Live News Now
  • అఖిలపక్షం కాదు.. అఖిల సంఘాల సమావేశం.. ప్రత్యేక హోదాపై రాజీపడబోమన్న ఏపీ సీఎం
  • మార్చి 21న కేంద్రంపై అవిశ్వాసం... బాబును ఒప్పించాలంటూ పవన్‌కు వైసీపీ సవాల్‌
  • నీరబ్ మోడీ స్కామ్‌తో రోడ్డున పడ్డ వందల మంది ఉద్యోగులు
  • రంగారెడ్డి జిల్లా : మహేశ్వరంలో నీరవ్ మోడీ ఆస్తులు సీజ్.. రోడ్డునపడ్డ జెమ్స్ కంపెనీ ఉద్యోగులు
  • తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగిన 600 మంది ఉద్యోగులు
  • బెజవాడ బార్ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పోలీసుల పనితీరుకు నిరసనగా అడ్వొకేట్ల దీక్ష
  • రెండ్రోజుల క్రితం లాయర్ షరీఫ్‌పై స్వాతి సెంటర్‌లో దాడి.. ఫిర్యాదు చేసినా పట్టించుకొని పోలీసులు
  • CI రాజాజీని సస్పెండ్ చేయాలని డిమాండ్
  • గుంటూరు: ప్రత్యేక హోదా కోసం నిరసన దీక్షలో పాల్గొన్నవైసీపీ నేతలు, విశ్రాంతి ఉద్యోగులు
  • 93వరోజుకు చేరిన వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర.. ప్రభుత్వంపై విసుర్లు.. ఆత్మీయ పలకరింపులు
ScrollLogo హైదరాబాద్‌లో మందుబాబుల వీరంగం ScrollLogo తెలంగాణ రైతులకు న్యూఇయర్‌ గిఫ్ట్.. అర్థరాత్రి నుంచి మొదలైన 24 గంటల పవర్‌ ScrollLogo కొత్త రికార్డ్‌ సృష్టించిన దుబాయ్‌ బూర్జ్‌ ఖలీఫా ScrollLogo కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికిన ప్రజలు ScrollLogo నల్గొండ: మున్సిపల్ చైర్మన్ భర్త బొడ్డునల్లి శ్రీనివాస్ హత్య.. బండరాయితో మోది చంపిన దుండగులు ScrollLogo నెల్లూరు జిల్లా కావలి వద్ద రోడ్డుప్రమాదం.. లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. ముగ్గురు మృతి ScrollLogo హైదరాబాద్ లో ఐదు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. 48 మంది పై కేసులు నమోదు ScrollLogo తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. 8 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు ScrollLogo శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం.. కాలినడక భక్తులకు 2 గంటల సమయం ScrollLogo ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం

సైబర్ సెల్‌లోకి బీటెక్ అభ్యర్థులు

BTech-students-are-also-eligible-in-cyber-cell-jobs
Posted: 370 Days Ago
Views: 159   

రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న కానిస్టేబుల్, ఎస్‌ఐ నియామకాలకు ఎంపికైన వారిలో బీటెక్ అభ్యర్ధులను సైబర్ సెల్‌లోకి తీసుకోనున్నారు.  బీటెక్ విద్యార్హత ఉన్న వారికి సాంకేతిక నైపుణ్యం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.  రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న నేరాలు, మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లాకో సైబర్ సెల్ ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖ నిర్ణయించింది.  ప్రతి జిల్లాలో సిఐడి విభాగానికి చెందిన డిఎస్‌పి స్థాయి అధికారి ఆధ్వర్యంలో సిఐ,ఎస్‌ఐ సహా కొందరు కానిస్టేబుళ్లతో ఈ ప్రత్యేక విభాగం విధులు నిర్వహించనుంది. పట్టణాలతో పాటు మారుమూల పల్లెల్లోనూ నేరాలు, మోసాలకు ఇకపై హైటెక్ పద్దతిలోనే చెక్ పెట్టనున్నామని పోలీస్ అధికారులు తెలిపారు. సైబర్ సెల్ ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలతో కేసు దర్యాప్తు చేయడం ద్వారా నేరగాళ్ళను స్వల్ప వ్యవధిలోనే గుర్తించే వీలుంటుందని ఓ పోలీసు అధికారి వివరించారు.  ఫింగర్ ఫ్రింట్స్ నిపుణులు, క్లూస్ టీం సహా సైబర్ సెల్ పోలీసులూ ఇకపై తమదైన వినూత్న శైలిలో దర్యాప్తులోకి దిగుతారంటున్నారు.  సిసి కెమెరాలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల ఆధారంగా వాహనాలు నెంబర్లు, ఫోన్ డేటా, అవసరమైతే ఫేస్ డిటెక్షన్ టెక్నాలజీని ఉపయోగించుకుని తక్కువ వ్యవధిలోనే నిందితుల ఆచూకీ కనుక్కుంటారు.  ఇక నుంచి నిందితుల డిఎన్ఎ వివరాలనూ సేకరించి నిక్షిప్తం చేయనున్నారు.  దీని వల్ల నేరం జరిగిన ప్రాంతంలో దొరికే అతి సూక్ష్మమైన ఆధారాలు కూడా బలమైన సాక్ష్యాలుగా మారే అవకాశాలుంటాయి. 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials