Live News Now
  • ప్రయాణికులు భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ లో సికింద్రాబాద్ కు తరలింపు..
  • తెలంగాణా మంత్రి పోచారానికి అస్వస్థత.. బిపిడౌన్ కావడంతో అశ్విని ఆస్పత్రికి తరలింపు..
  • ఢిల్లీ: రు.వెయ్యినోట్ల ముద్రణ వార్తలను తొసిపుచ్చిన కేంద్రం..
  • ప్రస్తుతానికి వెయ్యినోట్లు విడుదల చేసే ఆలోచన లేదు.. శక్తికాంతదాస్
  • తమిళనాడువ్యాప్తంగా డిఎంకె ఆందోళనలు.. తిరుచ్చిలో డిఎంకె నేత స్టాలిన్ దీక్ష
  • మద్రాస్ హైకోర్టులో డిఎంకె పిటిషన్ పై విచారణ ఈనెల 27కు వాయిదా...
  • వీడియో ఆధారాలను సమర్పించాలని డిఎంకెను కోరిన హైకోర్టు..
  • విపక్షం లేకుండా బలపరీక్ష నిర్వహించారని డిఎంకె పిటిషన్..
  • హైదరాబాద్: విద్యార్ధుల అరెస్ట్ లను నిరసిస్తూ గురువారం విద్యాసంస్థల బంద్ కు ఓయు జెఎసి పిలుపు
  • నాకు సెల్ ఫోన్ ఆపరేటింగ్ రాదు.. పొరపాటున అశ్లీల వీడియోలు ఉంటే క్షమించాలి.. గంగిశెట్టి..
ScrollLogo రెండు రాష్ట్రాలు సుభిక్షంగా వుండి అభివృధ్ది చెందాలని స్వామివారిని ప్రార్దించా..కెసిఆర్ ScrollLogo ఇరు రాష్ట్రాల మధ్య వున్న అన్ని సమస్యలు తొలగిపోతాయి.. కెసిఆర్ ScrollLogo హైదరాబాద్: పోలీసుల దిగ్భంధంలో ఓయు.. అన్ని మార్గాలు మూసివేత.. ScrollLogo ఢిల్లీ: సుప్రీంకోర్టు తలుపుతట్టిన జంతు సంక్షేమ మండలి.. ScrollLogo జల్లికట్టు,కంబాల ఆటలపై కొత్త చట్టాలను కొట్టివేయాలని వినతి.. ScrollLogo విశాఖ: భీమిలి తహశీల్దార్ రామారావు ఇంటిపై ఏసిబి దాడులు... ScrollLogo విశాఖ,హైదరాబాద్,రాజమండ్రిలో ఏకాకాలంలో సోదాలు.. ScrollLogo రు.45 లక్షలు, విలువైన పత్రాలు స్వాధీనం..కొనసాగుతున్న సోదాలు.. ScrollLogo వరంగల్: రెడ్ సిగ్నల్ దాటి వెళ్లిన కాకతీయ ఎక్స్ ప్రెస్... ScrollLogo జనగామ వద్ద డ్రైవర్లను అదుపులోకి తీసుకుని బ్రీత్ అనలైజింగ్ పరీక్ష చేసిన అధికారులు

చిరు ఆవిష్కరించిన శ్రీకాంత్ 'రారా' ప్రచారచిత్రం

Chiranjeevi-Unveils-Srikanth's-Ra-Ra-Motion-Poster
Posted: 6 Days Ago
Views: 1970   

శ్రీకాంత్ కథానాయకునిగా 'రారా' పేరుతో రూపొందుతున్న నూతన చిత్రం తొలి ప్రచార చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి తన స్వగృహంలో ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత విజయ్, శ్రీకాంత్ మిత్రుడు చిత్ర సమర్పకుడు శ్రీమిత్ర చౌదరి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..' నా తమ్ముడు శ్రీకాంత్, మరో సోదరుడు శ్రీమిత్ర చౌదరి, విజయ్ లు నిర్మాతలుగా రూపొందుతున్నహాస్యభరిత హర్రర్ చిత్రం 'రారా' చిత్రం మోషన్ పోస్టర్ ను విడుదల సందర్భంగా అందరికి శుభాభినందనలు. ఈ చిత్రం లోని కొన్ని సన్నివేశాలను చూడటం జరిగింది. చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అన్న ఉత్సుకతను కలిగించింది . ఇది హాస్యం తో కూడిన  హర్రర్ ధ్రిల్లర్ చిత్రం. చిన్న పిల్లలు సైతం ఈ చిత్రాన్ని చూసి ఎంతో సంబరపడతారు. ఇందులో కథానుగుణంగా ఎన్నో గేమ్స్ కూడా ఉన్నాయని తెలిసి మరింత ఉత్సుకతకు గురయ్యాను. దెయ్యాలకు మనుషులకు మధ్య సాగే సరదా ఆటలు సగటు సినిమా ప్రేక్షకుడిని వినోదాల తీరంలో విహరింప చేస్తాయని ఆశిస్తూ చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా 'రారా' మోషన్ పోస్టర్ విడుదల అయిన ఆనందంలో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ..ఆయనకు కృతఙ్ఞతలు తెలిపారు. అన్నయ్య చేతులమీదుగా గతంలో విడుదల అయి ఘన విజయం సాధించిన  'పెళ్ళిసందడి,ప్రేయసిరావే' వంటి చిత్రాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు శ్రీకాంత్. హర్రర్ కామెడీ ధ్రిల్లర్ చిత్రం నేను తొలిసారి చేస్తున్నాను.చిత్రం ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంటుదని ఆశిస్తున్నాను అన్నారు.
'రారా' చిత్రం షూటింగ్ కార్యరామాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. వచ్చే నెలలో చిత్రంను  విడుదలకు సిద్ధం చేస్తున్నట్లు నిర్మాత విజయ్ తెలిపారు. శ్రీకాంత్ హీరోగా, నాజియా కథానాయికగా 'విజి చరిష్ విజన్స్'  పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో గిరిబాబు, సీత, నారాయణ, ఆలీ, రఘుబాబు, పోసానికృష్ణ మురళి, పృథ్వి,జీవ,చంద్రకాంత్, అదుర్స్ రఘు,హేమ, షకలక శంకర్, నల్లవేణు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: రాప్రోక్ షకీల్, ఫోటోగ్రఫి: పూర్ణ, పోరాటాలు: గిల్లె శేఖర్, ఎడిటర్: శంకర్, సమర్పణ: శ్రీమిత్ర చౌదరి, నిర్మాత: విజయ్, దర్శకత్వం: విజి చరిష్ యూనిట్


Read Also
NRI Edition
AP News
Telangana News
Pata
Sports
Daily Specials