Live News Now
  • బాహుబలులు మాకు అవసరం లేదు.. మోడినే మాకు బ్రహ్మాస్త్రం.. లక్ష్మణ్
  • చెన్నై: రజనీకాంత్ శ్రీలంక పర్యటన రద్దు.. వచ్చే నెల 9న శ్రీలంక వెళ్లాల్సిన రజనీ
  • తమిళుల నుంచి వ్యతిరేకత రావడంతో పర్యటన రద్దు చేసుకున్న రజనీకాంత్..
  • ఢిల్లీ: ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు ఇక్కట్లు..జైట్లీ వేసిన పరువు నష్టం దావా కేసులో దర్యాప్తుకు కోర్టు ఆదేశం
  • హైదరాబాద్: ఏప్రిల్ 21న హైదరాబాద్ లో టిఆర్ఎస్ ప్లీనరీ.. అదే రోజు టిఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నిక
  • ఏప్రిల్ 27న వరంగల్ లో భారీ బహిరంగ సభ.. ఏప్రిల్ 6లోపు సభ్యత్వ నమోదు..
  • గ్రామ కమిటీల ఏర్పాటును పూర్తిచేయాలన్న కెసిఆర్
  • విశాఖలో పాతనోట్ల మార్పిడి ముఠా అరెస్ట్.. రు.కోటి 20 లక్షలు స్వాధీనం..
  • విజయవాడ: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాం.. హోంమంత్రి చినరాజప్ప
  • 27న వరంగల్ లో జరిగే టిఆర్ఎస్ బహిరంగసభకు శ్రమదానం చేసి విరాళాలు సేకరించాలని కెసిఆర్ ఆదేశం
ScrollLogo అమెరికాలో అనుమానాస్పదంగా మృతిచెందిన శశికళ కేసులో.. ScrollLogo భర్త,అత్త శివపార్వతి,మామ సుబ్బారావుపై శశికళ తల్లిదండ్రుల అనుమానం.. ScrollLogo అమరావతి: గాలి ముద్దుకృష్ణమ వ్యాఖ్యలను ఖండించిన రోజా... ScrollLogo గాలి ముద్దుకృష్ణమ ఇప్పటికైనా గాలిమాటలు మానుకోవాలి.. రోజా ScrollLogo హైదరాబాద్: 2019 ఎన్నికల్లోనూ తెలంగాణలో టిఆర్ఎస్ దే అధికారం.. కెటిఆర్.. ScrollLogo వచ్చే ఎన్నికలనాటికి హామీలన్నీ నెరవేరుస్తాం.. కెటిఆర్ ScrollLogo అమరావతిలో నిర్మించే ప్రభుత్వ భవనాల ప్లాన్ ను అందించిన నార్మన్ ఫోస్టర్ కంపెనీ.. ScrollLogo ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలకు ప్లాన్ ను వివరించిన కంపెనీ ప్రతినిధులు.. ScrollLogo అమరావతి: దేశంలో అనేక రాష్ట్రాలు ఏర్పడ్డా ఇంత హంగామా ఎవరూ చేయలేదు.. బిజెపి ఎమ్మెల్సీ సోమువీర్రాజు ScrollLogo హైదరాబాద్: ఎన్నికలకు ఆరునెలల ముందే బిజెపి అభ్యర్దులను ప్రకటిస్తాం.. రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
Tollywood/Bollywood

ప్రత్యేక హోదాపై చంద్రబాబుపై జగన్‌ విమర్శలు

TDP-and-BJP-Playing-with-People-Lives,-Says-YS-Jagan,-Yuvabheri-in-Guntur
Posted: 36 Days Ago
Views: 65   

రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేక హోదా ఒక్కటే బ్రహ్మాస్త్రమని వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోవడంతోమరో 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళే పరిస్థితులు ఏర్పడ్డాయని విమర్శించారు. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా కోసం ఊదరగొట్టిన టీడీపీ, బీజేపీలు ఇప్పుడు మాట మార్చడాన్ని తప్పుబట్టారు. గుంటూరులో జరిగిన యువభేరిలో ప్రసంగించిన జగన్‌... హోదా వచ్చే వరకు పోరాటం ఆగదన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజా ఉద్యమాలను కొనసాగిస్తోంది. గుంటూరులో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన యువభేరిలో భారీ సంఖ్యలో యువత, విద్యార్ధులు పాల్గొన్నారు. నల్లపాడు రోడ్‌లోని మిర్చియార్డుసమీపంలో జరిగిన యువభేరి సదస్సులో విద్యార్ధుల అభిప్రాయాలను జగన్‌ అడిగి తెలుసుకున్నారు. 
ప్రత్యేక హోదా సాధిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు... ఇప్పుడు యావత్‌ తెలుగు జాతికి వెన్నుపోటు పొడిచారని జగన్‌ విమర్శించారు. హోదా సాధిస్తే  మన పిల్లలకు మన ప్రాంతంలోనే, మన జిల్లాలోనే, మన రాష్ట్రంలోనే మంచి జీతంతో మంచి ఉద్యోగాలు రావడం ఖాయమన్నారు. ఇలాంటి ప్రత్యేక హోదాను దగ్గరుండి చంద్రబాబు కత్తితో పొడుస్తున్నారని చెప్పారు. తాను పోరాటం చేయకపోగా చేసేవాళ్లను కూడా అణిచేస్తున్నారని మండిపడ్డారు. జూన్‌లో జరిగే పార్లమెంట్‌ సమావేశాల్లో వైసీపీ ఎంపీల రాజీనామాలతో కేంద్రంపై మరింత ఒత్తిడి తెస్తామన్నారు. జనవరి 26న కొవ్వొత్తులతో రాష్ట్రవ్యాప్తంగా శాంతియుతంగా ర్యాలీలు చేయాలని తలపెడితే సీఎం చంద్రబాబు అడ్డుకున్నారన్నారు. బస్సు రోకో, రైల్ రోకో చూశాం..  చంద్రబాబు హయాంలో విమానాల రోకో కూడా చూపించారని ఎద్దేవా చేశారు.   హోదాయే సంజీవని అని ఎన్నికల వేళ చెప్పిన చంద్రబాబు, వెంకయ్య నాయుడులు తెలుగుజాత ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని విమర్శించారు. పెట్టుబడుల పేరుతో విదేశీ పర్యటనలు చేస్తున్న చంద్రబాబు... ఆ ఎంవోయూల్ని బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. ఇదంతా బూటకమని మండిపడ్డారు. యువభేరిలో పాల్గొన్న విద్యార్ధులు ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. వారడిగిన ప్రశ్నలకు జగన్‌ ఓపికగా సమాధానాలిచ్చారు. ప్రత్యేక హోదా పోరాటంలో ప్రజలంతా కలసిరావాలని జగన్‌ పిలుపునిచ్చారు. భవిష్యత్‌ తరాలకు మంచి రోజులు రావాలంటే పోరాటం తప్పదన్నారు.


Read Also
NRI Edition
AP News
Telangana News
Pata
Sports
Daily Specials