బోనాలు
  • ధాన్య రాశుల నిలయంగా నల్గొండ!.. సీఎం చొరవతోనే సాధ్యమైందన్న హరీష్
  • జమ్మూకశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్‌.. పుల్వామా జిల్లాలో టెన్షన్‌ టెన్షన్
  • బాలీవుడ్‌లోనూ కాస్టింగ్ కౌచ్.. తొలిసారి ఆరోపణలు చేసిన సరోజ్‌ ఖాన్
  • ఏపీలో చంద్ర క్రాంతి ప్రారంభం.. ద్వారపూడిలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
  • కర్ణాటక కాంగ్రెస్‌కు ఐటీ షాక్.. మంత్రి మహదేవప్ప ఇంట్లో రైడ్స్
  • తలకు బదులు కాలుకు ఆపరేషన్.. ఢిల్లీ ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం
ScrollLogo మిషన్ భగీరథ దేశానికే ఆదర్శమన్న కేసీఆర్ పెండింగ్ పనులు పరుగులు పెట్టించాలని ఆదేశం ScrollLogo మిషన్ భగీరథ దేశానికే ఆదర్శమన్న కేసీఆర్ పెండింగ్ పనులు పరుగులు పెట్టించాలని ఆదేశం ScrollLogo ఎంపీలు, ముఖ్యనేతలతో జగన్ కీలక భేటీ ప్రత్యేక హోదా, భవిష్యత్ కార్యాచరణపై చర్చ ScrollLogo కాల్పుల మోతతో దద్దరిల్లిన గడ్చిరోలి ఎన్‌కౌంటర్లో 14మంది మావోయిస్టులు మృతి ScrollLogo కొడుకుతో సహా తల్లి ఆత్మహత్య.. విజయనగరం జిల్లాలో విషాదం.. ScrollLogo వైసీపీ, జనసేన కుమ్మక్కయ్యాయన్న బోండా ScrollLogo 58 లక్షల మంది రైతులకు 6 వేల కోట్లు.. రైతు బంధు పథకం చారిత్రాత్మకమన్న హరీష్ ScrollLogo టీడీపీపై మహా కుట్ర జరుగుతోంది: బోండా ScrollLogo పోలవరం స్పిల్‌ ఛానల్‌ కాంక్రీట్ పనులు ప్రారంభం.. ScrollLogo ఐపీఎల్‌లో పంజాబ్ వర్సెస్ ఢిల్లీ.. క్రిస్‌గేల్‌పైనే అందరి చూపు

కిడ్నాపర్‌ అవతారమెత్తిన గ్రాడ్యుయేట్‌

graduate-turns-kidnapper
Posted: 432 Days Ago
Views: 942   

అతను ఓ నిరుద్యోగి. S.I కావాలనేది అతని కల. కానీ కల నెరవేరలేదు. ఆశయం సిద్ధించలేదు. దీంతో ఎలాగైనా డబ్బులు సంపాదించాలనుకున్నాడు. అడ్డదారులు తొక్కాడు. చివరికి వ్యూహం బెడిసికొట్టి కటకటాలవెనక్కు వెళ్లాడు. ఈ ప్రబుద్దుడి పేరు చంద్రశేఖర్.  B.Sc వెలగబెట్టిన చంద్రశేఖర్‌కు SI కావాలనేది కల. కానీ అనుకున్నది జరగలేదు. అనుకున్నది జరగకపోతే జరగకపోయింది. కరెన్సీ కట్టలు మాత్రం కావాలనుకున్నాడు. అంతే క్రిమినల్‌ బ్రెయిన్‌కు పదును పెట్టాడు. పిల్లలను కిడ్నాప్ చేస్తే లక్షలకు లక్షలు సంపాదించవచ్చని అనుకున్నాడు. అంతే బడాబాబుల పిల్లలను టార్గెట్ చేసాడు. హోమ్‌ ట్యూషన్స్ పేరుతో కలరింగ్‌ ఇవ్వటం స్టార్ట్ చేసిన చంద్రశేఖర్ ఇద్దరు యువకులను అపాయింట్ చేసుకున్నాడు. పేరెంట్స్ ఫోన్‌ నెంబర్లు కలెక్ట్‌ చేసే పనిని వారికి అప్పగించాడు. కేటుగాడి ప్లాన్‌ తెలియని అమాయక యువకులు తల్లితండ్రుల కాంటాక్ట్స్‌ సంపాదించి పెట్టారు. వీటి సహాయంతో ఇద్దరు పిల్లలకు మాయమాటలు చెప్పి ఇంటర్‌నెట్ సెంటర్‌లో నిర్బంధించాడు. పిల్లల పేరెంట్స్‌కు కాల్‌ చేసి అడిగినంత ఇవ్వకుంటే చంపేస్తానని బెదిరించాడు. వేర్వేరు కాయిన్‌బాక్స్‌ల వద్ద నుంచి కాల్ చేసి బెదిరింపులను తీవ్ర తరం చేసాడు. ఇక చేసేది లేక తల్లితండ్రులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన ఖాకీలు ఇద్దరు పిల్లల ఆచూకీ కనిపెట్టారు. అనంతరం కాయిన్‌ బాక్స్‌ నెంబర్లు, సిగ్నల్ ట్రేసింగ్‌తో కేవలం గంట వ్యవధిలో చంద్రశేఖర్ ఆట కట్టించారు.
ఎస్‌ఐ కాలేకపోయిన చంద్రశేఖర్‌ కిడ్నాపర్‌గా అవతారమెత్తాడు. పాపం ఎప్పటికైనా పండుతుంది అనే నానుడికి తగ్గట్లు  ప్లాన్‌ వేసిన గంట వ్యవధిలోనే అరెస్ట్ అయ్యాడు. ఏది ఏమైననప్పటికి అజ్ఞాత వ్యక్తులతో విద్యార్ధులే కాదు తల్లితండ్రులు కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials