Live News Now
  • చిత్తూరు: రేణిగుంట- మల్లవరం జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం
  • ఆర్టీసీ బస్సు - లారీ ఢీ, 15 మందికి తీవ్రగాయాలు ఆస్పతికి తరలింపు
  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దర్శకేంద్రుడు
  • ఐపీఎల్-10: ముంబై పై పూణె విజయం... 3 పరుగుల తేడాతో పూణె గెలుపు
  • గుంటూరులో బీవీఆర్ ట్రావెల్స్ నిర్వాకం... మధ్యం తాగి వాహనం నడిపిన డ్రైవర్
  • మధ్యం మత్తులో వున్న డ్రైవర్ ను ప్రశ్నించిన ప్రయాణికులు
  • ఏపీలో నేడు గ్రూప్ -3 పరీక్ష 'కీ' విడుదల
  • ఐపీఎల్-10: నేడు బెంగళూరు- హైదరాబాద్ ఢీ రాత్రి 8 గంటలకు మ్యాచ్
  • తెలంగాణలో ఏడు జిల్లాలకు వడగాల్పుల ముప్పు
  • కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, నాగర్ కర్నూల్ జగిత్యాలలో వడగాల్పులు
ScrollLogo మే 3న రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందుకోనున్న కె. విశ్వనాథ్ ScrollLogo 2016 ఏడాదికి కె. విశ్వనాథ్ కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం... ScrollLogo కె. విశ్వనాథ్ కు అభినందనలు తెలిపిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ScrollLogo నల్గొండ: నార్కట్ పల్లి (మం)ఎల్లారెడ్డి గూడెంలో దంపతులు అనుమానస్పద మృతి ScrollLogo తమిళనాడులో గత 30 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు పలికిన డీఎంకే సహా ఇతర పక్షాలు ScrollLogo రేపు తమిళనాడు బంద్ కు పిలుపునిచ్చిన డీఎంకే ScrollLogo దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపిక కావడం అదృష్టంగా భావిస్తున్నా: కె. విశ్వనాథ్ ScrollLogo కె. విశ్వనాథ్ కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం సంతోషంగా ఉంది: చంద్రబాబు ScrollLogo ఒంగోలులో అంగన్ వాడీ కార్యకర్తల ధర్నా...గత ఐదు నెలలుగా జీతాలు రాక ఇబ్బందులు ఎదుర్కుంటున్నాం ScrollLogo అమరావతి: ఎమ్మల్యే ఆర్.కె. హైకోర్టు వ్యాఖ్యలపై అసత్య ప్రచారం చేస్తున్నారు

ట్రాఫిక్ జామ్ లో చిక్కుకొన్న మంచు విష్ణు-సురభి!

Manchu-Vishnu-Surabhi-Movie-Shooting-in-RFC
Posted: 69 Days Ago
Views: 211   

రామా రీల్స్ పతాకంపై మంచు విష్ణు-సురభి జంటగా తమిళ-తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. హీరోహీరోయిన్లు మంచు విష్ణు-సురభిలపై భారీ సెట్ లో లవ్ సీన్ ను చిత్రీకరిస్తున్నారు. సదరు సన్నివేశం ట్రాఫిక్ జామ్ లో చిత్రీకరించి ఉండాల్సి రావడంతో పెద్ద సంఖ్యలో వెహికిల్స్ ను ఏర్పాటు చేశారు. జి.ఎస్.కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రేపటితో రెండోభారీ షెడ్యూల్ పూర్తికానుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సుధీ కుమార్ పూదోట (జాన్) మాట్లాడుతూ.. "నేడు రామోజీ ఫిలిమ్ సిటీలో వేయబడిన ప్రత్యేకమైన సెట్ లో హీరోహీరోయిన్ల నడుమ  లవ్ సీన్ ను చిత్రీకరిస్తున్నాం. అలాగే కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కూడా జరిపాం. మంచు విష్ణుకి కథానాయకుడిగా మంచి పేరు తీసుకురావడంతోపాటు కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. యూనివర్సెల్ కాన్సెప్ట్ కావడంతో బైలింగువల్ సినిమాగా రూపొందిస్తున్నాం. దర్శకుడు జి.ఎస్.కార్తీక్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్న విధానం బాగుంది. ఇప్పటివరకూ వచ్చిన ఔట్ పుట్ తో మా యూనిట్ సభ్యులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. తమన్ నేతృత్వంలో పాటల కంపోజింగ్ కూడా జరుగుతోంది. త్వరలో సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తాం" అన్నారు. సంపత్ రాజ్, పోసాని కృష్ణమురళి, నాజర్, ప్రగతి, బ్రహ్మాజీ, సుప్రీత్, శ్రవణ్, బేసన్ నాగర్ రవి, ఎల్.బి.శ్రీరామ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ: కిరణ్ మన్నే, కూర్పు: కె.ఎల్.ప్రవీణ్, ఛాయాగ్రహణం: రాజేష్ యాదవ్, లైన్ ప్రొడ్యూసర్: ఎస్.కె.నయూమ్, సహ-నిర్మాత: కిరణ్ తనమాల, సంగీతం: ఎస్.ఎస్.తమన్, నిర్మాత: సుధీర్ కుమార్ పూదోట (జాన్), కథ-చిత్రానువాదం-మాటలు-దర్శకత్వం: జి.ఎస్.కార్తీక్!!


Read Also
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials