Live News Now
  • ఇసుక మాఫియా కట్టడిపై కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు
  • జమ్మూకాశ్మీర్: అనంత్‌నాగ్‌లో మరో ఉగ్రదాడికి ముష్కరుల యత్నం
  • ప్రభుత్వ ధనాగారాన్ని దోచుకునేందుకు ముష్కరుల యత్నం...
  • ముష్కరుల దాడిని తిప్పికొట్టిన సీఆర్పీఎఫ్... ఓ ఉగ్రవాది అరెస్ట్ మరో ఉగ్రవాది పరారీ
  • భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపట్టిన సీఆర్పీఎఫ్
  • చంద్రబాబుతో ఆర్‌.కృష్ణయ్య భేటీ... గ్రూప్‌2 మెయిన్స్‌ వాయిదా వేయాలని విజ్ఞప్తి
  • చంద్రబాబు విదేశీ టూర్ షెడ్యూల్ ఖరారు...మే 4 నుంచి 11 వరకు అమెరికాలో పర్యటన
  • జమ్మూకాశ్మీర్‌లో పట్టుబడ్డ ఉగ్రవాది... పాక్‌తో సంబంధాలు ఉన్నట్లు అనుమానం
  • అనంతపురం: గుంతకల్లు మండలం వైటీ చెరువులో తెప్ప బోల్తా... 11 మంది మృతి నలుగురు గల్లంతు
  • మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు... గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు
ScrollLogo 111 పాయింట్లు నష్టపోయి 29,948 వద్ద ముగిసిన సెన్సెక్స్ ScrollLogo 38 పాయింట్లు నష్టపోయి 9,308 వద్ద ముగిసిన నిఫ్టీ ScrollLogo 9,300 పాయింట్ల మార్కును నిలుపుకున్న నిఫ్టీ ScrollLogo సూర్యపేట మార్కెట్‌ యార్డులో ఉద్రిక్తత... ScrollLogo మార్కెట్‌ యార్డును సందర్శించేందుకు వచ్చిన కోదండరామ్ ను అడ్డుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు ScrollLogo జేఏసీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం ScrollLogo హైదరాబాద్: సీబీఐ కోర్టులో వైఎస్ జగన్‌కు ఊరట... ScrollLogo జగన్‌ బెయిల్ రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్ ను కొట్టివేసిన ప్రత్యేక కోర్టు ScrollLogo హైదరాబాద్: జగన్ విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి... కుటుంబ సభ్యులతోనే వెళ్లాలన్న కోర్టు ScrollLogo మే 15 నుంచి జూన్ 15 లోపు 15 రోజులు విదేశాలకు వెళ్లవచ్చన్న కోర్టు

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ దారుణ హత్య...

Missing-Techie's-Burnt-Body-Found,-Cops-Suspect-Rape,-Hyderabad
Posted: 72 Days Ago
Views: 879   

హైదరాబాద్‌లో మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దారుణహత్యకు గురైంది. మాదాపూర్‌లోని భాగ్యనగర్‌ కోఆపరేటివ్‌ సొసైటీ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతురాలు లోతుకుంటకు చెందిన సునీతగా నిర్ధారించారు. డెడ్‌బాడీ సగం కాలిపోయి ఉండటంతో ఎవరో హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. లోతుకుంటకు చెందిన సునీత ఎస్సార్‌నగర్‌లోని మాన్‌స్టర్‌ సంస్థలో పనిచేస్తోంది. రోజులాగే మంగళవారం ఆఫీసుకు వెళ్లింది.. కానీ, తిరిగి రాలేదు. ఆమె దగ్గర్నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆఫీస్‌కు ఫోన్‌ చేయగా అప్పటికే వెళ్లిపోయినట్లు వారు చెప్పారు. బంధువులను అడిగినా ఎలాంటి సమాచారం లేకపోవడంతో చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు.
అయితే మాదాపూర్‌లోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో సగం కాలిన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. మృతదేహంపై గుర్తులు అదృశ్యమైన సునీతతో సరిపోలడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. సునీతను హత్యచేసి మృతదేహాన్ని ఇక్కడ వదలివెళ్లినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సునీత మిస్సైన అదే రోజు అర్థరాత్రి ఒంటిగంట సమయంలో రెండు స్కూటీలపై గుర్తుతెలియని వ్యక్తులు ఈ ప్రదేశానికి వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. వారే మృతదేహాన్ని ఇక్కడ పడేసినట్లు తెలుస్తోంది. సునీతను హత్య చేసిన దుండగులు ఆనవాళ్లు లేకుండా చేసేందుకు మృతదేహాన్ని తగులబెట్టినట్లు తెలుస్తోంది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అటు సునీత స్నేహితులను కూడా విచారిస్తున్నారు. ఆ రోజు ఏం జరుగుంటుందనే దానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అటు క్షేమంగా తిరిగొస్తుందనుకున్న కూతురు మృతదేహమై కనిపించడంతో సునీత తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమ బిడ్డ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు.


Read Also
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials