Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

కొత్త నినాదంతో ముందుకెళ్తున్న టీ-కాంగ్రెస్‌

T-Congress-Leaders-Action-Plan-to-Attract-Public
Posted: 491 Days Ago
Views: 192   

మ‌నం మారుదాం.. తీరు మార్చుకుందాం.. కేడర్‌ను మాట్లాడ‌నిద్దాం... ఇదే ఫార్ములాతో ముందుకెళ్లాలని భావిస్తోంది టీ-కాంగ్రెస్‌. ప్రజా ఉద్యమాలు చేస్తున్నా... ఆశించిన ఫలితాలు రాకపోవడంతో రూటు మార్చింది. కీలక నేతలతో అంతర్మధనం చేసిన పీసీసీ ... ఇకపై పార్టీ సమావేశాల్లో కేడర్‌కే పెద్ద పీఠ వేసి బలపడాలని నిర్ణయించింది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై అన్ని పోరాటాలు చేస్తోన్నాం. అయినా ప్రజలకు దగ్గర కాకపోవడంపై..తెలంగాణ కాంగ్రెస్‌లో గుబులు రేపింది. పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చేసారి కూడా అధికారంలోకి రావడం కలేననే భావన వ్యక్తమయ్యింది. రైతులు-విద్యార్దులు-అవినీతి-మహిళా సమస్యలపై ప్రతిపక్ష పార్టీగా అనే పోరాటాలు చేస్తూనే ఉన్నా, పొలిటికల్ గ్రాఫ్ ఎందుకు పెరగడం లేదనే అంతర్మధనంతో నలిగిపోయారు ఆ పార్టీ నేతలు. తెలంగాణలో రాజకీయాలు, కాంగ్రెస్‌ పరిస్థితిపై పార్టీ నేతలు అంతర్గత సమావేశాల్లో చర్చలు జరిపారు. రాష్ట్రంలో బలపేతమై 2019 ఎన్నికలే టార్గెట్‌గా పనిచేయాలని నిర్ణయించారు. తీరు మార్చుకొని కేడర్‌కు పెద్ద పీఠ వేస్తేనే తిరిగి పుంజుకోగలమనే అభిప్రాయానికి వచ్చారు.  ఆ దిశగా వర్కింగ్‌ స్టైల్‌ను మార్చేద్దామని పీసీసీ ఓ నిర్ణయానకి వచ్చినట్లు తెలుస్తోంది. 
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బ‌హిరంగ‌స‌భ‌లు ఏర్పాటు చేసినా .. గంటల కొద్ది నేతల ఊక దంపుడు ప్రసంగాలు ఉంటాయి. సభల్లో సీనియర్లు, జూనియర్లు, ప్రోటోకాల్..అంటూ అందరికి మైక్  ఇస్తుండటం ఆనవాయితీగా ఉంటుంది. సభకు వచ్చిన జనాలకు ఎవరు ముఖ్యనేతో, ఏది ముఖ్య అంశమో అర్దం కాక...సభ మొదట్లో చేసే ప్రసంగాలను విని, తర్వాత జారుకుంటున్న పరిస్థితి. ఇలా ప్రసంగాలతో ప్రజలను చికాకు తెప్పించే పనికి స్వస్తీ చెప్పాలని నిర్ణయించారు. సభల్లో ద్వితీయ శ్రేణి నేతలకు ప్రాధాన్యత ఇచ్చి, ప్రజల బాధలను వారితో చెప్పించాలనుకుంటున్నారు. ఆ తరువాతే ముఖ్య నేతలు ఒకరిద్దరితో మాట్లాడించి, సమావేశాలను ముగించాలని నిర్ణయించారు. ఈ విధానంతో పార్టీ చేసే ఉద్యమ పోరాటాలు ప్రజలకు చేరే అవకాశం ఉందని కాంగ్రెస్ భావిస్తోంది. మొత్తం మీద రాబోయే రోజుల్లో తీరు మార్చుకొని పనిచేస్తేనే పార్టీకి భవిష్యత్‌ ఉందుంటున్నారు ఆ పార్టీ నేతలు. మరి కాంగ్రెస్‌ యాక్షన్‌ ప్లాన్‌ ఏ మేరకు విజయవంతం అవుతుందో చూడాలి. 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials