Live News Now
  • నవంబర్ 28న మెట్రో ప్రారంభానికి మోడీ గ్రీన్ సిగ్నల్.. రేపు తెలంగాణ సర్కార్‌కు వర్తమానం
  • శ్రీశైలంకు కొనసాగుతున్న వరద ఉధృతి.. జల విద్యుత్‌ ఉత్పత్తి, కాలువలకు నీటి విడుదల
  • ఎడతెరపిలేని వర్షాలతో హైదరాబాద్‌ అతలాకుతలం.. కుత్బుల్లాపూర్‌ నాలాలో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు
  • నల్గొండ జిల్లా చిట్యాలలో దారుణం.. గొంతు కోసి యువకున్ని చంపిన దుండగులు
  • వేములవాడలో యువకుడి ఆత్మహత్యాయత్నం.. పోలీస్‌స్టేషన్‌లోనే పురుగుల మందు తాగిన జకీర్‌
  • ప్రధానిని చేస్తారనుకుంటే రాష్ట్రపతి పదవి ఇచ్చారు.. ఆటో బయోగ్రఫీలో ప్రణబ్‌ రాతలపై కలకలం
  • హైదరాబాద్‌లో ఇంటర్ విద్యార్థి అదృశ్యం.. కాలేజీ ఒత్తిడే కారణమని తల్లిదండ్రులకు లేఖ
  • కాసేపట్లో తెలంగాణ జేఏసీ స్టీరింగ్‌ కమిటీ భేటీ.. అమరుల స్ఫూర్తి యాత్ర, అరెస్ట్‌ లపై చర్చ
  • విశాఖలో వీడిన గేదెల రాజు హత్య కేసు మిస్టరీ.. తొమ్మిది మంది అరెస్ట్‌, పరారీలో A-1 డీఎస్పీ రవిబాబు
  • రేపు అల్పపీడనం.. తర్వాత వాయుగుండం.. సీమ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు
ScrollLogo కలెక్టర్‌ నుంచి ఎమ్మెల్యేల వరకు కేటీఆర్ క్లాస్.. సీఎం హామీల్నే పట్టించుకోరా అంటూ ఫైర్‌ ScrollLogo విద్యార్థుల ఆత్మహత్యలపై ఏపీ సర్కార్ ‌సీరియస్.. యాజమాన్యాలే కారణమైతే చర్యలు తప్పవని వార్నింగ్ ScrollLogo తెలుగు రాష్ట్రాల్లో మరో ఐదు రోజులు వర్షాలు.. కుత్బుల్లాపూర్‌ నాలాలో యువకుడి గల్లంతు ScrollLogo గౌరీ లంకేష్ హత్య కేసులో కీలక ముందడుగు.. నిందితుల్ని గుర్తించిన సిట్..ఊహాచిత్రాల విడుదల ScrollLogo మహిళల్ని అనుమతిస్తే శబరిమల అపవిత్రం.. నిప్పు రాజేసిన ట్రావెన్‌కోర్టు బోర్డ్‌ ఛైర్మన్ ScrollLogo మరో క్షిపణి దాడికి సిద్ధమవుతున్న ఉత్తర కొరియా.. శాటిలైట్‌ చిత్రాలతో నిపుణుల అంచనా ScrollLogo హైదరాబాద్‌ ను కుదిపేస్తున్న వర్షాలు.. మరో 5 రోజులపాటు నగరానికి వానగండం ScrollLogo గంటకు గంటకు పెరుగుతున్న వరద.. శ్రీశైలం డ్యామ్‌ 7 గేట్లు ఎత్తి నీటి విడుదల ScrollLogo AP లో అన్ని విభాగాలకు సిటిజన్‌ ఛార్టర్. సకాలంలో పనులు చేయకుంటే జరిమానా ScrollLogo ఫార్ములా వన్ రేసింగ్ పేరుతో 8 కోట్లు వసూలు.. మహిళా పారిశ్రామికవేత్తపై కేసు నమోదు
Tollywood/Bollywood

గుంటూరు ఐడీబీఐ బ్యాంకులో రూ.122కోట్ల కుంభకోణం

Rs-122-Crores-Scam-Exposed-In-Guntur-IDBI-Bank
Posted: 242 Days Ago
Views: 146   

గుంటూరు జిల్లా IDBI బ్యాంకులో భారీ కుంభకోణం. ఏకంగా 122 కోట్ల మేర గోల్‌మాల్‌. ఓ పారిశ్రామికవేత్త ప్లాన్‌కు బ్యాంక్‌ అధికారి ఫుల్‌గా సహకరించాడు. నకిలీ డాక్యుమెంట్లతో కోట్లకు కోట్లు దోచుకున్నారు. పాపం పండటంతో తాజాగా 40మందిపై CBI.. FIR నమోదు చేసింది. 2010-12 మధ్య కాలంలో జరిగిందీ ఘరానా మోసం. గండూరి మల్లికార్జునరావు అనే ప్రముఖుడు.. గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన ప్రభుత్వ భూములు, రైతుల పొలాలపై నకిలీ డాక్యుమెంట్లు, కిసాన్‌కార్డులు తయారు చేశాడు. వాటిని గుంటూరు IDBI బ్యాంకులో చూపించి భారీగా లోన్లు తీసుకున్నారు. ఇందుకోసం నకిలీ కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్స్‌ను విచ్చలవిడిగా వాడుకున్నారు. చేపల చెరువులు తవ్వేందుకని చెప్పి భారీగా లోన్లు లాగించేశారు. రైతులు, కూలీలు, ఉద్యోగులు ఇలా రకరకాల పేర్లు చెప్పి కోట్లలో అప్పు తీసుకున్నారు.  లోన్స్‌ అయితే తీసుకున్నారు కానీ.. కట్టాల్సిన సమయంలో కనిపించకుండా పోయారు. ఉన్నతాధికారులు తనిఖీ చేస్తే షూరిటీ పేపర్లన్నీ నకిలీవని తేలింది. మరింత లోతుగా విచారిస్తే.. గుంటూరు IDBI బ్యాంక్‌ అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ చంద్రశేఖర్‌ హస్తం ఉన్నట్టు గుర్తించారు. అసలేం జరిగిందో మొత్తం విషయం కూపీ లాగగా.. 122 కోట్ల కుంభకోణం జరిగినట్టు తేలడంతో అధికారులు తెల్లముఖం వేశారు. అన్ని లోన్లనూ గండూరి మల్లికార్జునరావే డ్రా చేసుకున్నట్టు గుర్తించారు. బ్యాంక్‌ జనరల్‌ మేనేజర్‌ చంద్రశేఖర్‌రావు ష్యూరిటీ పత్రాలను అసలేమాత్రం తనిఖీ చేయలేదని.. లోన్స్‌ మంజూరులోనూ నిబంధనలు ఉల్లంఘించారని తేలటంతో కుంభకోణంపై CBIకి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన సీబీఐ.. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టింది. 120 మందిని విచారించి.. 40 మందిని ముద్దాయిలుగా ధృవీకరించింది. 120మంది దళితుల భూములకు నకిలీ పత్రాలు సృష్టించి.. 122 కోట్లు నొక్కేసినట్టు సీబీఐ దర్యాప్తులో తేలింది. గండూరి మల్లికార్జునరావును A1 నిందితుడిగా పేర్కొంటూ మొత్తం 40మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials