Live News Now
  • ఇసుక మాఫియా కట్టడిపై కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు
  • జమ్మూకాశ్మీర్: అనంత్‌నాగ్‌లో మరో ఉగ్రదాడికి ముష్కరుల యత్నం
  • ప్రభుత్వ ధనాగారాన్ని దోచుకునేందుకు ముష్కరుల యత్నం...
  • ముష్కరుల దాడిని తిప్పికొట్టిన సీఆర్పీఎఫ్... ఓ ఉగ్రవాది అరెస్ట్ మరో ఉగ్రవాది పరారీ
  • భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపట్టిన సీఆర్పీఎఫ్
  • చంద్రబాబుతో ఆర్‌.కృష్ణయ్య భేటీ... గ్రూప్‌2 మెయిన్స్‌ వాయిదా వేయాలని విజ్ఞప్తి
  • చంద్రబాబు విదేశీ టూర్ షెడ్యూల్ ఖరారు...మే 4 నుంచి 11 వరకు అమెరికాలో పర్యటన
  • జమ్మూకాశ్మీర్‌లో పట్టుబడ్డ ఉగ్రవాది... పాక్‌తో సంబంధాలు ఉన్నట్లు అనుమానం
  • అనంతపురం: గుంతకల్లు మండలం వైటీ చెరువులో తెప్ప బోల్తా... 11 మంది మృతి నలుగురు గల్లంతు
  • మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు... గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు
ScrollLogo 111 పాయింట్లు నష్టపోయి 29,948 వద్ద ముగిసిన సెన్సెక్స్ ScrollLogo 38 పాయింట్లు నష్టపోయి 9,308 వద్ద ముగిసిన నిఫ్టీ ScrollLogo 9,300 పాయింట్ల మార్కును నిలుపుకున్న నిఫ్టీ ScrollLogo సూర్యపేట మార్కెట్‌ యార్డులో ఉద్రిక్తత... ScrollLogo మార్కెట్‌ యార్డును సందర్శించేందుకు వచ్చిన కోదండరామ్ ను అడ్డుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు ScrollLogo జేఏసీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం ScrollLogo హైదరాబాద్: సీబీఐ కోర్టులో వైఎస్ జగన్‌కు ఊరట... ScrollLogo జగన్‌ బెయిల్ రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్ ను కొట్టివేసిన ప్రత్యేక కోర్టు ScrollLogo హైదరాబాద్: జగన్ విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి... కుటుంబ సభ్యులతోనే వెళ్లాలన్న కోర్టు ScrollLogo మే 15 నుంచి జూన్ 15 లోపు 15 రోజులు విదేశాలకు వెళ్లవచ్చన్న కోర్టు

గర్భవతిని ఎయిర్‌పోర్ట్‌లోనే వదిలేసిన కసాయి..

NRI-Abandons-His-Pregnant-Wife-and-Child-at-Airport
Posted: 71 Days Ago
Views: 1371   

ఎన్‌ఆర్‌ఐ సంబంధం... అల్లుడు సాఫ్ట్‌వేర్‌... లక్ష రూపాయలు ఇచ్చి ఘనంగా పెళ్లి చేశారు. కాని రెండేళ్లకే సీన్‌ రివర్సైంది. తల్లి చెప్పుడు మాటలు విని కట్టుకున్న భార్యను చిత్రహింసలకు గురి చేశాడు. అర్థరాత్రి చంటిబిడ్డతో సహా గర్భవతైన భార్యను ఎయిర్‌పోర్టులో వదిలేశాడు. రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపిన ఆ ఇల్లాలు... పోలీసుల సాయంతో తల్లిదండ్రుల దగ్గరకు చేరింది. వారి సాయంతో భర్త దుర్మార్గాలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్రబుద్ధుడి పేరు కీర్తిసాయిరెడ్డి. అమెరికాలో ఉద్యోగం వెలగబెడుతున్నాడు. కీర్తిసాయిరెడ్డికి రెండేళ్ల క్రితం రామాంతపూర్‌కు చెందిన శిరీషతో పెళ్లైంది. వివాహ సమయంలో కట్నం కింద ప్లాట్‌, 36 తులాల బంగారం ఇచ్చారు. అమెరికాలో దంపతులు కాపురం పెట్టారు. వీరికి ఓ బాబు కూడా ఉన్నాడు. 
కీర్తిసాయిరెడ్డి తల్లి కొద్ది రోజుల క్రితం అమెరికాకు వెళ్లింది. అప్పటి నుంచి శిరీషకు కష్టాలు మొదలయ్యాయి. అత్త ఆమెను కొడుతూ చిత్రహింసలకు గురి చేసింది. సూటిపోటి మాటలతో మానసికంగా హింసిచింది. అలాగే భర్తకు తప్పుడు మాటలు చెప్పి ద్వేషం పెంచేలా చేసింది. కష్టాలను తల్లిదండ్రులకు చెప్పనీయకుండా ఆమె దగ్గర ఫోన్‌ కూడా లాక్కున్నారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లనీయకుండా నిర్భందించారు. తల్లి మాటలు విన్న కీర్తిసాయిరెడ్డి కూడా శిరీషను వేధించాడు. నిన్న అర్థరాత్రి భార్య, కొడుకును శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వదిలి వెళ్లిపోయాడు. ఆమె దగ్గర ఫోన్‌, డబ్బు లేకపోవడంతో రాత్రంతా అక్కడే ఉండిపోయింది. అందులోనూ ఆమె గర్భిణీ కావడంతో చలికి వణికిపోయింది. చివరికి ఓ ఏఎస్‌ఐ సాయంతో ఆమె తల్లిదండ్రుల దగ్గరకు చేరింది. తల్లిదండ్రులతో కలిసి శిరీష భర్త, అత్తలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తు చేస్తున్నారు. 


Read Also
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials