Live News Now
  • ప్రగతి భవన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత.. సాక్షర భారత్‌ మిషన్ కోఆర్డినేటర్ల ఆందోళన..
  • రికార్డు గరిష్ట స్థాయికి పెట్రో ధరలు..
  • కేంద్రానికి నరసింహన్ నివేదికపై సస్పెన్స్..
  • ఏపీలో హోరెత్తుతున్న హోదా ఆందోళనలు.. శ్రీశైలం భ్రమరాంబకు బోనాలు
  • ధాన్య రాశుల నిలయంగా నల్గొండ!.. సీఎం చొరవతోనే సాధ్యమైందన్న హరీష్
  • జమ్మూకశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్‌.. పుల్వామా జిల్లాలో టెన్షన్‌ టెన్షన్
  • బాలీవుడ్‌లోనూ కాస్టింగ్ కౌచ్.. తొలిసారి ఆరోపణలు చేసిన సరోజ్‌ ఖాన్
  • ఏపీలో చంద్ర క్రాంతి ప్రారంభం.. ద్వారపూడిలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
  • కర్ణాటక కాంగ్రెస్‌కు ఐటీ షాక్.. మంత్రి మహదేవప్ప ఇంట్లో రైడ్స్
  • తలకు బదులు కాలుకు ఆపరేషన్.. ఢిల్లీ ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం
ScrollLogo మిషన్ భగీరథ దేశానికే ఆదర్శమన్న కేసీఆర్ పెండింగ్ పనులు పరుగులు పెట్టించాలని ఆదేశం ScrollLogo మిషన్ భగీరథ దేశానికే ఆదర్శమన్న కేసీఆర్ పెండింగ్ పనులు పరుగులు పెట్టించాలని ఆదేశం ScrollLogo ఎంపీలు, ముఖ్యనేతలతో జగన్ కీలక భేటీ ప్రత్యేక హోదా, భవిష్యత్ కార్యాచరణపై చర్చ ScrollLogo కాల్పుల మోతతో దద్దరిల్లిన గడ్చిరోలి ఎన్‌కౌంటర్లో 14మంది మావోయిస్టులు మృతి ScrollLogo కొడుకుతో సహా తల్లి ఆత్మహత్య.. విజయనగరం జిల్లాలో విషాదం.. ScrollLogo వైసీపీ, జనసేన కుమ్మక్కయ్యాయన్న బోండా ScrollLogo 58 లక్షల మంది రైతులకు 6 వేల కోట్లు.. రైతు బంధు పథకం చారిత్రాత్మకమన్న హరీష్ ScrollLogo టీడీపీపై మహా కుట్ర జరుగుతోంది: బోండా ScrollLogo పోలవరం స్పిల్‌ ఛానల్‌ కాంక్రీట్ పనులు ప్రారంభం.. ScrollLogo ఐపీఎల్‌లో పంజాబ్ వర్సెస్ ఢిల్లీ.. క్రిస్‌గేల్‌పైనే అందరి చూపు

10 మినిట్స్ 50 న్యూస్..

10-Minutes-50-News
Posted: 431 Days Ago
Views: 247   

క్రమశిక్షణ తప్పితే ఉపేక్షించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. సొంత నియోజకవర్గం కుప్పంలో రెండో రోజు పర్యటించిన ఆయన కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
----------------------------
ప్రజాదర్బార్‌ పేరుతో నేటి నుంచి కేసీఆర్‌ ప్రజలను నేరుగా కలుసుకునే కార్యక్రమానికి నాంది పలుకుతున్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకుని మరింత సమర్థవంతంగా పాలన సాగించేలా అడుగులు వేయనున్నారు 
------------------------
రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేక హోదా ఒక్కటే బ్రహ్మాస్త్రమని వైసీపీ అధినేత జగన్‌ స్పష్టం చేశారు.గుంటూరులో నిర్వహించిన యువభేరీలో ఆయన ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 
----------------------
తమిళనాడు హైటెక్‌ వీవర్స్‌ పార్క్‌ను మంత్రి కేటీఆర్‌ సందర్శించారు. నేతన్నలకు, పరిశ్రమలకు ప్రభుత్వం నుంచి లభిస్తున్న ప్రోత్సాహకాలను ఆరా తీశారు. ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సౌకర్యాలు ఎలా ఉన్నాయో పరిశీలించారు.
-----------------------
విజయవాడ మెట్రో రైలు నిర్మాణానికి 2500 కోట్లు రుణం ఇచ్చేందుకు జర్మనీ సంస్ధ సంసిద్ధత వ్యక్తం చేసిందని మంత్రి నారాయణ చెప్పారు. త్వరలో పనులు ప్రారంభించి 2018 ప్రధమార్ధం కల్లా తొలివిడత పూర్త చేస్తామన్నారు.  
-------------------------
నిరుద్యోగుల ఆకాంక్షలు నెరెవేరే వరకు ఉద్యమిస్తామని టీజేఏసీ ఛైర్మన్‌ ఫ్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. నిరుద్యోగ,ఉపాధి కల్పనకై పోరు కొనసాగుతుందని హెచ్చరించారు. 
-------------------------
తెలంగాణ డిప్యూటీ సీఎం అండ్ కో చైనా పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది.నాన్జింగ్‌లో అత్యంత ఎత్తైన బుద్దుని కాంస్య విగ్రహాన్ని కడియం టీం సందర్శించింది. తెలంగాణలో అంబేద్కర్‌ విగ్రహాన్ని కూడా ఇంతే రీతిలో నిర్మిస్తామని తెలిపారు. 
------------------------
సౌత్‌ ఇండియాలో సిద్ధిపేటను నెంబర్‌ వన్‌ చేస్తామని తెలంగాణ మంత్రి హరీష్‌రావు చెప్పారు.మిషన్‌ భగీరథ పధకం కింద త్వరలో ప్రతి ఇంటికి నల్లా ద్వారా నీళ్లు అందిస్తామని చెప్పారు. 
-------------------------
PSLV సెల్ఫీ వీడియో ప్రపంచ వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ప్రయోగ దృశ్యాలు అందరిని ఆకట్టుకుంటున్నాయి.ఎంతో ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి 
------------------------
విశాఖలోని బుల్లయ్య కాలేజ్‌లో జరిగిన మాక్‌ పార్లమెంట్ ఆకట్టుకుంది.మాక్‌ పార్లమెంట్ వల్ల నేతలు పలు సమస్యలపై ఎలా చర్చిస్తారనేది అవగతమయిందని విద్యార్ధిని విద్యార్ధులు అన్నారు. మాక్ పార్లమెంట్‌తో రాజకీయ అవగాహన పెరిగిందన్నారు.  
----------------------------
కాకినాడ ఆర్‌ఎంసీ గ్రౌండ్‌లో జర్నలిస్ట్‌ క్రీడోత్సవాన్ని ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు, హోంమంత్రి చినరాజప్ప ప్రారంభించారు. ఇందులో పలు జిల్లాల నుంచి వచ్చిన జర్నలిస్టులు పాల్గొన్నారు.క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలని మంత్రులు అన్నారు.   
--------------------------
మాండలికాలతో రాసిన నవలలు సమైక్యతకు దోహదం చేస్తాయని ప్రముఖ సాహీతీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ అన్నారు.మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు వ్యాయామం ఎంత అవసరమో భాషా సాహిత్యం కూడా అంతే అవసరమన్నారు.   
---------------------------
పోరాట స్ఫూర్తిని అలవర్చుకోవటంతో పాటు బహుజనులను కలుపుకుని రాజ్యాధికారం కోసం పోరాడాలని తెలంగాణ మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ అన్నారు. మహబూబాబాద్‌ జిల్లా మేచారాజుపల్లిలో సర్వాయ్‌ పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆయన బంగారు తెలంగాణ కోసం అందరూ కృషి చేయాలన్నారు.  
----------------
యువభేరి పేరుతో యువతను రెచ్చగొట్టే కుట్రలకు జగన్ తెరలేపుతున్నారని టిడిపి నేత డొక్కా మాణిక్యవర ప్రసాద్ మండిపడ్డారు. ప్రతిపక్షపాత్రలో ఉన్న జగన్‌ ప్రభుత్వానికి సలహాలు,సూచనలు చేయాలే కానీ ఇలా వివాదాలు చేయకూడదన్నారు.   
------------------
తెలంగాణ యువతకు ఉపాధి కల్పించటమే టీఆరెస్‌ సర్కార్‌ లక్ష్యమని మంత్రి ఈటెల రాజేందర్‌ స్పష్టం చేసారు. యాదాద్రి జిల్లా జాలల్‌పూర్‌లో రామానందతీర్ధ రూరల్ ఇన్సిస్ట్యూట్‌ను ప్రారంభించిన ఆయన విద్యార్ధుల భవిష్యత్తుకోసం బంగారు బాటలు వేస్తామన్నారు. 
-------------------
నగదురహిత లావాదేవీలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నేడు వరంగల్‌ నిట్‌లో డిజిధన్‌ మేళా జరగనుంది.నిట్‌లో కార్యక్రమ నిర్వహణ తర్వాత తెలంగాణలోని ఎంపిక చేసిన 100 పట్టణాల్లో డిజిధన్ మేళా నిర్వాహకులు తెలిపారు.  
--------------------
తమిళనాడులో పాగా వేయటమే లక్ష్యంగా కేంద్రం శవరాజకీయాలు చేసిందని సిపిఐ జాతీయ నేత నారాయణ ఆరోపించారు. పన్నీర్ సెల్వంను సీఎం చేయాలనే మోడీ,అమిత్‌షా అభీష్టం నెరవేరకుండా పోయిందన్న ఆయన గవర్నర్‌ కేంద్రం చెప్పినట్లు ఆడారన్నారు. 
--------------------
యాన్యువల్ ఇన్స్‌పెక్షన్‌లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే డివిజన్‌ డీఎం వినోద్ కుమార్‌ గుంటూరు డివిజన్‌లో తనిఖీలు నిర్వహించారు. నర్సరావు పేట ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్యే మోదుగుల కొన్ని ప్రతిపాదనలు పెట్టారు. అభివృద్ధి కోసం వినతులు అందించారు.  
--------------
చెప్పుడు మాటలు విని కట్టుకున్న భార్యను చిత్రహింసలకు గురిచేసిన ఓ ఎన్ఆర్ఐ భర్త దాష్టికం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా చిత్రహింసలు పెట్టారని హైదరాబాద్‌కు చెందిన బాధితురాలు శిరీష ఆరోపించింది.
-------------------------
ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధులు నిర్వహించకుండా ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న డాక్టర్లపై నెల్లూరు జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు కొరడా ఝళిపించారు.6గురు వైద్యులను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని సస్పెన్షన్‌కు రికమెండ్ చేసారు. 
------------------------
కర్నూలు జిల్లా ఆదోనిలోని ఒక లాడ్జ్‌లో లిఫ్ట్‌ తెగిపడింది. ఈ ఘటనలో ధర్మవరానికి చెందిన గోవర్ధన్‌ మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. లాడ్జి నిర్వాహకులపై కేసు నమోదు చేయాలని బాధితులు ఆందోళనకు దిగారు. 
-----------------------
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో గణేష్‌ అనే కానిస్టేబుల్ కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసాడు. డిపార్ట్‌మెంట్‌లో ఉన్న ఒత్తిడిని తట్టుకోలేకే చనిపోయేందుకు ప్రయత్నించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 
----------------------------
డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే బాలింత మృతి చెందిందంటూ హైదరాబాద్‌ నాచారంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ముందు బాధితుల బంధువులు ఆందోళనకు దిగారు. న్యాయం చేసే వరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. చివరకు పోలీసులు సర్ధిచెప్పటంతో ఆందోళన సద్దుమణిగింది. 
---------------------------
శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఎమ్మార్వో కార్యాలయంపై ఏసిబి అధికారులు కొరడా ఝళిపించారు. వీఆర్వో బాలమురళి 5వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులు  రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials